12, నవంబర్ 2024, మంగళవారం

ఇక్కడివి ఇక్కడే

ఇక్కడివి ఇక్కడే  

నీవు ఏదైనా పట్టణానికి ఏదైనా పనిమీద వెల్లవనుకో అక్కడ రాత్రి బసచేయవలసి వస్తే ఒక గదిని ఏదైనా వసతిగృహాల్లో (లాడ్జిలో) తీసుకొని ఆ రాత్రి నిద్రించి మరుసటిరోజు ఉదయమే లేచి మరల నీ దారిననీవు వెళ్ళటం సహజంగా అందరం చేసే పనే. మనం వున్న కొద్దీ గంటలో లేక ఒకటి రెండు రోజులో మాత్రం ఆ గదిలో సంబంధం కలిగి ఉంటాము. మనకు తెలుసు గదిలో చేరిన మొదటి నిముషంలోనే ఈ గదిలో నా అనుబంధం కొన్ని గంటలు మాత్రమే అని. అందుకే మనం ఆ గాడిమీద ఎటువంటి సంబంధం పెంచుకోము, కేవలం నాకు కొన్ని గంటలు ఆశ్రయాన్ని ఇచేదిగానే భావించి అక్కడ ఉంటాము. ఎవరైనా ఆ వసతిగృహం గదిని తన సొంతగాడిగా భావించి అక్కడి వస్తువులపై మమకారాన్ని పెంచుకొని సరిగా లేని వాటిని పునరుద్దించాలని అనుకుంటే వాళ్ళను మనం కేవలం ముర్కులుగా భావిస్తాము. అనుడులకు సందేహం లేదు. ఎందుకంటె మనం ఉండేదే కొద్దీ సమయం ఆ కొద్దీ సమయం ఎలానో ఒకలాగా గడిపితే తెల్లారగానే మన ఊరికి వేళ్ళ వచ్చని భావిస్తాము. సాధారణ మానవుల అందరి భావన ఇలానే ఉంటుంది. ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా నీవు నేను అని అనుకోని నీ దేహం నీది కాదు.  కానీ నాది అని అనుకుంటున్నాం. కొన్నిరోజులు ( 70 - 90 సంవత్సరాలు) ఉండిపోయే దానిని శాశ్వితమైనదిగా భావించి ఈ శరీరంతోటి, శరీరానికి సంబందించిన వ్యక్తులతోటి సంబంధాలు పెట్టుకొని వాటినే నిత్యమైనవిగా భావించి మన అమూల్య సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. 

ఈ ప్రకృతికి ఒక నియమము వున్నది అది ఏమిటంటే "ఎత్ దృశ్యం తత్ నస్యం" అంటే మన కంటికి కనిపించేది ఏదైనాకానీయండి అన్నీ కూడా కాలగతిలో నశించి పోయేవే. కానీ మనం ఏమి అనుకుంటున్నామంటే నా కళ్ళకు కనిపించే వాటిలో నేను లేను అని అనుకుంటున్నాం. నిజానికి నేను కూడా ఈ ప్రపంచంలో ఒకడిని నేను ఈ ప్రపంచానికి బిన్నంగా లేను అనే భావన ప్రతి సాధకునికి రావాలి. 

ప్రపంచం మొత్తం మూడు సూత్రాలకు లోనై నడుస్తున్నది. అది ఆది మధ్య అంత  అంటే ఈ పాంచభౌతిక ప్రపంచం మొత్తం ఏదో ఒక నిర్దుష్ట కాలంలో ఉద్భవించి ఉంటుంది. తరువాత పరిణతి చెందుతుంది. తరువాత ఒక సమయంలో నశించి పోతుంది. ఇది మన కంటికి కనిపించే ప్రతి దానికి అంటే అది నిర్జీవి కావచ్చు సంజీవి కావచ్చు అన్నిటికి అనువర్తిస్తుంది. ఒక నిర్జీవి అది యెట్లా వర్తిస్తుందో చూద్దాము. ముందుగా ప్రకృతి అంటే దానిని దైవసృష్టి అని కూడా అంటారు. ఒక పర్వతమో లేక ఒక పెద్ద రాయో వున్నదనుకోండి అది కాలాంతరంలో బీటలు వారి పగిలి పోవటం లేక నశించిపోవటం జరుగుతుంది.  పూర్వం మేరుపర్వతము ఉండేదని మనకు పురాణాలలో చెప్పారు. మరి అది ఇప్పుడు ఉన్నదా అంటే సందేహాత్మకమే. ఇక మానవ సృష్టి లేక జీవ సృష్టి. మానవుడు నిత్యం అనేకవస్తువులను తన దైనందిక ఉపయోగాల నిమిత్తం నిర్మిస్తున్నాడు. అవి కూడా కాలాంతరంలో నశించి పోతున్నట్లు మన కళ్ళముందు తెలుస్తున్నది. 

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బాహ్య ప్రపంచ మొత్తం పాంచబౌతికమైనది. ఈ ఐదు భౌతిక పదార్థాల కలయికే ప్రతిదీ. అది సంజీవి కావచ్చు లేక నిర్జీవి కావచ్చు. కాలాంతరంలో మరల అవి వాటి వాటి రూపాలను కోల్పోయి మరల ఐదు పదార్థాలుగా విడి పోవలసిందే. 

సాధకు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఒక నిజం బయటపడుతుంది. అది ఏమిటంటే తన శరీరం కూడా ఈ ప్రపంచంలోంచి ఉద్బవించిందని దానికి ఒక అంతదశ మరణం ఉంటుందని అవగతం అవుతుంది. అప్పుడు తానూ వేరు తన శరీరం వేరు అనే స్ఫురణఁ తట్టుతుంది. ఆ క్షణం నుంచే అసలైన వెతుకులాట మొదలవుతుంది. తాను నిత్యుడు కావటానికి ఏమి చేయాలనే తపన. అదే సాధకుని ముముక్షత్వం వైపు నడిపిస్తుంది. 

ఒక వసతి గృహంలోని గది లాంటిదే తాను వున్నా శరీరం అని సాధకుడు తెలుసుకుని మోక్షార్ధి అయి మోక్షం వైపు అడుగులు వేస్తాడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: