*33 కోట్ల దేవతలు ఎవరు?*
➖➖➖✍️
*హిందువులను విరోధించువారు… మీ 33 కోటి దేవతల పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు.*
*అసలు ఈ కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తీర్చి తిద్ది తెలివిమంతులు అనిపించుకొన్నారు.*
*హిందువులు అటువంటి చరిత్రను చదివి బుద్ధి హీనులు వారు అనిపించుకొనిరి.*
*వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి(33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా?*
*హిందూ ధర్మ - సంస్క్రతియందు 33కోటి దేవతల ఉల్లేఖన ఉంది. మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33కోట్ల పేర్లను చెప్పమని బలవంతం చేస్తారు. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు.*
*సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్థమూ ఉంది.*
*ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం.*
*అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.*
*యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు.*
*హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.*
*ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము:*
*12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) :* 1. త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. సవితృ 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.
*11 రుద్రులు (ఏకాదశ రుద్రులు):*
1.మన్యు 2. మను 3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా 8. భవ 9 కాల 10. వామదేవ 11. ధృతవృత.
*8 వసువులు(అష్టవసువులు):*
1. ధరా 2. పావక 3 అనిల 4. అప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8 ధ్రువ.
మరి ఇద్ధరు: 1. ఇంద్ర 2. ప్రజాపతి.
త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా! ఈ పేర్లను కంఠపాఠము చేయునది చాలా సులభము. ఎవరైననూ ఇపుడు 33కోటి దేవతల పేర్లను చెప్పమంటే వెనుక ముందు చూడవలసిన అవసరమే లేదు! కదా?.
( True translation from kannada version)
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి