31, జులై 2022, ఆదివారం

ఆండాళ్ తల్లి ( గోదాదేవి ) తిరునక్షత్రం

 _*రేపు ఆండాళ్ తల్లి ( గోదాదేవి ) తిరునక్షత్రం*_


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️



రేపటి రోజు ఆండాళ్ తల్లి పుట్టిన రోజు. కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది. విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు , అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే , అందులో మునిగి , అడుగుదాకా వెల్లి తిరిగి బయటికి వచ్చి , ఇంత ఉంది సుమా ! అని బయటి లోకానికి తెలియజేసిన వాల్లను ఆళ్వారులు అని అంటాం. ఈ ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు , కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తో పాటు ఆయన శిష్యుడైన మధుర కవి , ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి , ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీల్లంతా.

 

*కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |*

*పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||*

*నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం*

*పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ*

*స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా* *బలాత్కృత్య భూంక్తే*

*గోదా తస్యై నమ ఇద* *మిదం భూయ ఏవాస్తు భూయః*


విష్ణుచిత్తులవారు పాండ్య దేశపు సభకు వెల్లి , భగవంతుని అనుగ్రహంచే , తత్వం అంటే ఇట్లా ఉంటుంది అని నిర్ణయంచేసిన మహనీయుడు. ఆ పాండ్య రాజు ఆయనని ఏనుగు అంబారి పై ఉరేగించి బట్టర్పిరాన్ అని బిరుదిచ్చారు. అప్పుడు ఆ రాజుద్వారా ఆందిన సంపదతో శ్రీవెల్లిపుత్తుర్ ఆలయ గోపురం , ప్రాకారాదులకు కైకర్యంగా వినియోగించారు. తులసివనం పెంచి , తులసి మాలలను కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతి దినం. ఒకనాడు ఆయనకు ఒక పాప ఆ తులసి వనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడంచే ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచాడు. శ్రీకృష్ణుడు యశోదమ్మకి కనకుండానే లభించాడో , ఈయన తను యశోదగా భావించి ఆ పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. తులసి మాలని తమిళంలో కోదై అంటారు , ఆమెకు కోదా అని పేరు పెట్టుకున్నాడు. సంస్కృతంలో అది క్రమేపి గోదాగా మారింది. భగవంతుని కథలు ఆ గోదాదేవికి చెప్పుతూ పెంచారు ఆమె తండ్రి , అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తు విష్ణుచిత్తులవారు ఎన్నో పాటలు పాడేవారు. శ్రీకృష్ణుడి జ్ఞానం కల్గిఉండటంచే ఆయనను ఎలాపొందాలని కోరిక కల్గితే , వాల్ల తండ్రి వివిద దివ్యదేశాల గురించి తెలిపాడు. శ్రీరంగనాథున్ని ప్రేమించింది గోదాదేవి. ఒకప్పుడు విభవంలో మన వద్దకు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పడిలా ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడని తెలుసుకొని అట్లాంటి అనుభూతిని పొందింది గోదా. తన చుట్టు ఉన్న ఊరినే నందగోకులంలా , తన చుట్టూ వారినే గోపికలవలె , ఆ వూరి వటపత్రశాయి మందిరాన్నే నందగోప భవనంగా భావించింది. ఆనాడు గోపికలు చేసిన వ్రతాన్ని తాను చేసింది. అలా భావిస్తూ రోజుకో పాటని పాడేది. మరి మాములు పాటలు కావు , సర్వ వేద సారం అని పిలవబడే తిరుప్పావై అనే ముప్పై పాటల్ని పాడింది గోదా. ఇంకా భగవంతుని దర్శనం కల్గలేదు, అప్పుడు తన వేదనని తెలియజేస్తూ నాచియార్ తిరుమొఱ్ఱి అనే మరొక నూట నలభై మూడు పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది. అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చలించి , తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ నుండి పిలిపించుకుని , శ్రీరంగ క్షేత్రంలో రంగవిళాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహమాడాడు. అమె స్వామి సన్నిదానంలో చేరిపోయింది. తండ్రిగారు అయ్యో నా గోదా ఏది అని విలపిస్తుంటే , భగవత్ తత్వం తెలిసినవాడైనందుకు రంగనాథుడు ఆ విగ్రహరూపంలోనే ఆయనతో విలపించవలదు మీరు మీ వూరికి వెల్లండి , నేను గోదా దేవితో పాటు అక్కడికి వస్తాను అని ఆదేశించాడు.

 

విష్ణుచిత్తులవారు శ్రీవిల్లిపుత్తూర్ చేరగానే స్వామి రంగమన్నార్ , అంటే రంగరాజుగా గరుడవాహనంపై గోదాదేవితో కల్సి వేంచేసాడు. శ్రీవిల్లిపుత్తూరులో అసలు దేవాలయం వటపత్రశాయిదే , కాని గోదాదేవి రంగనాథుడిని పొందాక , గోదాదేవి ఆలయం తర్వాత ప్రసిద్ది చెందినది. పెద్దగోపురం కనిపించేది వటపత్రశాయి ఆలయంకు చెందినది. ప్రక్కన గోదాదేవి నివసించే ఇల్లు ఆమె మందిరంగా ఉంది ఈనాటికి కూడా . ఆగోదాదేవి అలా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అవతరించి భూమినంతా తరింపజేసింది. తల్లి తన పిల్లల్ని స్తన్యముల ద్వారా పోశిస్తుందో , అలా గోదాదేవి తిరుప్పావై , నాచియార్ తిరుమొఱ్ఱి అనే రెండు దివ్యప్రబంధాలను లోకానికి ఇచ్చి ఈ జీవరాశినంతా పోశిస్తుంది.

చేసుకున్నంత మహాదేవా

 "చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా"


🌹🌹🌻🌹🌹


"చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా" అన్నది ఒక నానుడి. అర్ధం ఏమిటి అంటే మనం ఎంత చేసుకుంటే ఆంతే మనకి. ఇది ఒక కర్మ సిద్దాంతం. మనం గతంలో చేసుకున్నది ఇప్పుడు, ఇప్పుడు చేసుకునేది ముందు ముందు అని అర్థం. అంటే మన గతం ఇప్పటి వర్తమానం. ఇప్పటి వర్తమానం రాబోయే భవిష్యత్తు. 


మరి


అదృష్టం అంటే ఏమిటి?


దురదృష్టం అంటే? 


దైవం పాత్ర ఎంత?


జ్యోతిష్యం, గ్రహచారం ఇవ్వన్నీ ఏమిటి మరి? గ్రహ శాంతులు ఏమిటీ? 


 దైవ పూజలేనిటీ? 


హోమాలు ఏమిటి?



1) చేసుకున్నవారికి చేసుకున్నంత మహానుభావా అన్నది 


ఇది ఒక సూత్రమును తెలియచేస్తుంది. అది కార్య కారణ సంబంధము. దీనినే ఆంగ్లంలో


 " law of cause and effect " అంటారు లేదా "as you sow so you reap" నాటుకో~~కోసుకో అంటారు.  వీటి అర్థాలు ఏమిటి అంటే ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. నీవు ఏ విత్తు నాటుతావో అదే ఫలాలను పొందుతావు.



2) అదృష్టం/దురదృష్టము



మరి అదృష్టం ఏమిటీ? అంటే మనకి అనుకోకుండా అంతా శుభమే జరుగుతుంటే అదృష్టం పట్టింది అంటాము. అలాగె ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాదించకపోతే అది దూరదృష్టము అంటాము. దురదృష్టము అనగా మనకి కనబడని ఎదో అది అని అనుకుంటాము. అలాగే అదృష్టం అంటే ఎదో కనబడని శక్తి మనకు కావలసినది ఇస్తోందని అనుకోని దీనిని అదృష్టం అంటారు.


అయితే కార్య కారణ సంబంధము అర్థం అయ్యినప్పుడు ప్రస్తుత కార్యానికి ఏదో తెలియని కారణం ఉందని గ్రహిస్తే అప్పుడు అదృష్టం ఇంకా దురదృష్టం మాయం అవుతాయి. కారణంను మనం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల  అంతరంగ అన్వేషణలో తెలుస్తుంది. మనకి తెలియకపోవడం వల్ల కారణం లేదు అనుకోవడం పొరపాటు.



3) దైవం



మనకి రావాల్సిన వాటిని ఆపడం కానీ, తొందరగా ఇవ్వడం గాని దైవం చెయ్యాడు. ఆయనకి ఇదేనా పని. ఆయన సృష్టిలో మనం ఎంత. "కోన్ కిస్కా గొట్టం గాళ్లం" . అందుకని దైవం అన్ని చేస్తున్నాడు అనుకోవడం అజ్ఞానం. మరి మన జీవితంలో దైవము వద్దా? అంటే. కావాలి. మన అహంకారాన్ని అణచాలి అంటే దైవం కావాలి ఆయనని శరణు పొందాలి. కానీ ఒక్క విషయం మాత్రం సత్యం భగవంతుడికి మన పాపంతో కానీ పుణ్యం తో కానీ ప్రమేయం లేదు. ఇది భగవద్గీతలో 5 వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది.


🌹🌹🌹🌹🌹


🙏🙏🙏🙏🙏

ధర్మమును

 శ్లోకం:☝️

*నాస్ధా ధర్మే న వసునిచయే*

    *నైవ కామోపభోగే*

*యద్యద్ భవ్యం భవతు భగవన్*

    *పూర్వకర్మానురూపం l*

*ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం*

    *జన్మజన్మాంతరేపి*

*త్వత్పాదాంబోరుహయుగగతా*

    *నిశ్చలా భక్తిరస్తు ll*

    - ముకుందమాల


భావం: ఓ కృష్ణా! ధర్మమును ఆర్జించ వలెనని గాని, అర్థమును కూడబెట్టవలెనని గాని, కామములను అనుభవించ వలెనని గాని నాకు కోరిక లేదు. నా పూర్వకర్మములను అనుసరించి ఏది ఎలా జరగ వలెనో అలాగే జరుగునుగాక. ఈ జన్మయందు గాని, జన్మాంతరమందు గాని, నీ పాదారవిందములయందు గాని, నాకు నిశ్చలమగు భక్తి కలుగవలెననునది ఒక్కటియే అభిమతమగు కోరిక. (జన్మరాహిత్యము లేదా మోక్షము కంటే కూడా, కృష్ణ భక్తినే ముఖ్యముగా ప్రార్థించు చున్నారు కులశేఖరులు. నాలుగు పురుషార్థముల కంటే కూడా భగవంతుని యందు ప్రేమయే పరమ పురుషార్థమ ని వారి ఆశయము)

30, జులై 2022, శనివారం

లిఫ్ట్ ఇవ్వటం నేరం..

 *లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే* 


 రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైనా చేదు అనుభవం.. ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం… పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ నాయర్. ముంబైలో ఉంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు పోలీస్.

విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్ ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడు. మైండ్ బ్లాంక్. ఎందుకు అన్నాడు. లిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు. లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతే తెలియని నితిన్.. ట్రాఫిక్ పోలీస్ ను మరోసారి గట్టిగా ప్రశ్నించాడు. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం.. రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ వెళ్లాడు. కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు నితిన్. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు అంతా టైం వేస్ట్ అయ్యింది అంటున్నాడు. అంతే కాదు.. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఇందన్న సంగతి తెలియదని.. లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా అని అంటున్నాడు.

తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. లిఫ్ట్ ఇవ్వటం నేరమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

శాంతమ్మ గారు 🙏

 *✨సాహో... ప్రొఫెసర్‌* 

 *శాంతమ్మ గారు 🙏🎊*

🕉️🌞🌎🏵️🌼🚩


 *కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’.. అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్‌ చిలుకూరి శాంతమ్మ.* 


 *పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్‌ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..* 

 

 *‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాను.* 


 *అప్పుడే మహారాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్‌ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్‌ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేరాను. లెక్చరర్‌ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్‌ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను.* 


 *ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను.* 


 *పాఠాలు భోదిస్తూ...* 


 *వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్‌ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్‌ సైంటిస్ట్స్‌ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.* 


 *నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్‌ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్‌ డైరెక్టివ్‌‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది.* 


 *వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్‌ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్‌ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు.* 


 *పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్‌ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్‌ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌ను నేనేనట. గిన్నిస్‌బుక్‌ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు.* 


 *మాది🚩 ఆరెస్సెస్‌ 🚩నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’.* 


– బోణం గణేష్, సాక్షి, 


🕉️🌞🌎🏵️🌼🚩

జగన్మాత – జగత్పిత


            జగన్మాత – జగత్పిత

               ➖➖➖✍️


“వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”


మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యానికి మొదట ఈ మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని ఆ మహాకవి అన్నాడు. ఇదేవిధంగా భగవత్ పాదులవారున్నూ మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్. అని ఒకచోట సెలవిచ్చారు.


ఆవు అనే పదము ఉన్నది. ఇందు రెండు అక్షరాలు ఉన్నవి. ఈ రెండక్షరాలనూ వినంగానే మనస్సులో ఒక రూపం పొడగట్టుతుంది. ఆ పదము నిర్దేశించే వస్తువుయొక్క రూపం జ్ఞప్తికి వస్తుంది. ఈ రెండక్షరాలూ ఒక గుర్తు లేక సంకేతం. ఆవు అనగానే గోవు జ్ఞప్తికి వస్తుంది, లేదా ఆవును చూడంగానే దానికి సంకేతమైన ఆవు అనే మాట మనస్సుకు తట్టుతుంది. వీనికి అవినాభావసంబంధం. అనగా ఒక దానిని మరియొకటి విడనాడని చెలిమి ఉన్నట్టున్నది. ఈ విషయాన్నే నామరూపాలని పేర్కొంటారు. వీనిలో ఒక దానినుండి మరొక దానిని వేరుచేయలేము. ఒకటి వాక్కు మరొకటి దాని అర్థము. ఈ వాగర్థాలు ఎలా సంపృక్తాలై ఉన్నవో అనగా ఒక దానిని మరొకటి వదలక చేరి ఉన్నవో, అట్లే పార్వతీపరమేశ్వరులు ఒకరి నొకరు వదలక, ప్రపంచానికి తలిదండ్రులై ఉన్నారనిన్నీ, వారికి నా వందనములనిన్నీ కాళిదాస మహాకవి మంగళాచరణం చేస్తున్నాడు. ఇదే అర్థ నారీశ్వర తత్త్వం. ఇటు చూస్తే అంబికా అటు చూస్తే అయ్యా లేక పార్వతీ పరమేశ్వరులు. సంస్కృత భాషాభ్యాసం చేసే వారందరూ ఈ శ్లోకం చదివి మరీ నమస్కరిస్తారు.


మనకు రూపు ఇచ్చేవారు మన తల్లిదండ్రులు. దేహానికి కారణభూతులు తండ్రి. పుష్టి గలిగించే ఆహారమిచ్చి పోషించేది తల్లి. దేహానికి పుష్టి గలిగించే వస్తువు ఆహారము. కొరత లేకుండా ఆత్మకు పుష్టి ఇచ్చేవారు ఎవరు? ఆత్మ అనగా ప్రాణం, ప్రాణానికి పుష్టి ఏది? ఆనందం, జ్ఞానం.


దేహము ఏనాడు ధరించామో ఆనాటి నుండీ ప్రాణానికి కష్టాలే. అనగా ఈ కష్టాలన్నింటికీ కారణం జన్మ లేక దేహధారణ. ఇంకో జన్మ ఎత్తితే మరిన్ని కష్టాలు. కన్న తండ్రి ఏదో సంపాదించి ఇంత నిలువ చేసి పోయినాడని దేహానికి శ్రమ లేదనుకొన్నా ఆత్మకు ఎన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలూ, దుఃఖాలు! 


దేహానికి గాని ఆత్మకుగాని ఏ విధమైన కష్టమూ ఉండగూడదని అనుకుంటే జన్మలేకుండాపోవాలి, జన్మ ఎత్తామో ఆనందం తక్కువ దుఃఖం ఎక్కువ.


దుఃఖ స్పర్శలేకుండా ఆరుగాలంలోనూ ఆనందంగా వుండేటట్టు చేసేది ఆత్మ. అందరి ఆత్మలకున్నూ పుష్టినీ, ఆనందాహారాలనూ ఇచ్చునది పరాశక్తీ పరమేశ్వరుడూ, ఆత్మ జగన్మాత, ఆయన జగత్పిత. వారికి శరణుపొందితేనే గాని జన్మ లేకుండా పోదు. జన్మ లేకుండా పోవడమంటే అవధి లేని ఆనందమే. జన్మ కలిగిందంటే ఆనందానికి ఒక కొరత అని అర్థం. ప్రాణానికి లేక ఆత్మకు, ఆహారం అంటే పుష్టి, ఏమిటీ అని ఆలోచిస్తే ఎప్పుడూ ఆనందంగా వుండడమే. ఈ ఆనందం ఇవ్వగలవారు తల్లిదండ్రులే. కొందరూ ఈశ్వరోపాసనా, కొందరు దేవ్యుపాసనా, మరికొందరు యిరువుర కూడిక ఐన శివశక్త్యుపాసనా చేస్తారు.


అయితే వీరి వద్దకు పోవలసిన అవసరం? జబ్బుతో తీసుకుంటున్న మనిషి వైద్యుని దగ్గరకు వెళతాడు. డబ్బులేని వాడు యాచనకో చేబదులుకో శ్రీమంతుని వెతుక్కుంటూ వెడతాడు. ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళవలసి వుంటుంది. మనకు అది లేదూ, ఇది లేదూ అనేకొరతా, ఫలానావాడు అవమానించాడు అనిన్నీ లేక తగిన మర్యాద చేయలేదు అనే దుఃఖమున్నూ జన్మతో వచ్చింది. ఈ కొరతలను పోగొట్టుకోవలెనంటే, మనసుకు ఒక పూర్ణత్వం సిద్ధించాలంటే పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళాలి.


మనస్సుకు ఎప్పుడూ ఏదో ఒక చింత. దీనికి కారణం ఏమిటీ? జన్మ. డబ్బులేని వాడు యాచనకు శ్రీమంతుని కడకు వెళ్ళినట్లే ''జన్మ ఇక మనకు వద్దు'' అని అనుకొన్నవాడు జన్మలేనివాని కడకు వెళ్ళాలి. అతని అనుగ్రహమాత్రాన జన్మరాహిత్యం సులభంగాసిద్ధిస్తుంది. జన్మ లేకపోతే చింతలేదు. అందువల్ల చావు పుట్టుకలులేని పార్వతీపరమేశ్వరుల కడకు మనము వెళ్ళాలి.


మనకందరికీ చావు పుట్టుకలున్నవని తెలుసు. పుట్టుకకు కారణం కామం. చావునకు కారణం కాలుడు. కామకారణంగా కలిగిన వస్తువు కాలగ్రస్తమై నశించిపోతూంది. కామ వీక్షణంతో మోడు కూడా చిగిరిస్తుంది. కాలదర్శనంతో ఎండిపోయి జీర్ణిస్తుంది. ''కాలో జగద్భక్షకః''. కాలంవచ్చిందంటే సూర్యచంద్రాదులున్నూ చూపులేకుండా పోతున్నారు.


కామం లేకపోతే పుట్టుక లేదు. కాలం లేకపోతే చావు లేదు. ఈ రెండింటినీ జయించాలంటే పరమేశ్వరుని వద్దకు వెళ్ళాలి. అసామాన్యమయిన ఇట్టి వరం అనుగ్రహించగల ఆ వర ప్రసాది ఎటువంటి వాడు?


''కాముని కంటితో నీఱుచేశాడట

కాలుని కాలితో తన్ని వేశా డట''


మన్మథుణ్ణి చూచి నంతమాత్రాన దగ్ధంచేసినవాడికీ, కాలుని కాలితో తన్నిన కాలకాలునికీ చావుపుట్టుకలులేవు. ఆయన అనుగ్రహం గనుక సంపాదించుకుంటే మనకు కూడా పుట్టటం గాని గిట్టటంగాని ఉండదు.


పరమేశ్వరుడు ఒక్కడు ఉంటే సరిపోదూ మరి అంబిక అవసరమేమిటీ? పార్వతీ పరమేశ్వరులు వాగర్థాలు కదా, ఈశ్వరుడు కాముని నిగ్రహించింది నొసలి కంటితో. అర్థనారీశ్వర ప్రకృతులగు వీరికి మూడోకన్ను ఉమ్మడి. దానిలో ఆయనకు సగబాలూ ఆమెకుసగబాలూ, కాలుని తన్నినది ఎడమకాలితో, ఆకాలు అంబికది. అందుచేత కామ విజయానికీ కామనిగ్రహానికీ అమ్మవారి అనుగ్రహంకూడా ఉండాలి. జన్మవద్దనుకుంటే మనం ఈ పురాణదంపతుల నిద్దరినీ చేర్చి ఉపాసనచేయాలి. ఏకశరీరులై ఉన్నందున మన పని చాలా తేలికయింది. వారి అనుగ్రహం ఉంటేచాలు చావుపుట్టుకల సంత మనకుండదు.


సంగీతంద్వారా భగవదుపాసనచేసినవారిలో ముత్తయ్య దీక్షితులు, త్యాగయ్య, శ్యామశాస్త్రి అనే మువ్వురు గాయక శ్రేష్ఠులు ఉన్నారు. దీక్షితుల వారు నవావరణ కీర్తనలను వీణమీద పాడి అమ్మవారిని ఆరాధించేవారు. శ్రీచక్రార్చన చేసేవారు. సంగీతమందు అభిరుచి ఉన్నవారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. దీక్షితులవారు ఒకనాడు ఆలాపన చేస్తూ అందే మునిగిపోయి ఉన్నారు. ఆనాడు కార్తిక అమావాస్య ''శ్రీ శ్రీమీనాక్షీ మే ముదం దేహి'' అనే చరణం పాడుతున్నారు. పాట చివర ''పాశమోచనీ'' అని ఉంటుంది. 'ముదం దేహి పాశమోచని' అని పాడుతూండగా వారిశ్వాస అట్టే ఆగిపోయింది. మరణబాధే లేదు. సంకీర్తనచేస్తూ తన్మయులైపోయారు. ఎప్పుడూ దేనిని తలుస్తూ ఉన్నారో ఆ వస్తువే అయిపోయారు. మరణమనేది లేక ఆనందంలో లయం పొంది జనన మరణాలులేని స్థితినిపొందారు.


చావుపుట్టుకలు రెండున్నూ దుఃఖం కలిగించేవే. జనన నివృత్తిని వెతకికొంటూ ప్రపంచానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను తలచుచూ ''జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ'' అని మనము వారికి శరణాగతి చెయ్యాలి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️


                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

29, జులై 2022, శుక్రవారం

 *_శ్రావణ వరలక్ష్మి వ్రత విధానం_*



  🌹🌷🌹🌷🛕🌷🌹🌷🌹

                  🙏 *ఓం శ్రీ*🙏 

    🌹 *వర మహాలక్ష్మీయై నమః*🌹




శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును.

గుడికి ఎందుకు వెళ్ళాలి?: వెళితే పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే?


*శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి :-*


పసుపు 100 గ్రాములు

కుంకుమ100 గ్రాములు.

ఒక డబ్బ గంధం

విడిపూలు,పూల దండలు - 6

తమల పాకులు -30 వక్కలు

వంద గ్రాముల ఖర్జూరములు

50 గ్రాముల అగరవత్తులు

కర్పూరము - 50 గ్రాములు

౩౦ రూపాయి నాణాలు

ఒక తెల్ల టవల్

జాకెట్ ముక్కలు

మామిడి ఆకులు

ఒక డజన్ అరటిపండ్లు

ఇతర ఐదు రకాల పండ్లు

అమ్మవారి ఫోటో

కలశం

కొబ్బరి కాయలు

తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం 2

స్వీట్లు

బియ్యం 2 కిలోలు

కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు

దీపాలు

గంట

హారతి ప్లేటు

స్పూన్స్

ట్రేలు

ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనే, వత్తులు

అగ్గిపెట్టె

గ్లాసులు

బౌల్స్


*వ్రత విధానం :-*


వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి.


*కావలసినవి :-*


పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు మొదలైనవి.


*కంకణం ఎలా తయారుచేసుకోవాలి :-*


తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి,కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి.ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజ:-

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి.

యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః ,

ఓం ఏకదంతాయ నమః ,

ఓం కపిలాయ నమః ,

ఓం గజకర్ణికాయ నమః ,

ఓంలంబోదరాయ నమః ,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం గణాధిపాయ నమః,

ఓంధూమకేతవే నమః,

ఓం వక్రతుండాయ నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచంద్రాయ నమః,

ఓం గజాననాయ నమః,

ఓం శూర్పకర్ణాయ నమః,

ఓం హేరంబాయ నమః,

ఓం స్కందపూర్వజాయనమః,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.


*కలశపూజ :-*


కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః

కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః

అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥


అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.


*అధాంగపూజ:-*


పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః - పాదౌ పూజయామి,

చపలాయై నమః - జానునీ పూజయామి,

పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి,

మలవాసిన్యైనమః - కటిం పూజయామి,

పద్మాలయాయైనమః -నాభిం పూజయామి,

మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి,

కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి,

సుముఖాయైనమః - ముఖంపూజయామి,

సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి,

రమాయైనమః - కర్ణౌ పూజయామి,

కమలాయైనమః - శిరః పూజయామి,

శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృతై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూత హితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓంపరమాత్మికాయై నమః

ఓం వాచ్యై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం శుచయే నమః

ఓంస్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓంహిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యైనమః

ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం రమాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధ సంభవాయై నమః

ఓం అనుగ్రహ ప్రదాయై నమః

ఓంబుద్ధ్యె నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓంఅమృతాయై నమః

ఓం దీపాయై నమః

ఓం తుష్టయే నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓంలోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓంలోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓంపద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓంపద్మముఖియై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓంపద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మ గంధిన్యైనమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖీయైనమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓంచంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్ర రూపాయై నమః

ఓంఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యెనమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం దారిద్ర నాశిన్యై నమః

ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః

ఓం శాంత్యై నమః

ఓం శుక్లమాలాంబరాయై నమః

ఓం శ్రీయై నమః

ఓంభాస్కర్యై నమః

ఓం బిల్వ నిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యైనమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓంహేమమాలిన్యై నమః

ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధ్యై నమః

ఓం త్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశగతానందాయై నమః

ఓంవరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓంహిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై నమః

ఓంమంగళాదేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః

ఓం ప్రసన్నాక్ష్యైనమః

ఓం నారాయణసీమాశ్రితాయై నమః

ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః

ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓంభువనేశ్వర్యై నమః

కంకణపూజ :-

కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి,

రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి,

లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి,

విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి,

మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి,

క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి,

విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి,

చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి,

శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే వ్రత.


*కథా ప్రారంభం :-*


శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు.

ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.

అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.


*వరలక్ష్మీ సాక్షాత్కారం :-*


వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.

చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో

*సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే*

*శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !!*


 అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు.

వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.


మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి.

భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.


               🌷 *సేకరణ*🌷

          🌹🌷🌹🌹🌷🌹

                  *న్యాయపతి*

               *నరసింహా రావు*


🌹🙏🎋🌾🌷🛕🌷🎋🌾🙏🌹

నేతికుండతోను

 శ్లోకం:☝️

*ఘృతకుంభ సమా నారీ*

   *తప్తాంగారసమః పుమాన్ l*

*తస్మా ద్ఘృతం చ వహ్నించ*

   *నైకత్ర స్థాపయేద్బుధః ll*


భావం: స్త్రీని నేతికుండతోను, పురుషుని అగ్నితోను పోల్చవచ్చును. పండితుడైనవాడు ఇది తెలిసికొని నేతిని అగ్నిని ఒకచోట నుంచరాదు. రెంటినీ ఒక్కచోట నుంచే అనర్థదాయకములైన స్నేహములు ప్రమాదమని భావం!

28, జులై 2022, గురువారం

శ్రావణ మాసం

 🦚 *ఓం శ్రీ శరవణభవాయనమః*🦚


*రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం శ్రావణ మాస విశిష్టత*


శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.

స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.

ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.


🦚🚩🕉️ *స్కందమయీ* 🕉️🚩🦚

ఆశలు మాత్రం వదలడు.

 Bhaja Govindam Slokam_ Adi Shankaracharya


17) Behold there lies the man who sits warming up his body with the fire in front and the sun at the back; at night he curls up the body to keep out of the cold; he eats his beggar’s food from the bowl of his hand and sleeps beneath the tree. Still in his heart, he is a wretched puppet at the hands of passions.


This Stanza attributed to Subodha.


శ్రీ ఆదిశంకర విరచిత భజగోవిందం శ్లోకం


అగ్రే వహ్నిః పృష్ఠేభానుః

రాత్రౌ చుబుకసమర్పితజానుః |

కరతలభిక్షస్తరుతలవాసః

తదపి న ముంచత్యాశాపాసః ||17||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.

మాంచి మాట🌷

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

          *🌷మాంచి మాట🌷*                               

                    🌷🌷🌷

కృష్ణమాచార్యులు గారు అనే గురువుగారి  వద్ద బాలరాజు , శివమూర్తి  విద్యనభ్యసించారు. శిక్షణ పూర్తికాగానే వారిద్దరూ వేర్వేరుగా ఆశ్రమాలు స్థాపించారు .


బాలరాజు తన శిష్యులకు శాస్త్రం బోధించి నేర్పించేవాడు. వాళ్ళ సమయం వృథాకాకుండా తన సమక్షంలోనే చదివించేవాడు. ఏదైనా మార్పుచేస్తే సహించేవాడు కాదు తాను చెప్పిన శాస్త్రాన్ని వల్లె వేయించేవాడు. తాను చెప్పిందే తు.చ. తప్పకుండా చెప్పాలనేవాడు. 


శివమూర్తి తన శిష్యులను మిత్రుల వలే చూసేవాడు. వారు వారి పక్కవారిని అడిగి తెలుసుకొని, ఆ పైన సొంతంగా ఆలోచించి చదివేవారు. 


ఆ సంవత్సరం రాజస్థానంలో విద్యాసభలు జరిగాయి. 


బాలరాజు శిష్యులు శాస్త్రాన్ని పొల్లుపోకుండా చెప్పి అందరి మెప్పు పొందారు


శివమూర్తి శిష్యులు శాస్త్రాలలో ఉండే రహస్యాలూ, అనుపానులు అన్నీ చెప్పి లోపాలను ఎత్తి చూపారు .సవరణలు కూడా సూచించారు. 


రాజు వారి ప్రతిభకు ఆశ్చర్యపోయారు. రాజు వారికి కానుకలు బహుకరించాడు.


బాలరాజు వాళ్ళ గురువు గారి వద్దకు వెళ్ళి గురుదేవా! నేను మా శిష్యులకు బాగా పాఠం చెప్పి క్షణం వృథా కాకుండా శిక్షణనిచ్చాను. అయితే నా శిష్యులకన్నా శివమూర్తి శిష్యులకు మంచిపేరు ఎలా వచ్చింది? సెలవీయండి" అని అడిగాడు


దానికి ఆయన చిరునవ్వు నవ్వాడు. ""వత్సా! నీవు శిష్యులకు బాగా బోధించావు. కాదనటం లేదు. కాని, వాళ్ళ ఊహాశక్తికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి చిలుక పలుకుల్లా నీవు బోధించేదే వాళ్ళు అభ్యసించారు అలాకాక శివమూర్తి తాను బోధించి, ఆ తర్వాత వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళు ఆలోచించి, అవగాహన చేసుకొన్నారు. యథేచ్ఛగా చర్చించుకొని శాస్త్రంలోని అంశాలు లోతుగా తెలుసుకొన్నారు. 

మళ్ళీ ప్రశ్నించి వాళ్ళు తెలుసుకొన్న దానికి తుది మెరుగులు దిద్దుతాడు గురువు.


దాంతో బాలరాజు  శిష్యులకు కేవలం బోధన చేయడమే కాకుండా వారిని స్వతంత్రం గా ఆలోచించనివ్వాలి అని తెలుసుకున్నాడు..



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


 ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా ।

 పాదం సబ్రహ్మచారిభ్యః,

పాదం కాలక్రమేణ చ ॥


గురువు శిష్యునికి అందించే జ్ఞానము ఒక పావు భాగము మాత్రమే. శిష్యుడు సొంత తెలివి తేటలతో నేర్చుకొనేది మరో పావు భాగం. ఇక సమవయస్కులతో నేర్చుకొనేది మరొక పావు భాగం. మిగతా పావు భాగాన్ని కాలక్రమేణా అనుభవాలతో నేర్చుకొని పరిపూర్ణుడవుతాడు

*ఓం నమః శివాయ*


*సేకరణ: వాట్సాప్*

రామాయణానుభవం_ 113*

 🌹 *రామాయణానుభవం_ 113* 


*తతోరావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః* 

*ఇయేష పదమన్వేష్టుం। చారణా చరితేపథి* .


జాంబవంతుని ద్వారా స్తోత్రము చేయబడి, వానరులందరికి తన సామర్ధ్యాన్ని వివరించిన తరువాత శత్రుహంత అయిన హనుమచారణులనే దేవగాయకులు సంచరించే ఆకాశమార్గం ద్వారా వెళ్లి రావణుని చేత అపహరింపబడి, నిర్బంధింపబడిన సీతాదేవి ఉన్న స్థలాన్ని వెతుకాలని సంకల్పించాడు.


*దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః* చేయసాధ్యం కానిది, సాటిలేనిది అయిన సాహసానికి పూనుకున్నాడు.

అబోతు కోడెవలె ధైర్యం తో తల ఎత్తి నిలి చాడు....


సింహము వంటి ఆయన గంభీర రూపానికి భయపడి పక్షులు పారిపోయాయి, మృగాలు మరణించాయి. ఆయన మడుగులో స్వైర విహారం చేస్తున్న మత్త గజము వలె కనబడుతున్నాడు.


తాను నిర్వహించబోయే కార్యము సిద్ధించడానికి హనుమ సకలలోక సాక్షియైన సూర్యునికి, మూడు లోకాల ప్రభువైన మహేంద్రునికి, తన తండ్రి అయిన వాయుదేవునికి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి మనసారా ప్రణమిల్లాడు.


పర్వదినాలలో సముద్రము ఉప్పొంగినట్లు, రామకార్యసిద్ధి కొరకు హనుమ పొంగిపోతున్నాడు.


ఇక ఆ పర్వతం పై నుండి ఆకాశంలోకి ఎగురాలనుకొన్నాడు.

 ఆ కొండను తన కాళ్లతో చేతులతో బలంగా అదిమాడు. ఆ కొండ కొంత కదిలింది. ముందుగా చెట్ల పూలన్ని జలజల రాలాయి. ఏనుగు తొండాన్నుండి కారే మదధారలవలె ఆ కొండనుండి రంగు రంగుల ధారలు స్రవించసాగాయి.

 నల్లని మనశ్శిలలు కొండనుండి దొరలి క్రింద పడసాగాయి. 


హనుమ మరింత గట్టిగా కొండను నొక్కాడు. ఆ కొండ గుహలలోని జంతువులు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణభయంతో బిగ్గరగా అరవసాగాయి.


 బిలాలలోని సర్పాలు విషాన్ని వెడలగ్రక్కుతూ ఆ పర్వత శిలలను కాటువేయసాగాయి. 


ఆ పర్వతముపై విద్యాధరులు తమ తరుణులతో విలాసంగా మధ్యపానం చేస్తున్నారు. ఆకస్మికంగా జంతువుల అరుపులు, పడిపోయే కొండ రాళ్లను చూచి ఆ పర్వతము బ్రద్దలవుతున్నదనే భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదలి ఆకాశంపైకి ఎగిరి ఆశ్చర్యంతో చూడసాగారు.


ఆ మహాపర్వతం పైనున్న మహానుభావులైన మహర్షులు “రామ కార్యార్థమై హనుమ కొండంత శరీరంతో నూరు యోజనాల విశాలమైన సముద్రాన్ని దాటబోతున్నాడ”ని తెలిపారు.


హనుమ తన శరీరాన్ని యోగాభ్యాస వశం చేశాడు, చేతులను కదలకుండా బిగించి, నడుమును సన్నగా చేసి, మెడను సంకోచింప జేసి ఎగరడానికి వీలుగా పాదాలను ముడిచి యోగ నియమాలను పాటించాడు.......


** 

బయల్దేరడానికి సిద్ధమై వానరవీరులందరూ వినేలా ఇలా ప్రకటించాడు.


*యధా రాఘవనిర్ముక్తః శరః శ్వసనవిక్రమః* *గచ్ఛేత్తద్వద్గమిష్యామి లఙ్కాం* |*రావణపాలితామ్*


రామబాణంలా వాయువేగంతో రావణపాలితమైన లంకకు వెళ్ళి వెదుకుతాను. అక్కడ సీత కనబడకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళి వెదుకుతాను. అక్కడా సీత కనబడకపోతే. ఏమాత్రం అలసట లేకుండా లంకకు వచ్చి రావణుణ్ణి బంధించి, సీతతో సహా తెస్తాను. ఎలాగైనా సీతను తీసుకునే వస్తాను. ఆమె కనబడకపోతే రావణుడితో సహా లంకను పెల్లగించి. తీసుకు వస్తాను. అనుకున్న కార్యం సాధించి తీరాను." మనస్సునుంచి ఇతర ఆలోచనలు దూరం చేసాడు. సముద్రలంఘనం మీదనే బుద్ధి ఏకాగ్రం చేసి మహేంద్రపర్వతం నుంచి గాలిలోకి ఎగిరాడు.


ఆ మహాకపి తొడల వేగానికి పర్వతం మీద ఉన్న వృక్షాలు కూకటివేళ్ళతో భూమిని పెకలించుకుని బయటకు వచ్చి కొమ్మలన్నిటినీ కిందకు ముడిచి పెట్టుకుని, ఆయనవెంట గాలిలోకి ఎగిరాయి.


సారవంతమైన కొన్ని వృక్షాలు, రాజును సాగనంపే సైన్యంలా పరిమితదూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి.


తేలికపాటి చెట్లు, ప్రియబంధువును సాగనంపేవారిలా చాలాదూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి.


ఆ వృక్షాలకు ఉన్న పుష్పాలు రాలి, గాలికి పైకిలేచి హనుమంతుడి శరీరమంతా అలంకరించినట్లు అంటుకున్నాయి.


కుప్పించి ఎగిరిన పర్వతమంత మహాకపి, ఆ కపి వెనుక గాలిలోకి లేచిన విశాలమైన వృక్షసమూహాలు, వాటినుండి రాలి అయస్కాంతానికి తగులుకున్న ఇనుపరజనులా హనుమంతుడి శరీరానికి తగులుకున్న పుష్పాలు- అదో మహాద్భుతదృశ్యమై కనబడింది.


గుండ్రంగా, పచ్చగా ఉన్న ఆ మహాకపినేత్రాలు ఆకాశంలో సూర్యచంద్రులు ఏకకాలంలో, ఒకే కాంతితో ఉదయించినట్లున్నాయి. వృత్తాకారంలో ఉన్న తోకతో హనుమంతుడు ఆకాశంలో గూడుకట్టిన సూర్యుడిలా ఉన్నాడు.


ఆయన వేగానికి, బాహుమూలాలనుండి వస్తున్న గాలి చేసే చప్పుడు మేఘగర్జనలా ఉంది. మేఘమండలంలో ఉన్న మేఘాలను లాక్కుపోతున్నాడా అనిపించేలా నీలిమేఘాలన్నీ ఆయనను అనుసరించి కదిలాయి.....

*

[హనుమ తనను *యధా రాఘవ నిర్ముక్త శరః* 

రాముడు వదిలిన బాణం గా చెప్పుకొన్నాడు. ఇది కర్మయోగము యొక్క మూల సూత్రం. రాముని బాణం రాముని యొక్క పనిముట్టు.


రాముడు తన పనికై వినియోగించుకొనును. అపుడు రాముడు వేగముతో లాగి వదలగా రాముడు కల్పించిన వేగమే దాని వేగముగా ఆ బాణము పోవును; మధ్యలో ఆగదు. లక్ష్యమును చేరును.


 హనుమ తన్ను ఆ బాణముతో పోల్చుకొనుచున్నాడు. రాముని బాణము ఎట్లు సహజమగు వేగములేనిదో నేనును అంతే! రామునిపనిమీద రాముడు పంపగా రామునివేగము నా వేగమై పోవుదును గాని ఇది నా శక్తి కాదు. భగవత్పారతంత్ర్యమును భావించుకొనును....]

స్వచ్ఛమైన అశ్వగంధ

 అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 


    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో   అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది.  ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 


 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 


      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 


 మోతాదు - 


     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 


       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 


  ఔషధోపయోగాలు  - 


 *  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 


 *  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 


 *  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 


 *  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 


 *  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 


 *  రక్తము నందలి దోషములను పోగొట్టును . 


 *  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 


 *  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 


 *  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 


 *  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 


 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .


 *  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 


 *  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 


 *  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 


 *  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 


 *  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 


 *  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 


 *  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 


 *  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 


 *  మూర్చరోగులకు ఇది వరం వంటిది . 


 *  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 


 *  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 


      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 


         కరోనా చికిత్సలో కూడా ఇది చాలా అద్బుతముగా పనిచేసింది . నేను ఎంతో మంది రోగులకు ఇచ్చాను . కరోనా నుంచి కోలుకొనిన తరువాత వచ్చే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవడానికి ఇది వాడుట అత్యుత్తమం . 


      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం . 


  

27, జులై 2022, బుధవారం

మంచిని గ్రహించండి!*

 XI. 9.1-5.270722-8.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *మంచిని గ్రహించండి!*

                  ➖➖➖✍️


*మంచిని గ్రహించండి! చెడుని వదలండి!!*

      …మీ చామర్తి మల్లికార్జున శర్మ 

                                   శ్రీకాకుళం.



* క్షమిస్తున్నారు కదా అని*

*మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ*

*కష్టపెట్టకు!*


*వాళ్ళు ఒక్క క్షణం*

*మంచితనాన్ని మర్చిపోయారంటే*

*వేరేలా మారడానికి*

*నిమిషం కూడా పట్టదు!*


*మనకు ఎన్ని పనులు ఉన్నా*

*ఉదయాన్నే మనసుకు నచ్చినవారిని* *పలకరించడంలో ఉండే ఆనందం*

*మాటల్లో చెప్పలేం!*


*విలువ లేని దుమ్ము కూడా,*

*ఒక్కోసారి నీ కంట్లో పడి,*

*నిన్ను విలవిలలాడేలా చేస్తుంది..!*


*అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా,*

*చాలాసార్లు వారి మాటలతో బాధపెడతారు,*


*ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం...!*


 *"నీ చుట్టూ ఉన్నవాళ్ళ స్థానం, స్థాయి మారితే*

*నిన్ను మర్చిపోతారేమో.*


*అయినా కూడా* 

*నువ్వు నీలానే ఉండాలి!* 

*స్థానం మారినా, స్థాయి మారినా!*

*అదే వ్యక్తిత్వం అంటే!"*



 *"ఏదీ శాశ్వతం కాదు!*

*నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు.*

*ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే*

*మారిపోక తప్పదు."*



 *కాలం ఎందరినో*

*పరిచయం చేస్తుంది.*

*కానీ కొందరినే*

*మనసుకు నచ్చిన వారిగా*

*మార్చుతుంది.*

*అది స్నేహమైనా, ప్రేమైనా..!!*


 *మనిషిని గెలుచుకోవడంలో*

*సంతోషం ఎన్నిరోజులు*

*ఉంటుందో తెలియదు కానీ...*

*మనసును గెలుచుకోవడంలో*

*ఉండే సంతోషం మాత్రం...*

*జీవితాంతం ఉంటుంది....!!*


 *మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు. మంచి మనుషులు కూడా అంతే… ఇతరులకి సాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమీ ఆశించరు!*


 *మన కష్టంలో మనవాళ్లే*

*కలిసిరానప్పుడు*

*ఎవరో ఆదుకోవడానికి*

*రాలేదని బాధపడటం*

*అనవసరం.*


*ఎక్కువగా నమ్మటం,*

*ఎక్కువగా ప్రేమించటం,*

*ఎక్కువగా ఆశించటం..*

*ఫలితంగా వచ్చే బాధ కూడా*

*ఎక్కువగానే ఉంటుంది.*✍️


. 🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

                     

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

కవితా చమత్కారం

 శుభోదయం👏


కవితా  చమత్కారం!

-------------------------------- 


                  చ:  కలశ పయోధి  మీద  తరఁగల్  మరి 'హోయని'  మ్రోయ ,  వేయిభం


                        గుల  తలపాన్పు  పాము  బుసఁగొట్టఁగ ,  నేగతి  నిద్రఁ  జెందెదో ?


                        అలసత  తండ్రి !  చీమ చిటుకన్నను  నిద్దుర  రాదు  మాకు  , ఓ


                        బలవదరీ !  దరీకుహర  భాస్వదరీ !  యదరీ !  దరీ ! హరీ !


                          చాటుపద్యం-   అజ్ఙాత కర్తృకం ;


                          కవితా చమత్కారాలు  యెన్నిరీతులో?  ఒకొక్క  కవిది  ఒక్కొక్క  ఊహ! ఆవూహకు తగ్గ భావసంపద. దానిని ఆవిష్కరించే  చక్కని పద్యరచన!  అత్యద్భుత మనిపించక మానదు.


                          మనం నిద్ర పోతుంటే  అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఏమాత్రం చిన్నశబ్దమైనా మెళకువ వచ్చి ప్రక్క వారిపై విసుగు ప్రదర్శిస్తాం. అదే లోకేశ్వరునకు  ఆపరిస్థితే వస్తే  ఆయన కెంత బాధ? కానీ యివేవీ పట్టించుకోకుండా  ఓదేవాది దేవుడు

నిద్రపోతున్నాడట. ఆయన నిద్రను జూచి యీకవి యబ్బురపడుతున్నాడు.  పదండి ఆసంగతేమిటో చూద్దాం;


                  "  పాల  సముద్రంలో   కెరటాలు  హోరుమని మోత పెడు తుండగా, వేయితలల నాగు  ఆదిశేషుడు  బుసలు కొడుతుండగా ,   లోకపాలనతో అంతగా అలసిపోయిన నీవు  యెలా నిదురించినావయా ? నాయనా?  మాకైతే  చీమచిటుకన్నా

నిద్దుర రాదే ,  అబ్బో నీవు చాలా గొప్పవాడివేనయ్యా!  అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడీ కవి.


                     అంత భయంకరమైన  చప్పుడవుతున్నా  నిమ్మకు నీరెత్తినట్లు  నిశ్చలంగా నిదురించటం ఇక్కడ ఆశ్చర్య జనక మైన

చమత్కారం. దాన్ని కవి బహు చక్కగా వర్ణించాడు.


                   కడలో కెరటాలు అనంతం వాటి మ్రోతలు కూడా నిర్విరామమే! ఇక  ఆది శేషునకున్నపడగలా  వేయి. ఒక్క పాము బుసకొడితేనేమనం

హడలిపోతాం. అలాటిది వేయిపాములొక్కసారిగా బుసలు సారిస్తే  యెంత శబ్దమో ? ఆశబ్దం  కర్ణ కఠోరంగదా? మరి ఆరొదలో కదలకుండా నిద్రపోవటం మాటలా? మహ దిట్టతనమో, మొండి తనమోకావాలి. ఆరెండూ నీకున్నాయయ్యా! లేకపోతే  చీమచిటుకు

మన్నామాకు మెలకువ వస్తుందే ?మరి నీకెందుకురాదు? అనికవి ప్రశ్న?


 

                   బలవదరీ!  దరీకుహర భాస్వదరీ! యదరీ!  దరీ!  హరీ!  ------  దీనివరుసచూస్తే  ఇదేదో శతకానికి మకుటంలాగ ఉంది.

కవి చాలా ప్రౌఢుడు." దరీ " శబ్దాన్ని వృత్యనుప్రాసంగా ప్రయోగించి  యర్ధభేదం సాధించటమేగాదు. తానెంత ప్రతిభావంతుడో మనకు

తెలియజేశాడు. అహోబలనృసింహ స్వామిని యీ సంబోధనలతో కవి సంభావిస్తున్నాడు.


              బలవదరీ- బలవంతుడైన శత్రువు గలవాడా( హిరణ్య కస్యపుడు బలవంతుడేగదా) దరీకుహర- పర్వత గుహలో; భాస్వదరీ!- ప్రకాశించు  నృసింహాకారా! ; అదరీ- చక్రము; దరీ- శంఖము ధరించెడువాడా ;హరీ- స్వామీ  శ్రీహరీ!


             బలవంతుడైన హిరణ్యకస్యపుని సంహరించినవాడా! శంఖ చక్రధారీ! పర్వత బిలమందు ( అహోబిలము) నివసించు నృసింహ స్వామీ! యని సంబోధనము.


                   మొత్తానికి  పాలకడలిలో  విష్ణమూర్తి నిద్ర కూడా కవితా వస్తువైనది.


                       ఇదండీ    విషయం!


                                                                   స్వస్తి!

విష్ణు సహస్రనామం

 మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  


"అదేలా" అని అందరూ అడిగారు. 


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. 


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

-సేకరణ

శ్రావణమాసం

 శ్రావణమాసం అంటే ఏమిటి..?



శ్రావణమాసము:- ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణమాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.


పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.


శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి.

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.


ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.


వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.


పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.


ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు.

ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.


శ్రావణ మాసం లక్ష్మీ ప్రదమైనమాసం 

శ్రావణ మాసం.

స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. అనేక రకములైన వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే “శ్రావణ మాసం“.

చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే, శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాదడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి.


మంగళగౌరీ వ్రతం:


శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.


వరలక్ష్మీ వ్రతం:

శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.


శుక్లచవితి-నాగచతుర్థి:

దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.


శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి:

శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.


శ్రావణ పూర్ణిమ –  రాఖీపూర్ణిమ:

అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.

పూర్ణిమ – హయగ్రీవ జయంతి:

ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.


కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి:

మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.

కృష్ణపక్ష అష్టమి – 


శ్రీకృష్ణాష్టమి:


శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.

కృష్ణపక్ష ఏకాదశి – కామిక 


ఏకాదశి:

ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య:

పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి,  పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

అవకాశం ఇస్తుంది

 *🙏🏻రెండు డైరీలు - భార్య❤️భర్త 👇🏻*



తమ వివాహ వార్షికోత్సవ  సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ  కలిసి  కూర్చుని  కాఫీ తాగుతూ  కబుర్లు చెప్పుకుంటున్నారు.  ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట.  నిజానికి  వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.


వారి సంభాషణలో.......భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను. ఈ సంవత్సరం  మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి  ఉన్న వాటిని వీటిలో రాద్దాం. 

వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని  సరిదిద్దుకోడానికి  కలిసి  ప్రయత్నిద్దాం,”  ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు. 


 ఇద్దరూ తమ తమ డైరీలు  తీసుకున్నారు.


 ఒక  సంవత్సరం వేగంగా  గడిచిపోయింది.  మరుసటి  సంవత్సరం  వివాహవార్షికోత్సవం  సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ  ముందుగా నిర్ణయించుకున్న విధంగా  తమ  డైరీలను  మార్చుకున్నారు.

మొదట.......భార్య  తనను  ఉద్దేశించి  వ్రాసిన  డైరీని భర్త  చదవడం  ప్రారంభించాడు.


మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం.  మీరు  నాకు  మంచి బహుమతి ఇవ్వలేదు" అని,


రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్ కి తీసుకెళ్లలేదు."

మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."


 " నా తరఫు బంధువులు వచ్చారు  కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."


"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"


 ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు  ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.


 భర్త, “ఓ  ప్రియా, నన్ను క్షమించు!  ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు.  భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.


 ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు...........


 మొదటి పేజీ - ఖాళీ

 రెండవ పేజీ - ఖాళీ

 మూడవ పేజీ - ఖాళీ

 ... ఖాళీ


 భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!  


భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు.  నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.


భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు.


 భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది. 

అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత  కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.  


అలాగని నీలో ఏమి లేవని కాదు. కానీ నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.  


నాలో లెక్కలేనన్ని క్షమించరాని  తప్పులు  ఉన్నప్పటికీ, నా  జీవితంలోని  ప్రతి దశలో నాకు నీడలా  ఉన్నావు.  ఆ నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.


అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..  మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!


 వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది.  మనం ప్రమాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 🙏🙏🙏🙏

శ్రీరాఘవం

 శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

ఆపదామప హత్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

*శ్రీసీతారామచంద్ర అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణా ఫలసిద్థిరస్తు*

*సౌమ్యవాసర శుభోదయః*
సర్వేజనాః సుఖినోభవంతు
లోకాఃసమస్తాః సుఖినోభవంతు 

అదృష్టం ఉంటేనే

 శ్లోకం:☝️

  *న దైవమపి సంచిన్త్య*

*త్యజేదుద్యోగమాత్మనః l*

  *అనుద్యోగేన తైలాని*

*తిలేభ్యో నాప్తుమర్హతి ll*


భావం: అదృష్టం ఉంటేనే కార్యసిద్ధి కలుగుతుందని ఆలోచిస్తూ .. తన అధీనమైన పురుష ప్రయత్నమును వదలకూడదు. అందుబాటులో ఉన్న నువ్వుల నుండి ఏ ప్రయత్నమూ లేకుండానే నూనె రాదు కదా!

26, జులై 2022, మంగళవారం

ఆదాయపు పన్ను వివరాలను

 మిత్రులందరికీ నమస్కారం.  జూలై నెల వచ్చిందనగానే సంపాదనపరులంతా చేయవలసిన ముఖ్యమైన పని "గడచిన ఆర్ధిక సంవత్సరానికి చెందిన మీ ఆదాయాలను, వాటికి మీరు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలను ఆదాయపు పన్ను శాఖ వారికి రిటర్ను రూపంలో దాఖలు చేయటం.  దానికి ఆఖరు తేది 31 జూలై.  ఇది అందరికీ తెలిసిన విషయమే.  అయితే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను పోర్టల్లో "యాన్యువల్ ఇంఫర్మేషన్ స్టేటుమెంటు" అని ఒక డాక్యుమెంటును పెట్టారు.  గతంలో 26ఎ.ఎస్. అన్న స్టేటుమెంటు ఉండేది. దానిలో మీ జీతభత్యాలు, మీరు ఉద్యోగులు అయితే డి.డి.ఓ. చేత పేబిల్లుల ద్వారా చెల్లించిన పన్ను వివరాలు మాత్రమే ఉండేవి.  ఆ ఉద్యోగులు బయట బాంకుల్లో కానీ, యితర ఆర్ధిక సంస్థల్లో గాని కొన్ని డిపాజిట్లను గాని, షేర్లు వంటి వాటిలో గానీ పెట్టుబడి పెట్టి, దానిపై వడ్డీని పొందుతున్న వివరాలు బహిర్గతమయ్యేవి కావు.  ఈ సంవత్సరం నుంచి(1921-22) మీరు పోస్టాఫీసుల్లో గాని, బాంకుల్లో గాని దాచుకొన్న మొత్తాలు, వాటిపై మీకు వచ్చిన వడ్డీల వివరాలన్నీ ఈ ఏ.ఐ.ఎస్.(వార్షిక సమాచార నివేదిక)లో కనిపిస్తాయి.  ఉద్యోగస్తులు బాంకుల్లో గానీ, యితర ఆర్ధిక సంస్థల్లో గానీ తమ పేరు మీద పెద్ద మొత్తాలను డిపాజిట్లుగా దాచుకొని పొందే ఆదాయాల మీద కూడా పన్ను కట్టాలన్న విషయాన్ని సాధారణంగా పట్టించుకోరు. దానికి కారణం సాధారణంగా ఆ మొత్తాలు మన చేతికి రావు కానీ మన అక్కౌంట్లలో కలుస్తూ ఉంటాయి.  జీతాల్లో కట్టేసిన టాక్సు మాత్రమే లెక్కలోకి తీసుకొనే వాళ్ళకి, ఈ మొత్తాల మీద కూడా టాక్స్ కట్టాలని ఈ నివేదిక మీకు గుర్తుచేస్తుంది.  మీరు డిపాజిట్లు చేసినప్పుడు యిచ్చిన మీ ఆధార్ నంబర్ ప్రకారం ఆదాయపు పన్ను  విభాగం ఈ స్టేటుమెంటుని తయారుచేసి మీ రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ లో ఉంచుతుంది.

మరొక విషయం ఏమిటంటే, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు గత సంవత్సరం తమకు బాంకు డిపాజిట్లపై వచ్చిన వడ్డీలపై టాక్స్ కట్టని వాళ్ళే ఎక్కువ ఉండొచ్చు.  వాళ్ళు రిటర్న్ ఫాం నింపేటప్పుడు, ఎలక్ట్రానికల్గా మీకు జీతంలో డి.డి.వో. పన్నుగా విరక్కోసిన మొత్తాలే గాక ఎక్కువ పన్ను బాకీ పడ్డట్లుగా కనిపిస్తుంది. ఆ తేడా ఏమిటన్నది తెలుసుకోవాలంటే మీరు ఈ "వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇంఫర్మేషన్ స్టేటుమెంట్) ని చూడాల్సిందే!  ఇది ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఆదాయపు పన్ను శాఖ తయారుచేసిన పోర్టల్ లో కనిపిస్తుంది.  అది కనుక్కొనే విధానం : మీరు పోర్టల్ తెరవగానే "ఫైల్ యువర్ రిటర్న్" అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ పాన్ నంబర్, పాస్ వర్డ్ కొట్టితే   మీ పోర్టల్ తెరుచుకొంటుంది.  అప్పుడు మీకు పైన కొన్ని హెడ్డింగ్ లు వస్తాయి.  అందులో సర్వీసెస్ అన్న హెడ్డింగ్ ని క్లిక్ చేస్తే ఒక వరుసలో ఉన్న లిస్ట్ వస్తుంది.  దానిలో మధ్యలో ఈ ఎ.ఐ.ఎస్. కనిపిస్తుంది.  దాన్ని క్లిక్ చేసి, లోపల వచ్చిన ఎ.ఐ.ఎస్. (AIS) మీద క్లిక్ చేస్తే, 26 ఎ.ఎస్. మాదిరి ఒక స్టేటుమెంట్ వస్తుంది.  దానిలో మీకు జీతంలో కట్ అయిన టాక్స్ తో పాటు, పోపుల డబ్బాలో తప్ప, మీరు బయట దాచుకొన్న మొత్తాలు, ఎక్కడెక్కడ ఎంత దాచారో, దానిపై వచ్చిన వడ్డీలు వివరంగా కనిపిస్తాయి.  అది Income from other sources  (ఇతర మార్గాల ద్వారా ఆదాయాలు) అన్న హెడ్డింగ్ లో కనిపిస్తాయి.  దానితో పాటు ఎక్కడ దాచారో (దబాయించటానికి వీల్లేకుండ)ఆ సంస్థల పేర్లు కూడా వస్తాయి.  ఇది ఈ ఏడాదే పెట్టారు గనుక, చాలా మంది వాటిపై మార్చిలో పన్ను కట్టి ఉండరు. అందువల్ల మార్చిలో పన్ను కట్టని ఈ వడ్డీ మొత్తాల పన్నుపై ఆదాయపు పన్ను వారి రెండు సెక్షన్ల ప్రకారం వాటిపై 1%, 3% వడ్డీలు కూడా కట్టమని ఒక అంకె పేర్కొనబడుతుంది.  ఆ మొత్తాన్ని కూడా self assessment tax head(300) కింద పన్ను(in a challan) బాంకులో  చెల్లించి( బాంకులో  చలాను కాపీ తీసుకోవాలి., ) ఆపైన మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.  ఆ పన్నును కట్టకపోతే, తరువాత దానిపై పెనాల్టీ కూడా చెల్లించవలసి ఉంటుంది.  పాత పెన్షన్ పథకం కింద ఉన్న ఉద్యోగులకు జి.పి.ఎఫ్. అని ఆఫీసులోనే కొంత మొత్తం దాచుకొనే వీలు ఉంది.  కొత్త పెన్షన్ కింద ఉన్న ఉద్యోగులకు 10% జీతం విరక్కోస్తారు గనుక ఈ జి.పి.ఎఫ్. ఉండదు.  వాళ్ళు తప్పని సరిగా బయట బాంక్, పోస్టాఫీసుల్లో కొంత మొత్తాలను దాచుకొంటుంటారు.  వాటిపై వచ్చే వడ్డీని కూడా మార్చిలోగా ఈ నివేదిక ద్వారా తెలుసుకొని, మీ డి.డి.ఒ.కి యిస్తే, దాన్ని కూడా కలిపి వచ్చే ఏడాది మీ పన్నును లెక్క  కట్టి, జీతంలో విరక్కోస్తాడు.  లేదంటే మార్చి తరువాత మీరు పన్నును, పన్నుపై కొంత మొత్తంతో వడ్డీని కూడా కట్టవలసి ఉంటుంది.  అరవై ఏళ్ళ లోపు వారికి సేవింగ్స్ బాంక్ వడ్డీపై 80 టి.టి.ఎ.కింద కేవలం పది వేలు మాత్రమే రిబేటు ఉంటుంది. వారికి ఫిక్సెడ్ డిపాజిట్ల వడ్డీపై ఏమాత్రం రిబేటు ఉండదు. అరవై పై బడ్డ వారికి ఈ రిబేటు ఉండదు.  వారికి మొత్తం డిపాజిట్లపై వచ్చే వడ్డీపై(సేవింగ్స్, ఫిక్సెడ్ డిపాజిట్లపై కలగలిపి) 80 టి.టి.బి.కింద 50,000/- రిబేట్ యిస్తారు. ఈ విషయం స్నేహితులకు తెలియాలని వ్రాసాను.  గమనించగలరు.  రిటర్న్ వేయటానికి ఆఖరి రోజు జూలై 31 మాత్రమే.  ఈ ఏడాది పొడిగింపు లేదు.  గమనించగలరు.  మన పొదుపు మొత్తాలను ప్రభుత్వంతో అనుసంధానించేది  ఆథార్ కార్డ్.


(ఇది మిత్రుల సౌకర్యార్ధం దీనిని పెట్టాను)



* అగ్నౌ ప్రాస్తాహుతి స్సమ్యగాదిత్య ముపతిష్ఠతే 1. * ఆదిత్యా జ్జాయతే వృష్టిః వృష్టేరన్నం తతః ప్రజాః11


సమత్రకంగా అగ్ని లో సమర్పించిన ఆహుతులు ఆదిత్యున్ని చేరతాయి.... 'సూర్యుని వల్ల వర్షం కలుగుతుంది.... వర్షం వల్ల ఆహారం పుడుతుంది. ఆహారం తీసుకొని ప్రజలు వృద్ధి చెందుతున్నారు.....

GSTని

 🙏 

*GSTని ఎలా నివారించాలి ప్రభుత్వాన్ని తిట్టకండి.. బదులుగా మీ మనస్సుతో పని చేయండి మరియు GSTని నివారించండి.*

 1. *మీరు బయటకు వెళ్లినప్పుడల్లా ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లండి... బయటి షాపుల్లో ప్యాక్ చేసిన బాటిళ్లను కొనకండి.*

 2. *ప్రయాణంలో పరోటాలు, కూరగాయలు, అన్నం లేదా పులావ్‌లను మీతో తీసుకెళ్లండి, హోటళ్లు లేదా మాల్స్ నుండి బయట తినడం మానేయండి.*

 3. *మీరు ఇంటి కిచెన్ వస్తువులు, కూరగాయలు మరియు కూరగాయలు ఏవైనా కొనాలనుకున్నా, ఇంటి సమీపంలోని చిన్న దుకాణదారులు లేదా వీధి వ్యాపారుల నుండి కొనండి, సూపర్ మార్కెట్‌కు వెళ్లడం మానేయండి.*

 4. *శనివారం-ఆదివారాల్లో పెద్ద పెద్ద మాల్స్‌కు వెళ్లడం మానేయండి, స్నేహితులు మరియు బంధువుల ఇళ్లకు వెళ్లి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోండి.*

5. *పెద్ద మల్టీప్లెక్స్ ఐనాక్స్, పివిఆర్ సినిమాలకు బదులు సింగిల్ స్క్రీన్ సినిమాకి వెళ్లి చిత్రాన్ని చూడండి.. వాటిపై జిఎస్‌టి లేదు.*

 6. *ఉదయం, సాయంత్రం వ్యాయామం తర్వాత ఇంటికి వచ్చి టీ, కాఫీలు తాగండి.. హోటళ్లలో కాదు.*

 7- *ప్యాక్ చేసిన పాలు, పెరుగు, మజ్జిగ కొనుగోలు చేయడానికి బదులుగా, స్థానిక దుకాణం నుండి సమీపంలోని ఆవు, గేదె మరియు పెరుగు మరియు మజ్జిగ యొక్క తాజా పాలు కొనండి.*

 8- *ప్యాక్ చేసిన తృణధాన్యాలు కొనవద్దు. ధాన్యాలన్నీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న కిరాణా దుకాణాల్లో కూడా దొరుకుతాయి, వాడండి!*

 9. *ప్యాక్ చేసిన తృణధాన్యాలలో ప్రిజర్వేటివ్ మన ఆరోగ్యానికి హానికరం.*

 *మనమందరం మన పొరుగువారికి, స్నేహితులకు మరియు బంధువులకు మరియు చిన్న వ్యాపారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వం దీన్ని చేసింది!*

*సానుకూలంగా ఆలోచించండి, సానుకూల ఆలోచనతో మీరు దేనినైనా మార్చవచ్చు!*

ధర్మాకృతి

 ఆకృతి దాల్చిన ధర్మం "ధర్మాకృతి"


సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితం 72 అవైదిక మతముల దాడుల వల్ల కొనఊపిరితో ఉన్న సనాతన ధర్మాన్ని పరి రక్షించడానికై కైలాస శంకరుడు కాలడి శంకరులుగా అవతరించి కేవలం ముప్పైరెండు సంవత్సరాల చిరు ప్రాయంలో వేదసమ్మతమైన అద్వైత తత్త్వాన్ని ప్రతిష్టించి దేశం నలుమూలలా నాలుగు పీఠాలను స్థాపించి దక్షిణ భారత మోక్షపురి అయిన కంచిలో సర్వజ్ఞ పీఠంగా కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి వారే స్వయంగా అధిష్టించారు.


మరలా 18, 19 శతాబ్దాలలో ప్రజలు అధర్మం, అవైదికం వైపు వెళ్తున్న తరుణంలో మనల్ని రక్షించడానికి ఆ శంకరులే నడిచే దైవంగా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామిగా అవతరించి చిరు ప్రాయంలో కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యులుగా వచ్చి శతాయిష్కులై కోట్ల మందిని సన్మార్గం వైపు నడిపి ధర్మపరిరక్షణ చేశారు. చేస్తూనే ఉన్నారు.


అటువంటి పరమాచార్య స్వామితో దాదాపు ముప్పై సంవత్సరాల సాంగత్యాన్ని పొందిన శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రిగారు ధన్యులు. వారు ప్రస్తుతం కంచి కామాక్షి అమ్మవారి ఆలయ శ్రీకార్యం. వారు రాసిన పుస్తకాల్లో “ధర్మాకృతి” చాలా ప్రశస్తమైనది. “కంచి పరమాచార్య వైభవం” పాఠకుల కోసం రేపటి నుండి రోజూ కొంత భాగం ప్రచురించాలని మహాత్ముల సంకల్పం. 


--- అడ్మిన్ టీం


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ముసలితనము

 శ్లోకం:☝️

*జరా రూపం హరతి ధైర్యమాశా*

*మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యామసూయా l*

*కామో హ్రియం వృత్తమనార్యసేవా*

*క్రోధః శ్రియం సర్వ మేవాభిమానః ll*


భావం: ముసలితనము రూపాన్నీ, ఆశ ధైర్యమును, మృత్యువు ప్రాణాలను, అసూయ ధర్మప్రవృత్తినీ, కామము లజ్జను, దుష్టసేవ సత్ప్రవర్తనను, కోపము ఐశ్వర్యమును, గర్వము సర్వమును హరించివేస్తాయి.

మొదటిదాన్నీ మూడోదాన్నీ ఎలానూ తప్పించుకోలేం. కనుక మిగిలినవాటినైనా వదిలించుకొనే ప్రయత్నం చేద్దాం.

25, జులై 2022, సోమవారం

పచ్చ కుంకుమ

 *"కుబేర పచ్చ కుంకుమ"*



మన భారతదేశంలో

"పసుపు-కుంకుమ"లను మంగళకరమైనవిగా, 'సౌభాగ్య'చిహ్నాలుగా భావించి, పవిత్రంగా చూసుకుంటారు !!


ఏ శుభకార్యానికైనా, పూజలకైనా,

ముందుగా......సిధ్ధం చేసుకునేవి.......,

'పసుపు-కుంకుమ"లే !!


పసుపులో పచ్చి పసుపు , కస్తూరి పసుపు, ఛాయ పసుపు, కొమ్ములు, దుంప పసుపు,అని పలు రకాలు !! అలాగే........,

కుంకుమలో కూడా పలు రకాలు వున్నాయి !! ఎరుపు, ముదురు ఎరుపు,సింధూరపు రంగు, మీనాక్షీ కుంకుమ,( ఈ కుంకుమ మొగలి పూవుల సువాసనతో వుంటుంది.)మొ.

ఎక్కువగా వాడుకలో వున్నాయి !!


కానీ. 'కుంకుమ'లో 'ఆకుపచ్చ' రంగు కుంకుమ గురించి మనకు తెలీదు !! దీనినే "కుబేరపచ్చ కుంకుమ" అంటారు !!


ఈ కుబేరపచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది !!

పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ,

'కుబేరునికి చాలా ప్రీతికరమైనది' !!

అలాగే.........,

'పార్వతీదేవి' కి ప్రీతికరమైన రంగు కూడా,

ఈ........'పచ్చ రంగే' !!


ఈ 'కుంకుమ' గురించి

#శివపురాణం యిలా వివరించింది !!


'పరమశివుని భక్తుడైన కుబేరుడు' ఒకసారి కైలాసానికి వెళ్ళాడట !!

అక్కడ ఏకాంతంగావున్న శివపార్వతులను చూశాడట !ప్రతిరోజూ...దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆరోజు 'అంబిక' ను దర్శించగానే..

'కామవికారానికి, లోనయ్యాడట !!

ఒక్క క్షణం 'పార్వతీ దేవి'ని, తన భార్యగా ఊహించుకున్నాడట !!


'సర్వజ్ఞాని' ఆ......... సర్వేశ్వరునికి, ఇది తెలియకుండా ఉంటుందా ??

సర్వేశ్వరునికి కోపం వచ్చింది !! శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది !!

శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు !!

ఆ......చూపుల తీక్షణతకు, కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట !!

కుబేరుడు గడగడా వణికి పోయాడు !! పరమశివుని కాళ్ళమీదపడి, మన్నించమని

వేడుకున్నాడు !!


మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన యీ ఉగ్రత, మా ఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది !!

అప్పుడు.......ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి, నీ చర్మం కమిలి పోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది !!అని పరమేశ్వరుడు కుబేరుని, దీవించాడు !!


అప్పుడు కుబేరుడు.........,

పరమేశ్వరుడే గతి అని అనేక స్తోత్రాలతో, స్తుతించాడట !!

త్వరగానే పార్వతీ పరమేశ్వరులు కుబేరుని కరుణించారట !!

వారి అనుగ్రహంతో కుబేరునికి, స్వస్ధత చేకూరిందట !!


అయినా............,

శరీరం కాలిన ప్రదేశాలలో, తప్పుకి శిక్ష గా, మచ్చలు శాశ్వతంగా వుండి పోయాయట !!


పరమేశ్వరుని కంఠం చుట్టూగల నీలం వర్ణం, పార్వతీ దేవి పసిమి ఛాయ.......,

{అంబిక మంగళరూపిణిగా దర్శనమిచ్చి నప్పుడు, పసుపు వర్ణంగానే దర్శనమిస్తుంది !! ఆ పసుపు వర్ణాన్ని, తన దేహానికి పసుపు నలుగుపెట్టి తీసిన

పసుపుతో వినాయకమూర్తిని చేయడం మనకు తెలుసు}

ఈ.....నీల వర్ణం, ఆ....పసుపు వర్ణం రెండూ కలసినప్పుడు,

అక్కడ ఒక అద్భుతం జరిగిందట !!

ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా 'ఆకుపచ్చ'గా మారి పోయిందట !!

{నీలం....పసుపు రంగులను మిశ్రం చేస్తే,

ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది} !!


కుబేరుడు ఆ........'ఆకుపచ్చ మట్టి'ని తన శరీరానికి, పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా, మామూలు స్థితిని పొంది, శివపార్వతుల ఆగ్రహంనుండి విముక్తి పొందాడట !!

అంతే కాకుండా.............,

ఆ......పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకొని వెళ్ళి, నిత్యం శరీరానికి ధరించేవాడట !!


ఆనాటి నుండి 'పచ్చరంగు' కుబేరునికి


 ప్రీతిపాత్రమయిందట !!

'పచ్చరంగు కుంకుమ' కుబేర చిహ్నంగా అయి, పురాణాలలో ఎంతో పవిత్రతను సంతరించుకుంది !!


చర్మ రోగానికి ఈ కుంకుమ అద్భుతంగా పనిచేస్తుంది. ఈనాటి వైద్యుల ఉవాచ

ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం

 1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,

చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)

(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)


3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!


4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...!


5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి

రావటం వధూవరులని ఆశీర్వదించటం..

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి

జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!


6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!


7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!


ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....


అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.


వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసo

స్వర్ణప్రాశ్య లేహ్యము

 స్వర్ణప్రాశ్య లేహ్యము గురించి సంపూర్ణ వివరణ -


         ఈ లేహ్యము ప్రాచీనమైన ఒక మూలికల సమూహము మరియు భస్మాలను కలిపి తయారుచేయడం జరుగును . ఈ లేహ్యము నందు సుమారు 36 రకాల మూలికలు మరియు స్వర్ణభస్మం , రజతభస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకం మొదలైన భస్మాలను కూర్చి స్వచ్ఛమైన తేనెతో కలిపి ఈ లేహ్యం తయారగును . ఇందులో కలిపే మూలికలను ఒక్కొక్కటి శుద్ది చేయుచూ ఉపయోగించవలెను . 


  ఈ లేహ్యం ఉపయోగించటం వలన ప్రయోజనాలు - 


 *  శరీరము నందలి మేహ సంబంధ దోషాలు నివారణ అగును . 


 *  నీరసం , నిస్సత్తువ తగ్గును . 


 *  శరీరము నందు కండరాలు బలహీనపడి ఉన్నవారు మరియు శరీరము బక్కచిక్కి ఉన్నవారికి ఈ లేహ్యం వాడుచున్న కండరాలు బలంగా తయరగును . కండరాలు వృద్ధిచెందును . 


 *  గుండె సంబంధ దోషాలు , గుండెల్లో దడ , గుండె మంట నివారణ అగును . 


 *  నోటివెంట రక్తము పడుట తగ్గును . 


 *  శరీరము నందు రక్తము వృద్ది అగును . 


 *  రక్తము శుద్దిచేసి రక్తము నందలి టాక్సిన్స్ నిర్వీర్యం చేయును . 


 *  థైరాయిడ్ గ్రంథి మీద పనిచేయును . గ్రంథి పనితీరు మెరుగుపరచును . 


 *  మెదడు నందలి న్యూరాన్లకు మంచిశక్తిని ఇచ్చి బుద్ధిబలమును , జ్ఞాపకశక్తిని పెంచును . 


 *  ఎముకలు బలపడును . మరింత గట్టిగా తయారగును . శరీరము నందలి క్యాల్షియం లోపములు తగ్గును. 


 *  ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు , ఆయసముతో ఇబ్బందిపడువారికి ఇది అత్యంత పుష్టిని కలుగచేయును . 


 *  కాలేయమునకు బలమును ఇచ్చును. 


 *  ఆడవారిలో గర్భసంబంధ దోషములను నివారించును . 


 *  వయస్సు పెరుగుతున్న కొలది వచ్చు బలహీనత మరియు ఎముకల సులువుగా విరిగిపోవడానికి కారణం అయిన క్యాల్షియం లోపాన్ని పోగొట్టును . 


 *  గర్భాశయాన్ని , అండాశయాలు శుద్దిచేయును . 


 *  నరాల సంబంధ దోషాలను నివారించును . 


 *  కాళ్ళు పట్టుకుపోవడం , కండరాల నొప్పులు నివారించును . 


 *  చర్మాన్ని కాంతివంతముగా ఉంచును . 


    

         పైన చెప్పినవే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచును . ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి తగ్గినవారిలో తీవ్రమైన బలహీనత ఏర్పడుచున్నది. అటువంటి సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ లేహ్యాన్ని వాడటం మూలన త్వరగా శరీరబలాన్ని పొందవచ్చు. మాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుట మూలాన శరీరం నందలి రోగనిరోధక శక్తి పెరుగును రోగాలపాలు కాకుండా ఉంటారు . 


      ఈ లేహ్యంను చిన్నవారు మొదలుకొని స్త్రీపురుషులు మరియు వయస్సు మీదపడిన పెద్దవారు సహా అందరూ వాడవచ్చు . ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు . 


ముఖ్య గమనిక - 


      కరోనా వచ్చి తగ్గి శరీర బలహీనతతో ఇబ్బంది పడువారు ఈ లేహ్యాన్ని వాడుట వలన అత్యంత త్వరగా బలాన్ని పొందగలరు. 


           ఈ లేహ్యం కావల్సినవారు డైరెక్టుగా కాల్ చేయగలరు . 

   సంప్రదించవలసిన నంబర్       9885030034 . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                      9885030034

రామాయణానుభవం_ 111*

 🌹 *రామాయణానుభవం_ 111* 


జాంబవంతుని మాటలతో నిజబలాన్ని గుర్తించిన హనుమ తన రూపాన్ని అంతకంతకు అధికం చేసికోసాగాడు. మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచిన త్రివిక్రముని ఆనాడు సురులు, భూసురులు ప్రస్తుతించినట్లు సముద్రాన్ని లంఘించడానికి పెరిగి పోతున్న హనుమ మహారూపాన్ని చూచి వానరులు సంభ్రమాశ్చర్యాలతో

స్తుతింప సాగారు.


గిరి గుహలో కేసరి తన శరీరాన్ని విస్తరింపజేసినట్లు హనుమ విజృంభింపసాగాడు. ఆయన ముఖము కాలిన పెనమువలె ఎఱ్ఱ బడింది. ఉత్సాహంతో ఆయన దేహంలోని వెంట్రుకలు నిక్కబొడుచుకొన్నాయి.


హనుమ ఒక్కసారి లేచి వానర వీరులకు నమస్కరించి నిలుచున్నాడు. ఆయన తన శక్తి సామర్ధ్యాల గురించి వారికి వివరింపసాగాడు.


అప్రమేయ బలసంపన్నుడు, అగ్నిహోత్ర మిత్రుడైన మా తండ్రి వాయుదేవుడు తన వేగంతో మహా పర్వత శిఖరాలను బంతులవలె ఎగర గొట్టగల్గుతాడు. గమనం లో ఆయనకు సాటి లేరు.


నేను వాయుదేవుని ఔరసపుత్రుడను. ఆయన ప్రసాదమువలన నేను కూడ మహావిస్తీర్ణమైన ఆకాశము యొక్క ఆద్యంతాలను స్పృశింపగలను. మేరు పర్వతాన్ని - ఆగకుండా మూడు మారులు పరిక్రమించగలను. నా బాహుబలానికి సముద్రము అల్లకల్లోలమై సమస్త పృథివీతలాన్ని జలమయం చేస్తుంది. జలచరాలన్ని నా తొడల పిక్కల రాపిడికి ఉవ్వెత్తుగా ఎగిరి పడుతాయి.


మహానుభావుడు, అమిత సత్వ సంపన్నుడైన గరుత్మంతునికి నేను వేలసార్లు ప్రదక్షిణం చేయగలను. సూర్య భగవానుడు ఉదయాద్రి నుండి బయలుదేరి అస్తమయాద్రికి పయనించేలోపు నేను ఆయనకంటే ముందుగా పయనించి తిరిగి వచ్చి ఉదయాచలాన్ని చేరగలను.


నా పరాక్రమంతో సముద్ర జలాన్ని ఎండింపగలను. భూమిని బ్రద్దలు చేస్తాను. మేఘాలను చిందరవందర చేస్తాను. నేను ఆకాశంలో ఎగిరేవేళ పర్వతాలపై ఉన్న వృక్షాలు లతలు, పుష్పాలు తమ నాయకుని అనుసరించే అనుచరులలాగా నన్ను అనుసరిస్తాయి. ఆకాశాన్ని మ్రింగేలా వెళ్లుతున్న నన్ను చూచి సకల భూతాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోతాయి.


ప్రశస్తమైన నా బుద్ధిబలంతో లంకలో ప్రవేశించి సీతాదేవిని తప్పక చూచి రాగలను. వజ్రాయుధుడైన మహేంద్రుని ఎదిరించి అమృతాన్ని లాగుకొని రాగలను. లంకను పెకిలించి తీసికవచ్చి రాముని పాదాలముందు ఉంచగలను". ఈ విధంగా వానర వీరులు భయాందోళనలు తొలిగి పోయేలా పరాక్రమ సంపన్నుడై గర్జిస్తున్న హనుమను చూచి వానర వీరులు హర్షపరవశులయ్యారు.


వృద్ధుడు, బుద్ధిమదగ్రేసరుడైన జాంబవంతుడు హనుమ ఉత్సాహపరాక్రమాలకు సంతోష భరితుడయ్యాడు. 


ఆయన హనుమకు కార్య సిద్ధి కలిగేలా శుభాశీర్వచనాలను పలికాడు. తదితర వానర వీరులకు ప్రణమిల్లి వారి మంగళాశాసనాలతో ముందడుగు వేయుమని ఉపదేశించాడు.


హనుమ తన సముద్రలంఘన వేగాన్ని భూమి భరింపజాలక బద్దలవుతుందని అందువలన సుస్థిరములైన మహేంద్ర పర్వత శిఖరాలనుండి సముద్ర లంఘనం చేస్తానని తెలిపి, ఆగిరి శిఖరాన్ని అధిరోహించాడు. 


ఆ పర్వత శిఖరాన్ని తన పాద బలంతో అదిమి పట్టాడు. అప్పుడు ఆ పీడనానికి మృగాలు, మాతంగాలు భయపడ సాగాయి. కన్నముల నుండి సగము పైకి వచ్చిన భుజంగాలు విజయ పతకాలవలె శోభిల్లాయి.


మనస్సులో మహోత్సాహాన్ని, శరీరంలో మహావేగాన్ని నింపుకొన్న శత్రుహంత అయిన హనుమ సముద్రాన్ని దాటి లంకలో చేరడానికి సన్నద్ధుడయ్యాడు. 


*స వేగవాన్ వేగసమాహితాత్మా హరిప్రవీరః పరవీరహంతా,*

*మన స్సమాధాయ మహానుభావో జగామ లంకాం మనసా మనస్వీ.*


మహావేగము కలవాడు, అట్లు వేగముగ పోవుటయం దాసక్తి కలవాడు, శత్రువీరులను సంహరించువాడు, వానరులలో మేటి, కార్యసాధనకై దృఢ నిశ్చయము కల ఉత్తమ మనస్సుతో కూడిన హనుమంతుడు మనస్సులో సముద్రము దాట నిశ్చయించి, మనస్సుచే అప్పుడే లంకను చేరెను.


ఆయన కంటే ముందే ఆయన మనస్సు లంకవైపు పరుగులు తీసింది.


 _కిష్కింధా కాండ సమాప్తం._

*జై శ్రీ రామ్*


**


*సుందరకాండ ప్రారంభం*


శ్రీమద్రామాయణంలో ఇది వరకు గడచిన "బాలకాండ" శ్రీరామచంద్ర స్వామి బాల్యాన్ని సీతాకల్యాణం వరకు తెలిపింది. “అయోధ్య”, “అరణ్య”, “కిష్కింధ” కాండలు స్వామి నివసించిన స్థలాలను వివరిస్తున్నాయి.


అలాగే రాబోయే "యుద్ధకాండ” ప్రధానంగా “రామరావణయుద్ధాన్ని” వివరిస్తుంది. “ఉత్తరకాండ” శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేకానంతరము (ఉత్తర = పట్టభిషేకము తరువాత) జరిగిన సీతావనవాసము, లవకుశ జననము, అశ్వమేధయాగము, సీతాదేవి భూప్రవేశము మొదలైన సంఘటనలను తెలుపుతుంది. ఇందులో "సీతాయాశ్చరితం మహత్" అని సీతాదేవి చరిత్ర అధికంగా ఉంటుంది.


ఈ సుందరకాండ మిగిలిన అన్ని కాండలకంటే విలక్షణమైంది. నిజంగా ఇందులో శ్రీరామునికి సూటిగా సంబంధము కల చరిత్ర చాల తక్కువ. సీతాదేవి చరిత్ర కొంత ఎక్కువ. అయితే వీరి ఇద్దరి కంటే ఆద్యంతములలో కూడ హనుమకు సంబంధించిన చరిత్ర నిండుగా ఉంటుంది.


అటువంటప్పుడు ఈ కాండకు “హనుమత్కాండ” అని పేరు పెట్టవచ్చు కదా! మరి వాల్మీకి కవీంద్రుడు హనుమ పేరును ఈ కాండకు ఎందుకు పెట్టలేదు?


హనుమ అత్యంత వినయ సంపన్నుడు. రాముడు తనను దూతగా పంపడం, తాను సముద్రం దాటి లంకలో సీతాదేవిని సందర్శించి ఆమెను ఓదార్చడం, రాక్షస సైన్యాన్ని వధించడం, సీతాక్షేమవార్తను శ్రీరామునికి తెలియజేయడం మొదలైన అద్భుత కార్యాలను తాను నిర్వహించినా, వీటన్నిటికి కారణము తన గొప్పదనమని హనుమ ఎన్నడు అనుకోలేదు. వీటన్నిటికి “తన పేరు” వాడు కోవడం ఆయనకు ఎంత మాత్రము ఇష్టము లేదు.


ఈ కాండకు తన పేరుతో “హనుమత్కాండ” అని పేరు పెట్టడం తనకేమాత్రము ఇష్టము లేదని వాల్మీకి మునీంద్రుని కలలో కనబడి హనుమ చెప్పాడని పురాణాంతరాలలో ఒక కథ ఉంది. ఆ కథ నిజమో, కాదో తెలియదు. కాని హనుమ స్వభావము మాత్రము ("స్వోత్కర్ష"ను) తన గొప్పదనాన్ని ప్రకటించుకోవడానికి విరుద్ధమని అందరికి తెలిసిందే. 


"యధా రాఘవ నిర్ముక్తః శరః" అని తనను రాఘవుడు ప్రయోగించిన బాణంగా (రాముని పనిముట్టుగా) హనుమ భావించాడు.


 బ్రహ్మ వరప్రసాదంగా ("సర్వంతేవిదితంభవతి” అని) అన్ని తెలిసిన వాల్మీకి మహర్షి హనుమ స్వభావాన్ని గుర్తించినందువలన ఈ కాండకు "హనుమత్కాండ" అని నామకరణం చేయలేదు. అయితే ఈ కాండను హనుమంతుని పేరు నుండి వేరు చేయడం కూడ వాల్మీకి మునీంద్రుని ఇష్టం కాదు. హనుమ పేరును సూటిగా పెట్టవద్దు. కాని “హనుమ” అనే అర్ధము వచ్చేట్లుగా పేరు పెట్టాలి.


"సుందరో, వానరః కపిః” అని “సుందరుడు”, “వానరుడు”, “కపి” అనే పదాలు హనుమను సూచిస్తాయి. మిగిలిన పదాల కంటే “సుందరుడు” అనే పేరు బాగుంటుందని వాల్మీకి కవీంద్రుడు అనుకొని ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టాడు.......

వాస్తవం - అవాస్తవం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

    *🌷వాస్తవం - అవాస్తవం🌷* 

                    🌷🌷🌷

       

ఒక గురువుగారు మరియు అతని శిష్యుడు వీధి దీపాల కింద నడుచుకుంటూ వెళుతున్నారు...


శిష్యుడు గురువుగారిని ఒక ప్రశ్న అడుగుతాడు..


అయ్యా! వాస్తవమంటే ఏమిటీ...?

అవాస్తవమంటే ఏమిటి...?""అని...


గురువుగారు చాలా ఆచరణాత్మక భోధిసత్తుడు....

మౌనంగా ఆ వీధి దీపాలకిందే నడుస్తూ ఉంటాడు ప్రశ్న వున్నప్పటికీ కూడా...


కొంత దూరం వెళ్ళాక తల ఎత్తి ఆ దీపాల వైపు చూస్తాడు

ఆరిపొమ్మన్నట్లు ఆజ్ఞ జారీ చేస్తూ మౌనంగానే.....


వున్నట్లుండి ఆ దారిలోని చమురు దీపాలన్నీ ఆరిపోతాయి..

ఇద్దరూ నడుస్తూనే వుంటారు....ఇంతలో వాళ్లముందర ఒక

పాము కనిపిస్తుంది దారికి ఎదురుగా...


శిష్యుడు అటూ ఇటూ వేదికి చివరికి ఆ చీకటిలో కఱ్ఱలాంటిదేదో చేతికి చిక్కితే దాన్ని తీసుకుని ఆ పాముని

గబా..గబా..అని నాలుగు బాదుతాడు....


అదే సమయంలో గురువుగారు  తల పైకెత్తి దీపాలను

వెలగమన్నట్లు మౌనంగానే ఆజ్ఞ జారీ చేస్తాడు...దీపాలన్నీ మళ్లీ వెలుగుతాయి...


ఆ వెలుగులో చూస్తే శిష్యుడు ఏదైతే పామనుకున్నాడో అది

పాము కాదు...వంకర కర్ర..

అదే సమయంలో ఏదైతే కర్ర అనుకుని చేతిలో పట్టుకున్నాడో

 అది పాము....

శిష్యుని గుండె ఆగినంత పనైంది...వెంటనే ఆ పామును 

వదిలేసి కర్రను పట్టుకుంటాడు...

గురువు గారు చిన్నగానవ్వి....""శిష్యా నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా"""? అని అడుగుతాడు....


ఇప్పుడు శిష్యుడు రెండు చేతులు జోడించి గురువుగారికి

ప్రణమిల్లుతాడు....


అప్పుడు గురువుగారు...


చూడు శిష్యా ఈ మానవుడు....

ఏదైతే కనబడుతోందో ( శరీరము,,,ఆస్తులు,,,భౌతికము,,బంధాలు,,)

వాటిని వాస్తవమని నమ్ముతాడు...నువ్వు 

కర్రని పామని నమ్మినట్లు....పైవన్నీ కూడా కేవలం

మనసులో ఇమిడే భావాలు మాత్రమే....ఎవైతే మనసులో

ఇముడుతాయో అవన్నీ అవాస్తవాలే...కానీ వాటినే సత్యమనీ ,,శాశ్వతమనీ ,,నమ్ముతున్నాడు

ఇక ఏదైతే కర్ర అనుకున్నావో అది పాము....


ఈ మనిషి అనేవాడు

 ,,,ఏదైతే మాయకు ప్రాణం పోస్తుందో,,, ఏదైతే బంధానికి ప్రాణం పోస్తుందో,,,ఏదైతే ద్వంద్వానికి ఊతం ఇస్తుందో,,, దాన్నే,,, ఆ పామనే మనస్సునే వాణ్ణి వాడు రక్షించుకునే ఆయుధంగా వాడతాడు....


పాము సత్యం కానీ అది చేతిలో ఉంది...కర్ర అనుకుంటున్నావు కాబట్టి...అవాస్తవం...

కర్ర సత్యం కానీ అది కింద ఉంది...పామనుకుంటున్నావు కాబట్టి..... ఇదీ అవాస్తవమే....


 ఏదైతే చంపబడాలో ( మనస్సు ) దాన్ని పట్టుకుంటాడు...

ఏదైతే చంపడానికి పనికొస్తుందో (జ్ఞానం ) దాన్నే పామనుకుని వదిలించుకోవాలనుకుంటాడు....


కనబడుతున్న దాన్ని ( శరీరాన్ని ) శాశ్వతసత్యమని 

కనబడని ఆత్మను అసత్యమని నమ్ముతాడు.......

చీకట్లో ఉన్నంత వరకూ మనిషి ఇలాగే ఉంటాడు...


వెలుగొచ్చాక నువ్వు పాముని వదిలేసి 

కర్రను పట్టుకున్నట్లే...మనిషి

జ్ఞానోదయం అయ్యాక శరీర సత్యం వదిలేసి

ఆత్మసత్యం  పట్టుకుంటాడు.

చిత్తశుద్ధితో శోధించి

 శ్లోకం:☝️

  *వేదాంతార్థ విచారేణ*

*జాయతే జ్ఞానముత్తమం |*

  *తేనాత్యంతిక సంసార*

*దుఃఖనాశో భవత్యను ||*


భావం: ఉపనిషన్మంత్రాలను చిత్తశుద్ధితో శోధించి అర్థం చేసుకోవడం వలన నిత్యసత్యమైన జ్ఞానం జనిస్తుంది. ఆ జ్ఞానం వలన అత్యంత బాధాకరమైన సాంసారిక క్లేశములన్నీ పూర్తిగా నశిస్తాయి.

24, జులై 2022, ఆదివారం

అనుమానం

 *దివ్యశ్రీనారాయణీయమ్* 

************************

*"అనుమానం పెనుభూతం" శ్రీకృష్ణుడు రాయబారం వహించడానికి హస్తినాపురం వెళ్లాడు. ముందుగా సభలో అందరికీ నమస్కరించి, అశ్వత్థామను సభ బయటకు పిల్చుకుని వెళ్లాడు. క్షేమ సమాచారం ముచ్చటించిన తర్వాత తనచేతి ఉంగరాన్ని కిందికి జారవిడిచాడు. దుర్యోధనుడు ఇదంతా ఒకకంట గమనిస్తూనే ఉన్నాడు. ఉంగరం పడిపోయిందని అశ్వత్థామ కిందికి వంగి తీసివ్వబోగా కృష్ణుడు గమనించనట్టు నటించి ఆకాశం వైపు చూపిస్తూ ఏదో మాట్లాడటం మొదలు పెట్టాడు. కృష్ణుడేం చూపిస్తున్నాడో.. అర్థం కాక అశ్వత్థామ కూడా ఆకాశం వైపు చూసి మాట్లాడుతూ, వేలికి ఉంగరం తొడిగాడు. ఇదంతా గమనించిన దుర్యోధనుడు, మరోలా అర్ధం చేసుకుని 17 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామను ఒక్కరోజూ సర్వ సైన్యాధిపతిగా నియమించ కుండా చేశాడు. యుద్ధంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పడ్డాడు. అప్పుడు అశ్వత్థామ సుయోధనా! నేను చిరంజీవిని. పైగా శస్త్రాస్త్రాలలో అర్జునుడితో సమానమైన వాణ్ణి. నన్ను సైన్యాధిపతిని చేసి ఉంటే పాండవులనందరినీ హతమార్చేవాణ్ణి. నీకీ దుస్థితి కలిగేది కాదు' అంటూ విలపించాడు. దుర్యోధనుడు 'కానీ నువ్వు రాయబారం నాడు శ్రీకృష్ణుడికి నింగీ నేలా సాక్షిగా పాండవుల విజయానికే సహాయపడతానని మాట ఇచ్చావు కదా! అందుకే నిన్ను దూరం పెట్టాను' అన్నాడు. అది విన్న అశ్వత్థామ విరక్తిగా నవ్వి 'విధి వైపరీత్యం దుర్యోధనా! ఇది ఆ జగన్నాటక సూత్రధారి పన్నాగం. నీకు నా మీద కలిగిన అనుమానమే నీ ఓటమికి కారణమైంది' అంటూ ఆనాడు జరిగిందేమిటో వివరించాడు.* *కనుక అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలి. అంతేగానీ లోలోపలే రగిలిపోతే నష్టం తప్పదు. అనుమానం పెనుభూతమని రుజువు చేసే ఘటన ఇది.*

జీవన సాఫల్యానికి కావలసిన

 సైకిలు పెడలు - సంప్రదాయాలు 


(పరమాచార్యులవారు చెబుతుండగా 1947లో వ్రాయబడిన వ్యాసం)


ఎవరైనా సైకిలు నడుపుతుంటే అతను కాళ్ళతో పెడలు తొక్కుతాడు. తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలును త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిలు మాత్రం పట్టుకుని ఉంటాడు. వాడు పెడలు త్రొక్కకపోయినా సరే, అంతకుముందు త్రొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా, సైకిలు ముందుకు వెడుతుంది.


ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొంతకాలం కేవలం ప్రతిభ ఆధారంగా కళాశాలలో ప్రవేశం ఉంచినప్పుడు, బ్రాహ్మణుల పిల్లలు ప్రవేశం సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిభకు కావలసిన మార్కులకంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అలా విశేషంగా మార్కులు సంపాదించే విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఉన్న ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్ల కన్నా కొన్నివందలరెట్లు ఎక్కువగా ఉంటుంది.


ఇలా జరుతుండటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ప్రస్తుతం ఏ విశేష కారణమూ కనిపించటంలేదు. ఆచారాలూ, అనుష్టానాల విషయంలో బ్రాహ్మణుల పిల్లలకూ ఇతరుల పిల్లలకూ ఏమీ తేడా ఉండట్లేదు. పైగా కొన్ని విషయాలలో బ్రాహ్మణుల పిల్లలకంటే ఇతరులే బాగా ఉంటున్నారు. మరి బ్రాహణుల పిల్లలు ఎక్కువ ప్రతిభ కనపచటానికి మూలకారణం ఏదయ్యుంటుంది ? మనం దాన్ని కనుగొనాలి.


భగవంతుడు పక్షపాతి కాడు. బ్రాహ్మణులు ఆచారాలూ, అనుష్టానాల విషయంలో ఇతరులకన్నా వేరు కాకపోయినా, కొన్ని విషయాలలో ఇతరులకన్నా దిగదుడుపే అయినా, భగవంతుడు ఎక్కువ మేధస్సుని బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చాడు ?

పూర్వీకులు సైకిలు త్రొక్కడం చేత. 


మనకు మూడుతరాల క్రితం జీవించిన మన పూర్వీకులు, జీవన సాఫల్యానికి కావలసిన బ్రహ్మ తేజస్సును పొందటానికి అవసరమైనదానికంటే ఎక్కువగా ధార్మిక జీవనము అనే సైకిలు త్రొక్కారు. ఈరోజు మనం ఏ కర్మానుష్టానమూ లేకుండా కేవలం హ్యాండిలు పట్టుకుని వారి (మన పూర్వీకుల) మూలంగా పరీక్షలలో విజయం సాధించేస్తున్నాము.


వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు నిద్రలేచేవారు. మనం సాధారణంగా సూర్యోదయం తరువాతే నిద్ర లేస్తాం. వారి కాలంలో సకాల సంధ్యావందనం చెయ్యని వాడిని వెతకవలసి వచ్చేది. మన కాలంలో సకాల సంధ్యావందనం చేసే వాడిని వెతకవలసి వస్తోంది.


వారి కాలంలో ఉదయ సాయంకాలాలలో జనులు సంధ్యావందనములకై గుమికూడేవారు. మన కాలంలో ప్రొద్దున్న ఒక క్లబ్బులోనూ సాయంత్రం వేరే క్లబ్బులోనూ గుమికూడతాము. ఆత్మను పోషించవలసిన సమయంలో అనాత్మను పోషిస్తాము. ఆత్మశక్తిని కోల్పోయి, ఆత్మను బలహీనం చేస్తాము.


ఈ భూమిలోని ఇతర మతస్తులు కేవలం సాయంత్రం భగవంతుణ్ణి స్మరించడం, కొన్ని సమయాలలో కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపాదించిన శక్తి సామర్ధ్యాలతో, అకారణంగా మన వద్దనుండి మొత్తం రాజ్యం లాగివేసుకున్నారు.

బుక్కరాయల గురువైన విద్యారణ్యస్వామి, శివాజీ గురువైన సమర్థ రామదాసు గొప్ప నైతిక ప్రవర్తన కలవారు, కర్మానుష్టానపరులు, భగవదనుభవం అయినవారు. వారు మన ధర్మాన్ని పాడుచేసిన విదేశీయుల కరాళనృత్యాన్ని నాశనంచేసి, మన ధార్మికమైన రాజ్యాన్ని పునః స్థాపించారు.


నాగరికతా ? జంతుప్రవర్తనా ? 


మనకు మూడుతరాల క్రితం జీవించిన గొప్పవారిలో మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోనివారు లేరు. మట్టి, నీటిపాత్ర వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. మనం నాగరీకులమయ్యాము. మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోవడం వదలివేశాము. మనం జంతువులమయ్యాము. ఇది మన నాగరీకత.


ప్రథమ ఆచారమైన శౌచం వదలివేసిన వాడు చేసే ఏ కర్మ అయినా, బూడిదలో (అగ్నికి బదులు) హోమంచేయటంతో సమానం.


మూడుతరాల క్రితం వారు త్రొక్కిన ఫలం ఎంతవరకూ ఉంటుంది ? త్రొక్కకుండా ఉన్న సైకిలు ఎంత దూరం పరిగెడుతుంది ? వేగం తగ్గిపోవడం అప్పుడే మొదలయ్యింది. మా చిన్నప్పుడు బ్రాహ్మణుల పిల్లల్లో చూసిన బ్రహ్మతేజస్సు ఈ తరం వాళ్ళల్లో కనిపించుటలేదు. అలాగే చదివే సామర్థ్యమూనూ.


కాబట్టి, తరువాతి తరాల వారు భగవదనుగ్రహమూ, బ్రహ్మ తేజస్సూ, మేధాశక్తీ కోల్పోకుండా ఉండాలంటే, మన జీవితంలోనూ ఇవి క్రమేణా తగ్గిపోకుండా ఉండాలంటే, మనం "ధర్మశాస్త్ర సైకిలు" లోని "కర్మానుష్టాన చక్రమును", "ప్రవర్తన పెడలు" త్రొక్కడం ద్వారా త్రిప్పుతూ ఉండాలి.


--- “జగద్గురుబోధలు”,