18, జూన్ 2024, మంగళవారం

విద్య ద్వారా ధర్మం.

 *సరైన విద్య ద్వారా మాత్రమే ధర్మం.*

ధర్మం మాత్రమే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అదెలా వస్తుంది ?విద్య ద్వారా. వినయంతో కూడిన విద్యవున్నప్పుడే మాత్రమే గౌరవం, గుర్తింపు రెండూ లభిస్తాయి మనకు. కేవలం గౌరవం లేకుండా సంపాదించిన ధర్మాన్ని, జ్ఞానాన్ని విద్యగా పరిగణించరు. సరైన విద్య ద్వారా సంపాదించిన సంపద మనల్ని ధర్మ మార్గంవైపు నడిపిస్తుంది. అది మనకు శాశ్వత సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.

సంస్కృతంలో తండ్రిని పిత అంటారు. ఒక తండ్రిని మాత్రమే సంస్కృతంలో అలా ఎందుకు పిలుస్తారు. అంటే,?! తన కొడుకును ఎవరైతే చాలా జాగ్రత్తగా, భద్రతతో, సరైన మార్గంలో నడిపిస్తారో వారే పిత కనుక. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన భద్రత కల్పించేత శ్రద్ధ వహిస్తున్నారో లేదో తమకు తాము ఆత్మావలోకనం చేసుకోని చూడాలి. ఎందుకంటే అది వారి పిల్లలకు నిజమైన ఆనందాన్ని,భద్రతను ఇస్తుంది. పిల్లలకు సంరక్షణ, క్షేమం లేకుండా, విద్య ద్వారా జ్ఞానాన్ని అందించడం అనేది ఆ పిల్లలకు వారిని డబ్బు సంపాదించే ఒక సాధనంగా చేస్తుంది తప్ప, అలాంటి విద్య తండ్రి ఇచ్చే నిజమైన భద్రత కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అలాంటి సంస్కృతిని నేర్పించబడినప్పుడు, తరువాతి రోజుల్లో, ఆ పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోవచ్చు. డబ్బు కోసం వెంపర్లాడటం మాత్రమే ఆ పిల్లలు పెరిగేటప్పటికి వారికి జీవన విధానం అవుతుంది.

ఒకరికి చాలా సంపద ఉండవచ్చు, కాని అతను తన ఆకలి కోసం ఆ డబ్బును తినలేడు. అతను తన ఆకలి కోసం ఆహారం కొనాలి లేదా సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఒకడు నిజమైన సుఖాన్ని, ఆనందాన్ని డబ్బు లేదా సంపద నుంచిగానీ, పేరు, కీర్తి నుండిగానీ పొందలేడు. ధర్మం ద్వారా మాత్రమే మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. ఏ విద్య అయితే నిజమైన జ్ఞానం, తద్వారా సుఖాన్ని ఇస్తుందో ఆ

ధర్మాన్ని ముందు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* .

కామెంట్‌లు లేవు: