11, డిసెంబర్ 2020, శుక్రవారం

అన్నం ముందు వడ్డించుకోవద్దని

.    అన్నం ముందు వడ్డించుకోవద్దని పెద్దవారు ఎందుకు చెబుతారు?*🌸

సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ముందుగా అన్నం వడ్డించుకుంటే మన పెద్దవారు "ముందు అన్నం పెట్టుకోకూడద"ని చెప్పి, పప్పూ, కూరా వగైరా వడ్డించి ఆ పిమ్మట అన్నం వడ్డిస్తారు. దీని వెనక ఒక అంతరార్థం ఉంది. మనం యేదైనా చేసేటప్పుడు ముందు ఎక్కువగా, లేక వేగంగా చేసి, సమయం గడుస్తున్నకొద్ది మోతాదు తగ్గిస్తాము. భోజనం చేసేటప్పుడుకూడా ఇదే రీతి మనం, మనకు తెలియకుండానే అనుసరిస్తాము. 


పళ్ళెంలో స్థానం పరిమితంగా ఉంటుంది. ముందుగా అన్నం పెట్టుకుంటే మిగిలిన సారవంతమైన తిండి తక్కువ పెట్టుకుంటాము. అన్నములో ఆహార విలువలు తక్కువ, పప్పు కూరా వగైరాలో ఆహార విలువలు ఎక్కువ అన్న సంగతి మనకందరికీ తెలిసినదే. అంచేత ముందుగా పప్పు, కూరా, పచ్చడీ ఇతరాత్రా పోషక గుణాలున్న తిను పదార్థాలు ముందుగా వడ్డించుకున్నాక, మిగిలిన జాగాలో అన్నం వడ్డించుకుంటే తినే తిండిలో బలం ఎక్కువ చేకూరుతుందని ఇలా చెబుతారు. 


పాత పద్ధతుల ప్రకారం అన్నం, పప్పు గట్రా మారు వేసుకునేవారు కాదు. పళ్ళెంలో ఎంత ఉంటే అంతే తిని లేచిపోయేవారు. అందుకని - అన్నం ఆఖరున వడ్డించుకునే పద్ధతిని అవలంబించేవారు.🌹

కామెంట్‌లు లేవు: