*||శ్లోకము||*
||న విప్ర పాదోదక కర్దమాని
న వేదశాస్త్ర ధ్వని గర్జితాని |
స్వాహా స్వధాకార వివర్జితాని
శ్మశాన తుల్యాని గృహాణి తాని ||
*||తాత్పర్యము||*
బ్రాహ్మణుల పాదములు కడిగిన నీరు పారనట్టివి ,
వేదశాస్త్ర పాఠపఠనాధ్వనులచే ఘోషిల్లనట్టివీ ,
యజ్ఞమంత్రముల చివర పలికెడు స్వాహా అను శబ్దములు , పితరులకీబడిన భోజనమును పొగడునట్టి శబ్దములు (స్వధా) లేనట్టివియగు గృహములు శ్మశానభూములతో సమానములు
*— చాణక్య నీతి శాస్త్రము ---*
మరి స్వర్గతుల్యమైన గృహములేవి ???
ఈ శ్లోకానికి కొద్దిగా మార్పు చేస్తే స్వర్గముతో సమానముగా గృహములు భాసించును 👇
*||శ్లోకము||*
॥స విప్ర పాదోదక కర్దమాని
స వేదశాస్త్రధ్వని గర్జితాని|
స్వాహా స్వధాకార నిరంతారాణి స్వర్గాణి తుల్యాని గృహాణి తాని||
*||తాత్పర్యము||*
బ్రహ్మణుల పాదములు కడిగిన నీరు పారునవి ,
వేదశాస్త్ర పాఠపఠనా ధ్వనులు ప్రతిధ్వనించునవి,
దేవ పితృ కార్యక్రమంలో హవిస్సును భుజింపుడు చేయు స్వాహా స్వధా ధ్వనులు గల గృహములు స్వర్గముతో సమానమయినవిగా గ్రహింపవలెను .....!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి