🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఈశ్వరుడు దుర్గాతిప్రియుడు. శంకరుల మనస్సు కూడా దుర్గము వంటిదట. అందుకే తన మనోదుర్గంలో నివాసముండుమని ఈశ్వరుని శంకరులు కోరారు.*
*శ్లోకం : 42*
*గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ*
*స్తోమ శ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః*
*విద్యా వస్తు సమృద్ధి రిత్యఖిల సామగ్రీ సమేతే సదా*
*దుర్గాతిప్రియ ! దేవ ! మామక మనోదుర్గే నివాసం కురు !!*
*పదవిభాగం : ~*
*గాంభీర్యం _ పరిఖాపదం _ ఘనధృతిః _ ప్రాకారః _ ఉద్యద్గుణస్తోమః _ చ _ ఆప్తబలం _ ఘనేంద్రియచయః _ ద్వారాణి _ దేహస్థితః _ విద్యా వస్తుసమృద్ధిః _ ఇతి _ అఖిలసామగ్రీసమేతే _ సదా _ దుర్గాతిప్రియ _ దేవ _ మామకమనోదుర్గే _ నివాసం కురు.*
*తాత్పర్యము :~*
*(దుర్గావల్లభుడైన ಓ స్వామీ). మిగుల దుర్గమమైన కైలాస పర్వతముపై ప్రీతితో నివసించి యున్న దేవా ! ఈశ్వరా ! నా దేహములో ఒక దుర్గము ఉంది. దానికి గాంభీర్యమే అగడ్త . అధిక ధైర్యమే, ప్రహారి. ప్రకాశించే సద్గుణాల సముదాయమే, మిత్రసైన్యము. గొప్ప ఇంద్రియాల సముదాయమే, ద్వారములు. ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానమే, వస్తువుల సమృద్ధి. ఇటువంటి సర్వ సామగ్రితో కూడిన నామనస్సు అనే కోటయందు సర్వదా నివసించు. (దుర్గమునకు కావలసిన సామగ్రి అంతయూ మనస్సునకు చెప్పబడింది ).*
*వివరణ :-*
*శంకరుల మనస్సులో కోటకు గల లక్షణాలున్నాయి. కోటకు, అగడ్త లోతుగా ఉంటుంది. శంకరుల మనస్సు కూడా , చాలా లోతుగా ఉంది. అంటే శంకరుల మనస్సులో గాంభీర్యముంది. ఆ గాంభీర్యము కోటకుండే యగడ్త వంటిది. శంకరుల మనస్సు లో గొప్ప ధైర్యముంది. ఆ ధైర్యం సహజంగా కోటకు ఉండే ప్రాకారంలా వుంది. కోట లోపల నమ్మదగ్గ సైన్యమున్నట్లే , శంకరుల మనస్సులో ఉద్యద్గుణములున్నాయి. కోటకు ద్వారములుంటాయి. ఆలాగే శంకరుల దేహంలో కన్ను, ముక్కు, చెవి, నాలుక , చర్మం వంటి ఇంద్రియ ద్వారాలు ఉన్నాయి. శంకరుల దేహంలో శివ సంబంధమైన జ్ఞాన రూపమైన విద్య ఉంది. ఆ విద్య కోటలోని అవసరమైన పదార్థ సంపత్తిలా ఉంటుంది. ఈవిధంగా శంకరుల మనస్సు అన్ని విధాలా సౌకర్యాలతో ధృఢంగా ఉండే కోటలా ఉంది. కాబట్టి కైలాసంలోని కొండలలో, బండలలో నివాసం ఉండడం మాని , తన మనస్సు అనే కోటలో నివాసం చేయుమని శంకరులు శివుని ప్రార్థించారు.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి