20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

హైందవం వర్ధిల్లాలి 6*

 *హైందవం వర్ధిల్లాలి 6*


సభ్యులకు నమస్కారములు.


మన మధ్యనే కొంత మంది తటస్థ వాదులు, నిర్లిప్తవాదులు, ఇంకా పరిశీలనగా చూస్తే.... 

ప్రక్క ఇల్లు అగ్నికి ఆహుతి అవుతున్నా, నా ఇంటి మ్రొక్క (చిన్న చెట్టు) బాగుంది కదా, ఇప్పుడేమయ్యిందని ఇంత గగ్గోలు అని దీర్ఘాలు తీసే నిక్షేపరాయుళ్లు ఉంటారు, ఉన్నారు . చేతులు కాలాక ఆకులు పట్టుకునే వీరి భావజాలం హిందూ మతానికే గాకుండా భారత దేశానికి తీరని నష్టము.


హిందువులపై జరుగుచున్న దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు, హత్యలపై ఇటీవలీ కాలంలో బహిరంగంగా వస్తున్న వార్తలు, వీడియోలు నాలాంటి సగటు పౌరులకు ఆందోళన కలిగిస్తున్నవి. ప్రస్తుత పరిస్థితిని ఇంకా వివరంగా పరిశీలిద్దాము. హిందు అన్న పదం వినగానే అది ఒక రాజకీయ పార్టీ చిరునామా అనో లేక ఆ పార్టీకి చెందిన ఊత పదమనో, అంటరాని పదమనో, పైకి ఉచ్చరిస్తే ప్రమాదాలకు లోనవుతామని ప్రస్తుత సామాన్యుడి భావన.


నిజానికి *హిందు* అను పదము *సింధు* అను పదము యొక్క ఉత్పత్తి పదమని విజ్ఞులకు అవగతమే. హిందు పద పూర్తి అర్థము చూద్దాము.... *హింసాం దూషయతి ఖండయతి ఇతి హిందుః* ఎక్కడైతే హింస, దుర్మార్గము ఉంటాయో దానిని ఖండించే వాడే హిందువు.


అల్ప సంఖ్యాకుల క్షేమము, అభివృద్ధి హిందువులకు గిట్టదని *టముకు* వేసి మరి మరీ చాటుతుంటారు కుహానా మేధావులు. ఎంగిలి మెతుకులకు ఆశపడి...కొన్ని ప్రసార మాధ్యమాలు, హేతువాద సంఘాలు, ఎర్రన్నలు (కమ్యూనిస్టులు) హిందు ధర్మాలు, దేవతలు, సంప్రదాయాలు, పండుగలు మరియు పర్వ దినాలపై పనిగట్టుకుని చర్చలు, పోటీలు పెట్టి కుతి తీరా హైందవాన్ని విమర్శించి, పైశాచికంగా ఆనందించిన సంఘటనలు కోకొల్లలు. 


భారత దేశ పలు ప్రాంతాలలోనే గాకుండా ఇరుగు పొరుగు హైందవేతర దేశాలలో హిందువుల, హైందవ అనుయాయుల ప్రాణాలు తీయడం ముష్కరులకు నీళ్ళు తాగినంత సులభము. *హిందువుల విషయం అనగానే మత్తుగా నిద్ర నటించే హిందు మేధావులకు ఇది ఒక సామాజిక సమస్యగా కనిపించదు*. ఇక ప్రసార మాధ్యమాలకు హిందువులు మనుష్య ప్రాణులుగా, హైందవము ఒక మంచి జీవన విధానంగా కూడా కాదు. కాబట్టి హిందువులపై, హిందు ధర్మాలపై దాడులు జాతి దృష్టికి రానే రావు. *వచ్చినా, ఆ విషయాలపై దృష్టి పెట్టిన వారిని హిందు మత దురంహంకారులుగా ముద్ర వేయడము ఆనవాయితిగా మారినది*. 


ఇంత క్రితం మనవి చేసినట్లుగా హిందువులపై జరుగుచున్న హింస, దౌర్జన్యాలపై నిద్ర నటించే హిందువు యొక్క భావ జాలం ఎలా ఉందంటే... ఇంటి ప్రక్క ఇళ్లన్నీ దగ్ధమవుతున్నా నాకేంటి, నా ఇంటికి ఇంకా ప్రమాదము రాలేదుగదా అని.


విచక్షణా రహితంగా దేశంలో, ఇతర దేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో జరుగుతున్న హిందు ధర్మ విధ్వంసము, గోవధ, దేవాలయాల మరియు పుణ్య క్షేత్రాల పట్ల జరుగుచున్న అపచారములు, భక్తి, ముక్తి పట్టని విచ్చల విడితనము మన భారత సంస్కతిని పీడిస్తున్నాయి. ఈ దేశ వాసులలో "సెక్యులర్" జాబితాలో చేరిన వారికి జిహాదీల, శిలువదారుల మత తత్వం కనపడదు, వినపడదు. వీరికీ మత తత్వం జాతీయ వాదానికి కట్టుబడి ఉండే వ్యక్తులలో, పార్టీలలో మాత్రమే కనబడుతుంది. 


*ధర్మాన్ని నశింప చేయడానికి ప్రయత్నిస్తే ధర్మమే హతమారుస్తుంది*, కనుక ధర్మాన్ని పరిరక్షించాలనే మన ప్రాచీనుల ఉపదేశమును ప్రతి హిందువు పాటించి ధర్మాన్ని పాటించాలి..... ఇబ్బందులలో ఉన్నవారిని ఐక్యతతో రక్షించాలి. అప్పుడు ప్రకృతి భీభత్సాలు శమిస్తాయి, మానవ విధ్వంసాలు తగ్గుతాయి.


ఈలాంటి భయానక వాతావరణంలో హిందువులందరూ *ఉపేక్షను వదిలి*, హిందు దేశము, ధర్మము పట్ల తమ విజ్ఞతను తామే పునః సమీక్షించుకొను సమయము ఆసన్నమైనది.


మన పెద్దలు నిర్దేశించిన హిందూ ధర్మాలను, సంప్రదాయాలను మళ్ళీ ఒకసారి పునర్ప్రవేశింపజేయు అవసరం కలదని మీరు కూడా భావిస్తున్నారని నా అభిప్రాయము. 


*గమనిక*

స్వధర్మ రక్షణ కొరకు మాత్రమే. *కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూూదడానినికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: