13, ఫిబ్రవరి 2023, సోమవారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు


🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ సాయికి శ్రీ స్వామి వారికి భేదం లేదనే అనుభవం*


M.భాస్కరరావు (చెన్నై) వారికి వివాహమై 12 సంవత్సరములు అయినా సంతానం కలగలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఎన్నో పరీక్షలు చేశారు. ఎవరిలోనూ ఏ లోపంలేదు అయినా పిల్లలు ఎందుకు కలగటం లేదో అర్ధం కాలేదు. చాలా బాధపడుతున్నారు. ఒకరోజు ఒక స్నేహితుడు కలసి వీరి బాధ విని *సాయిబాబాకు మొక్కుకో పిల్లలు పుడతారు* అని చెప్పాడు. వీరికి సాయిబాబా అంటే మొదటినుంచి తెలవదు. వీరు వెంకటేశ్వరస్వామి భక్తులు. స్నేహితుడు చెప్పాక సాయిబాబా గుడికి వెళ్ళి మాకు సంతానము ప్రసాదించు స్వామీ నీ మందిరానికి 9 వారాలు వస్తాము అని మొక్కుకున్నారు. 


ఒక వారం వెళ్ళారు. రెండవ వారానికే వీరి భార్యకు గర్భమని చెప్పారు. వీరికి ఒక పాప పుట్టింది. పాపకు సాయి అని పేరు పెట్టారు. తరువాత మరలా ఇంకొక పాప పుట్టింది. అప్పటినుంచి వీరు భరద్వాజ మాష్టారుగారి పుస్తకాలు చదువుతూ పారాయణ చేస్తున్నారు. కొంతకాలానికి వీరి భార్యకు గర్భసంచిలో ఏదో అయింది, ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేస్తే చిన్న పిల్లలతో ఇబ్బంది అవుతుందని చాలా బాధపడుతున్నారు వీరి భార్య. తెల్లవారితే ఆపరేషన్, ఆ రాత్రి *ఆమె స్వప్నంలో వెంకయ్యస్వామి వారి పూజ గదిలో కూర్చున్నారు*.


 ఆమెకు వెంకయ్య స్వామి ఎవరో అర్ధంకాక ఎవరు నువ్వు ఎందుకొచ్చావని గట్టిగా అరుస్తూ స్వామిని అడిగారు. అప్పుడు *స్వామి, ఊరికినే వచ్చానమ్మా! ఏమీలేదమ్మా, నన్ను తిట్టమాకు!* అని వెళ్ళి పోయారట. తెల్లవారి ఈ విషయం ఈమె భర్తకు చెప్పింది. వచ్చింది. వెంకయ్యస్వామి అని ఆయనన్నారు. ఆ రోజు ఆపరేషన్కు హాస్పిటల్కు వెళ్ళారు. ఆపరేషన్ ముందు ఒక స్కానింగు చేయాలని అన్నారు.. స్కానింగ్ చేస్తే అంతకుముందు కనిపించిన ప్రాబ్లమ్ ఇప్పుడు లేదేంటి అని ఆశ్చర్యపోయారు డాక్టరుగారు. ఆపరేషన్ అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఇదంతా స్వామి దయ అని వారు పరమానంద పడిపోయారు.


 మరలా కొంతకాలానికి మళ్ళీ ఈమెకు కిడ్నీలో ప్రాబ్లమ్ వచ్చింది. ఏ సంగతి సరిగా చెప్పలేదు డాక్టర్లు. వారం వారం బాడీలోని బ్లడ్ అంతా బయటకు తీసి శుద్ధి చేసి మళ్ళీ ఎక్కించాలి. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఇలా చేస్తుంటే కొన్నాళ్ళు బతకవచ్చు అన్నారు. బ్లడ్ తీసేటప్పుడు, ఎక్కించేటప్పుడు నరకం అనుభవించాలి. ఆమెకు పరీక్షలు చేస్తున్నారు. *ఈయన బాధతో హాస్పిటల్లోనే బాబా, వెంకయ్యస్వామి ఫోటోలుపెట్టి అగరవత్తులు వెలిగించి అక్కడే పారాయణ ప్రారంభించారు.* అది చూచి డాక్టర్లు ఏమిటయ్యా హాస్పిటల్ను గుడి చేసావేమిటి అని అడిగారు. అప్పుడు ఈయన మీ పని మీరు కానివ్వండి. నా పని నేను చూసుకుంటాను అని అన్నారు. పదిహేను రోజులు ఉంచాక పరీక్షలు అన్నీ అయ్యాక ఈమెకు ఏమీలేదు, బాగానే ఉంది. అని అన్నారట. స్వామి ఎంత దయామయుడో చూడండి. ఇంతటి దయామయునకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                                                     పూజ్యశ్రీ మాస్టరుగారు మాచేత అనేక కార్యక్రమాలు చేయించారు. మేము కూడా మా శక్తి మేరకు, 'ఏమేమి కార్యక్రమాలు చేద్దామా?' అని ఆలోచిస్తూండేవారము. పూజ్యశ్రీ మాస్టరుగారి మూడవ సమ్మేళనం ఇక్కడ చేద్దామని యువకులమందరము సంకల్పించాము. దానికి కమిటీవారు కూడా సహకరించడంతో మొట్టమొదటిసారి 2002లో శ్రీ సాయిమాస్టర్ సమ్మేళనం ఒంగోలులో   చాలా చక్కగా జరిగింది. 


'ప్రతి ఇంట్లో రామాయణ, భారత గ్రంథాలు ఎలా వుంటాయో, అలాగే శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర గ్రంథాలు వుండాలి!', 'ఆధ్యాత్మిక గ్రంథాలు కొనుక్కోవడానికి ఆర్థికంగా ఎవ్వరూ వెనుకాడకూడదు" అని పూజ్యశ్రీ మాస్టరుగారు చెప్పిన రెండు వాక్యాలు నా మనసులో బాగా నాటుకుపోయాయి. కనుక మేమందరం కృషిచేసి పూజ్యశ్రీ మాస్టరుగారి అనుగ్రహంతో  శ్రీసాయిమాస్టర్ భక్తబృందానికి పారాయణ గ్రంథాలు అందుబాటులో   తీసుకురాగలిగాము.

                                                     

నా వివాహం విషయంలో కూడా పూజ్యశ్రీ మాస్టరుగారి ఆశీస్సులు లభించాయి.  పెళ్లి చూపులకు గూడూరు వెళ్ళినప్పుడు మేము బస చేసిన లాడ్జిలో పూజ్యశ్రీ మాస్టరుగారి ఫోటో కనిపించింది! నాకు చాలా ఆనందం కలిగింది. అదే సంబంధం నిశ్చయమైంది. లాయరుపేట పరిసరప్రాంతాలలోనే చిన్నదైనా, ఒక సొంత ఇల్లు వుండాలని  నా కోరిక. ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే అసాధ్యమైన ఆ కోరిక నెరవేరింది.


నా భార్యకు ఎట్టి పరిస్థితిలోనూ రావడానికి అవకాశం లేని   PhD సీట్ రావడమే కాదు, అదీ ఒంగోలులోనే చేసే అవకాశం వచ్చింది. మాకు మొదట బాబు పుట్టాడు. రెండవసారి  చాలామంది జాతకం ప్రకారం మళ్ళీ మగపిల్లవాడేనని చెప్పారు. మాకు అమ్మాయి పుట్టాలని కోరిక. పూజ్యశ్రీ మాస్టరుగారి దయ వల్ల పాప పుట్టింది. 


మా జీవితంలో ప్రతీ సన్నివేశంలో పూజ్యశ్రీ మాస్టరుగారి అనుగ్రహం వర్షిస్తూనే వుంది.  మేము బాబా గుడికి సేవ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ లలితా మేడంగారు మాతో, "మీరు భక్తిశ్రద్ధలతో బాబా, మాస్టరుగారి సేవ చేసుకుంటే జీవితంలో మీకు కావలసినవన్నీ వాళ్ళే సమకూరుస్తారు" అని చెప్పేవారు. బాబా, "మీరు ఒక అడుగు వేస్తే నేను పది అడుగులు వేస్తాను" అని చెప్పినట్లు, ఉడతాభక్తిగా మేము చేసుకుంటున్న సేవకి పదిరెట్లు మాకు అన్నీ ప్రసాదిస్తున్నారు! 


మాకు సేవచేయాలన్న భావాన్ని, అందులో మేము పొందుతున్న తృప్తి ఆనందాలను ప్రసాదిస్తున్న గురుదేవులకు కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ, 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ  శరణం మమ!!' అని పూజ్యశ్రీ మాస్టరుగారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.    


ఓం సర్వాభీష్టప్రదాయ శ్రీ భరద్వాజ సద్గురవే నమః!                                                                                                                       

జై సాయి మాస్టర్!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: