1302.b-8.0103c-6.180624-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*అనుమానం పెనుభూతం!*
➖➖➖✍️
```
అనుమానం పెనుభుతం అనడానికి మహాభారతంలో జరిగిన సంఘటన...
మహాభారతంలో.. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు.
ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఆయన కొడుకు అశ్వద్దాముడు, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వద్దాముడు మరణం లేని వరం పొందినవాడని ‘చిరంజీవి’ అని తెలుసు... కౌరవుల పక్షంలో అశ్వద్దాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు.
అది అమలుపరచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు. సభలోని అందరికి నమస్కరించి అశ్వద్దాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు.
అపుడు కృష్ణుడు అశ్వద్దాముడి క్షేమసమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు. అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వద్దాముడు వంగి నేల పైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడా అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వద్దాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు.
ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు, అశ్వద్దాముడు “నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాటాయిస్తున్నాను!” అన్నట్లు అర్థం చేసుకున్నాడు.
ఈ అనుమానం తోనే చివరివరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు.
కుఱుక్షేత్రం17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వద్దాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు...
”నేను చిరంజీవి వరం పొందినవాడిని అని తెలుసు కదా... నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటె యుద్ధంలో మనం గెలిచేవారం కదా!” అని అడగగా...
అప్పుడు దుర్యోధనుడు... “నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా!” అని అంటాడు.
దీనికి బదులుగా… “ఎవరు మాట ఇచ్చింది?” అని అశ్వద్దాముడు అడగగా అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వద్దాముడు ముందు విరక్తితో నవ్వి.. “ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను, కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు. నాపైన నీకు కలిగిన అనుమానంతో, నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు. అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటె నీకు నిజం తెలుసుండేది, ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది!” అని చెప్పాడు అశ్వద్దాముడు.
నిజమే! అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం. అంతే కానీ మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు.
’అనుమానం పెనుభూతం’ అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి... 9440652774.
లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి