🎻🌹🙏 కార్తీక మాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము..
ఈరోజు విశేషామైన ఆలయం.....
శ్రీ ఎండల మల్లిఖార్జునస్వామి
ఆలయము , రావివలస గ్రామం,
శ్రీకాకుళం......!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿 పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటివి లేవు. ఇంకా ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా గుర్తింపు పొందింది.
🌸 మరి ఇక్కడి శివలింగాన్ని ఎండల మల్లికార్జునుడు అని ఎందుకు పిలుస్తారు,ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
🌿 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకాకుళం జిల్లా, టెక్కలికి కొంత దూరంలో రావి వలస గ్రామంలో ఎండల మల్లికార్జునుడు అనే పెద్ద శివలింగం కలదు. మల్లెపూలతోనూ... జింక చర్మంతోనూ... కప్పబడిన శివలింగం కాబట్టి మల్లిఖార్జునుడుగా పిలవడం పరిపాటి...
🌸 అతిపెద్ద ఈ శివలింగం గర్భగుడిలో ఎప్పుడు ఎండ తాకిడిని నిలిచి పైకప్పు లేదు కాబట్టి ఎప్పుడు ఎండలోనే ఉంటుంది. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని పిలుస్తారు.
🌿 ఈ ఆలయంలోని శివలింగం ఎత్తు సుమారు 20 అడుగులు. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం పక్కనే మరొక చిన్న శివలింగం ఉంది.
🌸స్థల పురాణం ప్రకారం, త్రేతాయుగంలో రాముడు రావణుడిని చంపి, అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు, వారి వైద్యుడైన సుషేణుడు సుమంచ పర్వతం వద్ద తిరిగి శివుని కోసం తపస్సు చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు.
🌿చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిని ఆదుకోవాలని ఉంది. కొంత కాలం గడిచిన తరువాత రాముడు సుషేనుడి గురించి విచారించడానికి హనుమంతుడిని పంపాడు.
🌸హనుమంతుడు రాగానే సుషేణుడు పోయినట్లు చూశాడు. సుషేనుడి దేహాన్ని చూసి దుఃఖించి, శరీరాన్ని జింక చర్మాన్ని (సంస్కృతంలో అజినా) కప్పి, దాని పైన కొన్ని మల్లెపూలను, శ్రీరాముడికి వార్తను తెలియజేయడానికి వెళ్ళాడు.
🌿రాముడు, సీత మరియు లక్ష్మణుడు తమ నివాళులర్పించేందుకు అక్కడికి వస్తారు మరియు వారు జింక చర్మాన్ని తొలగించినప్పుడు, ఒక శివలింగం పెరగడం జరిగింది.
🌸 స్వయంభూ లింగం దగ్గర ఉన్న పుష్కరిణి(చెరువు)లో స్నానం చేసి పూజలు చేసి వెళ్లిపోయారు. లింగం క్రమంగా పెరిగింది. శివలింగం వచ్చినప్పటి నుండి, ప్రజలు వారి ఆరోగ్యం కోలుకోవడం.
🌿ఈ స్వామిని మల్లికాజిన స్వామి అని పిలిచేవారు. మల్లిక(జాస్మిన్ ఫ్లవర్) మరియు అజినా(జింక చర్మం). అందుకే మల్లికాజిన స్వామి అని పిలిచేవారు. అదే క్రమంగా మల్లికార్జున స్వామి గా మారింది.
🌸 ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు ఈ స్వామిని పూజించాడని, అందుకే మల్లికార్జున స్వామిగా పిలవబడ్డాడని చెబుతారు.
🌿 1870 ప్రాంతంలో టెక్కలి జమిందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగదేవ్ మల్లికార్జున స్వామివారికి ఆలయం నిర్మించగా అది కూలిపోయిందట.
ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆలయ నిర్మాణం గావించ ప్రయత్నించగా
🌸ఆ స్వామి కలలో కన్పించి ఆలయం వద్దు ఎండలో ఎండి వానలో తడవడమే నా అభీష్టం, అదేలోక కళ్యాణం అని చెప్పగా అప్పటి నుండి మల్లికార్జునుడు ఎండల మల్లికార్జునుడుగా ప్రాచుర్యం పొందాడు.
🌿 లోకకళ్యాణార్థo సమస్త జనావాళిని కాపాడడానికి కార్తీక మాసంలో శివుడు రావి వలసలో ఆశ్వత్థ వృక్షం కిందవుంటాడని భక్తుల నమ్మకం. అందువల్లనే రావివలస కార్తీక కైలాసంగా ఖ్యాతినార్జించింది.
🌸ప్రతి సంవత్సరం కార్తెకమాసంలో ఇక్కడ కల సీతాకుండములో స్నానం చేసి భక్తితో స్వామిని కొలిస్తే సర్వవ్యాధులు నివారించబడుతాయని విశ్వసిస్తారు.
🌿 కార్తీకమాసంలో ఇక్కడ కల అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు, స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నండి చాలా మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు. రాష్ట్రము నలుమూలల నుండి కూడా యాత్రికులు వస్తుంటారు
🌸 శ్రీకాకుళం జిల్లా ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఏడాది కోసారి ఇక్కడి శివలింగం చిన్న ధాన్యం గింజ పరిణామంలో పెరుగుతుందట.
🌿సూర్యలింగంగా ఈ లింగాన్ని అభివర్ణిస్తారు. ఈ శివలింగాన్ని స్పృశిస్తూ వచ్చే గాలిని ఆస్వాదిస్తే సర్వరోగాలు పోతాయని ప్రతీతి. స్వామి తీర్ధప్రసాదాలు, దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు తీరుతాయని నమ్మకం.
🌸ఇదివరకు ఇలాంటి ఘటనలు జరిగాయని.. శివభగవానుడి దయవల్ల పుట్టిన ఆ పిల్లలకు మల్లన్న, మల్లమ్మా అని పేర్లు పెట్టుకోవడం కూడా జరిగిందని ఇక్కడి అర్చకులు చెబుతారు... స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి