#కొబ్బరి కాయ- ఆంతర్యం*
➖➖➖
*జుట్టులేని కొబ్బరికాయ కొట్టకూడదని చెబుతారు ఎందుకు?*
*దీని వెనుక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా?*
*పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా?*
*శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం।*
*అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం॥*
*అనేవి తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు. దీంట్లో చివరిది ఆత్మ నివేదనం. అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం.*
*పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మ స్వరూపంగా భావించి, దైవానికి నైవేద్యంగా సమర్పించాలి.*
*కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక.* *కాయ పైనుండే పొర.. చర్మం.*
*పీచు మాంసం.*
*దృఢంగా ఉండే చిప్ప ఎముకలు.*
*అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు.*
*కాయలోని నీళ్లు ప్రాణాధారం.*
*పైన ఉండే మూడు కన్నులే…. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు.*
*జుట్టు అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక.*
*అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించు కోవాలి.*
*ఇందులోని పరమార్థమిదే.*
*అందుకే పిలక లేని కొబ్బరికాయను దేవునికి కొట్టడం దోషమే అవుతుంది.*
*త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి, అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు, జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణగాథ.*
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి