18, జూన్ 2022, శనివారం

పారదసన్నిభాః

 శ్లోకం: అర్థాః పారదసన్నిభాః గిరినదీవేగోపమం యౌవనం మానుష్యం జలబిందులోల చపలం ఫేనోపమం జీవనం | ధర్మం యో న కరోతి నిశ్చలమతిః స్వర్గార్గళోద్ఘాటనం పశ్చాత్తాపహతో జరాపరిణతః శోకాగ్నినా దహ్యతే ||


భావం: సంపదలు అస్థిరములు; యౌననము సెలయేటివలే అతివేగముగా గడిచిపోవునది; మానవ జన్మమే మరల కలుగుననుటకు వీలులేదు; అసలు జీవితమే నీటిబుడగ వంటిది. ఈ విషయములు గమనించక, మూఢుడై స్వర్గద్వారములను తెరిపించు ఏకైక సాధనమైన ధర్మాచరణమును ఎవడు నిశ్చలబుద్ధితో చేయడో, వాడు ముసలివాడైన తర్వాత పశ్చాత్తాపంతోనూ, శోకాగ్ని చేత దహించబడి పోతూంటాడు. అందుచేత వయసు ముదరక మునుపే ధర్మాచరణకు పూనుకోమని భావం!


16:19 am

కామెంట్‌లు లేవు: