28, ఏప్రిల్ 2020, మంగళవారం

మాస్కులు ధరించటం ఎందుకు.

ఇప్పుడు ప్రపంచమంతా కరొనతో గజ గజ వణుకుతుంది.  ఈ సమయంలో మన ప్రభుత్వం వీధులల్లో తిరిగే వారు విధిగా నోరు, ముక్కు మూసుకునే విధంగా మాస్కులు ధరించాలని అట్లా ధరించని వారిని శిక్షిస్తామని పదే పదే చెప్పటమే కాక కొంతమందికి పోలీసు వారు బుద్ది చెప్పినట్లు మనకు రోజు టీ.వి వార్తలల్లో చూస్తున్నాము.  అది కేవలం ప్రభుత్వం ప్రజలను కాపాడుటకు తీసుకొనే చేర్య అని మనందరికీ తెలుసు.  కానీ మనం టి.వీలో, వాట్సాపులో అనేక మంది ముఖ్యంగా రాజకీయ నాయకులూ, N.G.O లు అనేక సంఘాల వారు పేదవారికి వస్తువులు, కూరగాయలు మొదలైనవి పంపిణి చేస్తున్నారు.  ఇది స్వాగతించదగిన విషయం.  కానీ కొంతమంది ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇచ్చే టప్పుడు వారి మూతికి వున్న మాస్కు ఆటంకిగా భవిస్తూ వారికి తెలియకుండానే మాటి మాటికీ ఆ మాస్కును చేతితో తడమడం, లేక కొంతమంది పూర్తిగా మాస్కు తీసి మైకు పట్టుకొని వారి ప్రతిభను చాటుతున్నారు.  వారిని ఉద్దేశించి ఇది వ్రాస్తున్నాను.  మీరు చేసే పనులు నిజానికి సమాజోద్ధరణకే, అందులో రవ్వంతయు సంశయం లేదు కానీ మీకు తెలుపదలచింది ఏమనగా మాస్కులు ధరించటం నిజానికి మనకు అలవాటు లేదు.  కేవలం ఇప్పటి పరిస్థితిని బట్టి ప్రభుత్వ సూచనల మేరకు మనం వీటిని ధరిస్తున్నాము.  దయచేసి రోడ్డుమీదికి వచ్చే వారు ఈ క్రింది సూచనలు పాటించ కోరుతాను.

1) విధిగా మాస్కు ధరించండి.  మాస్కు ధరించటం అంటే ఇంటి దగ్గర కట్టుకున్న మాస్కు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు దానిని సవరించటం కానీ ఏచేతితోను తాకటం కానీ, గోక్కోటం కానీ చేయకూడదు.  ఒక వేళ తుమ్ము కానీ, దగ్గు కానీ వస్తే వెంటనే వేగంగా జనాలకు దూరంగా వెళ్లి చెవుల దగ్గరినుండి మాత్రమే మాస్కు తీసి తుమ్ముటం  కానీ, దగ్గటం కానీ చేసి వెంటనే చెవులనుంచి మాస్కు ధరించి జనాలలోకి రండి.  ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కు మీద మీ చేయి పడకూడదు.

2) మీరు ఇంటికి వచ్చిన తరువాత మాస్కుని చెవులపైనుండి మాత్రమే అంటే మాస్కుని తాకకుండా తీసి పారవేయ దలిచితే మూత వున్నా చెత్తబుట్టలో మాత్రమే వేయండి.  వస్త్రంతో కుట్టిన మాస్క్ కానీ లేక మీరు చేతి రుమాలు మొఖానికి కట్టుకున్న యెడల అది కుడా చెవులమీదినుండి తీసి వెంటనే సబ్బుతో కానీ డిటర్జెంట్ తోకానీ  ఉతికి ఆరవేసి వెంటనే మీ చేతులు, మొఖం బాగా నురుగు వచ్చే సబ్బుతో కడుక్కోండి.  ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబ సభ్యులను చేతితో తాక వద్దు.

ఈ సూచనలు ప్రతి వక్కరు విధిగా పాటించండి. . 

మీరు ఆరోగ్యంగా వుండండి మీ తోటివారిని ఆరోగ్యంగా ఉండనీయండి. 
సర్వే జానా సుఖినో భవంతు, 
ఓం శాంతి శాంతి శాంతిః 

ఆయుర్వేద, హోమియో వైద్యులకు విజ్ఞప్తి

 ఇప్పుడు మనందరికీ ఒక విషయం తెలుస్తున్నది.  ఈ కోవెడు వైరస్ అనేక రూపాలుగా మారుతున్నది అని.  అంటే దీనికి వాక్సిన్ కనుగొనటం మేధావులకు సవాలుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అనైకమంది శాస్త్రవేత్తలు అనేక విధాలుగా అహర్నిశలు కృషి చేస్తూ ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనటానికి ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నట్లు మనకు వార్తలవల్ల తెలుస్తున్నది.  కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు విజయవంతం అయినట్లు మనకు  తెలియరాలేదు. మనం ఆశా వాదులం, మేధావుల ప్రయత్నం సఫలం కావాలని మనం నిత్యం దేముళ్ళను ప్రార్ధిస్తున్నాము. కానీ మనకు ఒకవిషయం మాత్రం కనపడుతున్నది అది నిత్యం పెరుగుతూవున్న కరోనా కేసులు.  ఏ రోజుకూడా ఇవాళ ఒక్క కేసుకూడా నమోదు కాలేదు అని చెప్పిన రోజు లేదు.  ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అంతే.  ఈ విధంగా వృద్ధి చెందుతుంటే ఈ మహమ్మారిని ఆపటం ఎవరి తరం, అనే ప్రశ్న ఉద్బవిస్తుంది.  దీనికి అంతం ఎప్పుడు.  ప్రజలంతా ఎప్పటిలాగా జీవనం గడిపే రోజు ఎప్పుడు వస్తుంది. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ అని రోగం తగ్గినవారినుండి సేకరించిన రక్తమునుండి తీసిన ప్లాస్మాను రోగులకు ఇంజక్ట్ చేస్తున్నారు.  ఈ విధానం సఫలం అయినట్లు చెపుతున్నారు.

ఈ ప్లాస్మా థెరపీ లాగానే మరొక విధానం నేను ప్రీతిపాదిస్తున్నాను.  అదేమిటంటే ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రాగానే అతని రక్తం వలసినంత తీసి దాచివుంచి తరువాత అతనికే ఎక్కిస్తే తప్పక రోగి కోలుకుంటాడని నా అభిప్రాయం. యెట్లా అంటే;

రోగ నిర్ధారణ జరిగిన సమయంలో రోగి పూర్తిగా రోగగ్రస్తుడు కాడు.  అతడు ప్రాధమికస్థితిలో కొంత ఆరోగ్యంగా కొంత అనారోగ్యంగా ఉంటాడు.  అతని శరీరం వైరస్తో యుద్ధం ప్రకటించి యాంటీబోడీస్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ యాంటీబోడీస్ కలిగిన రక్తం ఆ రోగినించి సేకరించి దాచిపెట్టాలి.  ఎప్పుడైతే శరీరంలో రక్తం తగిన మోతాదులో తగ్గుతుందో అప్పుడు అతని శరీరం తగ్గిన రక్తం భర్తీ చేయటానికి కొత్త రక్తం ఉత్పత్తి చేస్తుంది.  ఈ స్థితిలో ఆ వ్యక్తికి పండ్ల రసాలు, ఇతర పోషక విలువలు కలిగిం ఆహారపదార్ధాలు తగినంతగా ఇస్తే ఆ రోగి రక్తం త్వరగా ఉత్పత్తి ఆయె శరీరంలో ఉండాల్సిన రక్తం సమకూరుతుంది.  ఆ సమయంలో అతని నుండి సేకరించిన రక్తాన్ని అతనికే డూప్ చేస్తే అతని శరీరంలో రక్తం పెరిగి రక్తంలో వున్నా ఎర్ర రక్తకణాలు ఆక్సీజన్ వేగంగా సరఫరా చేస్తుంది.  అంతకు ముందు రక్తంలో వున్న యాంటీబాడీస్ ప్రస్తుతం వున్న వాటితోపాటు కలసి సమర్ధవంతంగా వైరస్ మీద దాడి చేసి రోగిని పూర్తిగా రోగమునుండి రక్షిస్తుంది.

ఈ విధానం వల్ల లాభాలు; ఏ మనిషి రక్తం తీస్తామో ఆ మనిషికే ఎక్కిస్తాము కాబట్టి ఎలాంటి గ్రూప్ పరీక్షలు చేయనవసరం లేదు. రోగి వ్యాధినిరోధకాలు శరీరంలో ఎక్కువగా చేరుతాయి కాబట్టి రోగి కోలుకోవడానికి ఎక్కువ శాతం తోట్పాడుతాయి. ఈ విష్యం సమర్ధవంతులైయిన వైద్యులు పరిగణలోకి తీసుకొని తగువిధంగా ఈ విధానం అమలు చేస్తే బాగుంటుంది.    

ప్రభుత్వాలు ఈ వ్యాధికి మందులేదు కాబట్టి ఇంట్లోనే ఉండమని లాక్ డౌన్ ప్రకటించాయి.  ప్రజలు కూడా తమని తాము కాపాడుకోవాలని ఇంటికే పరిమితం అయ్యారు.  వారందరు అభినందనీయులు.  కానీ ఎన్నాళ్ళు అనే ప్రశ్నకు జవాబు ఎవ్వరి వద్దా లేదు. కాబట్టి ఈ తరుణంలో కేవలం అల్లోపతి డాక్టర్లే కాకుండా ఇతర సాంప్రదాయ వైద్యులు కుడా నడుం బిగించాలిసిన సమయం.  సాంప్రదాయ వైద్యం కన్నా అల్లోపతి వైద్యం ప్రచుర్యం పొందటానికి కారణాలు రెండు. ఒకటి ఇంజక్షన్ వల్ల మందుని మనిషి రక్తంలోకి నేరుగా పంపించటం తత్వర రోగ నివారణ సత్వరంగా చేయగలగడం. రెండు చెడిపోయిన అవయవాన్ని ఆపరేషన్ చేసి తొలగించటం.  ఈ రెండు సుగుణాల వల్ల అల్లోపతి వైద్యం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.  కానీ అల్లోపతికన్నా ముందు వివిధ దేశాలలో వివిధ సాంప్రదాయ వైద్య విధానాలు వున్నాయి.  అప్పటి జనులు వాటివల్ల రోగాల బారినుండి కాపాదపడ్డారు.  మన దేశంలో పురాతన వైద్య విధానం ఆయుర్వేదం.  మన దేశంలో ఇంకా హోమియోపతి, యునాని వైద్య విధానాలుకూడా లభ్యమౌ తున్నాయి.  

ఆయురేదం: మన దేశంలో పూరితంగా ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలో వున్నది.  వేల సమస్తరాలు ఎందరో ఋషులు కస్టపడి సృష్టించిన వైద్య విధానం.  ఈ ఆయుర్వేదం. ధన్వంతరి, చెరకుడు మొదలగు మహర్షులు శ్రేమించి నిర్మించిన ఈ విద్య విధానం ఎంతో పురాతనమైనది మాత్రమే కాదు మానవాళికి ఎన్నో రకాల వ్యాదులనుండి కాపాడుతూ వున్నది. పూర్వం ఆపరేషనులు కుడా చేసేవారని మనకు గ్రంధాలూ చెపుతున్నాయి.  ఆ అపూర్వ జ్ఞ్యానసంపదఁ ఎటు పోయింది.   ఇప్పుడు కూడా ఎందరో ఆయుర్వేద దిగ్గజాలు ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. నేను ప్రార్ధించేది ఏమంటే మహానుభావులారా ఇప్పుడు సమయం ఆసన్నమైనది మీ అపూర్వ మేధస్సుతో ఈ కరొనకు మందును తయారు చేయండి. మానవాళిని కాపాడండి.  అనేక రకాల పాషాణాలు, విషాలు మనిషే చావు బతుకుల మధ్య కొట్లాడుకున్నపుడు వాడి మృత్యు వాత నుండి రక్షించినట్లు మన చరిత్ర చెపుతున్నది.  మరి ఇప్పుడు ఈ వైద్యులు ఎందుకు ముందుకు రావటంలేదు.   అయ్యా మీరు ఉపేక్షించకండి రండి ముందుకు రండి ఈ విపత్కర సమయంలో మానవాళికి చేయూతనివ్వండి.  మన దేశాధీశులను వినయపూర్వకంగా ఈ విధానంకూడా ఈ మహమ్మారినుండి జనులు కాపాడటానికి వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
ఈ సందర్భంలో నేను రెండు పద్ధతులు ప్రతిపాదించదలిచాను.
ఒకటి. మన గ్రామీణ ప్రాంతాలలో జ్వరాలు వస్తే కడుపు మీద సూదితో వాతలు పెట్టేవారు.  ఆ వాతలతో జ్వరాలు తగ్గేవి.  అదే మాదిరిగా కరోనా భారిన పడిన రోగుల కడుపు (abdomen)  మీద సూదితో వాటాలు పెడితే రోగం తగ్గవచ్చని భావిస్తున్న.

పని చేసే విధానం. ఎప్పుడైతే మనిషికి తన శరీరం కొంత భాగం కాలుతుందో అప్పుడు శరీర రక్షక విభాగం పనిచేసి ఆ గాయాన్ని నయం చేయటానికి యాంటీబోడీస్ని ఉత్పత్తి చేస్తుంది అట్లా ఉత్పత్తి ఐన యాంటీబాడీస్ ఈ వైరస్ మీద దాడి చేసి రోగాన్ని తగ్గించ వచ్చు. ఈ విధానం వల్ల ఎటువంటి నష్టము రోగికి వేరుగా ఉండదు.  కాక్ పోతే కాలిన గాయాలవల్ల కొంత బాధ పడవలసివుంటుంది.  ప్రాణాలు పోగొట్టుకోటం కన్నా గాయాల బాధలు అనుభవించటం మేలు కదా.

రెండో విధానం: గో మూత్రంతో అనైక రోగాలకు చికిత్స చేయవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెపుతున్నది.  కాబట్టి రోజు 10 మిల్లి లీటర్ల గోమూత్రాన్ని రోగులకు పరిగడుపున ఇస్తే వైరస్ మీద పని చేయవచ్చు.
ఫై రెండు విధానాలను అనుభవజ్ఞులైన వైద్యులు పరిశీలించి వివరించి ప్రభుత్వానికి తెలిపి ఈ కఠోర కరోనా మహారమారి నుండి మానవాళిని రక్షించాలని ప్రార్థిస్తున్నా;

ఇప్పుడు ఏ పద్దతి మంచిదా అని యోచించే సమయం కాదు ఏదో ఒక విధానం,  ప్రయత్నిస్తే తప్పకుండ ఫలితం లభిస్తుంది.  

హోమియోపతి:  జర్మనీ దేశంలో జన్మించిన డాక్టర్ Samuel Hahnemann (1755-1843),  చే ఆవిర్భవించిన  వైద్యం ఈ పద్దతి.  దీని మూల సూత్రం ఏమిటంటే  ఆరోగ్యవంతునికి ఏ మందు ఇస్తే అతనికి ఏరకమైన రోగ లక్షణాలు కనబడతాయో అదే మందు ఆ లక్షణాలు కలిగిం రోగికి ఇస్తే ఆ రోగం నయం అవుతుంది.  ఈ విధానం మనం మన భాషలో చెప్పాలంటే ముల్లుని ముల్లుతోటె తీయాలి అన్నట్లు. అప్పటి  వైద్య విధానానికి వ్యతిరేకంగా ఇది  ఉండటంతో ఆయనను అప్పుడు సమర్ధించలేదు. కాని కాలాంతరంలో ఈ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంతరించుకుంది.  మనదేశంలో కుడా ఈ వైద్యవిధానం బహుళ ప్రదాన్యత పొందింది.  అంతే కాక ఇటీవల జరిపిం ఒక సర్వేలో ఇక్కడ నూటికి 59 మంది ఈ వైద్యవిధానం పట్ల మొగ్గుచూపుతున్నారని తెలిసింది. మన దేశ ఆయుష్ మంత్రిత్వ విభాగం కరోనా రాకుండా arsenicum album 30c ని రోగనిరోధానికి వాడమని చెప్పటమే కాక అనేక హాస్పిటల్సులో ఉచితంగా ఇవ్వటం జరిగింది.  ఇక ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మందు మూడురోజులు వరుసగా వాడిన వారికి ఎవరికైనా కరోనా సోకిందా, లేదా అనే విషయం ఇప్పటివరకు సర్వ్ చేసిన దాఖలాలు లేవు.  ప్రభుత్వం ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని కరోనా రోగులు ఈ మందు రోగం రాకముందు వాడారా, లేదా అని ఆరా తీసి ఒకవేళ ఈ మందు వాడినవారికి కరోనా సోకితే ఈ మందు ప్రభావం వాళ్ళ మీద ఎంతవరకు వున్నది తెలుసుకోవాలి. నిజానికి నాకు తెలిసినంతవరకు హోమియోపతి విధానం ఒకరకంగా వాక్సిన్ లాగానే పని చేస్తుంది. మందు మందుయొక్క పొటెన్షిని సరిగా తెలుసుకొని ఉపయోగిస్తే తప్పకుండ ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది.  ఈ arsenicum album 30c పనిచేస్తే దానిని ఎందుకు వాడటంలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుని ఈ వైద్య విధానాన్ని ఈ కరోనా నివారణకు వినియోగించుకొనే దిశలో ఆలోచన చేస్తే బాగుంటుంది. 

నేను pubmed.gov అను website నుండి సేకరించిన విషయాన్ని యధాతధంగా ఇక్కడా ఇస్తున్నాను. 

Potentized homeopathic drug Arsenicum Album 30C positively modulates protein biomarkers and gene expressions in Saccharomyces cerevisae exposed to arsenate.

Abstract

OBJECTIVE:

This study examines if homeopathic drug Arsenicum Album 30C (Ars Alb 30C) can elicit ameliorative responses in yeast (Saccharomyces cerevisiae) exposed to arsenate.

METHODS:

The yeast S. cerevisiae 699 was cultured in a standard yeast extract peptone dextrose broth medium. It was exposed to the final concentration of 0.15 mmol/L arsenate for two intervals, 1 h and 2 h, respectively. The cell viability was determined along with the assessment of several toxicity biomarkers such as catalase (CAT), superoxide dismutase (SOD), total thiol (GSH) and glucose-6-phosphate dehydrogenase (G6PDH), lipid peroxidation, protein carbonylation and DNA damage. Reactive oxygen species (ROS) accumulation, expressions of relevant stress transcription activators like Yap-1 and Msn 2, and mRNA expression of yeast caspase-1 (Yca-1) were also measured.

RESULTS:

Treatment of arsenate increased lipid peroxidation, protein carbonylation, DNA damage, ROS accumulation and expressions of Yap-1, Msn 2 and Yca-1 and decreased GSH, G6PDH, CAT and SOD. Ars Alb 30C administration decreased lipid peroxidation, protein carbonylation, DNA damage, ROS formation and Msn 2 and Yca-1 expressions and increased cell viability, GSH, G6PDH, CAT and SOD significantly (P<0 .05="" a="" except="" expression.="" for="" in="" increase="" p="" slight="" yap-1="">

CONCLUSION:


Ars Alb 30C triggers ameliorative responses in S. cerevisiae exposed to arsenate.   

ఈ కరోనా వైరస్ నుండి మానవాళిని కాపాడాలన్నదే నా ప్రయత్నం.  నా ఆకాంక్ష నెరవేరాలని నేను విజయం పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం  ప్రార్ధిస్తూ సత్వర నివారణ కావాలని ఆశిస్తున్నా:
సర్వే జనా సుఖినో భవన్త
ఓం శాంతి శాంతి శాంతిః 


27, ఏప్రిల్ 2020, సోమవారం

రోగనిరోధకతకు విటమిన్ మాత్రలు

 రోగనిరోధకతకు విటమిన్ మాత్రలు ఎంతవరకు ఉపయోగం.అనేది ప్రస్తుత సమస్య.  ఇప్పుడు కరోనామహమ్మారి నుండి ఎదుర్కొనే క్రమంలో డాక్టర్లు రోగనిరోధక శక్తిని పెంచుకొనే విషయంలో రోజు విటమిన్ మాత్తర్లు వాడమని సలహా ఇస్తున్నారు.  ఈ క్రమంలో అందరికి అవహగాహన కొరకు విటమనుల గూర్చి ప్రస్తావిస్తున్నాను.  డాక్టర్లు ముఖ్యంగా vit-D, Vit-Bcomplex, Vit-C  లను వాడటానికి సూచిస్తున్న విషయం మనందరికి తెలిసేందే.   ఇప్పుడు విటమనుల గూర్చి తెలుసుకుందాం.  
ముఖ్యంగా విటమినులు అనేవి మన ఆహారంలో లభ్యమైయే పోషకాలు.  నిజానికి మనం పౌష్ఠిక ఆహరం తీసుకుంటే ప్రత్యేకించి విటమినులు విడిగా తీసుకోవలసిన అవసరం లేదు.  కానీ ప్రస్తుత మన ఆహారంలో కావలసినంతగా విటమినులు దొరకనందువల్ల మనం విటమిను మాత్రలు తీసుకోవలసిన పరిస్థితి. 
విటమినుల వాటి solubility ఆధారంగా రెండు రకాలుగా విభజించారు.  అవి 1) నీటిలో కరిగేవి 2) నూనెలలో కరిగేవి.  మొదటి కోవకు చెందినవి Vit-Bcomplex, Vit-C.  ఇందులో Vit-Bcomplex అనునది ఒక విటిమను కాదు ఇది బి విటమినుల సమూహం.  కొన్ని బి విటమినులు ఒకదానికి ఒకటి వేరు చేయటం కుదరదు అందుకే అన్ని విటమినులు కలిపి Vit-Bcomplex గా పిలుస్తారు.  ఇది సాధారణ బలహీనతలను పోగొడుతుంది.  మనం తేనే అన్నంలో,  ఆకు కూరల్లో  ఈ విటమిన్ పుష్కలంగా వున్నది కానీ ప్రస్తుత పరిస్థితులలో మనం దీనిని వలసినంతగా పొందలేక పోతున్నాము.  కారణం ఏమంటే బియ్యం తెల్లగా వుండాలని బియ్యాన్ని ఎక్కువ పట్టు పట్టిస్తాము.  కాబట్టి బియ్యపు ఫై పొరలో వున్న ఈ విటమిన్ తౌడులో పోతుంది.  ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మనం బియ్యాన్ని రెండు, మూడు సార్లు కడిగి అన్నం వండుకుంటాము కాబట్టి ఆ వున్నా కొంచం కూడా బియ్యం కడుగు నీళ్ళల్లో కరిగి పోతున్నది.  కాబట్టి మనం వలసినంత విటమిన్ పొందలేక పోతున్నాము.  మనం కొన్న బియ్యం పురుగు పట్టకూడదని మిల్లు వాళ్ళు బియ్యానికి కొన్ని రసాయనిక పదార్ధాలు కలుపుతారు.  కాబట్టి మనం బియ్యం కడగక తప్పదు. ఇక పొతే ఆకు కూరల విషయానికి వస్తే ఆకుకూరలు మంచిగా వృద్ధి చెందాలని రైతు రసాయనిక ఎరువులు, కూర చీడ పట్టకుండా రసాయనిక విష పదార్ధాలు చిమ్ముతున్నారు.  ఏతావాత తెలిసేది ఏమంటే మనం ఆకుకూరలను శుభ్రంగా కడగక పోతే మనం రసాయనాలను భుజించాలి.  తత్ కారణంగా అనారోగ్యం కొని తెచ్చుకోవాలి.  కాబట్టి ఒక పని మనం చేసి కొంత వరకు పోషకాలను కాపాడుకో వచ్చు.  అది కూర పూర్తిగా కడిగి తరువాత తరగటం. 
ఇక  Vit-C ఇది పుల్లని రుచి కలిగిన పదార్ధాలలో అంటే నిమ్మ, ఉసిరి, మొదలగు వాటిలో ఉంటుంది.  నిజానికి మన ఆయుర్వేదం ఉసిరి తింటే మంచి రోగనిరోధక శక్తి వస్తుందని చెపుతుంది. ఇప్పుడు మనం ఆయుర్వేద చ్యవనప్రాస తింటే మంచిది. 
రోజుకి ఒక Vit-Bcomplex మాత్ర, ఒక Vit-C మాత్ర తీసుకుంటే మన శరీర రోగనిరోధకత పెరిగి రోగాలని తట్టుకొనే శక్తి కలుగు తుంది.  ఈ మాతర్లు పొరపాటున ఎక్కువ తీసుకున్న పెద్దగా ప్రమాదం జరగదు.  ఎందుకంటె మనకు కావలసిన దానికన్నా ఎక్కువ వున్న విటమినులు మూత్రంలో కరిగి పోతాయ్. 
డాక్టర్ల సలహా లేకుండా vit-D మాతర్లు మనం ఇష్టమొచ్చినట్లు తీసుకోకూడదు.  ఈ విటమిన్ నూనెలో కరిగే విటమిన్ కాబట్టి మనం మన శరీరానికి కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకుంటే ప్రమాదము.  ఇప్పటి పరిస్థితుల్లో ఈ విటమిన్ ఊపిరితిత్తులకు ఆరోగ్యం చేకూరుస్తుందని డాక్టర్లు చెపుతున్నారు.  కాబట్టి తగు మోతాదుల్లో మాత్రమే ఈ విటమిన్ తీసుకోవాలి.  ఈ విట్మన్ తెబ్లేట్ Vit-A విటమిన్ తో కలసి దొరుకుతాయి.  ఈ రెండు విటమినులుకూడా నూనెలలో కరిగేవే. నిజానికి మనం తీసుకునే డి విటమిన్ మాతర్లు ప్రొవిటమిన్ డి కలిగి ఉంటాయి అంటే విటమిన్ డి ని తయారుచేసే పదార్ధం అంటే మన శరీరంలో వున్న ప్రొవిటమిన్ డి మనం సూర్య కాంతిలో వున్నప్పుడు సూర్య కాంతితో విటమిన్ D గా మార్పు చెందుతుంది.  కాబట్టి మనకు డాక్టర్లు ప్రతి రోజు కొంత టైం ఎండలో ఉండమని చెప్పుతున్నారు.
రోజుకు ఒక Vit-Bcomplex మాత్ర, ఒక Vit-C మాత్ర తీసుకుందాం,  ప్రాతఃకాలంలో ఎండలో ఉందాం ఆరోగ్యంగా ఉందాం.

ఇక్కడ పేర్కొన్న విషయాలు కేవలం సమాచారం కొరకు మాత్రమే.  డాక్టర్ల సిఫారుసులేకుండా మందులు వాడటం క్షేమం కాదు.

 సర్వ్ జనా సుఖినో భవంతు.

 ఓం శాంతి శాంతి శాంతిః


26, ఏప్రిల్ 2020, ఆదివారం

నాకేం కాదు దేముడు నన్ను కాపాడుతాడు.

   నాకేం కాదు దేముడు నన్ను కాపాడుతాడు అనే భావన చాల మంచిది ఇది ప్రతి మనిషికి ఊరట నిస్తుంది. కానీ కొన్ని సమయాలలో ఇదే ప్రాణాలను హరిస్తుంది కూడా. నేను దైవ భక్తుణ్ణ నన్ను కాపాడటం దేముడి కర్తవ్యం.  ఎందుకంటె నేను రోజు దైవ ప్రార్ధన చేస్తాను.  అని కొందరు మూర్కులు ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ప్రవర్తించి మృత్యువాత పడ్డ  వారిని ఉద్దేశించి ఇది వ్రాస్తున్న.  ఇక్కడ మతం ముఖ్యం కాదు కేవలం నమ్మకం ముఖ్యం.  ప్రతి మనిషికి ఎవరో ఒకరు దేముడు ఉంటాడు.  కానీ కొంతమంది తమ దైవం మాత్రమే ఈ ప్రపంచాన్ని కాపాడుతాడని.  అందరు ఆ దేముడినే కొలవాలనే మూర్ఖపు ఆలోచనలో వుంటారు.  నిజానికి ఈ ప్రపంచం మొత్తానికి ఒకే ఒక దేముడు ఉన్నాడు. ( దేముడు అనే పోస్ట్ చదవగలరు) 

భక్తులని కాపాడటం దేముడి కర్తవ్యమా:  ఈ ప్రశ్నకు మనం రెండు విధాలుగా సమాధాన ఇవ్వొచ్చు ఒకటి కాదు అని రెండు ఔను అని. ఒక ప్రశ్నకు ఒక జవాబు ఉండాలి కానీ రెండు విరుద్ధ జవాబులు ఉంటాయా అని మీరు అడగవచ్చు.  ముందుగా మొదటి జవాబు కాదు అనేదానికి వస్తే. 

దేముడు ఎప్పుడు ఎవ్వరిని కాపాడటం కానీ, లేక శిక్షించటం కానీ చేయడు.  ఈ సంగతి తెలియని కొందరు మూర్ఖులు వారు చెప్పినట్లుగా నడవక పోతే  నరకానికి వెళతారు అని అమాయక మానవులతో చెప్పి వారి పబ్బం గడుపుకుంటున్నారు.  నిజానికి ఆ మూర్కులే చివరకు నరకానికి వెళతారు అన్న యదార్ధం తెలుసుకోలేరు.  ఎలానో చూద్దాం. 

ప్రతి మనిషి రోజు కర్మలు అంటే పనులు చేస్తూ ఉంటాడు.  ఈ కర్మలు రెండు రకాలు ఒకటి సత్కర్మ రెండు దుష్ కర్మ ఈ రెండు ఏమిటో చూద్దాము. 
సత్ కర్మ అంటే మంచి కర్మ ఈ కర్మ చేయటం వలన మంచి కలుగుతుంది.  అంటే ఈ ,మంచి ఎవరికి కలుగుతుంది ఎట్లా కలుగుతుంది చూద్దాం. ఆకలితో వున్న వానికి అన్నం పెట్టారనుకోండి ఆ అన్నం తిన్న వానికి ఆకలి తీరుతుంది.  దాని ద్వారా అతనికి నీ పట్ల కృతజ్ఞతా భావం కలుగుతుంది. అంటే అతని మనస్సు ప్రశాంతతగా నీ పట్ల ఉంటుంది.  దీని ఫలితం మంచి ఫలితం అని అనుకుందాం. ఈ మంచి ఫలితమే పుణ్యం అని అంటారు.  అంటే నీవల్ల ఎదుటి వానికి కలిగిన  మేలు.  ఇతర జీవులకు మేలు చేయటం అని అర్ధం.  

నీవు ఏ కారణం లేకుండా ఒక మనిషిని కానీ, జంతువుని కానీ హింసించావనుకో దానివల్ల అతనికి నీమీద కోపము, ద్వేషము కలుగుతాయి అంటే అతని మనసు నీ కారణంగా క్షోభిస్తుంది.  దీని వల్ల నీకు చెడు ఫలితం వస్తుంది.  అదే పాపం. అంటే ఏది ఎదుటువాడు నీకు చేస్తే నీవు బాధపడతావో అది నీవు ఎదుటివాడికి చేయటం పాపం.  అదే విధంగా నీకు ఎదుటివాడు ఏది చేస్తే నీవు ఆనందపడతావో అది నీవు ఎదుటి వానికి చేయటం పుణ్యం అన్నమాట. 

ప్రతి మనిషి పూర్తిగా పాపాత్ముడు కాడు అదే మాదిరిగా పుణ్యప్తుడు కాడు.  ఎందుకంటె మనం రోజు చేసే కర్మలలో సత్ కర్మలు, దుష్ కర్మలు రెండు ఉంటాయి. అంటే మనకు రోజు కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు మన అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి అన్న మాట.  అంటే మనిషి పాప,పుణ్యాల మిశ్రమం.  అయితే ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కక్క విధంగా ఎందుకు వుంటారు అనే సందేహం వస్తుంది.  నిజానికి ఈ పాప పుణ్యాల ఫలితమే ఈ రోజు మనకు వున్న ఈ శరీరం.  అందుకే ఈ శరీరాన్ని ప్రలబ్ద దేహంగా జ్ఞ్యానులు చెపుతారు. 

భక్తుని దేముడు ఎలా కాపాడుతాడు.  దేముడికి ఎవరిమీద ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు.  మనిషి చేసిన పాప పుణ్యాల ఫలితమే తానూ పొందే సుఖ దుఃక్కాలకు కారణం.  కేవలం దైవ భక్తి వలన పుణ్య కార్యాలు చేయాలనే తలపు వస్తుంది.  కానీ తాను చేసిన పాప పుణ్యాల ఫలితం పొందక తప్పదు.  కాబట్టి జీవితాంతం నేను పాప కార్యాలు చేస్తాను కేవలం ఒకసారి ఏదో ఒక మంచిపని చేస్తాను నన్ను ఆ దేముడు రక్షించాలి అని అనుకోటం కేవలం అమాయకత్వం మాత్రమే.  మనం పాప పుణ్యాల డేటాను ఒక బ్యాంక్ అకౌంటుతో పోలుద్దాము .  నీవు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకొన్నావు అనుకో అది పాపం.  ఒక వెయ్యే రూపాయలు డిపాజిట్ చేసావనుకో అది పుణ్యం.  ఇప్పుడు నీవు ఒక పది వేలు కావాలని చెక్ ఇచ్చావనుకో ఆ చెక్కు హానర్ కాదు ఎందుకంటె నీకు బ్యాలన్స్ లేదు కాబట్టి.  అంతే కాక నీ వద్దనుండి బ్యాంకు వాళ్ళు 90 వేలు రికవరీ చేస్తారు.  నీ ఆస్థి అమ్మి ఆయన కట్టాలి.  అదే విధంగా నీవు తక్కువ పుణ్యం చేసి దేముడు నిన్ను కాపాడుకుంటాడని అనుకుంటే దేముడు కాపాడాడు సరి కదా నీ బాలన్స్ పాపాన్ని నీవు అనుభవించాలి.  అది ఎట్టి పరిస్థితిలోను తప్పదు.  ఇది తెలియని వాళ్ళు కొందరు  నేను ప్రతి రోజు దేముడిని ఆరాధిస్తాను కాబట్టి నాకు దేముడు ఎప్పుడు తోడుగా ఉంటాడని విర్రవీగుతూ వుంటారు అంతే కాక్ వాళ్ళు ఇతరులు పాపాత్ములుగా భావిస్తుంటారు.  కానీ నిజానికి  వారికీ వారు చేసిన  పాపలు పుణ్యాల మీదే వారి ప్రాప్త ప్రాప్తాలు లభిస్తాయి.  దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది కేవలం పాప రహితులు కేవలం అధిక పుణ్యం చేసిన పుణ్యప్తులు మాత్రమే దైవ కృపకు ప్రాప్తులౌతారు.

దేముడు - పుణ్యప్తులు.
పుణ్యప్తులు అంటే పుణ్య కార్యాలు ఎక్కువగా చేసే వాళ్ళు.  అంటే ఎవరైతే వారి జీవితాన్ని ఒక క్రమశిక్షణగా గడుపుతారో ఎవరైతే వారి జీవితాన్ని ఇతరుల క్షేమంకోసం శ్రమిస్తారో వారు దేముడికి దగ్గరగా వుంటారు.  వారిపై ఆ చేరా చెర జగన్నాధుడు సర్వ వేళల నీడలా వుంటూ వారిని కాపాడుతూ ఉంటాడు.  ఈ భూమి మీద దీర్ఘ కాలం జీవించటం మాత్రమే దైవ కృప అనుకుంటే పొరపాటే అవుతుంది.  ఈ జీవితం మనం చేసిన పాప పుణ్యాలను అనుభవించటానికి వచ్చింది అని మాత్రమే తెలుసుకోవాలి.

షడ్భాగం మనుష్యాణాం సప్తమం దైవ చింతనం. అనే నానుడి ననుసరించి మానవుడు ఆరు విధాలుగా ప్రయత్నం చేసి తానూ ఫలితం పొందని పరిస్థితిలో మాత్రమే ఏడవ భాగం దైవ చింతనం అంటే దేముడి అనుగ్రహం మీద ఆధారపడవలసి ఉంటుంది.  అప్పుడు మాత్రమే దేముడు తప్పకుండా కాపాడుతాడు.

గజేంద్ర మోక్షం: ఈ కధ ఇప్పుటి పరిస్థితికి పూర్తిగా సమన్వయకరణంగా తోడ్పడుతుంది. గజేంద్రుడు తన బలం మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాడు.  కానీ తన బలంతో మకరిని ఎదుర్కొనలేక పోయాడు.  వెంటనే అనేక మంది దేముళ్ళను అనేక విధాలుగా ప్రార్ధించాడు.  కానీ లాభాము లేక పోయంది.  చివరికి " లా ఒక్కింతయు లేదు దేర్యమ్ము  విలోలంబాయే   అని నీవే తప్ప ఇతప్పారంబు ఎరుగను అని త్రికరణ శుద్ధిగా శరణాగతి కోరాడు.  అప్పుడు మాత్రమే ఆ దేముడు కరుణించాడు గజేంద్రుని కాపాడాడు.  ప్రస్తుతం కొందరు వివిధ రకాల దుస్తులు ధరించి తాము సాక్షాతూ దేముడి వారసులం అన్నట్లు ప్రవర్తిస్తూ ఇతరులు తమకు దాసులు అని భవిస్తూ బాహ్య డంబాచారాలు పోతూ సామాన్యులను మోసగిస్తున్నామని అనుకుంటున్నారు.  కానీ నిజానికి వారు  వారినే వారు మోసగించుకుంటున్నారు,  వారు ఇతరులను ఉద్దరించటం అటుంచి వారే పాపకూపంలో త్రొక్కబడుతున్నారు. . వారి చేష్టలకు అనుగుణంగా ఫలితాలు అనుభవిస్తారు, అనుభవిస్తున్నారు.  కానీ అది వారు గుర్తించక పోవటం విచారకరం.

గజేంద్రుడు ఏ రకంగా అనేకవిధాలుగా ప్రయత్నించి చివరికి దేముడి కృపకు పాత్రుడు అయినాడో అదే విధంగా మనం ఈ  కరొనను ఎదుర్కొటం కోసం షడ్భాగం అంటే ఆరు రకాలుగా ప్రయత్నించాలి  అవి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమనగా
1) ఇంట్లోనే ఉండటం. 2) చేతులు ముఖం సబ్బుతో మాటి మాటికీ కడుగుకోవటం. 3) ఇతరులకు దూరంగా ఉండటం. 4) తప్పనిసరి ఐతే తప్ప బైటికి వెళ్లకపోటం. 5) ఎవ్వరితో చేతులు కలపక పోవటం. 6) బైటికి వెళితే మాస్కు ధరించటం అనే ఈ ఆరు భాగాల ప్రయత్నం  చేసి ఏడవది ఐన దైవ చింతనం అంటే భగవంతుడిని ప్రార్ధించడం చేస్తే తప్పకుండ దేముడు మనలను కరోనా నుండి కాపాడుతాడు.

కానీ కొందరు నా కేమి కాదు దేముడు నన్ను కాపాడతాడు అని రోడ్డుమీద పని వున్నా లేకున్నాఇష్టమొచ్చినట్లు తిరుగుతూ, వెంట  చిన్న పిల్లలని కూడా తీసుకొని వాళ్లతో పాటు వాళ్ళ ఇంట్లోని 60 సం. ధాటిని వృద్ధులిని, తీసుకొని వెళ్లే వాళ్ళను ఏ దేముడు కాపాడాడు. ఇంకా ఇంట్లో ఏమి తోయటం లేదని కూరల బండి వద్దకు, కిరాణా షాపుల వద్దకు, దేముడి గుడికి వెళ్లే ఆడవారిని ఏదేముడు కాపాడడు వారికి అతి వేగంగా కరోనా సోకె ప్రమాదము వున్నది.
సరదాగా కిరానా షాపుల దగ్గర పాన్ షాపుల దగ్గర నిలుచొని సిగరెట్ తాగే మూర్కులారా ఇకనైనా కళ్ళు తెరవండి ప్రమాదాన్ని గుర్తించండి జాగ్రత్త వహించండి.

దేవానాం మనుష్య రూపేణా; అన్న ఆర్యోక్తి ప్రకారం దేముడు ఎప్పుడు మనిషి రూపంలోనే మనకు సహాయం చేస్తాడు.  అది తెలుసుకోక మనం సాటి మనిషి మాటను లెఖ్ఖ చేయం దాని పర్వయవసాయంగా చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తాము.  మన దేశ ప్రధాని మోడీ గారు మనకు చక్కగా లాక్ డౌన్ ప్రకటించి ఈ మహమ్మారిని అరికట్ట టానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి మన ప్రధాని మోడీగారు మానుషరూపంలో వున్నా దేముడు మనమంతా మోడీ గారికి కృతజ్ఞతలు తెలపాలి.
ఈ విపత్కర పరిస్థితినుండి మనల్ని మనమే కాపాడుకోవాలి.
 తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త
ఓం శాంతి శాంతి శాంతిహి:











25, ఏప్రిల్ 2020, శనివారం

గో మూత్రంతో కరొనకు ట్రీట్మెంట్.

గో మూత్రంతో అనేక రోగాలకు చికిత్స చేయవచ్చని చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు చెపుతున్నారు.  దీనికి మూల కరణం  గో మూత్రం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి రోగాలను తగ్గిస్తుంది.  అదే విధంగా ఈ కరోనా వ్యాధికి కూడా గో మూత్రం ఎందుకు పనిచేయదని అనిపిస్తున్నది.  రోజు 10 ml. గో మూత్రాన్ని ఉదయం క్రమం తప్పకుండ సేవిస్తే ఈ కరోనా  రోగ నివారణకు ఉపయోగ పడవచ్చు. పతంజలి ఆయుర్వేద వారు గోమూత్ర ఆర్క్ సరఫరా చేస్తున్నారు.  ఈ గో మూత్ర ఆర్క్  ఈ కరోనా మహమ్మారిని నిర్ములించటానికి పని చేస్తుందని అనిపిస్తున్నది.  డాక్టర్లు ఈ విషయాన్నీ గమనించి సత్వరమే ఈ గోమూత్ర థెరపీని ప్రారంభిస్తే బాగుంటుంది. 

సర్వేజనా సుఖినోభవంతు. 

ఓం శాంతి శాంతి శాంతిహీ

23, ఏప్రిల్ 2020, గురువారం

కరోనోపాఖ్యానం

ఒక్క దినంబు  నైమిశారణ్యమందు  శవనకాది మహాఋషులు సూతుని సమీపించి ముచ్చటించు వేళ శవనకుడు లేచి నిలబడి కరములు జోడించి సూతినితో ఇట్లనెను.  ఓ మహర్షి తాము భూత భవిష్యత్ వర్తమానములెఱింగిన మహానుభావులు కాన మీరెరుగని విషయామీ పృద్వితలమున ఉండదు కాన నా యందు ప్రసన్నులై నా సందేహములు తీరుపవేడెదన్. అంత సూత మహర్షి, ఓ మహర్షి మీరు అడుగుటకు నా వద్ద సంసశయమెందులకు మీ బుద్ధికి పుట్టిన సంధేహములను నిస్సంశయముగా అడుగుడి అని ఆనతి నివ్వ అంత శవనకుడు వినమ్రుడై రాబోవు కలియుగంలో ఒకానొక శర్వారి  నామ సంవత్సరములో మానవాళికి తీవ్ర విపత్తు సంభవించు నట్లు నాకు జ్యోతకమౌచున్నది అది ఎంతవరకు యధార్ధము.  అట్లైన ఈ మానవాళిని కాపాడునదెవ్వరు తాము దయతో సెలవిండనెను. అంత మహర్షి దయాళుడై కరోనోపాఖ్యానంను  ఈ విధముగా చెప్పఁన్దోడంగెను. 

జంబూ ద్విపములో భారత వర్షంలో హిమనగానికి ఉత్తర ప్రదేశంలో చెనా అను ఒక రాష్ట్రము గలదు.  అందు బహు సుప్రసిద్ధ పట్టణములు గలవు.  అందులో యువన్ మను ఒక పట్టణము బహు విశాలముగా, అందముగా జనాకర్షణగా సాగర తీరమున గలదు.  ఆ పట్టణ వర్ణన చేయుట మానవ మాత్రుల వశము కాదు.  ఆ నగరిని దర్శించిన రాజులకు అక్కడి సౌధములను చూసుటకు శిరస్సులు పైకి ఎత్త ఆ సౌధాగ్రము ఫై దృష్టిపడ వారి మకుటములు క్రిందపడుచుండెను.  బహు అంతస్తులు, అత్యంత శోభాయమానమైన నిర్మాణములు, గాంచిన వారిని ముగ్దులను చేయుచుండెను.  సాగర తీరము బహు విశాలముగా ఉండి అత్యంత అధునాతన వనములు, భవనములు కలిగి చూపరుల మంత్రముగ్ధుల చేయుచుండెను.  అంతటి చక్కటి పట్టణము బహు జనములతో కిట కిట లాడుచుండెను. అచటికేగిన వారెవ్వరు ఆ నగరిని పొగడకనుండరు.  దేవేంద్రుడు సహితం అచటికి చనిన ఆహ ఈ పట్టణమెంత శోభాయమానంగా వున్నది నా ముఖ్య పట్టణమైన అమరావతిని ఆక్షేపించునట్లున్నదే అనక మానడు. అంతగా అభివృద్ధి చెందిన ఆ నగరిని గాంచిన వారెవ్వరైనా అచటి మానవులు సంస్కార వంతులు, ధర్మపరులు అని భావింపక తప్పదు.  కానీ అక్కడి ప్రజల జీవన విధానము తెలిసిన వారెవ్వరైనా, వారిని ఛీత్కరించక మానరు.  ఏలయన వారి ఆహారపు అలవాట్లు బహు చిత్రముగా మరియు హేయముగా తోచును.  వారు ఈ ధరాతలమున భుజించని జీవి లేదు అన అబ్బరపడనవసరము లేదు.  కప్పలు, పాములు, గబ్బిలములు, సకల జల చరులు, పక్షులు వారి కాహారమగు చుండెను శునకములను కుడా వారు వదలరు.  విశ్వమంతా పాములను చూసి భయపడ వారు ప్రీతితో శిరస్సు తప్ప శరీరమంతా తినుట ఇతర దేశస్తులకు ఆశ్చర్యం కలిగిస్తున్నది.  ప్రపంచమంతా పాముల భారం పడి ప్రాణముల నొడ్డుచుండ వారు ఆ విష సర్పములనే ఆహారరముగా తినుచున్నారన వారాలు ఎట్టి వారో తెలియగలరు. ఒక్క మాటలో చెప్ప వలెనన్న వారు ఈ పృద్విమీద తినని జీవి లేదనిన ఒప్పదగును. 

ఇట్లు ఆ జనులెల్ల జీవులను తమ ఇచ్చానుసారముగా భుజించుచుండ సర్వ జీవులకు ముప్పు వాటిల్లుతుండే . ఒక్కదినంబు భూచరములు, వాయుచరములు, ఉభయచరములు అచ్చటగల శివాద్రి అను ఒక పర్వతమందు చేరి ఈ మానవులనుండి వాటిని రక్షించుకొను మార్గాన్వేషణం చేయ బూనెను. 

సౌలొచ తపోదీక్ష పూనుట 

అట్లు ఆయా జీవులు తలకొక సూచనచేయుచు వాటి రక్షణ నిమిత్తము ప్రయత్నములు చేయగా ఏవియు సరైనవిగా వాటికి  తోచలేదు. అందులకు కారణమేమన ఈ జీవులు శారీరకంగా, బుద్ధికుశలతలోనూ అక్కడి జనుల కన్నా ఎంతో స్వల్పంగా తోచినవి.  కాన ఈ విషమ పరిస్థితికి విరుగుడు ఏమిటని అన్ని జీవులు మరల మరలా యోచించ సాగెను.  అంత  అక్కడ అంతవరకు మౌనంగా వున్న సౌలొచ అను  ఒక చర్మఛర్కము (గబ్బిలం) ఆ జీవ సమూహమును చేరి యిట్లనియె. నేను ఎన్నో ఇతిహాస కధలు తెలుసుకున్నాను.  గతంలో ఎట్టి ప్రమాదము వచ్చినను సర్వ లోకాలకు  పితయేన  ఆ మహాదేవుని కొల్చారని ఆ దేవదేవుని కృప వల్ల ఫలితం పొందారని మనకు తెలుస్తున్నది. దేవాది దేవుడు ఆర్త జన రక్షకుడు, దుష్టజన శిక్షకుడు, భోళా శంకరుడు, గతంలో గజ కోరిక మన్నించి గజాసురుని హృదయంలో కొలువున్నాడు, సాలె పురుగుకు కాలముకు హస్తికి వరములిచ్చి అచట శ్రీకాళేశ్వర రూపమున కొలువున్న ఆ దేముడు తప్ప మనలను కాపాడ అన్యులు లేరని.  కాన మనకు ఈ విషమ పరిస్థితిలో ఆ దేవదేవుని కొలుచుట కన్నా వేరు మార్గాంతరం లేదు అని నుడివి, నేను ఈ నాటినుండి ఆ దేవదేవుని శరణు చొచ్చి మన జీవహరులను నిర్జించు వరంబు పొందెదనని ఆ జీవులకు తెల్పి వాటిని ఊరడించి మీరు నాకు దేవుని వరప్రదానం లభించువరకు ఆ జనులనుండి మిమ్ము మీరు కాపాడుకొనుడని తెల్పి ఆ పర్వత శిఖరమందు గల ఒక బోధివృక్ష శాఖను చేరి తల్లక్రిందులుగా మహా దేవుని గూర్చి ఘోర తపంబుఆచరించే. . 
సౌలొచ తపోజ్వాలతో ఇంద్రలోకం భయకంపితులు కావటం : సౌలొచొనర్చు తీవ్ర తప్పస్సుతో జనించిన తపో జ్వాలలు ఇంతింతయి పెరిగి పెరిగి అవి ఇంద్రలోకాన్నిచుట్టూ ముట్టాయి.  ఆ జ్వాలా ప్రచులిత  తీవ్ర తాపానికి దేవాదులెల్లరు  అతలాకుతలమైరి.  దేవతలు, సప్తఋషులు, నవగ్రహాలు హాహా కారాలు చేస్తూ మహేంద్రుని కడకెళ్లి మొరలిడిరి.  అంత మహేంద్రుడు ఈ జ్వాలా ప్రకోపిత ఉష్ణ తాకిడిని ఎదుర్కొను మార్గము గాంచక ఖిన్నుడాయె.  అంత ముల్లోక సంచారగు బ్రహ్మర్షి నారద మహాముని వచ్చి మహేంద్రునిచేరి  ఇది భూలోకంలో మహా తపస్వి ఆచరించు తపో ప్రభావంబున జనించిన తీవ్రగ్నిగా తెలిపి వీటినేదుర్కొను శక్తి కేవలము ఆ మహా దేవునికి తప్ప అన్యులకు లేదు.  కాన ఆ మహాదేవుని శరణు చొచ్చుమని బోధించే.  వల్లే అని అంత దేవేంద్రుడు తన పరివార సమేతముగా కైలాసముకేగి పరమశివుని శరణు చొచ్చి ప్రభు మేము భూలోకతాపసి తీవ్ర తపోజ్వలోషణముతో భయ కంపితులమౌతున్నాము.  అవి ఇంద్రలోకమును ధ్వంసం చేయకమునుపే మమ్ము కాపాడమని కరములు జోడించిప్రార్ధించే.  సప్త ఋషులు, నవగ్రహాలు ఇతర దేవతలు భయకంపితులై పరమేశుని పాదాలపై పడిరి.  దయాళువైన పరమేశ్వరుడు ఆ జ్వాలల కారణమెఱుంగ అది శివాద్రి అను ఒక    చర్మఛర్కము (గబ్బిలం) చేయు తీవ్ర తప్పస్సు ప్రభావమని యెఱుంగే. అంత పరమేష్ఠి సహితముగా పరమేశ్వరుడు శివాద్రికరిగి ఆ చర్మఛర్కము (గబ్బిలం) నకు ప్రత్యక్షమై ఓ సౌలోచి నీ తపస్సుకి మెచ్చితి నీకెట్టి వరమ్ము కావలెను  కోరుకొమ్మనెను.  ఆ  సౌలొచ నేత్రానందముగా పరమేష్ఠి సహిత పరమేశ్వరుని గాంచి వేనోళ్ల ఆ దేవదేవుని పొగడి పరమేశ్వర నీ దర్శన భాగ్యముగా నా జన్మ తరించింది.  నీ దర్శనముకన్న వేరు వరము నా లాంటి అల్ప జీవులకు కలదేనని.  తాను తపమాచరించు కారణము తెలిపి దేవాది దేవా ఇచ్చోటి మనుజులు ధర్మాధర్మముల విడనాడి దొరికిన జీవినేల్ల భక్షించుచు జీవ జాతిని మొత్తము నశింప చేయుచున్నారు.  వారాలనడ్డగించ మేమశక్తులము.  మమ్ము మేము కాపాడుకొనలేకుంటిమి కాన నేను నీ కృపన్ ఆ దుష్ట మనుజుల నిర్జించ నెంచి ఈ తపమాచరించితి. ఓ దీన రక్షకా ఆపద్బాంధవా దయతో  ఈ క్రూర మానవుల హస్తంబులనుండి మా జీవ సంతతిని కాపాడవె అని వేడెను.  నీవు దక్క నాకు అన్య దిక్కులేదు.  నీవు కాపాడనిచో అనతి కాలములో ఈ సృష్టిలో జీవ జాలము యావత్తు నశించగలదనెను.  అంత ఆ పరమేశ్వరుడు దయాళుడై ఓ సౌలొచ నీ ప్రార్ధనలో అర్ధమున్నది నీవు నీకొరకు కాక యావత్ నీ సోదర జీవుల నుద్ధరించ పూనినావు.  కాన తప్పక నీకు వరమ్మిచెద ననియెను.  మీ జీవ జలమును కాపాడ వలెనన్న ఆ దుష్ట మానవులకు మీ యెడ విరక్తి కలగవలెను.  అప్పుడే వారు మీ జోలికి రారు.  కానీ మీ మాంస రుచిమరిగిన వారు మిమ్ముల నోదులుటకు ఇష్టపడరు,  కన్నా దీనికోకే ఒక ఉపాయము కలదు అది ఏమన మీ మాంస భక్షణ వారి పాలిట ప్రాణహరణ కావలెను.  అట్లయిన వారు మీ జోలికి రారు.  కాన నేను ఒక సూక్ష్మ జీవిని పుట్టించి మీ మాంసమందు పంపెద తత్ కారణంబునఁ మీ మాంస భక్షణం చేసిన వారి ప్రాణముల ఆ క్రిమి హరించ గలదు.  అట్లని పరమేశుడు వరంబియ ఆ సౌలొచ మిగుల సంతసించి పరమేశుని వేనోళ్ల పొగడ  పరమేశ్వరుడు అంతర్దహనమాయె.  అంత ఆ సౌలొచ  తన పరివారంబుని చేరి జరిగిన దంతయు వివరించ జీవులెల్ల సంతసించె. 

పరమేశ్వరుని వరప్రభావమున సూక్ష్మ జీవి జీవించుట.  అంత ఆ జనులు ఇది ఎరుగక వారు ఎప్పటివలె జీవ హింస చేయుచు వివిధ రకముల జీవుల మాంస భక్షణం చేయుచుండిరి.  పరమేశ్వర వరప్రభావముచేత ఒక సూక్ష్మ క్రిమి ఆ మాంసములందు జెనించె.  తత్కారణంబున ఆ మాంసభక్షణ చేసిన వారికి   ఆ సూక్ష్మ క్రిమి సోకి వివిధ రకముల అనారోగ్యములు జెనిచి చివరకు వారలు మరణించుచుండిరి. 

చైనీయులు సుక్స్మక్రిమిని గుర్తించుట:  అంత అనేకులు అకారణముగా అనారోగ్యగ్రస్తులై మరణించుట అచ్చటి మేధావులకు, వైద్యులకు ప్రస్నార్ధకముగా మారినది.  వారు వివిధ పరిశోధనలు చేసి చివరకు ఆ సూక్ష్మ క్రిమి జాడ  కనుగొనిరి. ఇది ఒక నూతనమైన అతి సూక్షమైన క్రిమి దీనికి విరుగుడు ఔషధము వారాలకు తెలియనిదాయె.  అప్పుడు వారలు ఈ జీవికి కరోనా అని నామకరణంచేసి దాని సంహరణమొనర్చ పూనుకొనిరి.  నాటి నుండి అచటి వైద్యులు జనులకు మీరు సర్వ జీవ భక్షణ చేయ ఈ విపత్తు దాపురించే కాన మీరు మాంసాహారము మానుడని సూచించ వల్లే యని అనేక జనులు జీవ భక్షణం వీడిరి.  కానీ పరమేశ్వర వరప్రసాది యగు ఆ సూక్ష్మ క్రిమి నానాటికి విజృభించి యావత్ భూలోకమంతా వ్యాపించెను.  తత్ కారణంబునఁ జీవ భక్షణ చేయని వారాలకు కుడా ఇది ప్రాణాంతకంగా నయ్యెను.  వివివిధ దేశాధీశులు దీని నంతమొందించ జాడ కనక ఖిన్నులై జనులను గృహంబులు వీడి బయల్వెడలవద్దని ఆనతిచ్చిరి.  దేశాధీశులు మాటలు పెడచెవిన పెట్టిన వారికి ఈ వ్యాధి సంక్రమించి విగతజీవులైరి. 

జగన్మాత పరమేశ్వరుని వేడుకొనుట:  ఇది ఇటులుండ భూలోకములో జరుగుచున్న విపత్త్తుని గమనిచిన  జగన్మాత పరమేశ్వరి పతిని జేరి ప్రభు మీరు ఆ సౌలొచన కిచ్చిన వరమ్ము సర్వ మానవాళికి శాపంబాయే.  మీరే సర్వస్వమని నిత్యం మిమ్ములను వేడు మీ భక్తులు కుడా ఈ క్రిమి భారిన పడి వారి ప్రాణములొడ్డుచున్నారు.  కాన దయతో ఈ విపత్తునుండి మీ భక్తులను కాపాడమని వెడుకొన అంత పరమేశ్వరుడు ప్రసన్నుడాయె. 

పరమేశ్వరుడు భక్తులను కాపాడుట: ఓ పరమేష్ఠి నీవు కోరిన కోరిక సమంజసమైనది.  ఇది కేవలము సర్వ జీవ భక్షణ చేయు మానవరూప రాక్షసులను నిర్జించుటకే కానీ శిస్టులను శిక్షించుటకు కాదు.  నేను ఎప్పుడు నా భక్తులకడ ప్రసన్నుడనే. అంతేకాదు శిష్టులు, ధర్మచారులు, ఆచార పరులు, పరహిత పరాయణులను ఏళ్ళ వేళల కాపాడుట నా కర్తవ్యము.  కాన ధర్మ పరులకు ఈ క్రిమి సోకాదని తెలిపెను. 

ధర్మ పరుల కాపాడుట: నిత్యము  సౌచపరులగు ధర్మా చరుణులు ప్రాతః కాలమున లేచి సూర్య భగవానుని స్తుతిస్తు ప్రాఖ్ ముఖులై ఆదిత్యునిప్రార్ధించి పరిశుభ్ర వస్త్రముల ధరించి స్వయంపాకముల భుజిస్తూ, జీవహింస చేయక నిత్యమూ నన్ను శరణు చొచ్చి నా నామ జపము, తపము ఆచరిస్తూ.  పరులకు అపకారము తలపక అత్యాశకు పోక ధర్మ దీక్షా పరతంత్రులై గృహంబు వీడక  జీవింతురో వారికి ఈ సూక్ష్మ క్రిమి వలన ఎట్టి హాని కలగదని తెలిపెను.  అనతి కాలములోనే మానవుల మేధస్సుతో ఈ క్రిమికీ విరుగుడు కనుగొనెదరని,  తత్కాలము వరకు ప్రతి వారు గృహంబుల వీడి వీధులలో విహరించకూడదని పరమేశ్వరుడు పరమేష్ఠికిన్ తెలుప పార్వతియు సంతసించె.  నాటి నుండి శిష్ఠులైన భక్తకోటి ప్రాతః కాలమున లేచి స్నాన సంధ్యాదుల నాచరించి సూర్య భగవానుని ప్రాతః కాలమున స్తుతించి తత్ కిరణ ప్రేరణతో ఆరోగ్యంబున్ చేకూర్చుకొని నిత్యము భగవన్నామ పారాయణము, దైవ చింతనమొనర్చుతూ ధర్మాచరణ బద్ధులై జీవనం గడప మేధావుల కృషిని ఈ క్రిమికీ ఔషధము లభ్యమైయ్యే.  అంత ఆ ఔషధ ప్రభావమున జనులెల్లరు సుకులై పూర్ణాయ్సమంతులై జీవితులైరి అని శవనకాది మహమునులకు    సుతుడు కరోనా ఉద్భావము  దాని ఉపశమనముతెలుపు కరణోపాఖ్యానము తెలుప వారలు నిజాశ్రమములకరిగిరి. 
ఫలశృతి:  ఈ ఉపాఖ్యానం చదివి నిత్యం ధర్మ దీక్ష పరాయణులై మహాదేవుని నిత్యమూ పూజంచు వారాలకు ఈ కరోనా వ్యాధి సోకకుండును గాక.  ఓం తత్సత్. 

ఇది రేవాఖండే ప్రథమాశ్వాసే కరోనోపాఖ్యానం సమాప్తం. 


ఓం శాంతి శాంతి శాంతిహి 
సర్వే జానా సుఖినో భవంతు. 

గమనిక ఇది కేవలము కల్పితము.  ఈ వృత్తాన్తము ఏ పురాణ ఇతిహాసములలోను ప్రస్తావించ లేదు. 

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

Blood doping.- cure corona ?

Blood doping is the practice of boosting the number of red blood cells in the bloodstream in order to enhance athletic performance. Because such blood cells carry oxygen from the lungs to the muscles, a higher concentration in the blood can improve an athlete's aerobic capacity (VO2 max) and endurance.



it is a practice to improve RBCs in the body of a person.  Is this system useful to cure the Corona patients?

Because by doping, the volume of the blood in the body will increase and the antibodies also increase.  is the increased antibodies works against the virus.  if this system improves the antibodies in the patient’s body.  Defiantly it will work and we can cure the patients.  

By this method the amount of oxygen in the body will be increased so that the patient will have sufficient oxygen and the antibodies which are available in the doping blood will fight against the virus.  In either way the system will give patient to some relief or he may be completely cured from the aliment by the graces of god. If this system is really works mankind around the globe will be survive. 

om shanthi shanti shanthihi

15, ఏప్రిల్ 2020, బుధవారం

ప్లాస్మా థెరపీ :

ప్లాస్మా థెరపీ :  ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఒకే ఒక ప్రశ్న అదే కరోనాను ఎలా  నియంత్రించాలి ఈ విషయం మీదనే ప్రస్తుతం అన్ని దేశాల డాక్టర్లు, మేధావులు పరిశోధనలు చేస్తున్నారు.  కరోనాకు మందు ఉండదు ఎందుకంటె అది ఒక వైరస్.  వైరస్ నిరోధించటం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటె ఇంకా మన సైన్సు antibacterial మెడిసిన్ లాగ antivirus లు కనుగొనే స్థాయికి ఎదగ లేదు.  కాబట్టి కేవలం రాకుండా ఆరోగ్యవంతునికి టీకాలు అంటే వాక్సిన్ ఇచ్చి రోగం రాకుండ కాపాడుకోటం మాత్రమే. నేను ఇంతకు ముందే తెలిపాను వాక్సిన్ రావటానికి ఇంకా సమయం పడుతుంది అది కొన్ని సంవత్సరాలు కావచ్చు.  మరి అంత వరకు ఏమిటి గతి.  ప్రస్తుత పరిస్థితిలో రోగ గ్రస్తులని treat చేయటానికి ఏదో ఒక చికిత్స కావాలి కదా దాని కోసం చేసే ప్రయత్నమే ఈ ప్లాస్మా థెరపీ ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. 
ప్లాస్మా అనేది మనిషి రక్తంలో ఒక భాగం, కాబట్టి రక్తానికి సంబందించిన ప్రాధమిక విషయాలు తెలుసుకుంటే అప్పుడు ప్లాస్మా దాని ఉపయోగం తెలుస్తుంది. 
మానవ రక్తం అనేది ఒక ద్రవ రూపంలో ఉన్న కణజాలం. కణజాలం అంటే కణాల సమూహం. ఇది ద్రవ రూపంలో ఉండటానికి కారణం రక్తం శరీరం మొత్తం సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ద్రవ రూపంలో వుండి శరీరం మొత్తంలో దాని అవసరం వున్నచోటికి ప్రసరిస్తూ ఉంటుంది.  
రక్తం చేసే పనులు; మొట్ట మొదటగా రక్తం చేసే పని శరీరంలో ఎక్కడ ఆక్సిజెన్ కావాలన్న అక్కడికి ఆక్సిజెన్ సరఫరా చేయటం.  ఈ ప్రక్రియ ఎర్ర రక్త కణాల వల్ల జరుగుతుంది.  మన రక్తంలో ఎఱ్ఱ రక్తకణాలు ఎక్కువ శాతంలో ఉంటాయి అందుకే రక్తం ఎర్రగా కనబడుతుంది. ఇంకా తెల్ల రక్త కణాలు, ప్లేటిలెట్స్ అనేవి కూడా రక్తంలో ఉంటాయి. ఈ కణాలు కాకుండా వున్న ద్రవ పదార్థమే ప్లాస్మా. ఇందులో నీరు, లవణాలు, ఎంజయ్మలు, ఆంటీబాడీస్ మరియి ప్రోటీన్లు ఉంటాయి.  మనకు ముఖ్యమైనవి యాంటీబోడీస్ వీటితోటె ప్లాస్మా థెరపీ చేయాలనీ డాక్టర్లు యోచిస్తున్నారు. 
విధానం: కరోనా సోకి నయమయిన రోగి నుండి రక్తాన్ని సేకరించి దానిలోంచి ప్లాస్మాని వేరు చేసి ఆ ప్లాస్మాని కరోనా వ్యాధితో బాధ పడుతున్న రోగి రక్తంలోకి ఇంజక్షన్ ద్వారా ఎక్కిస్తారు. 
పని చేసే విధానం: ఎప్పుడైతే రోగి శరీరంలోకి రోగం తగ్గిన మనీషి  రక్తమునుండి సేకరించిన  ప్లాస్మా ప్రవేశిస్తుందో అప్పుడు ఆ ప్లాస్మాలో వున్నా యాంటీబోడీస్ ఈ రోగిలో వున్న కరోనా మీద దాడి చేయటం మొదలు పెడతాయి.  తద్వారా రోగి శరీరంలోని కరోనా వైరస్ నశిస్తుంది.  ఈ ప్రక్రియ ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు గతంలో కూడా చేసినట్లు మనకు చరిత్ర చెప్పుతున్నది.  ఇంకా ఈ ప్రక్రియ మన దేశంలో మొదలు కాలేదు. ఇందులో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు.  అవి కరోనా రోగి శరీరం తన శరీరంలోకి ప్రవేశించిన ప్లాస్మాను అంగీకరించాలి. అంతే కాకుండా ఏ మనిషి రక్తమునుండి ప్లాస్మా గ్రహించారో ఆ వ్యక్తికి వెరీ ఇతర వ్యాధులు ఉండకూడదు, ఉంటే అవి ఈ రోగికి సోకె ప్రమాదం ఉండొచ్చు. 
blood group:  కరోనా రోగి రక్తపు గ్రూప్ అతనికి ఇచ్చిన ప్లాస్మా డొనేట్ చేసిన మనిషి  రక్తపు గ్రూప్ కలవాలి. కలవకపోతే వేరే కొత్త సమస్యలు తలయెత్తి రోగి మరణించే అవకాశం ఉండొచ్చు. అందుకే ప్రస్తుతం మన డాక్టర్లు AB రక్తపు గ్రూప్ వున్నా మనిషుల ప్లాస్మా ఉపయోగించ టానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఎందుకంటె AB  రక్తపు గ్రూప్ను యూనివర్సల్ donors గా పేర్కొంటారు. అంటే ఈ రక్తపు గ్రూప్ కలిగిన రక్తం మిగితా రక్తపు గ్రూపుల వారికీ ట్రాన్స్మిట్ చేయ వచ్చు. 
ఏది ఏమైతేనేమి ఇప్పుడు మన డాక్టర్లు చాలా శ్రమ దమాలకు ఓర్చి ఈ కరోనా వ్యాధిని నిర్ములించటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.  భగవంతుడు వారి ప్రయత్నాలను సఫలం చేయాలని ఆశిద్దాం. 
ఓం శాంతి శాంతి శాంతిః 

7, ఏప్రిల్ 2020, మంగళవారం

మేధావులకు వందనాలు

ఇప్పుడు మన సైన్స్ చాల అభివృద్ధి చెందినది. ప్రతి దానిని అది ఎంత సూక్షమైనకాని దానిని చూసి దాని గుణ గణాలను తెలుసుకొనే వీలు మన శాస్త్రీయ విజ్ఞానం, పరికరాలు ఉపకరిస్తున్నాయి.  కాబట్టే ఎంతో సూక్ష్మమైన కరోనా వైరస్ నిర్మాణాన్ని, దాని ఉనికిని దాని పనితనాని, అది ఏరకంగా మానవ శరీరంకు ముప్పు కలుగ చేస్తున్నది ఆవిష్కరించారు.  ఈ విజ్ఞానాన్ని మనకు అందించిన మేధావులు, డాక్టర్లు కానీ, శాస్త్రజ్ఞులు కానీ, బహుదా ప్రశంసనీయులు.  వారికీ ఈ ప్రపంచ మానవాళి యావత్తు సర్వదా కృతజ్ఞత కలిగి వుంటారు. 

ఈ కరోనా వైరస్ ఏమిటి: మనం తరచూ మూడు పేర్లు వ్యాధి కారకాల విషయంలో వింటూ ఉంటాము. అవి ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్. ఈ మూడింటిలో మొదటి రెండు జీవులు.  కానీ ఈ వైరస్ అనేది పూర్తిగా జీవి అని మనం చెప్పలేము. ఎందుకంటె జీవులకు వుండాలిసిన పూర్తి లక్షణాలు దీనిలో వుండవు.  కానీ ఇది జివి లాగ ప్రవర్తిస్తుంది. ఇక వివరాల లోకి వెళితే. 

ప్రతి జంతువు అనేక కణ జలాలు కలిగి ఉంటుంది.  ఆ కణాలు అవి చేసే పనులను బాట్టి ఆ పేర్లతో పిలువ బడతాయి.  కానీ ప్రాధమికంగా అన్ని కణాలకు ఒక nucleus ఉంటుంది అది రెండు రకాల nucleic acids  కలిగి ఉంటుంది.  అవి 1) RNA, 2) DNA అనగా ribonucleic acid.Deoxyribonucleic acid ఈ రెండిటిలో స్వల్ప బేధాలు వున్నాయ్. 
ఇకపోతే మనం ఈ కరోనా వైరస్ నిర్మాణ గూర్చి తెలుసుకుందాం. 
ఒక ఫాట్ పొరతో కప్పబడ్డ ఒక RNA అణువే  ఈ వైరస్.  నిజానికి ఇది చాలా చిన్నగా వున్న అణువు.  ఈ వైరస్ స్వతహాగా బైట ఉంటే ఎక్కువ కాలం జీవించి వుండలేదు.  కానీ దాని host Cell దొరికితే అప్పుడు అది దాని ప్రతాపం చూపెడుతుంది. మన శరీరంలో వున్న కొన్ని కణాలు ఈ వైరస్కు host Cells గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ వైరస్ మానవ శరీరంలో ప్రవేశించి దాని  host Cell మీదికి వెళుతుందో అప్పుడు ఈ కణంలో వున్న RNA అణువు మానవ శరీర కణంలోకి ప్రేవేశించి శరీర కణం మీద ఆధిపత్యం వహించి అనేక  RNA అణువులను సృష్టిస్తుంది.  ఆ విధంగా శరీరం నిండా వ్యాపిస్తుంది.  ఈ వైరస్ మానవ శరీరంలో ఊపిరితిత్తుల కణాలను ఆక్రమించుకొని పూర్తిగా ఉపిరితితుల కణజాలాన్ని వైరస్ కణాలుగా మార్పు చెందిస్తుంది.  ఈ విధంగా ఇది వ్యాపిస్తుంది.  తద్వారా ఊపిరి పీల్చుకోటం కష్టం అయి నిమోనియా వస్తుంది.  శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం వస్తుంది.  ఆ రకంగా మనుషుల మరణాలకు కారణం అవుతుంది.  
ఇప్పటి దాకా మనకు ఈ వైరస్ ఏరకంగా హాని చేస్తుందో మాత్రమే తెలుసుకున్నారు.  ఇది వైరస్ కాబట్టి మందుల ద్వారా దీనిని అరికట్ట లేము.  కాకపోతే టీకాల ద్వారా అంటే వాక్సిన్ ద్వారా రోగం రాకుండా ఆపవచ్చు.  కానీ ఇప్పటి వరకు వాక్సిన్ కనుగొన్న సమాచారం లేదు.  కాకపోతే మనకు వున్నా సమాచారం ప్రకారం ఈ రోగానికి వైరస్ కనుగొనటానికి కొంత సమయం పడుతుంది.  మరి అప్పటి దాకా మానవాళి మనుగడ యెట్లా? 
మనం కంటికి కనపడే శత్రువును ఎదుర్కొటం కొంత తేలిక ఎందుకంటే మన శత్రువు మనిషే కానీ వేరే ఏ జంతువూ కాని మనం ఒక్కళ్ళం దానిని లేక అతనిని ఎదుర్కొలేకే పోతే సమిష్టిగా దానిని నియంత్రించ గలం.  కానీ ఇది జీవం ఉందొ లేదో అనే ఒక చిన్న నూక్లిక్ ఆసిడ్ కణం.  ఇది కంటికి కనిపించదు. మనకు సోకింది లేనిది వెంటనే తెలియదు.  అంతే కాదు కొన్ని సందర్భాలలో మానవ శరీరంలో వున్నా ఆ మనిషికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు బైటపడవు.  అధవా బైట పడ్డా కనీసం 14 రోజులు పడుతుందని వైదులు చెపుతున్నారు.  కాబట్టి మనం అత్యంత జాగ్రత్త వహించాలి. ఇంకొక విషయం.  ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమే కాక అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి వున్నది.  మనకు తెలియకుండా పాకుతుంది.  కాబట్టి దీనిని గుర్తు పట్టటం ఎవరికి సాధ్యం కాదు.  వైద్య పరీక్షలలో నెగటివ్ వచ్చినా తరువాత పాజిటివ్ వచ్చిన కేసులు వున్నాయి.  కాబట్టి ఈ వ్యాధికి చాలా, చాలా దూరంగా ఉండాలి.  అది యెట్లా అంటే మనం వేరే ఏ మనిషితోటి శారీరక కాంటాక్ట్ కలిగి ఉండరాదు. అంతే కాదు అతని చేతుల ద్వారా లేక ఆటను తుమ్మినా దగ్గినా, చీదినా వుమ్మిన కూడా ఆ తుంపెరలలో ఈ వ్యాధి కణాలు కలిగి ఇతరులకు సంక్రమించే అవకాశం వున్నది.  కాబట్టి ఈ వ్యాధిని అరికట్టడం చాలా కష్టమైన పని. కనుక మనం ఎట్టి పరిస్థితులలోను ఇంటిలోంచి బైటికి రాకూడదు.  బైటి వారిని ఇంట్లోకి రానీయకూడదు. ఇక ఇతరుల ద్వారా ఏ వస్తువైనా తీసుకొన్న వెంటనే మన చేతులను పరిశుభ్రంగా సబ్బుతో, డెట్టాల్తో కడుక్కోవాలి.  చేతులు కడుకొనే ముందర మన చేతులను కళ్లకు, ముక్కుకు, నోటికి తాకించవద్దు. ఇంట్లో వాడే వస్తువులను అంటే పప్పులు, ఉప్పులూ మొదలైనవి సాధ్యమైనంత సమయం ఒక చోట ఉంచి తరువాత వాటిని వాడుకుంటే మనం రక్షింప బడతాము.  ఇక కూరలు మెడకినవి తెచ్చిన వెంటనే శుభ్రంగా నీటిలో 2% potassium paramanganetu  ( Kmno 4)  కలిపి కడగమని మేధావులు చెపుతున్నారు.  కానీ ఆ ద్రావకం మనకు కొట్లలో దొరకదు కాబట్టి నీటిలో ఒకటికి రెండు సార్లు కడుగుతే సరిపోతుంది.  కడిగిన వెంటనే వాడే రెట్లైతే కూర చేసేరప్పుడు స్టౌ మీద మనం వేడి చేస్తాం కాబట్టి ఒక వేళ వైరస్ వున్నా ఆ వేడికి దాని లిపిడ్ పొర కరిగి పోతుంది కాబ్బట్టి అది నిర్వేర్యం అవుతుంది. ఎలాంటి ప్రమాదం ఉండదు.  ఒక వేళ onlinge money transfer చేయ గలిగితే మనం రూపాయి నోట్లను చేతితో తాకవలసిం పని లేదు.  కాకపోతే ఎవ్వరి వద్ద నుండిన రూపాయలు కానీ ఏదైనా కాగితాలని గాని తీసుకోవలసి వస్తే వాటిని తీసుకొని ఒక చోట భద్రపరచి తరువాత వెంటనే చేతులను సబ్బుతో కానీ డెటాల్ తో కానీ శుభ్రంగా కడుగుకొండి.  మీరు తీసుకున్న ఆ రూపాయి నోట్లను ఒక రోజు దాకా ముట్టుకోకండీ.  వాటి మీద ఒకవేళ వైరస్ వున్నా అది కొన్ని గంటలు వుండి నశిస్తుంది కాబట్టి భయ పడనవసరం లేదు. ఇలాటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనా వైరస్ నుండి రక్షింప పడతాము.  
ముఖ్య మైన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధెర్యం వీడ వద్దు.  కస్టాలు కలకాలం ఉండవ్. మంచిరోజులు వస్తాయ్. 

మందులు లేవు కాబట్టి ఇప్పుడు వున్న పరిస్థితులలో కేవలం ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడటమే.  వ్యాధి సోకకుండా ఉండాలంటే ఈ వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండటమే.  ఎందుకంటే ఈ వ్యాధి కలిగిన రోగి drop lets అంటే వాళ్ళు దగ్గినప్పుడు, లేక తుమ్మినప్పుడు, ఉమ్మి నప్పుడు వారి శరీరం నుండి వెలువడే వైరస్ బైటికి వచ్చి ఇతరులకు శోకగలదు.  కాబట్టి ప్రతి మనిషి వేరే వాళ్లకు దూరంగా ఉండటం మంచిది.  మన ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పకుండ పాటించి ఈ రోగ బారిన పడకుండా మనలను మనం కాపాడుకుందాం. 

ఓం శాంతి శాంతి శాంతిః:  



6, ఏప్రిల్ 2020, సోమవారం

ఓదార్పు

 మనం సహజంగా ఎవరైనా కష్టాలలో ఉంటే వాళ్ళని మంచి మాటలు చెప్పి ప్రేమతో సంభాషిస్తూ వారిని ఓదార్చటం  చేస్తూ ఉంటాము.  కానీ ఇప్పుడు మనం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాము. ఓదార్చే వాళ్ళు ఓదార్పు పొందేవాళ్ళు అందారూఒక్కరే .  అర్ధం కవాటంలేదా. ఇప్పుడు ప్రతి వారికి ఇప్పటి పరిస్థితిలో ఓదార్పునిచ్చే వారు కావాలి.  కానీ అందరు ఒకే రకంగా ఉండటంతో ప్రతివారు ఎదుటి వారిని ఓదార్చాలి. అంటే మనం అంతా మనకు వున్న సామాజిక మాధ్యమాలతో ప్రేతివారిని (ఇంట్లోంచి వెళ్లకుండా)  కలసి ఓదార్పు మాటలు చెప్పుకుంటూ ఈ విపత్కర కరోనా  గడ్డు సమస్య తీరేదాకా ద్యేర్యం కోల్పోకుండా మానస్థాపానికి లోను కాకుండా ఉండాలి.  నిజానికి మనం పుట్టినప్పటినుండి ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు, వినలేదు. 
అందరం ఈ సమయాన్ని మన ఇష్ట దేముడిని  కొలవటానికి వినియోగించుకుని మన ఆధ్యాత్మిక ఉన్నతికి, దేశ శ్రేయస్సుకు తోడ్పడుదాం. 
ఓం శాంతి శాంతి శాంతిః. 







5, ఏప్రిల్ 2020, ఆదివారం

అసంకల్పిత ప్రతీకార చర్య

 ప్రతి జీవికి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప శక్తీ ఈ అసంకల్పిత ప్రతీకార చర్య. మనకు తెలియకుండానే మనం మనలను కాపాడుకోటమే ఈ అసంకల్పిత ప్రతీకార చర్య అంటే.  దీనిని వివరిస్తాను. మనము తెలియకుండా ఏదైనా ఒక వస్తువును ముట్టు కున్నామనుకోండి అది మనం భరించనంత వేడిగా ఉంటే మన శరీరం మనకు తెలియకుండానే దాన్ని వదలి దూరంగా వెళ్ళుతుంది.  ఈ రకమైన చర్య మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది.  అందుకే దీనిని మనం అసంకల్పిత ప్రతీకార చర్య  అని అంటాం. 
ఇక మనకు ప్రమాణం ఆయన దానిని బట్టి మనం జాగ్రత్త పడటం.  ఉదా : ఒక క్రూర జంతువు, ఒక విష జంతువును చూసిన వెంటనే మనం అక్కడి నుండి పరిగెడతాం.  దానికి ప్రమాణం మనకు ఆ జంతువు మన ప్రాణాన్ని తీసి వేస్తుంది అంటే మనకు ప్రాణ హాని ఉందని మనం తెలుసుకొని జాగ్రత్త పడతాము.  ఇలా జాగ్రత్త పడటానికి మనకు ప్రత్యక్ష  ప్రమాణం అవసరం లేదు పరోక్ష ప్రమాణమే మనం ప్రమాణంగా తీసుకుంటాం. ప్రత్యక్ష  ప్రమాణం అంటే మనం ఏదైతే స్వతంత్రంగా అనుభవంలోకి తెచుకుంటామో అది స్వప్రమాణం. అంటే ఉదా: మనం ఒక అరిటి పండు తింటాం అది తియ్యగా వుంది.  ఆ విషయం మనం అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాం.  అదే వేరే ఎవరో చిప్పినదానిని నమ్మటం పరోక్ష ప్రమాణంగా మనం చూడ వచ్చు. ఒక పాము కాటు వేస్తే మనిషి చనిపోతాడు దానికి ప్రమాణం వేరే ఎవరో పాము కాటుకు బలి ఆయన వాళ్ళ  ప్రమాణం. ఈ జ్ఞ్యానం మనం యితరుల అనుభవంతో తెలుసు కున్నాము.  నిజానికి ప్రత్యక్ష ప్రమాణం పరోక్ష ప్రమాణం రెండు ప్రమాణాలే. కానీ మనం ప్రత్యక్ష ప్రమాణంకు ఇచ్చిన ప్రాధాన్యత పరోక్ష ప్రమాణంకు ఇవ్వము.  దానికి కారణం స్వానుభవం లేక పోవటమే.  కానీ మనం రెండు కుడా సమానమైన ప్రమాణాలుగా తీసుకోటం మంచిది. 
ఇప్పుడు ప్రపంచమంతా వుడికిస్తున్న వణికిస్తున్న ఈ కరొనకు ప్రత్యక్ష ప్రమాణాలకోసం చూడకండి కేవలం పరోక్ష ప్రమాణాలనే నమ్మాలి. అప్పుడే మనం ఈ కరోనాను పారద్రోలవచ్చు.  కరచాలంతో, స్పర్శతో, తాకిడితో అంటే ఆ వైరస్ వున్నా ప్రదేశాన్ని ఏదయినా వస్తువు కానీ స్థలం కానీ తాకటం వల్ల సంక్రమిస్తుందని వైదులు చూపుతున్నారు.  మనం వినాలి తప్పకుండ పాటించాలి.  అంతే కానీ మనం ఏమాత్రం ఏమరుపాటు వహించి ప్రత్యక్ష ప్రమాణాలకోసం చూశామా ఇక ఇంతే సంగతులు ఆ వైరస్ కదిలిస్తుంది.  కాబట్టి ప్రపంచంలో వుండే ప్రతి మానవునికి చెప్పేది ఏమిటంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇతరులను తాకటం అంటే పైన చెప్పిన వాటికి దూరంగా ఉండాలి. మనల్ని మనం కాపాడు కోవాలి. 
ఈ ప్రపంచంలో వున్నా వారంతా క్షేమంగా వుండాలని కోరుకుంటున్నాను. 
ఓం శాంతి శాంతి శాంతిః