18, జూన్ 2022, శనివారం

Advocacy

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

వకీల్ తనం(Advocacy) అంటే ??

😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ఒక వకీలు గారిని 'అనుకూల పక్షాన వాదించడం '(Advocacy)' అంటే అర్థం ఏమిటని ఒక విద్యార్థి బృందం ప్రశ్నించింది. 


ఆ వకీలు దానికి నేనొక ఉదాహరణ చెబుతాను అంటూ  'ఇద్దరు వ్యక్తులు నా దగ్గర కొచ్చారనుకోండి. వారిలో ఒకాయన చాలా పరిశుభ్రంగాను, మరొకాయన అపరిశుభ్రంగాను ఉన్నారు. 


నేను వారిద్దరికీ స్నానం చేసి శుభ్రంగా తయారవండి అని సలహా ఇచ్చాను.‌ వారిద్దరిలో ఎవరు స్నానం చేస్తారో మీరు చెప్పాలి అన్నాడు. 


ఒక విద్యార్థి '  అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తి స్నానం చేస్తా' డని చెప్పాడు. 


అందుకు వకీలు ' లేదు. పరిశుభ్రంగా ఉన్న వ్యక్తే ఆ పని చేస్తాడు. ఎందుకంటే అతడికే స్నానం చేసే అలవాటు ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తికి పరిశుభ్రత గురించిన ప్రాముఖ్యత తెలీదు. కాబట్టి  ఎవరు స్నానం చేస్తారో ఇపుడు చెప్పండి ? అన్నాడు. 

     

మరో విద్యార్థి  ' పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి ' అన్నాడు. 

       

దానికి వకీలు కాదు. అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తి‌ స్నానం చేస్తాడు, ఎందుకంటే పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం అతడికే ఉంది అన్నాడు

     

ఈసారైనా ఎవరు స్నానం చేస్తాడో చెప్పండి అన్నాడు. 

   

ఇద్దరు విద్యార్థులూ  ఎవరైతే అశుభ్రంగా ఉన్నారో ఆ వ్యక్తి స్నానం చేస్తాడు అన్నారు. 

     

మళ్ళీ వకీలు ' లేదు. వారిద్దరూ స్నానం చేస్తారు. ఎందుకంటే పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి తనకున్న అలవాటు కారణంగా స్నానం చేస్తాడు. అపరిశుభ్రంగా ఉన్నతనేమో తప్పనిసరై స్నానం చేయాల్సిఉంటుంది. 

      

ఇపుడు వారిరువురిలో  స్నానం ఎవరు చేస్తారో మళ్ళీ చెప్పండి? అన్నాడు. 

    

ఇపుడు ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా ' వారిద్దరూ స్నానం చేస్తారు ' అన్నారు. 

    

అది విన్న వకీలు 'తప్పు. ఎవరూ స్నానం చేయరు, ఎందుకంటే అపరిశుభ్రంగా ఉన్నవాడు స్నానం చేయాలనుకోడు. ఇక పరిశుభ్రంగా ఉన్నవాడేమో స్నానం చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి మరోసారి వాళ్ళలో ఎవరు స్నానం చేస్తారో చెప్పండి ? అన్నాడు. 


ఒక విద్యార్థి చాలా ప్రశాంతంగా ' సర్, మీరు ప్రతిసారి వేర్వేరు జవాబు ఇస్తున్నారు. అలా చెప్పిన ప్రతి జవాబు సరైనదని అనిపిస్తోంది. సరైన సమాధానం ఏమిటో మేమెలా తెలుసుకోవాలి ?

     

దానికి వకీలు ఇదే  *అనుకూల పక్షాన వాదించడం* అంటారు! నిజమేమిటన్నది అంత ప్రాముఖ్యత కల్గిన  విషయం కాదు. ప్రాముఖ్యత కల్గిన విషయమేమిటంటే , *మీరు చెప్పదల్చుకున్న అంశానికి‌ అవసరమైన వాదనలు ఎన్ని వినిపిస్తారన్నదే* అన్నాడు.


*అదీ వకీల్ తనం అంటే మరి!*👍❤️😷

కామెంట్‌లు లేవు: