భారత రత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి వర్ధంతి (11 -డిసెంబర్ )సందర్బంగా నివాళులతో
అది 1945 వ సంవత్సరం .అపర సరస్వతీ అవతారం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు రాజపుత్ర మహారాణి మీరా పాత్రలో లీనమై రాజస్థాన్ వీధుల్లో నటిస్తూ మీరా భజన్స్ పాడుతూ ఉంటే మా మీరా తిరిగి వచ్చింది అంటూ జనులు వేలాదిగా గుంపులు కూడేవారట . ఆనాడు మీరా ఎంత అందంగా ఉండేదో తెలియదు, ఎంత భక్తి శ్రద్ధలతో పాడారో మనకు తెలియదు గానీ ఎమ్మెస్ మాత్రం మీరాబాయి తిరిగి వచ్చినట్టు ఆ పాత్రలో జీవించారు. మహాత్మా గాంధీ ఆమె తమిళ మీరా తీసారని విని దానిని హిందీలో కూడా తీయమని అడిగారట. గాంధీ గారి కోరిక మేరకు మళ్ళీ ఆ చిత్రాన్ని 1947 లో తీశారు. గాంధీ గారు మరణించడం వల్ల అయన ఆ చిత్రం చూడలేక పోయారు . ఇప్పటికీ ఆ చిత్రం మనలను ఆనాడు రాజపుత్ర సామ్రాజ్యములో తీసుకు వెళ్లి భక్తి సంద్రములో విహారం చేయిస్తుంది.
మీరా 1947 చిత్రం తరువాత ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు సినిమాల్లో నటించడం మానివేశారు. పూర్తిగా శాస్త్రీయ సంగీత కచేరీలు చేయడానికే మొగ్గు చూపారు. ఆమె ఆలాపనతో జనులే కాదు దేవతలూ నిదుర లేస్తారు. ఆమె తవ సుప్రభాతమనగానే జగన్నాయకుడు భక్తుల బ్రోచే వేళాయెనంటూ పరుగెత్తుకు వస్తాడు. మధుర గాన స్వర ఝరి భారత రత్న అపర సరస్వతీ అవతారం శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారి వర్ధంతి సందర్భంగానివాళులు
- Veera Narasimha Raju, FB wall
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి