18, జూన్ 2024, మంగళవారం

18.06.2024. మంగళవారం

 *Jai Sriram 🚩🚩శుభోదయం*


18.06.2024.       మంగళవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం.......


ఈరోజు జ్యేష్ట మాస శుక్ల పక్ష *ఏకాదశి* తిథి ఉ.06.24 వరకూ తదుపరి ద్వాదశీ తిథి, *స్వాతీ* నక్షత్రం మ.03.56 వరకూ తదుపరి *విశాఖ* నక్షత్రం , *శివం* యోగం రా.09.39 వరకూ తదుపరి *సిద్ధ* యోగం, *భద్ర(విష్టీ)* కరణం ప.06.24 వరకూ, *బవ* కరణం రా.07.01 వరకూ తదుపరి *బాలవ* కరణం  ఉంటాయి.

*సూర్య రాశి*: మిథునం (మృగశీర్ష నక్షత్రంలో)

*చంద్ర రాశి*: తుల రాశి లో.

*నక్షత్ర వర్జ్యం*: రా.09.52 నుండి రా.11.34 వరకూ

*అమృత కాలం*: ఉ.06.22 నుండి ఉ.08.06 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.42

*సూర్యాస్తమయం*: సా.06.53

*చంద్రోదయం*: మ.03.35

*చంద్రాస్తమయం*: రా.03.05

*అభిజిత్ ముహూర్తం*: ప.11.51 నుండి మ.12.44 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.08.20 నుండి ఉ.09.13 వరకూ మరలా రా.11.13 నుండి 11.56 వరకూ

*రాహు కాలం*: మ.03.35 నుండి సా.05.14 వరకూ

*గుళిక కాలం*: మ.12.17 నుండి మ.01.56 వరకూ

*యమగండం*: ఉ.09.00 నుండి ఉ.10.39 వరకూ.


ఈ రోజు *స్మార్త,మాధ్వ,వైష్ణవ నిర్జల ఏకాదశి*. *భీమ ఏకాదశీ* అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణము ప్రకారం, పాండవులలో రెండవవాడు అయిన భీముడు మంచి తిండి పుష్టి కలవాడు,ఆకలికి తాళలేని వాడు. ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశీ తిథి రోజు అందరూ ఉపవాసం ఉంటుంటే,ఆకలికి తాళలేక తాను మాత్రం ఉపవాసం ఉండేవాడు కాదుట. గమనించిన వేద వ్యాసుడు, సంవత్సరంలో వచ్చే ,24 ఏకాదశీ ఉపవాసాలు ఆచరించక పోయినా ఈ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉండమని,ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే... సంవత్సరం లో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో ఉపవాసాలు ఉన్న ఫలితం ఉంటుందని భీమసేనుడుకి నచ్చచెప్పి ఉపవాసం ఉండేలా చేసాడుట.అందుకని ఈ ఏకాదశి ని *భీమసేనీ ఏకాదశీ* అని కూడా పిలుస్తారు. కాబట్టి సంవత్సరంలో వచ్చే అన్నీ ఏకాదశీ ఉపవాసాలు ఉండలేని భక్తులు కనీసం ఈ నిర్జల ఏకాదశీ ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన, సంవత్సరంలో అన్నీ ఏకాదశీ వ్రతాలను ఆచరించిన ఫలితం దక్కుతుంది అని నమ్మకం. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉ.07.28 వరకూ ఉంటుంది.


ఈ రోజు *శ్రీ ఆది శంకరాచార్యుల కైలాస గమనం*. జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదుల వారు మోక్షం పొంది కైలాసం చేరుకున్న రోజు అని భక్తుల నమ్మకం.


ఈ రోజు *రామ లక్ష్మణ ద్వాదశీ*.రామాయణ కథల ప్రకారం సంతానం కోసం ఈ ద్వాదశీ రోజున దశరథ మహారాజు వ్రతాన్ని ఆచరించారని, ఫలితంగా రామ లక్ష్మణులు జన్మించారు అని కథనం. సంతానం లేని దంపతులు ఈ రామలక్ష్మణ ద్వాదశీ ని పరిపూర్ణ శ్రద్ధతో,కఠిన ఉపవాస దీక్ష తో వ్రతం చేయడం వలన పుత్ర సంతానం కలుగుతుంది,జన్మ సార్థకత ఏర్పడుతుంది అని నమ్మకం.


*త్రి పుష్కర యోగం* ఈరోజు మ.03.56 నుండి రేపు సూర్యోదయం వరకూ ఉంటుంది. (మంగళవారం, ద్వాదశీ తిథి, విశాఖ నక్షత్రం కలయిక). ఈ యోగ సమయం లో చేసే ప్రతీ పనీ జీవితం లో మరలా మూడు పర్యాయాలు చేయవలసిన సందర్భాలు ఏర్పడతాయి.అందువలన ఈ సమయం లో ఎటువంటి తొందరపాటు,అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయం లో బంగారం,వెండి, వజ్రాలు, స్థిర ఆస్తులు, వాహనాలు, కొనుగోలు చేయటానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న  అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరడానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు.


 నారాయణ స్మరణం తో....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నంబర్: 6281604881.

కామెంట్‌లు లేవు: