31, జనవరి 2022, సోమవారం

హిందువులు బహుదేవతలను పూజిస్తారా

హిందువులు బహుదేవతలను పూజిస్తారా 

ఇటీవల మనం తరచూఎడారి మత అజ్ఞ్యానులు హిందూ ధర్మం మీద బురజ చాల్లే ప్రయత్నంలో హిందువులు అనేక దేవతలను పూజిస్తారు, దేముడు ఒక్కడు ఉంటాడు కానీ అనేకమంది వుంటారా కాబట్టి హిందువులు అజ్ఞ్యానంలో వున్నారని వారే జ్ఞ్యానులన్నట్లు ప్రబోధిస్తుండటమే కాక హిందువులను చులకన చేస్తూ మాట్లాడటం హిందువుల మీద సవాళ్లు విసరటం చేస్తున్నారు. నిన్న కాక మొన్న పుట్టియిన వాళ్ళ మతం గొప్పదైనట్లుగా మాట్లాడటం మనం తరచూ వింటున్నాము, చూస్తున్నాము.  మన హిందూ సోదరులకు హిందుత్వం మీద సరైన అవగాహనా లేకపోవడాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకొంటూ అమాయక హిందువులను మతమార్పిడి చేస్తున్నారు.  కాబట్టి హిందువులారా జాగ్రత్తగా వుండండి మన ధర్మం యెక్కు గొప్పదనాన్ని తెలుసుకోండి. 

ముందుగా  చెప్పేది ఏమిటంటే ప్రపంచంలో మనుషులు బట్టలు కట్టుకోవటం కూడా నేర్వక ముందే మన భారతీయ సంస్కృతి ఎంతో వృద్ధి చెంది వున్నది. 

మనకు వేదాలు నాలుగు, వేదాలు ఎప్పుడు పుట్టాయో ఎవ్వరికి  తెలియదు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాయని చెపుతున్నారు.శుక్ల యజుర్వేద సంహితలోని నలుబదియవ అధ్యాయమునందు ఈశావా స్యోపనిషత్తు గలదు. ఇది మంత్రభాగమునకు చెందినదగుటచే దీనికి విశేష మహత్వమున్నది. ఇది ఉపనిషత్తులలో కెల్ల మొదటిదిగా పరిగణింపబడినది. శుక్లయజుర్వేదము నందలి మొదటి ముప్పదితొమ్మిది అధ్యాయములలో కర్మకాండము నిరూపింపబడినది. ఇది ఆ కాండము యొక్క అంతిమాధ్యాయము. దీనిలో భగవత్తత్త్వరూపమైన జ్ఞానకాండము నిరూపింపబడినది. దీని ప్రథమ మంత్రము (ఈశావాస్యమ్' అని ప్రారంభింపబడినందుననియ్యది 'ఈశావాస్యోపనిషత్' అని పేర్కొనబడినది.

ఈ ఉపనిషత్తులో పద్దెనిమిది మంత్రములు కలవు.  ఈ ఉపనిషత్తు భగవత్స్వరూపాన్ని వివరిస్తూ మానవుడు తన జీవితాన్ని ఎలా గడపాలో తెలుపుతున్నది. మొట్ట మొదటి మంత్రము భగవత్స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. దానిని పరికించండి.

ఈశా వాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్,

 తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్ ధనమ్.

జగత్యామ్ =అఖిల బ్రహ్మాండము నందు; యత్ కించ=ఏదైతే; జగత్ = జడ, చేతన స్వరూపమైన జగత్తుగలదో; ఇదమ్ = ఈ; సర్వమ్ = సమస్తమును; ఈశా= ఈశ్వ రునిచే; వాస్యమ్ =వ్యాపించియున్నది; తేన=అందుచే; త్యక్తేన త్యాగపూర్వకముగ (ఈశ్వరుని వెంట నిడుకొని); భుంజీథా= (దీనిని) అనుభవింపుము; మాగృధః=( దీనియందు) ఆసక్తుడవు గాకుండుము; (ఏలయన) ధనమ్= ధనము-సంపద-భోగ్య పదార్ధములు; కస్యస్విత్ = ఎవరిది? అనగా ఎవరిదీకాదు.

 తాత్పర్యము: అఖిల బ్రహ్మాండము నందుగల చేతనా చేతన జగత్తంతయు వ్యాపించియున్నది ఈశ్వరుని చేత. అనగా ఈ జగత్తు మొత్తము ఈశ్వరుడి రూపమే కాక వేరొక్కటి కాదు.  కాబట్టి ఈశ్వరునికన్నా భిన్నంగా ఇంకొకటి లేదు.  అటువంటప్పుడు బహు దేవతలప్రసక్తే ఉండదు కదా? అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యము ననుభవించుచు, సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకముగ, ప్రాప్తించిన దానిని అనుభవింపుము. కాని దాని యందు ఆసక్తుడవు గాకుండుము. ఈ సంపద, ధనము, భోగ్యసామగ్రి ఎవరిది? అనగా ఎవరికీ చెందినది కాదు.  అంతాఈశ్వరుడే అయి వున్నాడు అని అర్ధము.

వ్యాఖ్య: అఖిల విశ్వబ్రహ్మాండము నందుగల చరాచరాత్మకమైన జగత్తు నీ చూపుద్వారా, వినికిడి ద్వారా తెలియవచ్చు చున్నదంతయునూ సర్వాధారుడు, సర్వనియంత, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సకల కళ్యాణగుణ స్వరూపుడునగు పరమేశ్వరుని చేత వ్యాపింపబడి యున్నది; సదా, సర్వత్ర అతనిచేత పరపూర్ణమై యున్నది. (గీత.9-4) ఇందలి ఏ అంశము కూడా అతనితో రహితమైలేదు. గీత.10-39, 42) ఈ విధంగా తెలిసి ఆ పరమేశ్వరుని నిరంతరము సన్నిహితంగా భావిస్తూ సదా, సర్వదా అతనిని స్మరించుచునే నీవు ఈ జగత్తునందు త్యాగభావం కలిగి కేవలం కర్తవ్య నిర్వహణకై మాత్రమే విషయములను యధోచితముగా ననుభవింపుము. అనగా - విశ్వరూపుడగు ఈశ్వరుని అర్చించుట కొరకే కర్మలను ఆచరించుము. . విషయములందు మనస్సును చిక్కు కొననివ్వకుము. ఇందులోనే నీకు నిశ్చితమైన మేలు గలదు. (గీత.2-64; 3-9; 18–46) నిజమునకు ఈ భోగ్యపదార్ధములు ఎవరివీ కావు. మనుజుడు పొరపాటుగా వీనియందు మమతా, ఆసక్తిని పెంచుకుంటాడు (ముడి వేసుకొని కూర్చుంటాడు) ఇవన్నియును పరమేశ్వరునివే, ఆతని కొరకే వీటినుపయోగించ వలయును. (త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే) ) అని మనుజుల పట్ల వేదభగవానుడిచ్చిన పవిత్రమైన ఆదేశము నెరుగుము.(1) 846

ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే సర్వము ఈశ్వరుడే అయితే మరి మనం నిత్యం అనేక దేవి దేవతలను ప్రతిమలను  ఎందుకు  పూజిస్తాము. అది ఎంతవరకు సబబు అనే సందేహం ప్రతి మానవునిలో ఉదయిస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్నీ కూలంకుషంగా పరిశీలిద్దాం 

మనకు ఫై శ్లోకంతో ఈ జగత్తు పూర్తిగా ఈశ్వరునిచే ఆవరించి వున్నదని తెలు.సుకున్నాం కదా. మరి మన కామ్యములు ఈడేరటానికి మనం అనేక దేవతలను ఎందుకు పూజిస్తాం అంటే దానిని మనం ఒక కార్యాలయ వ్యవస్థ ఉదాహరణతో చూద్దాం. ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఏదయినా పనివున్నదనుకోండి ఉదా: తహశీలుదారు కార్యాలయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్) కావాలనుకోండి అప్పుడు నీవు నీ దరఖాస్తుని ఆ కార్యాలయ ఇన్వార్డ్ ఔట్వేర్డ్ గుమస్తాకు అంతదాచేస్తావు.  ఒక వారం రోజుల్తరువాత అతని వద్దకు వచ్చి నీ సర్టిఫికెట్ తీసుకొని పోతావు.  నిజానికి నీ సర్టిఫికెట్ మీద సంతకం చేసిన అధికారి ఆ గుమస్తా కాదు తహసీల్దారు గారు.  కానీ నీవు తహసీల్దారుని కలవను కూడా కలవలేదు కానీ సర్టిఫికేట్ ఆమోదించింది మాత్రం ఆయనే.  అదెలా సాధ్యం అంటే తహసీల్దారు ఒక్కరు అన్ని పనులు చేయలేరు కాబట్టి ఆయన క్రింద అనేక మంది ఉద్యోగులు అయన వివిధ బాధ్యతలను నిర్వహించటానికి వున్నారు.  అంటే గుమాస్తాలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దారు, అటెండర్లు ఆలా అనేక సిబ్బంది ఉండబట్టే ప్రజల సమస్యలను వారు సామూహికంగా తహసీల్దారు పేరుమీద జరుగుతున్నాయి.  ఈ కార్యాలయ వ్య్వవస్థ మనకుభగవంతుని దగ్గరకుడా వున్నారు. అంటే మనం కార్యాలయ వ్యవస్థ మనం దేముళ్ళ దగ్గరనుండే అనుసరిస్తున్నాం అన్న మాట పూర్తీ జగత్తుకి భగవంతుడు ఒక్కరే అయినాకూడా వివిధ శాఖలకు వివిధ దేవి దేవతలు వున్నారు అన్నమాట. 

మీకు విజ్ఞాలు కలుగకుండ ఆ శాఖకు అధిపతి వినాయకుడు, ధనానికి లక్ష్మి అమ్మవారు, దైర్యానికి పార్వతి అమ్మవారు, సృష్టి జరగటానికి బ్రహ్మ దేముడు, స్థితి కారకుడు మూర్తి, లయ కారకుడుగా పరమ శివుని ఇలా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క దేముడు ఉండి వారికి కేటాయించిన విధులను నిర్వహిస్తున్నారు.  మీరు ఒక కార్యాలయంలో ఏపని కావాలంటే దానికి సంబంధించి గుమస్తా వద్దకు వెలుతారో అలానే భగవంతుని కార్యాలయంలో కూడా మీకు ఏ ఏ కోరికలకు సంబందించిన శాఖకు సంబందించిన దేముడివద్దకు వెళితే వారి వల్ల మీమీ కోరికలు తీరుతాయి.  కానీ అన్నీ కూడా భగవంతుని వల్లనే అన్న విషయం మరువవద్దు. 

కొందరు భక్తులు వారు కేవలం ఒక దేముడినే నిత్యం ఆరాధిస్తుంటారు మరి వారి పరిస్థితి ఏమిటి అని అడగవచ్చు,  మీరు ఏ దేముడిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ రాధిస్తారో ఆ దేముడే మీకు అన్ని కోరికలను తీర్చగలడు.  క్రింది శ్లోకాన్ని పరిశీలించండి. 

ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం |
సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి ||

ఆకాశం నుండి జాలువారిన వర్షపు చినుకులు ఏరకంగా ఐతే సముద్రాన్ని చేరుతాయో అదేవిధంగా ఏ దేముడిని నమస్కరించినా అది కేశవునికేచందుతుంది, కాబట్టి ఎవరు ఏ ఏ రూపంలో దేముడిని ఆరాధించినా కూడా అందరి ఆరాధన ఆ భగవంతునికే చెంది వారి వారికి ఆ ఆయా రూపాలలో భగవంతుడు వారి కామ్యములను ఈడేర్చుతాడు. ఈ ప్రకృతి  మొత్తం భగవంతుడే అని భావించే సాధకుడు సదా భగవంతుని సన్నిధిలోనే ఉంటాడు. 

హిందూ ధర్మంలో వృక్షాలు, జంతుజాలం కూడా దేముడిగా పేర్కొని పూజించటం ఒక మహోన్నత ఉద్దేశ్యంగా కనపడుతుంది. 

వృక్షాలలో దేముడు: 

ఇంటిలో తులసి కోట ఉండని ఇల్లు ఉండదు, ప్రతి ఇల్లాలు ఉదయాన్నే తులసి చెట్టుని ఆరాధించటం నిత్యం ప్రతి హిందూ కుటుంబంలో చూస్తాం.  ఏముంది అంతమహిమ ఈ తులసి చెట్టులో అంటే తులసి ఆకులు చక్కటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేదం చెపుతున్నది.  ఆ చెట్టుపై నుండి వీచే గాలిమనలోని రుగ్మతలను తొలగిస్తుందని మన మహర్షులు ఏనాడో కనుగొని ఈ సంప్రదాయాన్ని నెలకొల్పారు.

తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని, దాని తో ఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవిత్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది .

యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా: యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం

మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవత లు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తు న్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్న విషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్ల నే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.

రావి

దేవతా వృక్షాల్లో రావి (అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది

మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణ! అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:

 ఈ వృక్షం మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భం లో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతు న్నాయి. ఆయన ఆ చెట్టుగా  మారాడని పురాణాలు చెబుతు న్నాయి. రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నర కడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహా పాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.

వేప

వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్ల నే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మల ను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.

మారేడు

మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చది వి నమస్కరించి కోయాలంటారు.

ఆ శ్లోకం 

అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా గృహ్లామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్

మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ రాకంగా ఇంకా అనేక రకాల వృక్షాలను దేవి దేవతలుగా భావించటం, కొన్ని చెట్ల పాత్రలను, పుష్పాలను దేముళ్లను పూజించటానిని మనం నిత్యం ఆచరిస్తువున్నాం. 

జంతువులలో కూడా దేముళ్ళు: 

హిందూ సనాతన ధర్మంలో జంతువులను కూడా పూజించే ఆచారం వుంది. 

 ఏనుగు మనకు వినాయకుడు, ఎలుక ఆయన వాహనంగా పూజించబడుతున్నాయి. సర్పాలు సుబ్రహ్మణ్యస్వామిగా, సింహం నరసింహంగా, కోతిని ఆంజయస్వామిగా, పందిని వరాహస్వామిగా, తాబేలును శ్రీ కూర్మంగా, ఇలా చెప్పుకుంటూ పొతే అనేక విధాలుగా మనం పూజలు చేస్తున్నాము.  ఆవును సాక్షాత్తు కామధేనువుగా పూజించటమే కాకుండా ఆవు, పేడ మూత్రం, పాలు హిందువులు ఔషదాలుగా భవిస్తూ రోజు ఎంతో పవిత్రంగా సేవిస్తున్నారు. 

మనుషులు కూడా దేముళ్ళే 

ప్రతి హిందువు తన జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దేవతలుగా పూజిస్తూ సేవిస్తారు. విద్యనేర్పిన గురువులను, అతిధులను కూడా దేముడిగా చూసే సాంప్రదాయం హిందువులది. 

సర్వ-భూతేషు యః పశ్యేద్ భగవద్-భావం ఆత్మనః
భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః ( గీత . 11.2.45)

“భగవంతుడినే అంతటా చూసేవాడు, అందరిలో భగవంతుడినే చూసేవాడే, అత్యుత్తమ భాగవతుడు (ఆధ్యాత్మికవేత్త)” భగవంతుని యందే ఎల్లప్పుడూ మనస్సు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు, యజ్ఞము ఆచరించే వాడు, యజ్ఞ ద్రవ్యము, హోమ పరికరాలు, హోమ అగ్ని, యజ్ఞ ప్రక్రియ, ఇవన్నీ భగవంతుని కంటే అబేధమైనవే.కాబట్టి సదా సాధకుడు తానూ చూసేది, వినేది అంతా భగవత్ స్వరూపంగానే భావిస్తాడు. 

ఇప్పుడు చెప్పండి హిందువులు అనేక దేముళ్ళను పూజిస్తారా? 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

భార్గవ శర్మ

 


28, జనవరి 2022, శుక్రవారం

అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి

 ,

 * బ్రేకింగ్ న్యూస్ - అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నికయ్యారు! *

 భారత్‌కు గొప్ప విజయం!!! ప్రధాని మోదీ చాణక్య దౌత్యం. ప్రపంచ వేదికపై బ్రిటన్‌ ఓటమి. ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా అభివృద్ధి చేసుకున్నారనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారు. భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ 193 ఓట్లకు 183 ఓట్లు (ప్రతి దేశం నుండి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) పొందారు మరియు బ్రిటన్‌కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్‌ను ఓడించారు. అతను బ్రిటన్ యొక్క ఈ పదవిపై 71 సంవత్సరాల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాడు.

 దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 6 నెలలుగా కృషి చేస్తున్నాయి! మొత్తం 193 దేశాల ప్రతినిధులను సంప్రదించడం మరియు సులువుగా గెలుపొందగల బ్రిటీష్ అభ్యర్థి విషయంలో భారతదేశం యొక్క వైఖరిని వారికి వివరించడం చాలా కష్టమైన పని. 11 రౌండ్ల ఓటింగ్‌లో, జస్టిస్ దల్వీర్ భండారీ జనరల్ అసెంబ్లీలో 193 ఓట్లలో 183 ఓట్లను పొందారు మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 మంది సభ్యులలో మొత్తం 15 ఓట్లు పొందారు.

 జస్టిస్ దల్వీర్ భండారీ 9 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ 183 దేశాలు భారతదేశానికి ఓటు వేసినా వారి దేశాలకు నా ధన్యవాదాలు! మనకు స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో పోటీ పడుతూ మనము గెలవడం గొప్ప విషయం

 అభ్యర్థన - మీకు నచ్చితే మీ ఇతర స్నేహితులకు కూడా పంపండి

 * జై హింద్-జై భారత్. *

 ,

ధర్మం”

 🍇🍇🍇🍇🍇🍇


         *”ధర్మం”* అంటే ఏమిటి? 

       

*->* అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం:

         *వివాహ ధర్మం!* 


*->* తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం:

            *భార్య ధర్మం!* 


*->* నమ్మిన మిత్రునికి అపకారం 

     చేయకుండటం :

           *మిత్ర ధర్మం!* 


 *->* సోమరితనం లేకుండటం:

          *పురుష ధర్మం!* 


*->* విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం:

             *గురుధర్మం!* 


*->* భయభక్తులతో విద్యను నేర్చుకోవటం:

             *శిష్యధర్మం!* 


*->* న్యాయమార్గంగా సంపాదించి 

     సంసారాన్ని పోషించటం:

          *యజమాని ధర్మం!* 


*->* భర్త సంపాదనను సక్రమంగా పెట్టి 

     గృహాన్నీ నడపటం:

            *ఇల్లాలి ధర్మం!* 


*->* సైనికుడుగా వుండి దేశాన్ని,ప్రజలను 

      కాపాడటం:

            *సైనిక ధర్మం!* 


*->* వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి 

      పోషించటం:

               *బిడ్డల ధర్మం!* 


*->* తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని 

     చేయటం :

              *తండ్రి ధర్మం!* 


 *->* తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు 

     ప్రతిష్ఠలు తేవటం:

          *బిడ్డలందరి ధర్మం!* 


 *->*  తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని 

    గౌరవించటం :

             *వృత్తి  ధర్మం!* 


  *->* తీసుకున్న జీతానికి నమ్మకంగా పని చేయడం  

                *ఉద్యోగి ధర్మం*


*->* తాను సంపాదించినదాన్ని తనవారితో 

    పంచుకొని తినటం :

             *సంసార ధర్మం!* 


*->* అసహాయులను కాపాడటం:

           *మానవతా ధర్మం!* 


*->* చెప్పిన మాటను నిలుపుకోవటం :

               *సత్య ధర్మం* 

               🌾🌲🌷🦜🍬💃💃  🌹🙏🌹

తెలుగు వాగ్ధాటి' గరికపాటి

 ఈరోజు (28-1-2022)🌹 *ఆంధ్రజ్యోతి* (వ్యాసం పూర్తిపాఠం) 'తెలుగు వాగ్ధాటి' గరికపాటి //🌹 -నేటి కాలంలో తెలుగువారికి బాగా పరిచయమైన పేరు గరికపాటి నరసింహారావు.యూట్యూబ్ వంటి సోషల్ మీడియా,

ఏ బీ ఎన్ వంటి ఛానల్స్ ద్వారా ప్రతిరోజూ కొన్ని లక్షలమంది ఆయన ప్రసంగాలను వింటూ వుంటారు.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ మొదలు పవన్ కల్యాణ్ సినిమాలు చూసి పల్టీలుకొట్టే పల్లెటూరి పిల్లాడి వరకూ ఎందరెందరో ఆయన మాటలకూ అభిమానులుగా మారిపోయారు.అంతటి అభిమాన ధనాన్ని పొందిన ఐశ్వర్యవంతుడు గరికపాటి.

ఈ భాగ్యవంతుడిని నేడు ప్రతిష్ఠాత్మకమైన 'పద్మశ్రీ' వరించింది.'సాహిత్యం -విద్య' విభాగంలో భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.ఈ ఎంపిక పట్ల ప్రతి తెలుగు భాషాభిమాని అమిత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.గరికపాటి కేవలం కవి,పండితుడు,ప్రవచనకర్త మాత్రమే కాదు,ప్రఖ్యాత అవధాని.పద్మశ్రీ ప్రదానం ద్వారా తెలుగువాడి సంతకంగా అభివర్ణించే 'అవధాన విద్య'కు ఘన గౌరవం దక్కినట్లయింది.

గరికపాటిని మేటిగా నిలిపింది సాటిలేని అతని వాగ్ధాటి. తెలుగు పలుకులో ఇంత చమత్కారం ఉందా,

తెలుగు నుడికారంలో ఇంత మమకారం ఉందా, మాటవిరుపులో ఇంత మైమరుపు ఉందా? అని నేటితరం యువతకు కూడా తెలిసేట్టు చెప్పే ప్రసంగప్రతిభ ఆయన సొత్తు.

నన్నయ్య నుంచి నవకవి వరకూ,ఆదిశంకరాచార్యుడు నుంచి 'ఆర్ట్ అఫ్ లివింగ్' రవిశంకర్ వరకూ అనేక పేర్లు ఆయన ప్రసంగంలో వినిపిస్తూ ఉంటాయి.'కనకధారాస్తోత్రం' నుంచి కారల్ మార్క్స్

 'కాపిటల్ ' వరకూ ఆయన ఉటంకిస్తూ ఉంటారు. పద్యాలు,శ్లోకాలు,సామెతలు, పిట్టకథలు,వ్యాకరణ సూత్రాలు,గొప్పోళ్ల గోత్రాలు ఒకటేమిటి? అప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ వరకూ అన్నింటినీ ఆయన ప్రసంగంలో వినవచ్చు.

ఇందరు కవులు,అవధానులు, ప్రవచనకర్తలు ఉండగా, గరికపాటివారికే అంతటి ఆకర్షణ ఎందుకు వచ్చింది అంటే? ఆయన ఎంచుకున్న ఉపన్యాసశిల్పం ఆయనను సరికొత్తగా నిలబెట్టింది. అందుకు తన అవధాన ప్రజ్ఞ జత కట్టింది.చిన్నప్పటి నుంచీ అలవడిన చదువరితనం కలిసొచ్చింది,ప్రశ్నించే లక్షణం పనికొచ్చింది,నిరంతర సాధన తోడునీడై నిలిచింది.

సహస్రావధానిగా,

ప్రవచనా ప్రభాకరుడుగా నేడు మన్ననలు పొందుతున్న గరికపాటి జీవితప్రస్థానం వైవిధ్యభరితం.అనేక కష్టాలు,నష్టాలు,అవమానాలు, కన్నీళ్లు అన్నింటినీ ఎదుర్కొని నిలిచారు.కఠోరమైన సాధన చేశారు.ఆయన ఎదుగుదల కేవలం స్వయంకృషి.ఇప్పటి వరకూ 1160 పుస్తకాలను మధించారు.11,189 పద్యాలను రచించారు. ప్రపంచమంతా తిరిగారు.

కొన్ని వందల సభల్లో పాల్గొన్నారు.ఆయనను మలిచిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.ఆయనను మార్చిన వ్యక్తులు ఎందరో ఉన్నారు.

మిగిలిన అవధానులకు భిన్నంగా,మూడు పదుల వయస్సు దాటిన తర్వాత అవధానాలను మొదలు పెట్టారు.అనతికాలంలోనే అప్రతిహతంగా దూసుకువెళ్లారు.

నేడు 'పద్మశ్రీ'ని సైతం అందుకున్నారు.గరికిపాటి జీవితంలో (1) అధ్యాపనం

(2) అవధానం (3) ప్రవచనం మూడు ప్రధామైన భూమికలు. చాలాకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసినా,విశేషంగా పేరు తెచ్చినవి అవధానం,ప్రవచన క్షేత్రాలు.తాను అవధానిగా మారడానికి పూర్తి ప్రభావాన్ని చూపించింది గుంటూరు వాతావరణం.అందునా డాక్టర్ ప్రసాదరాయకులపతి (నేటి కుర్తాళ పీఠాధిపతి) ప్రథములు.ఆ తర్వాత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం.

వీరిద్దరి ప్రేరణ,ప్రోత్సాహం అవధాన రంగంలో,పద్య సారస్వత రంగంలో తనను ఇంతవాడిని చేశాయని గరికపాటి ఎప్పుడూ చెబుతూ ఉంటారు.పూర్వరంగంలో, పదేళ్ల పాటు 'ఆకాశవాణి' కోసం చేసిన సమస్యాపూరణ, దత్తపది  మొదలైన అంశాల సాధన అవధానరంగంలో ఆయనకు చాలా అక్కరకు వచ్చాయి.భువన విజయాలు వంటిరూపకాలు,

కవిసమ్మేళనాల ద్వారా 'ఆశుపద్య విద్య' మరింత పదునెక్కింది.పద్యరచన ఆయనకు కొత్తగా అబ్బింది కాదు.17-18 ఏళ్ళ ప్రాయంలోనే నాలుగు శతక రచనలు చేశారు.అలా మొదలైన ఆ సాధన ఆ తర్వాత 1,116 పద్యాల 'సాగర ఘోష' వంటి పరమాద్భుత రచన వరకూ చెయ్యి పట్టి నడిపింది.అవధాన ప్రదర్శనలో నిబద్ధతకు పెట్టిందిపేరు గరికపాటి.పద్యాలను ధారాపాతంగా చెప్పడమే కాక, అన్ని పద్యాలను తిరిగి అప్పజెబితేనే ఆ అవధానం సంపూర్ణమైనట్లు. ధార,ధారణల సమ్మేళనమే 'అవధానం'.తను ఏనాడూ ధారణను ఎగ్గొట్టిన సందర్భం ఇంత వరకూ రాలేదు.ఆ ధారణ కూడా అసాధారణం.అందుకే ఆయనకు 'ధారణా బ్రహ్మరాక్షసుడు' అనే బిరుదు కూడా వచ్చింది.ఆశువుగా చెప్పే పద్యంలోనూ ఎంతో కవితా సుగంధం,చమత్కార బంధం ఉంటాయి.ఆయన అవధానాలు ఆద్యంతం ఆకర్షణాభరితాలు.రచించిన పద్యాలలోనూ అదే సొగసు, సోయగం తొణికిసలాడుతూ ఉంటాయి.ఆవేశం వచ్చినప్పుడు,ఆవేదన కలిగినప్పుడు పుట్టిన కవిత్వాన్ని 'భాష్పగుచ్ఛం'గా లోకానికి అందించారు. ముఖ్యంగా ' సాగరఘోష' కావ్యానికి కేంద్ర ప్రభుత్వ గౌరవాలు ఏనాడో వచ్చి ఉండాల్సివుంది.ఎందుకో తప్పిపోయాయి.మానవ జీవన సాగరాన్ని,సముద్ర సంచలనాలను అన్వయం చేసుకుంటూ రచించిన గొప్ప కావ్యం 'సాగరఘోష'.

విశ్వఘోషలా వినిపించే ఈ రచనపై నండూరి రామమోహనరావు  'విశ్వదర్శనం' ప్రభావం ఉందని గరికిపాటి చెబుతూ ఉంటారు. తన స్వతంత్ర భావాలపై ధూర్జటి ప్రభావం చాలా

ఎక్కువని అంటుంటారు. అవధానాలు,పద్యరచనలు కొనసాగిస్తూనే ఆయన ప్రవచనాల లోనికి లంఘించారు.పెరుగుతున్న శాటిలైట్ ఛానల్స్,ఎదుగుతున్న సోషల్ మీడియా మధ్య గరికిపాటి విశ్వరూపం ఎత్తారు. పురాణాలు,ఇతిహాసాలు, కావ్యాలు,శతకాలు,స్త్రోత్రాలు, ఉపనిషత్తులు,వేదవేదాంగాలు మొదలు సమకాలీన రాజకీయాలు,ఆహారం, వ్యవహారం,అలవాట్లు అన్నీ ఆయన ఉపన్యాసాలకు వస్తువులయ్యాయి.

అప్పుడే వచ్చే బ్రేకింగ్ న్యూస్ కూడా అందులో జొరపడుతుంది.దీనికి 'సామాజిక వ్యాఖ్య' అనే పేరు ఆయనే పెట్టారు.ఈ విధానం కోట్లమందిని తన చుట్టూ కట్టిపడేసింది.ఇందులో,

తన పూర్వ ఉపాధ్యాయుడు ఇంద్రగంటి రామచంద్రమూర్తి ఉపన్యాసబాణీ తనకు ప్రేరణగా నిలిచిందని గరికిపాటి చెబుతారు.ఆ కాలంలో రేడియాలో వచ్చే వార్తలను కూడా కలుపుకొని విశ్లేషిస్తూ ఆ మాస్టారు చేసే ప్రసంగాలు తనను ముగ్ధుడ్ని చేశాయని గుర్తుచేసుకుంటారు.తన జీవితంలోని పదేళ్ల సంధిగ్ధ దశ తనకు ఎన్నింటినో దగ్గరకు చేర్చిందని,ఎంతో మార్చిందని అంటుంటారు.సనాతన సంప్రదాయ వాదులను - ఆధునిక తార్కికులను చదివే అవకాశం వచ్చిందని చెబుతారు.చిన్ననాడే తమ ఊరి దేవాలయంలోని గ్రంథాలయంలో చదువుకున్న ఎన్నో పుస్తకాలు పునాదులు వేశాయని ఆయన భావిస్తారు.తనపై పెద్ద ముద్ర వేసిన ఆధునికులలో ముప్పాళ్ల రంగనాయకమ్మ తొలి వ్యక్తిగా తలచుకుంటారు.ఆమె అనువాదం చేసిన కారల్ మార్క్స్ ' క్యాపిటల్ ' తనకు కొత్త తర్కాన్ని పరిచయం చేసిందని గరికిపాటి భావిస్తూ ఉంటారు.'సీతారామాంజనేయ సంవాదం' అనే గ్రంథం తొలిగా తనకు అద్వైతాన్ని భోధించినట్లుగా చెప్పుకుంటారు.వచనంలో ఉన్న 'వ్యాసభారతం' తాత్పర్య సహితంగా చదివే అదృష్టం ఆయనకు చిన్ననాడే  దక్కింది. ఒక దశలో తీవ్రమైన డబ్బుల ఇబ్బంది సమయంలో  'కనకధారా స్తవం' ఆయన జీవితంలోకి ప్రవేశించింది.

దాని పఠనం సత్ఫలితాన్నిచ్చిందని ఎన్నమార్లు చెప్పుకున్నారు. అదే ఆదిశంకరాచార్యుల సర్వ సాహిత్యాన్ని ఆయన  దగ్గరకు చేర్చింది.వీటితో పాటు ' 'వేదాంత డిండిమ' అనే గ్రంథం ఆయనకు అచంచలమైన ధైర్యాన్ని ఇచ్చింది.తిరుపతి వేంకట కవుల ' పాండవ జననం' నూనూగు మీసాల నిండు యవ్వనంలోనే పలకరించి,కొత్త ఆలోచనలను చిగురింప చేసింది. కుమారులకు గురజాడ,శ్రీశ్రీ అనే పేర్లు పెట్టుకోవడం వెనకాల వారిపై ఉండే విశేషమైన అభిమానమే కాక,ఆయా సందర్భాలు అలా కలిసివచ్చాయి.ఎం.ఫిల్,

పిహెచ్ డిలు పూర్తి చేసి, లౌకికంగా విద్యాధికుడు కూడా అయ్యారు.ఎంఫిల్ కు రెండు స్వర్ణపతకాలను సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా తీసుకున్నారు. అంతే కాదు ' మా మాట నిలబెట్టారు' అంటూ ఎన్టీఆర్ ప్రశంసలు కూడా పొందారు. గరికిపాటి ఒకప్పుడు ' ఎన్టీఆర్ ఫ్యాన్స్ ' కు అధ్యక్షుడు కూడా.ఇంతటి వైవిధ్యభరితమైన జీవన గమనంలో నుంచి పైకెగసిన గొప్ప కెరటం గరికిపాటి.ఇరవైకి పైగా రచనలు చేశారు.తను వచించే,రచించే ప్రతి పద్యాన్ని ఎప్పటికప్పుడు రాసిపెట్టుకొనే క్రమశిక్షణ ఆయన ప్రత్యేకం. చదివిన ప్రతి పుస్తకానికీ నోట్స్ రాసుకొనే మరో సుగుణం ఆయన భూషణం.ఆ కీర్తి కిరీటంలో ఎన్నో బిరుదులు, ఘన గౌరవ,సత్కారాలు చేరాయి.స్వర్ణ కంకణాలు అందుకున్నారు.నేడు 'పద్మ'విభూషితులయ్యారు. జ్ఞానం మౌనంగా ఉండమని చెబుతోందని,భవిష్యత్తులో మౌనాన్ని ఎక్కువగా అశ్రయించే  ప్రయత్నం చేస్తానని గరికిపాటివారు అంటున్నారు.సనాతనతకు -ఆధునికతకు వారథిగా నిలుస్తూ, తెలుగు పద్యాన్ని రెపరెప లాడిస్తూ,అవధానాన్ని అందలమెక్కిస్తూ, తెలుగు వాగ్దేవతను నమ్ముకొని ముందుకు సాగుతున్న మాటలమేటి గరికపాటికి అభినందనలు అందిద్దాం-మాశర్మ🙏

27, జనవరి 2022, గురువారం

గరికపాటి వారికి

💐గరికపాటి వారికి అభినందనచందనాలు💐

వ్యవధానములు లేని యవధానముల సాగి 
          కవనాల పండించి కవుల మించి 
ప్రవచనామృతధార రంగరింపులలోన 
          సంస్కృతీవిలువల సందడించి 
వాగ్వైభవము జూపి వాణికిం బ్రియమౌచు 
          వఱలెడు ప్రియవాచి వందితాంఘ్రి! 
గౌతమీ తీర్థాలఁ గడుపారగాఁ గ్రోల 
          గలిగెనో పాండితీగరిమ మీకు 
లలితవిన్యాసభూషిత తెలుగుభాష 
మెచ్చి యిచ్చె *పద్మశ్రీ* ని యిచ్చగించి 
మిమ్ము గన్న గర్భమ్ము సతమ్ముఁ బొంగు 
భారతావని భాగ్యమ్ము పరిఢవిల్లు 
*~శ్రీశర్మద*

దేవతార్చన కొరకు పుష్ఫాలు

 దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్ఫాలు - వాటి ఫలితాలు . 


 *  జాజిపువ్వుతో అర్చించిన భుక్తి , ముఖ్తి ఇచ్చును . చంపకము స్తంభనము , మొగిలి , మొల్ల , తెల్ల కలువ ఉచ్చాటన పద్దతిలో ఆయుధముగా పనిచేయును . 


 *  బంగారు మల్లె లాభము , నల్ల గోరింట పువ్వుల అర్చన బలవర్ధనము , తెల్ల కలిగొట్టు గొప్ప కీర్తిని ఇచ్చును . 


 *  పద్మము శాంతి , పుష్టిని ఇచ్చును . కమలము సుపుత్రులను , దాసాని మరియు రక్తగన్నేరు వశీకరణము ఇచ్చును . 


 *  శాలి ( వరివెన్ను ) సౌభాగ్యమును , కడిమి , పొగడ , మొల్ల , వస , కుందము అను పుష్పములతో అర్చించిన పాపనాశనం చేయును . 


 *  కుసుమ వశీకరణము , మోదుగ ఆకర్షణము , పొన్న , నాగకేసరములు మహాలక్ష్మీప్రదములు . 


 *  ఎర్ర కలువ వశీకరణము , నీలము మరియు నల్ల కలువలు మారణ ప్రయోగము నందు , మందార పుష్పము శత్రువుకు భయము కలిగించుటకు ఉపయోగించదగినది . 


 *  వైశాఖము నందు పొగడ పువ్వులు , జైష్టమున నాగకేసర పుష్పములు , ఆషాడమున గన్నేరు పుష్పములు విరివిగా దొరకును కావున దేవతార్చనకు ఈ మాసములలో వీటిని వాడుట శ్రేష్టం . 


 *  శ్రావణమాసము నందు పద్మముల కన్నా సంపెంగలకు ప్రాముఖ్యం , భాద్రపదమున లొద్దుగ , అశ్వజమున దాసాని , కార్తీకము నందు అగిసే , మార్గశిరమున బిల్వములు , పుష్యమాసము నందు గరికె , మాఘ మాసము నందు కుంద పుష్పములు , ఫాల్గుణమున పూల గురివిందతో పూజించుట సర్వసిద్ధి ప్రదాయకము   చైత్రమాసమున అశోక మొగ్గలతో పూజించుట అత్యంత శ్రేష్టదాయకం . 


 *  తెల్లని సన్నజాజి ,అడవి గోరింట  , దవనం , రేల , పచ్చపూల గోరింట , ఎర్ర గోరింట , కలిగొట్టు , విరజాజి , జిల్లేడు , మాధవి , గొరింటా ఈ 11 రకాల పుష్పములతో జగదాంబకు అర్చన కొరకు సమర్పించవలెను . 


 *  సన్నజాజి పుష్పములతో పూజించిన వాక్శుద్ధి కలుగును . 


 *  చమేలీ పుష్పములతో అర్చించిన రాజవశీకరణము కలుగును . మరియు అధిక మేధాశక్తి లభించును . నాగకేసరములు రాజత్వమును ప్రసాదించును . 


 *  పూల గురువింద భూలాభము , సంపెంగ బంగారము , బండి గురువెంద బుద్ధివృద్ధి , మల్లె ధనాధిక్యతను కలిగించును . 


 *  మొల్ల పువ్వు కీర్తిని , దాసాని పువ్వులతో అర్చించిన శత్రువులు సంశయావస్థలో పడెదరు . 


 *  పద్మము వలన ఆయుర్వృద్ధి కలుగును . కలువ వలన కవిత్వము అబ్బును , కడిమి పుష్పములతో అర్చన ద్వారా వ్యాధి నాశనము , బ్రహ్మదండి వలన బుద్ధిశాలిత్వము సంభంవించును . 


 *  మరువము వలన విజయప్రాప్తి , పచ్చ గోరింట వలన గజలాభము , అపరాజితా పుష్పముల వలన సర్వాంగ సుందరత్వము అబ్బును . 


 *  వావిలి వలన పుత్రలాభము , అశోకము వలన దుఃఖరాహిత్యము , పొగడ వలన వంశ గౌరవము కలుగును . 


 *  గరిక వలన ధన ధాన్య సంపద , బూరుగు పువ్వుల వలన శత్రుక్షయము , తుమ్మి పువ్వుల వలన అన్నప్రాప్తి , పొగడ వలన ధనాధిక్యత లభించును . 


 *  పొన్న వలన రాజ్యలాభము , రేల వలన అధికోన్నతి , పోట్లపువ్వుల వలన దీర్గాయువు , గ్రంథితగరము వలన సర్వమాన్యత ప్రాప్తించును . 


 *  మోదుగపువ్వుల వలన అనేక గోవులు ,మేకలు లభ్యమగును . దిరిసెన పువ్వులతో సుందర యువతి , దేవకాంచనం వలన జయము , శ్రేయము లభ్యమగును . 


 *  గన్నేరు పువ్వుల వలన మంత్రసిద్ధి , మారేడు దళముల వలన పరమపదము ప్రాప్తించును . సాత్వికమైన కోరికలకు తెల్లని పువ్వులు ప్రశస్తమైనవి . 


 *  ఉచ్చాటనము , వశీకరణము , ప్రేమ , శత్రుజయము వంటి వాటికొరకు అర్చనలు చేయువారు పరిమళము గల ఎర్రని పుష్పములు వాడవలెను . 


 *  మోహనము , వశీకరణము నందు పసుపుపచ్చని పుష్పములు శ్రేష్టమైనవి , అభిచారము , చేతబడి , పగ , మరణ ప్రయోగాల యందు రెండు విధములైన నల్లని పువ్వులు వాడవలెను . 


 *  దాసాని పువ్వులను దానం ఇచ్చిన దివ్యవస్త్రదాన  ఫలము కలుగును . మరియు బ్రహ్మ హత్యాది పాపములు క్షణములో నశించును . 


 *  దింటెన పుష్పముల యందు తెల్లదాని కంటే నల్ల దింటెన పుష్పములు దానం ఇచ్చిన రెండింతల పుణ్యము వచ్చును . 


 *  అపరాజితా , కుందముల నడుమ మనోహరమైన స్థానం కలదు . గన్నేరు పుష్పముల యందు సాక్షత్తు సదాశివుడే ఉండును . 


 *  దేవిని మంకెన పుష్పములతో పూజించిన యెడల మేకను బలి ఇచ్చినంత తృప్తి చెందును . దేవికి నిత్యపూజ యందు అర్ఘ్యం ఇయ్యవలెను . 


    

     పైన చెప్పినవన్నీ పరమశివుడు అమ్మవారికి తెలియచేసిన పుష్పసంబంధ మహత్తులు . వీటిని నేను కొన్ని పురాతన తాంత్రిక గ్రంథాల నుంచి సేకరించాను . ఇలాంటి మరెన్నో అద్బుత విషయాలు నా గ్రంథముల యందు విపులంగా ఇవ్వడం జరిగింది.  


  

    గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

కరక్కాయ గురించి

 కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ - 


 తెలుగు  - కరక్కాయ . 


 సంస్కృతం  -  హరీతకి . 


 హింది - హరడ్ . 


 లాటిన్  - TERMINALIA CHIBULA . 


 కుటుంబము  - COMBRETACEAE . 


 గుణగణాలు  - 


     కరక్కాయ లవణరస వర్జితముగా , అయిదు రసములు గలదిగా , రూక్షముగా , వేడిగా , జఠరదీపనముగా , బుద్ధిబలమును ఇచ్చునదిగా , మధురపక్వముగా , ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా , నేత్రములకు హితవుగా , తేలికగా , ఆయువును పెంపొందించునదిగా , ధాతువృద్ధిగా , వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్టును , నంజును , ఉదరమును , క్రిమిని , స్వరభంగమును , గ్రహిణిని , మలబద్ధకమును , విషజ్వరమును , గుల్మమును , కడుపుబ్బరం , దాహము , వాంతిని , ఎక్కిళ్ళను , దురదను , హృదయరోగమును , కామెర్లను , శూలను , ప్లీహారోగమును , అనాహమును , కాలేయవ్యాధిని , శిలామేహమును , మూత్రకృచ్చ రోగమును , మూత్రఘాత రోగమును నాశనం చేయును . 


           కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును . తీపి , చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును . రూక్షత్వం ,వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును . ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. 


        కరక్కాయను వర్షఋతువు నందు సైన్ధవ లవణము చేర్చి , శరదృతువు యందు పంచదార చేర్చి  , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి శిశిర ఋతువు నందు పిప్పలిని చేర్చి , వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లమును చేర్చి భక్షించవలెను. కరక్కాయను భోజనానంతరం భక్షించినను పథ్యకరమైనది . మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను , అజీర్ణసమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 


  రూప లక్షణాలు  - 


     కరక్కాయ మొత్తం 7 రకాలుగా కలదు. అవి 


             *  విజయా . 


             *  రోహిణీ . 


             *  పూతన . 


             *  అమృతా . 


             *  అభయా . 


             *  జీవంతి . 


             *  చేతకీ . 


      అని మొత్తం 7 జాతులుగా ఉండును. ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగ వివరిస్తాను. 


        విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 


                  సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 


     విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 


                కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ ( తినిన ) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 


     చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  


           ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 


              చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 


             పైన చెప్పిన 7 జాతులలో విజయ కరక్కాయ ప్రధానం అయినది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వరోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది . గొప్పది , గుండ్రనిది , బరువు కలిగినది . నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు 2 తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 


 ఔషధోపయొగాలు  - 


 *  కామెర్ల నివారణ కొరకు  - 


        కరక్కాయ , తేనె , బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 


 *  కీళ్ళవాతము నివారణ కొరకు - 


        కరక్కాయ చూర్ణమును , ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం , గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 


 *  క్రిమిరోగముల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును . ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది . 


 *  కడుపునొప్పి నివారణ కొరకు 


         కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 


 *  చర్మరోగముల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 


 *  విషమ జ్వరాల నివారణ కొరకు  - 


         కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 


 *  ఆమ్ల పిత్తము నివారణ కొరకు  - 


         కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 


 *  అర్శమొలల నివారణ కొరకు  - 


          కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 


 *  బరువు తగ్గుట కొరకు - 


         కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 


 *  గోరుచుట్టు నివారణ కొరకు  - 


        పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 


 *  నీళ్ల విరేచనాల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 


 *  రక్తస్రావ నివారణ కొరకు  - 


        కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 


 *  శరీర బలం పెరుగుట కొరకు  - 


         కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 


 *  పాండురోగం నివారణ కొరకు  - 


        కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు.  దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు , వరిబీజం తగ్గును. 


 *  చర్మ దళ కుష్టు నివారణ కొరకు  - 


       20ml గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు , కిటిభకుష్టు  తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 


 *  గొంతు బొంగురు నివారణ కొరకు  - 


       కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 


 *  దగ్గు నివారణ కొరకు  - 


        కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక , దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 


 *  తలనొప్పి నివారణ కొరకు  - 


        కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 


 * కండ్ల ఎరుపు నివారణ కొరకు  - 


         కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 


 *  ఎక్కిళ్లు నివారణ కొరకు  - 


       గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 


 *  ఉదరరోగ నివారణ కొరకు  - 


       ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 


 *  ఆహారం జీర్ణం అగుటకు  - 


       వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును . 


 *  కఫజ్వర నివారణ కొరకు  - 


       గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 


 *  వాంతుల నివారణ కొరకు  - 


        కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 


 *  కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు  - 


       కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 


 *  గుల్మ నివారణ కొరకు  -  


        కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 


 *  రక్తపిత్త రోగ నివారణ కొరకు  - 


        అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 


 *  ఉబ్బురోగం నివారణ కొరకు - 


     బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 


 *  వాతరక్త వ్యాధి నివారణ కొరకు  - 


     5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.


 *  అండవృద్ధి నివారణ కొరకు  - 


        గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 


 *  నేత్రరోగ నివారణ కొరకు  - 


        కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 


 *  పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు  - 


       కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును  . 


  గమనిక  - 


           అతిగా నడచినవాళ్లు , బలహీన శరీరం కలవాళ్ళు , చిక్కిన శరీరం కలవాళ్లు , ఉపవాసం వలన బలహీనపడిన వారు , శరీరం నందు అమిత వేడి కలిగినవారు , గర్భవతులు , రక్తం తీయబడిన వారు , రక్తస్రావం వలన ఇబ్బందిపడేవారు , హనుస్థంభ వాత రోగులు కరక్కాయను వాడరాదు. 


  పైన చెప్పినంత వివరణగా ఒక్కో మొక్క గురించి అత్యంత వివరణాత్మకంగా నేను రచించిన          " సర్వ మూలికా చింతామణి " అను గ్రంథము నందు ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథము నందు ఇచ్చినటువంటి యోగములు అన్నియు మా అనుభవపూర్వకములు . మొక్కలను సులభముగా గుర్తించుటకు మొక్కల రంగుల చిత్రములుతో ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథం మొత్తం 352 పేజీలతో మనం మాట్లాడుకునే సాధారణమైన భాషలో అందరికి సులభరీతిలో అర్థం అయ్యేలా ఇచ్చాను . ఎక్కడా గ్రాంధిక భాష ఉపయోగించలేదు . 


       సర్వమూలికా చింతామణి  గ్రంథము యొక్క విలువ  550 రూపాయలు కొరియర్ ఖర్చుతో కలుపుకుని . ఇతర రాష్ట్రాలకు 50 రూపాయలు అదనంగా 600 రూపాయలు అవుతుంది . గ్రంధములు కావాల్సినవారు 9885030034 నంబర్ నందు సంప్రదించగలరు . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


          అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034

26, జనవరి 2022, బుధవారం

గర్భగుడిని సందర్శించారా

ఎండకాలంలో చల్లగా, చలి కాలంలో వేడిగా ఉండే గర్భగుడిని సందర్శించారా?

-------------------------------------

ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. 


దాదాపు 1,500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. 


ఈ దేవాలయంలో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది.


నమో భావదేవాయ

ఇక ఈ దేవాలయంలో విగ్రహం మునికాళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది.


 ఇటువంటి విగ్రహం భారత దేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న మరో మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి వచ్చింది. 


ఇక మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం పూర్తి వివరాలు మీ కోసం...


అత్యంత ప్రాచీన దేవాలయం:

భావనారాయణ స్వామి దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారత దేశంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాలు.


 వీటి నిర్మాణం దాదాపు 1500 ఏళ్లకు పూర్వం జరిగిందని తెలుస్తోంది.

పంచ భావన్నారాయణ దేవాలయాలు

భావనారాయణ స్వామి దేవాలయాలు మొత్తం ఐదు.


 అందువల్లే వీటిని పంచ భావన్నారాయ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ ఐదు క్షేత్రాలు వరుసగా బాపట్ల, పొన్నూరు, భావరేవరపల్లి, సర్పవరం, పట్టిసీమ.

భావన్నారాయణుడి వల్ల భావపురి

మరికొంతమంది ఇందులో ప్రకాశం జిల్లాలోని పెద గజాం కూడా ఉందని చెబుతారు. 


వీటిలో ముఖ్యమైనది బాపట్ల. ఇక్కడ నెలకొన్న భావనారాయణ స్వామి వల్ల ఈ ఊరిని మొదట భావపురి అని పిలిచేవారు.


అటు పై బాపట్ల కాలక్రమంలో భావపురిగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడితో పాటు పరివార దేవతలైన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవారు, ఆళ్వారులు ఉన్నారు.


కాలి వేళ్ల పై నిలబడి:


ఇక్కడ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటారు.


 ఇలా ఓ దేవతా మూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించవు.


చలికాలంలో వెచ్చగా:


ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది. ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. 


ఆ ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు గజపాద (ఏనుగు కాలు) ఆకారంలో ఉండటం విశేషం.


చేప ఆకారంలో:


ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది. 


దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 594లో భావనారాయణుడి సూచనమేరకు చోళ రాజైన క్రిమికంఠ చోళుడు నిర్మించినట్లు చెబుతారు.


దేవరాయులు:


ఇతని తర్వాత చోళ భూపాల దేవుడు, వీర ప్రతాప శూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగ చోళదేవరాజు, గజపతులు, దేవరాయులు అటుపై అచ్చుత దేవరాయులు, సదాశివరాయులు ఈ ఆలయం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.


పునాదులు:


ఇదిలాఉండగా భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం జరిగే సమయంలో పునాదుల కోసం తవ్వుతుండగ అక్కడి వారికి జ్వాలా నరసింహ స్వామి విగ్రహం దొరికింది. 


దీంతో ఆ విగ్రహన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించేవారు.


పురోహితులు:


అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి. 


ఈ విషయమై క్రిమకంఠ చోళుడు అక్కడి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగారు.


జ్వాలా నరసింహుడు:


దీంతో పురోహితులు జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఆయన్ను శాంతింప చేయాలని నిర్ణయించారు.


 ఇందు కోసం స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.


అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు.


 ఇక జ్వాలా నరసింహుడి విగ్రహం ఆసీన రీతిలో ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి. పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.


ఎలా చేరుకోవాలి

బాపట్లకు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుంచి నిత్యం నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి.


 అదే విధంగా దక్షిణ భారతదేశంలోని చాలా నగరాల నుంచి రైలు సౌకర్యాలు ఉన్నాయి. బాపట్ల రైల్వే స్టేషన్ భావనారాయణ స్వామి దేవాలయం కేవలం అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఆటోలు అందుబాటులో ఉంటాయి.

లక్ష్యం

లక్ష్యం 

మనం చిన్నప్పటినుండి ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో  ఉంటాం. కొంతమంది వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు, కానీ కొంతమంది మాత్రం వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక నిరాశ చెంది జీవితం నిస్సారంగా గడపటం మనం చూస్తూవుంటాం.  ఇంకా కొంతమంది ఏదో చిన్న సమస్య వస్తేకూడా దానిని తట్టుకోలేక ఆత్మా హత్యలకు పాలుపడటం మనం రోజు చూస్తున్నాం.  నిజానికి ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి కానీ దానికి తగిన కృషికూడా ఉండాలి, అప్పుడే తానూ తన లక్ష్యాన్ని  చేరుకోలేస్తాడు. ఒక్క కృషి మాత్రమే కాదు దానికి తోడు తగిన ఇతర పరిస్థితులు కూడా సహకరించాలి. ఏ కొందరికో అన్ని పరిస్థితులు సహకరించి వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు.  ఒక విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలనేది సాధారణమైన లక్ష్యం అది మంచిది కూడా కానీ దానికి అతని కృషి ఒక్కటి ఉంటె చాలదు దానికి తోడు తల్లిదండ్రుల సహకారం అంటే అతనిని ఒక మంచి పాఠశాలలో చేర్పించటం, ట్యూషన్ పెట్టించటం మొదలైనవి చేస్తే అప్పుడు ఆ విద్యార్థి తాను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు.  అదే తల్లిదండ్రులు తిండి కూడా సరిగా పెట్టలేని పేదరికంలో ఉంటే ఆటను కనీసం పుస్తకాలుకూడా కొనుక్కొనెకపోతే ఆటను చదవటం చాలాకష్టం.  ఏ కొద్దిమందో అనేక శ్రేమదమాలకు ఓర్చి జీవితంలో పైకి రాగలరు. 

మనకు తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించగలరు కానీ నీవు ఫలానా లక్ష్యాన్ని చేరుకోవాలి అని చెప్పినా అది నీకు అంగీకారం కావచ్చు లేకపోవచ్చు.  

మన హిందూ సాంప్రదాయంలో ఒక విషయం ప్రస్ఫుటంగా కనపడుతుంది అదే ఆశావాదం.  ఆశావాది ఎప్పటికి తానూ జీవితంలో ఓడిపోడు.  మన పండగలు లేక మన ధర్మకార్యక్రమాలు అన్ని కూడా భగవంతుని పేరుమీద మనకు ఏర్పరచిన ఆరోగ్యకరమైన విషయాలే. ప్రతి పండగకు ఒక విశిష్టత ఉదాహరణకు వినాయకచవితిని తీసుకోండి మనం వినాయకుని 21 రకాల పత్రితో పూజిస్తాం అంటే పండగ జరుపుకునే పిల్లలకు పండాగాపేరుతో 21 రకాల మూలికలను పరిచయం చేయటమే వారు పత్రి సేకరణకు వెళ్లి స్వతహాగా వాటిని గుర్తుపట్టి తెగలరు. పండగ అనంతరం ఆ పత్రిని నీటిలో కలపటం వలన ఆ నీరు స్వచంగా మారుతుంది.  ఇదంతా ఆరోగ్యం కోసం అంటే ఎవరు చేయరు.  అదే దేముడి పేరుమీద ఎంతో ఉత్సాహంగా చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి క్రియకు ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. గుడిలో తీర్తం ఇచ్చేరప్పుడు 1) అకాల మృత్యు హరణం, 2) సర్వ వ్యాధి నివారణం, 3) సమస్త పాప క్షయకరం అని చెప్పి ఇవ్వటం వలన ఒక పాజిటివ్ ఆలోచన మనిషిలో కలగటమే కాక ఆ తీర్థంలో కలిపిన దీనిసులు మనిషికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. 

హిందూ సాంప్రదాయాలు మనుషులను ఒకరికి ఒకరు అండ దండగ వుండే విధంగా అందరి ఆరోగ్యం మంచిగా వుండే విధంగా మలచపడింది. మన మహర్షులు గొప్ప మేధావులు. మనకు మన జీవిత లక్ష్యం ఎలా ఉండాలో కూడా చెప్పారు. 

ఈశావాసోపనిషత్ లో వున్నా క్రింది విషయాన్నీ పరికించండి.

ద్వితీయ మంత్రము 

కుర్వన్నే వేహ కర్మాణి జిజీవి షేచ్ఛతన సమాః,

 ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే.

ఇహ=ఈ జగత్తు నందు; కర్మాణి శాస్త్ర నియత కర్మలను; కుర్వన్, ఏవ=(ఈశ్వరుని పూజకై)చేయుచునే; శతంసమా:=నూరు సంవత్సరములు; జీజీవి షేత్ = జీవింపకోరవలెను; ఏవమ్= ఈ విధముగా(త్యాగభావంతో పరమేశ్వరుని కొరకై); కర్మ= చేయబడుకర్మ; త్వయి=నిన్ను; నరే=మనుష్యుని యందు; న, లిప్యతే =బంధింపదు; ఇతః= ఈ మార్గముకంటే; అన్యథా= వేరొక మార్గము; న, అస్తి= లేదు; (మనుష్యుడు సమర్పణ భావముతో కర్మను చేయకుండా కర్మ నుండి ముక్తుడు కాగలిగే మార్గము మరొకటి లేదని భావము.) 

తాత్పర్యము: ఈ జగత్తునందు మానవుడు శాస్త్ర నియత కర్మలను ఈశ్వరపూజా సమర్పణ భావముతో చేయుచునే శత సంవత్సరములు జీవింప నభిలషింప వలెను. ఏలయన, ఈ విధంగా చేయబడు కర్మ అతనిని బంధింపదు. మానవున కింత కంటే వేరొక మార్గము లేదు.

వ్యాఖ్య: పూర్వ మంత్రము నందు చెప్పబడిన విధముగా జగత్తునకు ఏకైక కర్తయు, ధర్తయు, హర్తయు, సర్వశక్తిమంతుడు, సర్వమయుడునగు పరమేశ్వరుని సంతతము స్మరింపుచు, సర్వము అతనిదేనని తెలుసుకొని, ఆతని పూజకై శాస్త్ర నియత కర్తవ్య కర్మలను ఆచరించుచునే శత సంవత్సరములు జీవించుటకు నిచ్చగించుము. ఈ ప్రకారంగా మీ పూర్తి జీవితమును పరమేశ్వరుని కొరకు సమర్పింపుడు. శాసోక్తమైన స్వకర్మను ఆచరించుచు జీవనమును నిర్వహించుట కేవలము పరమేశ్వరుని పూజించుటకేనని, తనకొరకు గాదని, భోగముల ననుభవించుట కొరకు ఎంత మాత్రమూ కాదని తెలియవలెను. ఈ విధమైన వలన ఆ కర్మలు నిన్ను బంధనములో పడవేయజాలవు. కర్మ . నాచరించుచు కర్మతో బంధింపబడకుండుటకుగాను ఇదొక్కటియే చక్కని మార్గము. ఇది గాకుండా కర్మ బంధనము నుండి ముక్తుని జేయుటకు వేరొక మార్గము లేనేలేదు. (గీత.2-50, 51; 5-10) (2) ఆచరణ

సంబంధము: ఈ విధంగా కర్మఫలరూపమగు జన్మబంధము నుండి విముక్తమగు నిశ్చిత మార్గమును నిర్దేశించి, ప్రస్తుతము ఇందుకు విరుద్ధమైన మార్గము ననుసరించెడు మానవుల గతిని గూర్చి వర్ణించుచున్నారు -

ప్రతి మానవునికి బాల్యం నుండే మన ఇతిహాసాలు, భగవత్గీత, ఉపనిషత్తులు చదవటం వాటి అర్ధాలను గ్రహించటం నేర్పితే ప్రస్తుత తరం వాళ్ళు వారి జీవితాలను సుసంపన్నం చేసుకుంటారు.  ఎవరిలోనూ నిరాశ, నిస్పృహలు కలుగవు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గుతాయి.  సమాజం చక్కటి మార్గంలో ఉంటుంది.  అంతేకాదు పొలిసు స్టేషన్ల, కోర్టుల అవసరం మన సమాజానికి ఉండదు.  

కాబట్టి మిత్రులారా లేవండి నిద్రనుంచి మన ధర్మాచరణకు పూనుకోండి మీరు తరించండి ఎదుటివారిని తరింపచేయండి.  నిత్యం భగవతునిగూర్చి చింతన చేయండి. మీ జీవితాలను సార్ధకత చేసుకోండి. 

ఓం తత్సత్ 

తత్వమసి. 

ఓం శాంతి శాంతి శాంతిః

సమర్పణ భావముతో

 ద్వితీయ మంత్రము 

కుర్వన్నే వేహ కర్మాణి జిజీవి షేచ్ఛతన సమాః,

 ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే.

ఇహ=ఈ జగత్తు నందు; కర్మాణి శాస్త్ర నియత కర్మలను; కుర్వన్, ఏవ=(ఈశ్వరుని పూజకై)చేయుచునే; శతంసమా:=నూరు సంవత్సరములు; జీజీవి షేత్ = జీవింపకోరవలెను; ఏవమ్= ఈ విధముగా(త్యాగభావంతో పరమేశ్వరుని కొరకై); కర్మ= చేయబడుకర్మ; త్వయి=నిన్ను; నరే=మనుష్యుని యందు; న, లిప్యతే =బంధింపదు; ఇతః= ఈ మార్గముకంటే; అన్యథా= వేరొక మార్గము; న, అస్తి= లేదు; (మనుష్యుడు సమర్పణ భావముతో కర్మను చేయకుండా కర్మ నుండి ముక్తుడు కాగలిగే మార్గము మరొకటి లేదని భావము.) 

తాత్పర్యము: ఈ జగత్తునందు మానవుడు శాస్త్ర నియత కర్మలను ఈశ్వరపూజా సమర్పణ భావముతో చేయుచునే శత సంవత్సరములు జీవింప నభిలషింప వలెను. ఏలయన, ఈ విధంగా చేయబడు కర్మ అతనిని బంధింపదు. మానవున కింత కంటే వేరొక మార్గము లేదు.

వ్యాఖ్య: పూర్వ మంత్రము నందు చెప్పబడిన విధముగా జగత్తునకు ఏకైక కర్తయు, ధర్తయు, హర్తయు, సర్వశక్తిమంతుడు, సర్వమయుడునగు పరమేశ్వరుని సంతతము స్మరింపుచు, సర్వము అతనిదేనని తెలుసుకొని, ఆతని పూజకై శాస్త్ర నియత కర్తవ్య కర్మలను ఆచరించుచునే శత సంవత్సరములు జీవించుటకు నిచ్చగించుము. ఈ ప్రకారంగా మీ పూర్తి జీవితమును పరమేశ్వరుని కొరకు సమర్పింపుడు. శాసోక్తమైన స్వకర్మను ఆచరించుచు జీవనమును నిర్వహించుట కేవలము పరమేశ్వరుని పూజించుటకేనని, తనకొరకు గాదని, భోగముల ననుభవించుట కొరకు ఎంత మాత్రమూ కాదని తెలియవలెను. ఈ విధమైన వలన ఆ కర్మలు నిన్ను బంధనములో పడవేయజాలవు. కర్మ . నాచరించుచు కర్మతో బంధింపబడకుండుటకుగాను ఇదొక్కటియే చక్కని మార్గము. ఇది గాకుండా కర్మ బంధనము నుండి ముక్తుని జేయుటకు వేరొక మార్గము లేనేలేదు. (గీత.2-50, 51; 5-10) (2) ఆచరణ


సంబంధము: ఈ విధంగా కర్మఫలరూపమగు జన్మబంధము నుండి విముక్తమగు నిశ్చిత మార్గమును నిర్దేశించి, ప్రస్తుతము ఇందుకు విరుద్ధమైన మార్గము ననుసరించెడు మానవుల గతిని గూర్చి వర్ణించుచున్నారు -


25, జనవరి 2022, మంగళవారం

 లంజ అంటే ఏమిటి ? లంజలదిబ్బలని దేనికి పేరు ?

............................................................


(1) కొండవీడుకున్న మరోపేరు ఏమిటి ?


(అ) గోపినాథనగరం

(ఆ) రంగనాథనగరం

(ఇ) కొండవీటినగరం

(ఈ) కొండవీటిపురం


(2) గతంలో సబ్బిపురంగా ఏ గ్రామాన్ని పిలిచేవారు ?


(అ) అనకాపల్లి

(ఆ) సర్పవరం

(ఇ) మార్కాపురం

(ఈ) గుంటూరు జిల్లాలోని గోరంట్ల


(3) చికాకోల్ అనే పేరు ఏ గ్రామానికి వుండేది ?


(అ) శ్రీకాకుళం

(ఆ) చిలుకలూరిపేట

(ఇ) చిన్నకోడూరు

(ఈ) విజయనగరం


(4) పెనుకొండ ఓ పట్టణం, అది ఏ జిల్లాలో వుంది ?


(అ) పశ్చిమగోదావరి

(ఆ) అనంతపురం

(ఇ) కృష్ణా

(ఈ) చిత్తూరు


(5) దిగువ తిరుపతి అనే వైష్ణవక్షేత్రమెక్కడుంది ?


(అ) ద్వారకాతిరుమల

(ఆ) మంగళగిరి

(ఇ) యాదగిరి

(ఈ) పెంచలకోన (నెల్లూరుజిల్లా)


(6) దుగరాజపట్నం నెల్లూరుజిల్లాలో సముద్రతీరస్థగ్రామం. బ్రిటిష్ ఇండియాలో దీని పేరేమిటి ?


(అ) ఆర్ముగం

(ఆ) ఇంగ్లీష్ పేట

(ఇ) కేప్టన్ పేట

(ఈ) ఈస్ట్ పోర్ట్


(7) విజయవాడ సమీపంలోని గ్రామంపేరు గంగూరు. గంగ + ఊరు = గంగూరు. దీని పూర్వనామమేమిటి ?


(అ) లంజకాలువ

(ఆ) లంజలంక

(ఇ) లంజలదిబ్బ

(ఈ) లంజలపురం

ఇక్కడ లంజ అంటే వేశ్య అని అర్థం కాదు.లంజ అంటే వంకరగా ప్రవహించు ఏరు. వేశ్యకూడా వంకర గమనంతో ప్రవర్తిస్తుంది కాబట్టి వేశ్యను లంజని అంటారు.

కొన్ని చోట్ల శిథిల బౌద్ధ ఆరామాలను లంజలదిబ్బలంటారు. ఉదా॥అమరావతి స్థూపప్రాంతం.


(8) పెనుగొండ ఒక పట్టణం. ఇది ఏ జిల్లాలో వున్నది ?


(అ) పశ్చిమగోదావరి

(ఆ) అనంతపురం

(ఇ) కృష్ణా

(ఈ) నెల్లూరు


(9) గుంటూరుజిల్లాలోని అమీనాబాదు కు అసలైన మొదటి పేరేమిటి ?


(అ) ములుగుపాడు

(ఆ) ముల్లంగూరు

(ఇ) చిన్నములుగు

(ఈ) ములుకులూరు


(10) చిన్నజియ్యర్ స్వామివారి ఆశ్రమం ముచ్చింతలలో వుంది. వార్తాపత్రికలు TV ఛానెల్లు ముచ్చింతల్ అని సంబోధించడం వలన అర్థం మారిపోయింది. ముచ్చింతల అనే పలకాలి వ్రాయాలి. ముచ్చింతలనే పేరు కలగటానికి కారణం ?


(అ) ఒకప్పుడు ఇక్కడున్న మూడు చింతచెట్ల వలన

(ఆ) ఇక్కడున్న ముగ్గురు తాత్విక చింతనాపరుల మీదుగా

(ఇ) ముచ్చింతలనే గడ్ది విస్తారంగా పెరుగుట వలన

(ఈ) మూడుచింతలనే వ్యక్తి పేరు మీదుగా


మార్చి నెలలో ఇక్కడ రామానుజుల వారి భారీ పంచలోహ విగ్రహం ప్రారంభానికి సిద్ధంగా వుంది.

.................................................................జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

ఉన్నతమైన వ్యక్తి

 కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి 


అవునండి కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు 

యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య 


కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో కృష్ణుడు కర్ణుడిని వెళ్ళి ఒక కోరిక అడిగాడు 


కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు 

కర్ణుడు కృష్ణుడు అడగగానే దానం చేసేసాడు 


అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు 


అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు 

ఒకవేళ అలా ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు 


ఆ మాట  వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి 

ఇంతమంచి వాడి వేంటయ్యా కర్ణా నువ్వు అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు 


మనం మంచి మనసున్న వారిమైతే  చాలండి 

దేవుడి మోక్షం కోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదండీ 

జీవితం ముక్తి పొందడం కోసం దైవదర్శనాలు అంటూ తిరగక్కరలేదండి 


మంచి మనసుంటే చాలండి ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు 


కర్ణుడంత కరుణామయులం కాకపోయినా ఏదో ఆయన చిటికిన వేలంత మంచిగా బతికేద్దాం అండి 

కృష్ణుడు మనకోసం రాకపోయినా నెమలి పింఛాన్నైనా రప్పించేసుకుందాం అండి మనం...🙏 


సర్వే జనాః సుఖినో భవంతు

పాపేన జాయతే

 పాపేన జాయతే వ్యాధిః పాపేన జాయతే జరా | పాపేన జాయతే దైన్యం దుఃఖం గోకో భయంకర!|| తస్మాత్ పాసం మహావైరం దోషబీజ మమంగళమ్ |


భారతే సంతతం సన్తో నాచరని థయాతురా! " “పాపములే రోగములకు, వృద్ధావస్థకు, నానావిధ విఘ్నములకు బీజ ములు. పాపములవలననే దైన్యము, దుఃఖము, రోగములు, వార్ధక్యము, భయంకుశోకములు నుత్పన్నములు కాగలవు. అందువలననే భారతవర్ష మింకు వివేకవంతు లై నమహాత్ములు భయముతో నెన్నడును బాపముల నాచరింపరు. ఎందువలె ననగా


నాపాపములు మహా నైరముల నుత్పశ్నముచేయగలవు. పాపము లేదోషములను బీములై , యమంగళకారకములు కాగలవు.


స్వధర్మాచరణమం.కు సంలగ్నలై యున్న వాహి, భగవంతుని మంత్రపేక్ష వహించినవారు, శ్రీహరిసమారాధనము కంచు పంలగ్ను లై యున్న వారు, తలిదండ్రులను, గురువును, దైవమును, నతిథులను, భక్తితో సేవించు వారు, తపమ నం దాసక్తి కల్గియున్న వారు, వ్రతాపవాసముల నాచరించువారు, సదా తీర్థ సేవన మొనరించువారు నగుమానవులను గాంచి గరుత్మంకు భయము వలవ పలాయనముచి త్తగించునురగములవలె ఆగములు పాతిపోగలవు. అట్టి

ఉత్తిష్ఠత

 వరాన్ని బోధత |


ఉత్తిష్ఠత జాగ్రత క్షురస్య ధారా నిశితా దురత్యయా


ప్రాప్య


దుర్గం పథస్తత్కవయో వద9 | 14 |


ఉత్తిష్ఠత = లేవండి; జాగ్రత = మేల్కొనండి; వరాన్ ప్రాప్య = గొప్ప గురువులను ఆశ్రయించి; నిబోధత = తెలుసుకోండి; క్షురస్య ధారా = అంచువలె; నిశితా = తీక్షమైనది; దురత్యయా = దాటడానికి కష్టమైనది; దుర్గం = పొందడానికి కష్టమైనది; పథః = మార్గము; తత్ = (అనే) దానిని; ;


కవయః = జ్ఞానులు; వదంతి = చెప్పుదురు. ; .


తా|| లేవండి! (అజ్ఞానమనే నిద్రనుండి), మేల్కొనండి! ఉత్తమ గురువులను సమీపించి ( జ్ఞానాన్ని) తెలుసుకోండి. ఈ మార్గం కత్తి అంచువలె తీక్షమైనది, కష్టంచే దాటదగినది, కష్టంచే పొందదగినదని పండితులు చెబుతారు. తా

24, జనవరి 2022, సోమవారం

విశాఖపట్నం జిల్లా కోర్టులో

 ఎప్పుడో వంద సంవత్సరాలు పైగా కిందటి విషయం.

...........................వ్యవహారం కోర్టు కెక్కింది.

విచారణా జరిగింది విశాఖపట్నం జిల్లా కోర్టులో.

.............................

ఇంతలో  జడ్జీ వచ్చాడు. జడ్జి యూరోపియన్.  వారందరూ లేచినుంచున్నారు.

జడ్జీ గద్దెయెక్కాడు. బిలబిల్లాడుతూ వారూ కూర్చున్నారు.

కూచున్నారు;  గాని  మళ్ళీ లేచినుంచున్నారు వెంటనే.

పిడపర్తి పెద్ద దక్షిణామూర్తి  శాస్త్రిగారు హాల్లో ప్రవేశించారు, మరి.

చూడగా,  బ్రహ్మవర్చస్సు మూర్తీభవించిన ట్టున్నారు వారు.

అది చూసి చకితుడైనాడు;  కాని '' యేం లేచారూ?"  అనడిగాడు వకీళ్ళను జడ్జి.

''అరుగో, వారు దయచేశారు.  దైవజ్ఙులు  వారు.  దైవం  తరువాత  మాకంతటివారున్నూ. అలాంటివారికి ప్రత్యుత్థానం  చెయ్యడం  అనివార్యం  మాకు''  అని  బదులుచెప్పారు వకీళ్ళు, తమ నాయకుని పరంగా.''అలాగా?"  అన్నాడు జడ్జి,  జిజ్ఙాసతో.

యూరోపియను  అతడు.

తా  నిది అర్థంచేసుకోలేడు;  గాని  మనస్సు  గుబగుబలాడిపోయింది, తానూ లేచేశా డనుకోకుండా..

''వారి  విశిష్టత  యేమిటీ?"  అనిన్నీ  అడిగాడు, లేస్తూనే.

''సర్వజ్ఙులు వారు.  ధర్మనిరతులు..  జ్యోతిశ్శాస్త్రం  వారికి కరతలామలకం. వారు పంచాంగం  చేస్తారు,  దృక్సిద్ధంగా వుంటుం దది.  జాతకాలు రాస్తారు, వొక్కక్షరమున్నూ బీరుపోదు. ప్రశ్నలున్నూ చెబుతారు, వారిమాట  జరిగితీరుతుం'' దన్నారు వకీళ్ళు.

జడ్జి  బుద్ధి  చమత్కృతం  అయింది,  దీంతో.

''ఒక్క ప్రశ్న  అడగవచ్చునా?"   అనడిగా డతను.

''అడగ''  మన్నారు వకీళ్ళు,  శాస్త్రిగారి  యింగితం కనిపెట్టి.

'' నేను కోర్టుకి  బయలుదేరేటప్పడు  మా  ఆవు  ఈనడానికి  సిద్ధంగా వుంది.  అది పెయ్యను  పెట్టిందా, కోడెను  పెట్టిందా?  ఇది  చెప్పమనండి.''

వారి సంస్కృతి  అలాంటిది.

ప్రత్యక్షమే  వారికి  ప్రమాణం, మరి.

''యదృశ్యం  తన్నశ్యం''  అంటే నమ్మరు వారు.

''కాగితం  మీద  రాసియిస్తాను. పైకి చెప్ప''  నన్నారు  శాస్త్రిగారు.

లగ్నం కట్టుకుని  ఆలోచించి రాసి యిచ్చారు.

అది టేబులుమీద  పెట్టుకుని  నౌకర్నింటికి  పంపాడు దొర.

శాస్త్రిగారి  ముఖం మిక్కిలి గంభీరంగా భాసిస్తోంది;  కాని మనం యేమయిపోతామో?"  అంటూ  ఆందోళనపడసాగారు, వకీళ్లు.

అటు  నౌకరు వచ్చాడింతలో, ఇటు దొర  కాగితం తీశాడు  చురుగ్గా.

బెంచిక్లార్కు  అనువదించాడు.''సెబాస్, సరిపోయింది''  అన్నాడు దొర.

అన్నాడు కాని, వొక సందేహం పుట్టుకు వచ్చిం దతనికి - "మన మిటు నౌకర్ని పంపినట్లే,  వకీళ్ళున్నూ తమ నౌకర్ని పంపివుండగూడదూ నా యింటికి?" అని.

సిద్ధాంతాలు  ఎంత మంచివయినా  అవి  ప్రత్యక్షప్రమాణంతో రుజువయితే గాని  ముందుకు వెళ్ళరు వారు. వారి భౌతిక విజయాల కిదే కారణం.

చూసిచూసి  ''యింకొక టడగవచ్చునా?"  అనడిగా డతను.

వకీళ్ళకి నిశ్చింత.

''వో, అడగవచ్చు'' నన్నారు  వారు.

''ఈ  హాలుకి  నాలుగు ద్వారాలున్నాయి.  కోర్టుపని  ముగించుకుని బయటికి వెళ్ళేటప్పుడు నేనే ద్వారంనుంచి వెడతానూ?  ఇది రాయమనం''  డన్నాడు  దొర.

శాస్త్రిగారు రాసి వకీళ్ళ కిచ్చారు.

ఒక కవరులో వుంచి అతికించి అది దొర కందించారు వకీళ్ళు, ధీమాగా.

దొర  జేబులో  పెట్టుకున్నా డది. వ్యవహారం ప్రారంభం అయింది. అయిదింటికి పూర్తీ అయింది. అందరూ లేచారు.

వెనక ద్వారాన తన ఛాంబర్సులోకి వెళ్ళిపోవలసిన దొర  అందరి మధ్యకీ వచ్చాడు, 

హాల్లోకి.విషమసమస్య  ప్రారంభ మయినట్టయింది, దాంతో.

నీరవు లయిపోయారు వకీళ్ళు;  కాని దొర మాత్రం సావధానుడయినాడు, చురుగ్గా చూస్తూ.

.     ...       ....     ....      ..  

కాగా - "ఏగుమ్మాన వెడతాడో?"  అనుకుంటూ  ఆత్రంగా వున్నారు వకీళ్ళందరూ;

 కాని  వుడతలాగ వొక  కిటికీలోనుంచి బయటకు దూకేశాడు దొర  ''రండి'' అని వకీళ్ళను పిలుస్తూ. అందరూ తెల్లపోయారు.

దొర కవరు తీశాడు, కవరులోనుంచి కాగితమూ తీశాడు, అన్యమనస్కంగా 

ఆ  కాగితం అతని చేతిలో వుండగానే ఆంగ్లంలోకి అనువాదం చేసి  చదివేశాడు బెంచిక్లార్కు.

''వొక  కృత్రిమద్వారంలోనుంచి బయటి కురుకుతావు'' అని.

తుళ్ళిపడ్డాడు దొర.ఎగిరి పడ్డారు వకీళ్ళు.

(శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి స్వీయచరిత్ర నుండి కొన్ని భాగాలు)


విశ్వనాథం ఉపద్రష్ఠ గారి పోస్ట్

23, జనవరి 2022, ఆదివారం

కాంచనమయ వేదికా

 *కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు*

_________________________________


(1) అర్జున - తెల్లనిది. అర్జునుడు అనగా తెల్లని శరీరచ్ఛాయకలవాడని అర్థం.


(2) కమ్మ అనగా చెవికమ్మ. ఇంకా ఒకప్రాంతంలో అనగా కమ్మనాడులో  నివసించిన జనులకు కలిగిన పేరు > జాతిబేధము. పత్రిక, మంచిరుచి (కమ్మనైన భోజనము), మట్ట (కొబ్బరిమట్ట), తాటియాకు, ప్రియమైనది, మంచివాసన (కమ్మనైన వాసన), అందము అనే అర్థాలువున్నాయి.


(3) కనిగిరి > కన్నియగిరి > కన్నియ అనగా చిన్నది, కొత్తది, పెండ్లికాని యువతి అనే అర్థాలున్నాయి.గిరి అంటే కొండ. చిన్నకొండ దగ్గర వెలసిన గ్రామం కాబట్టి ఆ గ్రామానికి కన్నియగిరి అనే పేరు కలిగింది.  కన్నియగిరి > కన్నిగిరి > కనిగిరి అయింది. ఇలా అ కార మ కారాల ఒత్తులను లోపింపచేసి పలుకడం వలన అచ్చమ్మపేట > అచ్చంపేటగాను, రాజమ్మపేట > రాజంపేటగాను, గంగమ్మపల్లి > గంగంపల్లిగాను, జానకమ్మపేట > జానకంపల్లిగాను మారాయి.


(4) చాండాలి > చాండాలిక > అనగా దుర్గాదేవి.చండాలురు > దుర్గాదేవి సంతతివారు > పూజ్యనీయులు.


(5) తార  అంటే ఓంకారమనే అర్థముతోపాటు కంటిలోని నల్లగుడ్డు, నక్షత్రమనే అర్థాలున్నాయి.

బృహస్పతి భార్యపేరు తార

వాలిభార్య పేరు తార


(6) బుద్ధఘోష అనగా పాళీ భాషలో బుద్ధుని పలుకులు.(Voice of Buddha) అని అర్థము. 5 వ శతాబ్ది (ACE)లో

బుద్ధఘోషుడు భారతదేశం / మగధదేశంలోని బుద్ధగయ వద్ద గల బ్రాహ్మణకుటుంబంలో జన్మించాడు.

శ్రీలంకకు వెళ్ళి అనురాధపురంలో స్థిరపడ్డాడు. బౌద్ధములోని తెరవాద శాఖకు చెందినవాడు.

తెరవాద సిద్ధాంతము ప్రకారం మనిషి శీలవంతుడు కావటానికి 7 మార్గాలను బోధించాడు. అవి (అ) శీలవిశుద్ధి అనగా ప్రవర్తనను పవిత్రంగా వుంచుకోవడం (ఆ) చిత్తవిశుద్ధి అనగా మనస్సును స్వచ్ఛంగా వుంచుకోవడం (ఇ)  విత్తివిశుద్ధి అనగా మనదృష్టిని సక్రమంగా వుంచుకోవడం (ఈ) కంక వితరణ విశుద్ధి అనగా సందేహాలను శంకలను అధిగమించడం > అనుమానం లేకుండా జీవించడం.(ఉ) మగ్గమగ్గ నాశనదస్సన అనగా మంచిదృష్టిని జ్ఞనాన్ని కలిగివుండడం. ఏది మంచో ఏది చెడో గ్రహించడం.(ఊ) శంకపురేక్క నాన అనగా కష్టమొచ్చినా సుఖం కలిగినా స్పందించకపోవడం., స్థితప్రజ్ఞత కలిగివుండటం (ఎ) నానాదశన విశుద్ది అనగా రకరకాల దర్శనాలపట్ల అవగాహన కలిగివుండడం. దర్శనాలు అనగా సిద్ధాంతాలు.


(7) నాస్తికుడు అనగా ఈ ప్రకృతి నిజం, కనబడుతున్న ప్రపంచం నిజమని, పరలోకంకాని పరలోక దేవుడు కాని లేనేలేవడనేవాడు.


(8) నీలిధ్వజుడు > నల్లటి తాటిచెట్టును ధ్వజముగా కలవాడు > భీష్ముడు.

ఉత్తరగోగ్రహణ సమయంలో బృహన్నల (అర్జునుడు) ఉత్తరకుమారునికి యుద్ధంలో తాను ఎదుర్కొబోయే కురుసైన్యం వారి జెండాలగురించి తెలిపాడు. ఈ అద్భుతపద్యభాగాలను తిక్కన అత్యంతద్భుతంగా మలిచాడు. మచ్చుకు...


*కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు* - *కలశజుండు*

*బంగారు రంగుతో చేసిన వేదిక మీద ప్రకాశిస్తున్న జెండా కల రథం మీద ఉన్నవాడు*

*కలశజుండు* *(కుండలో పుట్టిన వాడు ) : ద్రోణుడు*


*"సింహ లాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు "* -

*సింహపు తోకతో అలంకరించి ఉన్న రథంపై విరాజిల్లుతున్నవాడు ద్రోణసుతుడు అశ్వత్థామ.*


*"కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబు వాఁడు కృపుఁడు "* -

*బంగారు ఆవు-ఎద్దుల జంట గుర్తుగా కలిగినవాడు కృపుడు.*


*"లలితకంబు ప్రభాకలిత పతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు "* -

*"లలితంబుగా ప్రభావితమౌతున్న శంఖం పతాకముగా కలవాడు రాధ కుమారుడు కర్ణుడు.*


*"మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాఁడు కురుక్షితిపతి "* -

*"మణులతో పొదిగిన పడగ గల నాగు పాము పతాకముగా కలవాడు కురు క్షితి పతి.. దుర్యోధనుడు.*


*"మహోగ్ర శిఖర ఘన తాళతరువగు సిడమువాఁడు సురనదీసూనుడు"* -

*బ్రహ్మాండమైన తాళవృక్షం జెండాగా ఉన్నవాడు*

*సురనదీసూనుడు.. సురనదీ : గంగాసూనుడుకొడుకు* *భీష్మాచార్యుడు.*


*ఏర్పడఁజూచికొనుము : బాగా తేరిపార చూడు*


*కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు.*

॥సేకరణ॥

___________________________________________జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

తెలుగు భాష

 _*తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. తెలుగు మాతృ భాషగా ఎవరికి వున్నదో,  తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.*_


1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.


2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది. మొదటి లిపిగ కొరియన్ భాష.


3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.


4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.


5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.


6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .


7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.


8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.


9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.


10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.


11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.


12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.


13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.


14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.  కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.


15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.


16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

 

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన.  ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 


తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం

చింతామణి నాటకానికి గ్రహణం

 *తెలుగు నాటకరంగానికి' బ్లాక్‌ డే….!!


*నూరేళ్ళ చింతామణి నాటకానికి గ్రహణం…!!


*ప్రజాస్వామ్యంలో కూడా ఫ్యూడల్ మనస్తత్వం..!!


*నాటకాన్ని నిషేధించినవారు..కాళ్ళకూరివారి చింతామణి 

 ని అసలు చదివారా?


*నాటక ప్రదర్శనలో బలవంతంగా 'జొప్పించిన' బూతు

 ను నిషేధించాలా? లేక సందేశాత్మక నాటకాన్ని  నిషేధిం

 చాలా?


*కాళ్ళకూరి వారి చింతామణి లో "బూతెక్కడ " వుంది?


*సంస్కరణ వాదానికి అద్దంపట్టిన చింతామణిని 

 నిషేధించి సమాజానికి మనం ఇచ్చే మెసేజ్ ఏమిటి?


*నేటి సినిమాలు,సీరీయళ్ళలోని బూతులు,ద్వంద్వార్ధాలు

కాళ్ళకూరి చింతామణిలో లేవు కదా?


*రోగం ఒకచోట ..వైద్యం ఇంకోచోటనా? నిషేధం అర్థంలేని నిర్ణయం కాదా?


నిజానికి చింతామణి నాటకంలో వున్నదేంటి..?


ఇక చదవండి...ఆలోచించండి..!!  


*చింతామణి కూడా ఓ సంస్కర్త..!!


ఈతరం వారు మిస్సవుతున్న నాటకరాజం….

కాళ్ళకూరి వారి “చింతామణి “.!!


“చింతామణి “, పేరు వినగానే నొసలు చిట్లించుకుంటాం.

రామ ! రామ ! అంటూ చెవులు మూసుకుంటాం.ఆ పేరు వింటేనే ఏదో పాపం చేసినట్లు ఫీలవుతాం.వాస్తవానికి చింతామణి ఓ సంస్కర్త.వేశ్యాకులంలో పుట్టి వేశ్యావృత్తిని స్వీకరించినా చివరకు  తప్పును తెలుసుకొని తన్నుతాను

సంస్కరించుకుంటుంది.వేశ్యాలోలత్వం మంచిది కాదని సమాజాన్ని మేల్కొలుపుతుంది.వేశ్యగా తాను సంపాదిం

చిన ధనరాశుల్ని తిరిగి వాపసు చేస్తుంది.యోగినిగా మారి

పోయి భగవధ్యానంలో తరిస్తుంది.


*ఎవరీ చింతామణి ?


కాళ్ళకూరు నారాయణరావు రాసిన “చింతామణి"నాటకం

లోని నాయిక పేరే చింతామణి.సమాజసంస్కరణ కోసం ప్రధానంగా వేశ్యపాత్రను సృష్టించడం ఆరోజుల్లో కొత్తేం కాదు.గురజాడ అప్పారావుగారితో నాటకాల్లో ఈ ధోరణి అలవడింది. కన్యాశుల్కంలో జగమెరిగిన జాణ “మధుర

వాణి”పాత్రను సృజించి అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ ను ప్రవేశ పెట్టారు గురజాడ.అప్పటినుండి వేశ్య పాత్రల్ని జొప్పించి

నాటకాలు రాయడం అలవాటుగా మారింది.కాళ్ళకూరి వారు కూడా గురజాడ వారి బాటలో మరో అడుగు

ముందుకేసి “చింతామణి “ పాత్రను ఓ సంస్కర్తగా,ఆదర్శ నారిగా తీర్చిదిద్దారు.అప్పట్లోసమాజంలో వేళ్ళూనుకున్న వ్యభిచార దురాచారాన్ని ' కాంతాసమ్మితంగా ‘ రక్తికట్టించి ప్రేక్షకుల పై బలమైన ముద్ర వేశారు.జనాన్ని ఆలోచించేలా చేశారు.


కాళ్ళకూరు వారి చింతామణి ఏ సంఘ సంస్కర్త కంటే ..

తక్కువ కాదు.చింతామణి తన కులవృత్తిని స్వీకరించినా,

చివరకు బుద్ధి వికసించి,బురదలోని పద్మంలా ప్రకాశించిం

ది.ఒక మంచి నాటకం ప్రజల ఆలోచనా విధానంలో

మార్పు తెస్తుందనడానికి చింతామణి నాటకం ఓ చక్కని ఉదాహరణ.మనుషుల్లో సహజంగావుండే వేశ్యా వ్యామో

హం పట్ల కళ్ళు తెరిపిస్తుందీ నాటకం.అంతే కాదు వేశ్యా సంపర్కం పట్ల జుగుప్సను,విముఖతను కూడా కలిగి

స్తుందీ నాటకం!


 “జీవితమే ఓ నాటక రంగం...మనమంతా పాత్రధారులం “అని   ప్రముఖ నాటక కర్త షేక్స్పియర్ అన్నమాటలు చింతామణి నాటకానికి బాగా వర్తిస్తుంది.జీవితమనే 

నాటక రంగంలో చింతామణి ఒక  పాత్ర మాత్రమే.ఆ పాత్ర

ద్వారా సమాజంలో పాతుకుపోయిన ఓ దురాచారానికి చరమగీతం పాడాలని ఆశించాడు ఈ నాటక రచయిత కాళ్ళకూరి .


చింతామణి నాటకం అనేసరికి బూతులబుంగ,ముతక 

హాస్యం,అన్న ఓ అపప్రథ వుంది.నిజానికి ఈ నాటకం ఆద్యంతం ఎక్కడా బూతు లేదు.అర్వపల్లి సుబ్బారావు, గండికోట జగన్నాథం లాంటివృత్తి కళాకారులు కొందరు సందర్భాన్ని బట్టి,ప్రదర్శన ప్రాంతాన్ని బట్టి మూలంలో లేని బూతు సంభాషణల్ని,ముతక హాస్య, సన్నివేశాల్ని జొప్పిం

చారు.దీంతో చింతామణి అంటే ఓ చవకబారు నాటకం,

సంస్కారవంతులెవరూ చూడ కూడదన్న అపోహ నెల

కొంది.నిజానికి కాళ్ళకూరి వారి చింతామణి నాటకం ప్రదర్శన యోగ్యమైంది.పండిత,పామర జన రంజకమైంద

నడంలో ఎటువంటిసందేహం లేదు.


*ఇతివృత్తం…!!


బిల్వమంగళుడు,రాధ ఆదర్శ దంపతులు.దామోదరుడు బిల్వమంగళుడి మిత్రుడు.తండ్రి వార్థక్యంవల్ల బిళ్వ మంగ

ళుడు వ్యాపారభారాన్ని నెత్తినేసుకుంటాడు.అదే నగరంలో చింతామణి అనే వేశ్య వుంటుంది!ఆమె తల్లి  శ్రీహరికి డబ్బు పిచ్చి.చింతామణి  అందచందాల్ని వలగా విసిరి విటుల్నిఆకర్షించి వారివద్దనుంచి 💰 డబ్బు గుంజేది.

భవానీ శంకరం,సుబ్బిశెట్టి వంటి వారు ఇలా చింతామణి

 మోజులో పడి తమ సర్వస్వం కోల్పోతారు.


వ్యాపారంలో లక్షలు గడిస్తుప్న బిల్వమంగళుడిపై చింతా

మణి దృష్టిపడుతుంది.బిల్వ మంగళుడు సదాచార సంప

న్నుడు.నగరంలోమర్యాదస్తుడు.పెద్దమనిషి.బిల్వమంగళుడ్ని ఎలాగోఅలాగుతన దగ్గలకు తీసుకువస్తే కొంత సొమ్ము 

ముట్టజెబుతానంటూ చింతామణి భవానీ శంకరాన్ని

ప్రలోభ పెడుతుంది.భవానీ శంకరం మొత్తానికిబిల్వమంగ

ళుడ్ని తీసుకువచ్చి చింతామణి కి పరిచయం చేస్తాడు.

చింతామణి అందచందాలు,నాట్య విన్యాసాలు చూసి ముగ్ధుడైపోతాడుకట్ చేస్తే..చింతామణి మాయలో పడి ఉన్నదంతా చింతామణికిమర్పించుకుంటాడు . బిల్వ

మంగళుడు.సమాజంలో పరువు ప్రతిష్టలు దిగజారిపో

తాయి.పండంటి కాపురం కూలి పోతుంది.భార్య రాధ 

పరిస్థితి అత్యంత దయనీయంగా తయారవుతుంది.


డబ్బులేదని తమ ఇంటికిరావద్దంటుంది చింతామణి

తల్లి శ్రీహరి.ఉన్నదంతా మీకే ఊడ్చి ఇచ్చానుగాఅంటా

డు బిల్వమంగళుడు.అయినా డబ్బులేకండా రావడానికి వీల్లేదంటూ తెగేసి చెబుతుంది శ్రీహరి.ఇక చేసేది లేక డబ్బుకోసం ఇంటికొస్తాడు  బిల్వమంగళుడు.


వేశ్యా వ్యామోహం  వదులుకోమంటాడు  తండ్రి.  బిల్వ

మంగళుడు ‌తండ్రి మాటల్ని పెడచెవిన పెడతాడు.దీంతో మిగిలిన ఆస్తుల్ని కోడలు రాధ పేర రాసి మరణిస్తాడు బిల్వమంగళుడి తండ్రి.చివరకు తనపేర వున్న ఆస్తిని కూడా  భర్తకే రాసి ఇచ్చేస్తుంది రాధ.


*కామాతురాణాం…..!!


తన తండ్రి ఇంట్లో శవంగా పడివున్నా పట్టించుకోడు.

దహన సంస్కారాలను చేయకుండా ఆస్తిపత్రాలను

తీసుకొని అంత రాత్రి పూట చింతామణి దగ్గరకు బయ

లుదేరుతాడు.వర్షం జోరుగాకురుస్తుంటుంది నది ఒడ్డున వున్న చింతామణిని చేరాలంటే నావ అవసరంవుంటుం

ది.అయితేఅంత రాత్రి నావ ఎక్కడ  దొరుకుతుంది?

అందుకే నదిలో దూకి ఈదటం మొదలుపెడతాడు.

ప్రవాహవేగం  ఎక్కువగా వుండి కొట్టుకుపోయే పరిస్థితి కలుగుతుంది.ఇంతలో ఓ ఆధారందొరుకుతుంది.దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరతాడు.తీరా చూస్తే తాను పట్టుకున్న ఆధారం ‘శవం ‘అని తెలుస్తుంది.”కామాతురాణాం..న భయం..న లజ్జ “ అని ఊరికే అన్నారా? బిల్వమంగళుడి

పరిస్థితీ అదే.


ఈలోగా….,


ఈలోగా అక్కడ చింతామణి కి జ్ఞానోదయంఅవుతుంది.

వేశ్యావృత్తిని మానేస్తుంది.దైవారాధనలోకాలం గడుపు

తుంటుంది.ఈ విషయం బిల్వమంగళుడికి తెలీదు!.

ఆస్తిపత్రాలతో చింతామణి ఇంటికి చేరుకుంటాడు... బిల్వమంగళుడు.!


*అక్కడి వాతావరణమే వేరు.!!


బిల్వమంగళుడికి చింతామణి ఇంటి వాతావరణం వేరు

గా కనిపిస్తుంది .గతంలో మాదిరిగామల్లెలు,పన్నీరు, సుగంధాలు కనబడవు.కేవలం  బదులు అగరొత్తుల వాసన మాత్రం వస్తుంటుంది.రసిక,సంగీత నాట్యాలకు బదులు వైరాగ్య భరితమైన మీరా భజనలు వినిపిస్తుం

టాయి.బిల్వమంగళుడికిదేం అర్థం కాదు.మతి పోతుంది.

అసలు తానొచ్చింది చింతామణి ఇంటికేనా? అన్న అను

మానం కలుగుతుంది.


చింతామణి వుండే గదిలోకి వెళతాడుబిల్వమంగళుడు.

అక్కడ చింతామణిని చూసి అవాక్కవుతాడు.పట్టు చీర 

కట్టుకొని ఒంటినిండా భరణాల్ని ధరించి,సిగలోమల్లెచెండు 

తురిమి,తనను సరస సల్లాపాలతోతనను కవ్విస్తూ,సుఖ

భోగాలతో అలరించే అపూర్వఅందాలరాసి...నారచీర

కట్టి,నుదుట విభూతితో,ఏక్ తారను మీటుతూ మీరా భజన ఆలపిస్తుంటుంది. చింతామణిని ఇలా చూసి జీర్ణించుకో లేక పోతాడు.బిల్వమంగళుడు.అయితే ….

బిల్వమంగళుడ్ని దగ్గరకు పిలిచి ఓదారుస్తుంది చింతా

మణి.తనలో కలిగిన ఈ ఆథ్యాత్మిక మార్పును తెలియ

జేస్తుంది!అశాశ్వతమైన శారీరక ఆనందం కంటే ఆత్మానం

దం గొప్పదనిచెబుతుంది.బిల్వ మంగళుడికి కనువిప్పు కలుగుతుంది.బిల్వమంగళుడికి సోమగిరి యోగితో పరిచయం కలుగుతుంది. ఆ యోగి దగ్గర శ్రీకృష్ణ మంత్రో

పదేశాన్ని పొంది సన్యాసిగా మారిపోతాడు.ఆయోగి వెంటే 

వెళ్ళిపోతాడు బిల్వమంగళుడు.” దైవభక్తే మానవజీవితా

నికి మోక్ష సాధన “, అన్న సందేశంతో నాటకంముగుస్తుం

ది.వేశ్యావ్యామోహం పట్ల ప్రేక్షకులకు / పాఠకులకుఛీత్కా

రం కలుగుతుంది.


*చింతామణి వ్యక్తిత్వం..!


చింతామణి అందాల రాసి.సకల విద్యలు నేర్చిన నెరజా

ణ.సంగీత,సాహిత్యాల్లో నిష్ణాతురాలు.నాట్యంలోమయూ

రి.లోకానుభవానికి కొదవే లేదు.అయినా కులవృత్తి రీత్యా

సానికాక తప్పలేదు!కులవృత్తి లోకాచారమే కదా ! అని సరిపెట్టుకుంది.వేశ్యాకులంలో పుట్టినా సంస్కారవంతు

రాలు.కాబట్టే మంచీ చెడులవిచక్షణను గుర్తెరిగి ప్రవర్తిం

చేది.


తన వ్యామోహంలో పడి సర్వంసమర్పించుకొని,ఉత్తచేతు

లతో మిగిలిన భవానీ శంకరాన్ని బయటకు గెంటేయ మం

టుంది తల్లి శ్రీహరి.అయితే చింతామణి ఇందుకు ఓపట్టా

న అంగీకరించదు.తల్లికి నచ్చజెప్పబోతుంది.అయినా భవానీ శంకరాన్ని ఇంటినుంచి బలవంతంగా గెంటేస్తుంది శ్రీహరి.నిజానికిచింతామణి కి వేశ్యా కుల సహజ లక్ష

ణాలు అంతగా ఒంటబట్టలేదు.వేశ్యకు కూడా నీతి వుం

టుందని చింతామణి నిరూపించింది.


“తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి నీకే సమర్పించు

కున్నాను.”గదా! 


అని భవానీ శంకరం అన్నప్పుడు…


“నేను మాత్రంవనీకేం తక్కువ చేశాను ? నీకోసం 

నా చుట్టూ తిరిగే విటుల్ని పంపివేశాను. మా అమ్మ

కసురుకుంటున్నానీకే లోబడి వున్నాను కదా “,

అంటుంది. 


“నీవు లోటు చేశావని యే ఛండాలుడన్నా డని” 

భవానీ శంకరం  అంటాడు


తసుకున్న డబ్బుకు న్యాయం చేయడం చింతామణికి వృత్తితో పెట్టిన విద్య.అందుకే చింతామణి ప్రియవస్య,

సర్వాంగ సుందరి అంటాడు భవానీ శంకరం.


 *పాండిత్యం..!!


చింతామణి పాండిత్యంలో కన్యాశుల్కం లోని మధుర

వాణి కంటే మిన్నగా కనిపిస్తుంది. బిల్వమంగళుడు చింతామణి కోసం సర్పం,సంపెంగ పూవు,శివుడు రాహు

వు రూపాలన్న  దంతపు పెట్టెను తెచ్చి తెరవకుండా,

వీటి ఆధారంగా లోపల ఏముందో కనిపట్టమంటూ ‘

సవాలు విసురుతాడు.అలా తెలుసుకోగలిగితే మరో మంచి బహుమతి కూడా ఇస్తానంటాడు.చింతామణి 

ఈ సవాలును స్వీకరిస్తుంది.పెట్టెలపై వున్న గుర్తులను బట్టి లాజిక్ వెదుకుతుంది.


"దంతపు పెట్టెపై మొదట సర్పం వున్నది.సర్పం దేనినిని హరింప గలదు?  మారుతమును….మారు తము దేని

కొరకు వచ్చును.? పరిమళము కొరకు వచ్చును.?

పరిమళము దేనియందు..వుండును? పుష్పాదుల

యందు...అందువల్ల పెట్టెలోని వస్తువు పుష్పాదులలో

నిది కావలెను.


ఇక రెండవ గుర్తు సంపెంగ పూవు.‌సంపెంగ దేనినిహరింప 

గలదు?తుమ్మెదను.తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు.మకరందము దేనియందుండును? పుష్పమందు.అందు వల్ల పెట్టెలోని వస్తువు పుష్పమగుట నిశ్చయము.కానీ ...ఏ పుష్పమో? తేలాలి.


మూడవ గుర్తు శివుడు.శివుడు ఎవరిని వారించును? మన్మథుని. మన్మథునికే పుష్పము కావలెను? అరవింద

ము.అశోకము,చూతము,మల్లిక,నీలోత్పలము, అందువల్ల పెట్టెలోనిది పుష్పమే కావలెను.


ఇక నాల్గవ గుర్తు రాహువు.రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు.సూర్యునికే పుష్పము ప్రియము? ఇంకే

ముంది? కమలమే.కావున పెట్టెలో వున్నది కమలమే “అంటుంది చింతామణి.

   

చింతామణి పాండిత్యానికి అబ్బురపడతాడు బిల్వమంగ

ళుడు! పెట్టెతెరచి అందులో వున్న  వజ్రకమలాన్ని తీసు

కోమని ఇస్తాడు. ఇక బహుమతిగా ఏం కావాలో కోరుకో

మంటాడు.

   

"నాకెప్పటి నుంచో కామ శాస్త్రం చదువుకోవాలని వుంది.

ఇప్పటి దాకా సరైన బోధకులు నాకు దొరకలేదు.మీరది తీర్చిన చాలును “అంటూ పీటముడి వేస్తుంది .చింతా

మణి. నిజానికి  బిల్వమంగళుడికి సమస్త శాస్త్రాలు తెలు

సన్న విషయం చింతామణి కి ముందే తెలుసు. అతన్ని లోబరుచుకోడానికే బహుమతి మిషతో కామశాస్త్రం నేర్పమంటుంది.దీనివల్ల ఎలాగూ బిల్వమంగళుడు తనకు కామదాసుడవుతాడు.


*జ్ఞానోదయం..!!


వేశ్యగా తన బతుకు పట్ల తనకే  హేయభావం ఏర్పడు

తుంది. దీంతో చింతామణికి జ్ఞానోదయం కలుగుతుంది.‍‍‌” 


"పాపిని,భ్రష్టురాలను,నతిబానిసనై బహు నీచ వృత్తిలో  లేపులు మావులుంబడిచరించిన మాటయె నిక్కువ,మింక పాపపు దారి త్రొక్కును.భవచ్చరణాబ్ది యుగంబు సాక్షిగా నాప ప్రేమ నిల్పియదు నందన కృష్ణా తరింప జేయవే "

అంటూ తనను తాను తిట్టుకుంటూ కష్ణారాధనకు…..

అంకితమవుతుంది.


చింతామణి సహజ సంస్కారం వల్ల ఆథ్యాత్మిక చింతన పొంది ,తన వల్ల నష్టపోయిన వారందరికీ ధనాన్ని తిరిగి ఇచ్చివేస్తుంది.భవానీ శంకరం,బిల్వమంగళుడు,సుబ్బి శెట్టి,వంటి వారిలో పరివర్తన  కలుగజేస్తుంది. 


*సంస్కరణ..!!


చింతామణి ముందుగా తన్ను తాను సంస్కరించుకుంటుం

ది.తన వల్ల కష్టాలు పడిన వారందరూ తనవలె పరివర్తన చెందాలని కోరుకుంటుందివేశ్యావవ్యామోహం,వేశ్యా సంప

ర్కం వల్ల వాళ్ళకు   కలిగిన కష్టాన్ని,నష్టాన్ని లోకంలోతిరిగి 

ఓ ఆర్నెల్లు ప్రచారం చేయాలని కోరుతుంది.చింతామణి

మాటను మన్నించి సుబ్బిశెట్టి,భవానీ శంకరం,వేశ్యావ్యా

మోహ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటారు!

బిల్వమంగుళుడు కృష్ణ దర్శనానికి మధురానగరానికి బయలుదేరి వెళ్తాడు.


కాళ్ళకూరి వారి చింతామణి పాత్ర ఉదాత్తమైంది. కేవలం జాతివల్ల గాక,నీతివల్ల మాత్రమే మనుషుల్ని,వారి మన

స్తత్వాల్ని గ్రహించాలని చింతామణి పాత్ర ద్వారా లోకానికి చాటి చెప్పాడు  రచయిత.


ఈ నాటకం గొప్పదనమేమంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఓ మూల ఈ నాటకం నిరంతరం ప్రదర్శింపబడుతూ

నే వుంటుంది.ఈ నాటకంలోని 


*అత్తవారిచ్చిన అంటుమామిడి తోట…”


*వగలును,వలపులు వర్షించి తొలినాడె తిరగని పిచ్చి యెత్తించినాను “


వంటి పద్యాలు ఎన్నిమార్లు విన్నా..'వన్స్ మోర్లు".. పడాల్సిందే.మరో మాట అర్వపల్లి సుబ్బారావు (సుబ్బిశెట్టి ) బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (చింతామణి ) కనకం (శ్రీహరి ) షణ్ముఖ (బిల్వమంగళుడు )కాంబి

నేషన్లో చింతామణి నాటక ప్రదర్శనను తిలకించడం 

ఓ మధురానుభూతి. ఈ నాటక ప్రదర్శనను ఎన్నో…

మార్లు చూడటం నా అదృష్టం.రాత్రి 9గం.లకు నాటకం మొదలైతే..అదిపూర్తయ్యేసరికి తెల్లారేది..ఎన్నిసార్లు చూసినా తనివి తీరని నాటకం చింతామణి !!

                                                                                *ఎ.రజాహుస్సేన్ !!

  నంది వెలుగు..!!

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతర్వేది

 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతర్వేది


తూర్పు గోదావరి జిల్లా లో వున్న  పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ వుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం.... పురాణాలలో కూడా దీని ప్రస్థావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు....

గోదావరీ నదికి ఇటువేపు ఉన్న "సఖినేటి పల్లి" మండలానికి చెందిన "అంతర్వేది" తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో వుంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించవచ్చు

ఇక్కడి స్థలపురాణం: సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.

రక్తావలోచనుని కథ:  హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వరగర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తి నుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు.ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో వుంది.

త్రేతాయుగంలో... శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తోంది. ఓం నమో వేంకటేశాయ

 Share to your group

పూజా పునస్కారాలు

 ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారుని కి ఖాళీ గా ఉన్నాడా లేడా అని కనుక్కుని తన వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మీ మన కోసం....


     తల్లి...నాయనా .పూజా పునస్కారాలు ఐనాయా?

కుమారుడు...ఇలా చెప్పారు.

అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని.అది కూడా అమెరికాలో  మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు.అలాంటి నేను పూజ లు అవి ఏం బాగోదు.

   తల్లి మందహాసం తో కన్నా!నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా.కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా.....అన్నది.

కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.

అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. ..


నీకు దశావతరాలు అది మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ  జీవ పరిణామానికి ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు.

 అప్పుడు ఆ తల్లి...హా సంభంధం ఉంది. ఇంకా నువు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.

     మొదటి అవతారం మత్స్య అవతారం.అది నీటిలో ఉంటుంది.అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది.ఇది నిజమా కాదా.

  కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.

   తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించిన ట్టుగా గమనించాలి.అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.

 మూడవది వరాహ అవతారం అంటే పంది.ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్ల ని గుర్తు కు తెస్తుంది.

  ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు.దీన్ని బట్టి మనకు జీవ పరినామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమై న జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.

ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు.నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో erectes మరియు  హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు  గా వికాసం చెందారు.

  కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.

తల్లి కన్నా ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలి ని పట్టుకు తిరిగేవాడు.దీని వల్ల ఎం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.

 ఇక ఏడో అవతారం రామావతరం.మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు .సమస్త కుటుంబ బంధుత్వనికి అది పురుషుడు.

 ఇక ఎనిమిదవ ది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు పాలకుడు ప్రేమించే స్వభావి.అతడు సమాజ  నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజము లో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.

కొడుకు ఆశ్చర్యం విస్మయం తో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ

 తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం.ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమం లో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు.ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణ లకు మూలం.

ఇక వచ్చేది కల్కిపురుషుడు.అతను నీవు   ఏ మానవునికై వేతుకోతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వరసత్వానిగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తి.గా వెలుగొందుతాడు.

కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తున్నాడు

   అపుడా ఆ కొడుకు ఆనంద భాష్పలతో అమ్మ...హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మం. అని అన్నాడు

    ..

. ఆత్మీయులారా !!

                 మన వేదాలు ,గ్రంథాలు,పురాణాలు,ఉపనిషత్తులు,

ఇత్యాది అన్ని ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మారాలి.మీరు ఎలాగ అనుకొంటే అలా వైజ్ఞనికమైనవి కావచ్చు.లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్ట్రీయత తో కూడిన ధర్మాన్ని నేడు మూఢచారాలు పేరిట మన సంస్కృతి ని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం.ఇకనైనా మేలుకోండి రుషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.

మనంమారుదాం. యుగంమారుతుంది...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

నేతాజీ జయంతి

 నేతాజీ జయంతి శుభాకాంక్షలు. 


    జై హింద్ నినాదంతోనూ, 

   "ఆజాద్ హింద్ ఫౌజ్" అనే భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసీ, 

    భారత స్వాతంత్ర సమరంలో ఎంతో ఉత్తేజ పరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి జాతి ఇప్పటికీ ఎంతో నేర్చుకోవలసి ఉంది.  

    

అందుకు ప్రబల ఉదాహరణ


    ఆ రోజుల్లో మహాత్మాగాంధీ మాటకి తిరుగుండేదే కాదు. 

    భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన మాటను ధిక్కరించి నిలబడడమే ఎంతో సాహసం. 

    కాంగ్రెస్ సాధారణ సభ్యత్వం నాలుగు అణాలు. గాంధీ కాంగ్రెస్సులో తనకు నాలుగణాల సభ్యత్వం కూడా లేదంటునే, నేతాజీకీ ప్రత్యర్థిగా భోగరాజు పట్టాభి సీతారామయ్యని నిలబెట్టి, "పట్టాభి ఓటమే నా ఓటమి" అని ప్రకటించినా, 

    అటువంటి పరిస్థితులలో దానికి ఎదురీది, గెలిచిన నేతాజీని చూసి మనమెంతో నేర్చుకోవాలి కదా! 

    గెలిచి చూపించి, రాజీనామా చేసిన ఆయన ధైర్యమూ, త్యాగమూ మన యువతకు అలవడితే, మన జాతి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. 


    అడుగు ముందుకేద్దాం. 

    నేతాజీ మనకిచ్చిన మార్గంలో పయనించి, దేశ ఔన్నిత్యాన్ని నిలబడదాం. 


                జై హింద్

BRAHMINS KITCHEN

 *ONLY BRAHMINS KITCHEN* *(OBK)*


*హైదరాబాద్ లో ఇంటి వద్దకే ప్రతీరోజూ బ్రాహ్మణ భోజనం*


బ్రాహ్మణుల వంట శుచిగా పంపించబడును

 

*మల్కాజిగిరి/ఆనందబాగ్/సఫిల్ గూడా/నేరెడ్ మెట్/సైనిక్ పురి/AS రావు నగర్ / రాధిక థియేటర్ / ఈస్టు మారేడుపల్లి / వెస్ట్ మారేడుపల్లి/ ముషీరాబాద్ / చిక్కడపల్లి / RTC X రోడ్స్ / గాంధీ నగర్/ విద్యా నగర్ / నల్లకుంట / సాకేత్ / దమ్మాయిగూడా* మొదలగు సమీప ప్రాంతాల్లో ప్రతిఇంటికి ప్రతిరోజూ శాఖాహార భోజనం *నెలవారీ పద్ధతిలో మాత్రమే* సప్లై చేయబడును... *కాయకూర, పప్పు, సాంబారు, పచ్చడి* ఉదయం క్యారెజి వస్తుంది.


మా ఇంటి (బలరాంనగర్, సఫిల్ గూడ) నుండి *మూడు కిలోమీటర్ల వరకు సరఫరా మాత్రం ఉచితం* గా పంపబడును...


మా ధరలు ఈ క్రింది విధంగా ఉంటాయి...


పచ్చడి (60-80 గ్రాములు)

పప్పు (100-120 గ్రాములు)

కాయగూర (100-120 గ్రాములు)

పులుసు (100-120 గ్రాములు)


పై వన్నీ కలిసి ధర రూ. 80/-


పై వాటికి అన్నం (400 గ్రాములు) కలిపి కావాలంటే ధర రూ. 100/-


*ఈ పై ధరలు 3 కీలోమీటర్ల వరకు మాత్రమే...*


ఒకవేళ మీకు సాయంత్రం చపాతీలు కావలస్తే, మేము సరఫరా చేయగలం, కానీ అవి మధ్యాహ్న భోజనంతో పాటే ఇచ్చేస్తాము... వాటి ధర రూ. 60/-  (మూడు చపాతీ, ఒక కూర)


మీరు మీ ఇంటి స్థానం (location) పంపినట్లైతే, మీ ఇల్లు ఉన్న దూరం google ద్వారా చూసి మూడు కిలోమీటర్ల పైన ఎంతదూరం ఉంటే అన్ని కిలోమీటర్లు ₹.10/- తో గుణించి పై ధరకు కలపటం జరుగుతుంది...

ఇది కూడా మొత్తము దూరం మా ఇంటి వద్ద నుండి 8 నుంచి10 కిలోమీటర్ల లోపు మాత్రమే మా సేవలు అందుబాటులో ఉంటాయి...


మీకు అవసరం ఐతే కాల్ చెయ్యండి,  లేకుంటే *దయచేసి మీ వద్ద ఉన్న *బ్రాహ్మణ* సమూహాలలో ఈ పోస్టు షేర్ చెయ్యమని ప్రార్థన...🙏🙏🙏


శాఖహరులకు మాత్రమే సంప్రదించ వలసిన చరవాణి /  ఫోను నెంబర్లు  7382754039 / 9966066021

Star Enterprises



To see more posts like this and join ALL INDIA BRAHMIN FEDERATION, click here 👇👇


https://kutumbapp.page.link/XHzm1mv1XfRpkggy5

22, జనవరి 2022, శనివారం

తిరుమల 7 కొండలు

 తిరుమల 7 కొండలు..పరమార్ధం

తిరుమల 7 కొండలు..


1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.


ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.


అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.


1. వృషభాద్రి - అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)


వాక్కు అంటే - శబ్దం

శబ్దం అంటే - వేదం

వేదం అంటే - ప్రమాణము


నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.


2. వృషాద్రి - అంటే ధర్మం


ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.


అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.


3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.

షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.


పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. 


ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.


భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.

అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.


అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.


4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.

కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.


కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.


అప్పుడు అంజనాద్రి దాటతాడు.


5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,


తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) 


తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.


6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.


ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.


7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.


వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం 7 కొండలు ఎక్కడం


🙏సర్వేజనా సుఖినోభావంత్🙏