13, ఫిబ్రవరి 2023, సోమవారం

అదృష్టం

 శ్లోకం:☝️

*ఉద్యోగేన కృతే కార్యే*

 *సిద్ధిర్యస్య న విద్యతే ।*

*దైవంతస్య ప్రమాణం హి*

 *కర్తవ్యం పౌరుషం సదా ll*

~ గరుడపురాణం (ఆచారకాండ)


భావం: ఒక వ్యక్తి ప్రయత్నం చేసిన తర్వాత కూడా పనిలో విజయం సాధించలేకపోతే అందుకు అదృష్టమే కారణం. దానినే ప్రారబ్ధం, విధి, దైవము అని అంటారు. అయినప్పటికీ మనిషి ఎల్లప్పుడూ పురుష ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలోని కృషి, ప్రయత్నమే రాబోయే జన్మలలో అదృష్టంగా మారుతుంది.

కామెంట్‌లు లేవు: