17, జులై 2023, సోమవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 118*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 118*


*రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము :* 


*📕 మంచి రాజ్యాన్ని సంపాదించడం సర్వ సుఖాలకీ హేతువు 📕*


1. సుకస్య మూలం ధర్మః (సుఖానికి మూలం ధర్మం.) 


2. ధర్మస్య మూలమర్థః (ధర్మానికి మూలం ధనం.) 


3. అర్థస్య మూలం రాజ్యమ్ (అర్థానికి మూలం రాజ్యం.)


4. రాజ్యస్య మూలమింద్రియజయః (రాజ్యాధికారానికి మూలం ఇంద్రియాలను జయించడం.) 


5. ఇంద్రియజయస్య మూలం వినయః (ఇంద్రియాలను జయించడానికి మూలకారణం వినయం.) 


6. వినయస్య మూలం వృద్దోపసేవా (పెద్దవాళ్ళను, విద్యావంతులను సేవించడం వల్ల వినయం అలవడుతుంది.) 


7. వృద్దోపసేవయా విజ్ఞానమ్ (వృద్ధుల సేవవలన విజ్ఞానం లభిస్తుంది.) 


8. విజ్ఞానేనాత్మనం సంపదయేత్ (విజ్ఞానం చేత తనను సంపాదించుకోవాలి. వినయం, విజ్ఞానం ఈ రెండూ ఉన్నవాడు తనను తాను చక్కబరచుకొన్నవాడవుతాడు. ఆత్మసంపాదనం.)


9. సంపాదితాత్మా జితాత్మా భవతి (ఆత్మను సంపాదించుకొన్నవాడు తనను తాను జయించినవాడు అవుతాడు.) 


10. జితాత్మా సర్వార్థె సంయుజ్యతే (ఆత్మను జయించినవాడు అన్ని లాభాలు పొందగలుగుతాడు. అర్థం అనగా సంపద, పొందుతాడు.)


11. అర్ధసంపత్ ప్రకృతి సంపదం కరోతి (అర్థసంపద ప్రకృతి సంపదను ఇస్తుంది. అమాత్యులు, మిత్రులు, ధనాగారం, రాష్ట్రం, దుర్గం, సైన్యం - ఈ ఆరింటికీ ప్రకృతులని పేరు. పరిపాలనకు కావలసినవి ఈ ఆరే. అర్థ సంపద బాగుంటే ఇవన్నీ బాగుంటాయి.) 


12. ప్రకృతిసంపదా హ్యనాయకమపి రాజ్యం నీయతే (ప్రకృతి సంపదచేత రాజ్యవ్యవహారం పరిపాలకుడు లేకపోయినా నడిచిపోతుంది. ఉదాహరణకి - అప్పుడప్పుడు ప్రభుత్వాలు పడిపోయినా ఐ.ఏ. యస్. అధికారులు, భద్రతా సైన్యాదుల అధికారులు తమ తమ కార్యాలు సక్రమంగా నిర్వర్తిస్తే లోకవ్యవహారం నడిచిపోతూనే ఉన్నది కదా.) 


13. ప్రకృతికోపః సర్వకోపేభ్యో గరీయాన్ (ప్రకృతుల విప్లవం అన్ని విప్లవాల కంటే ప్రమాదకరమైనది.) 


14. అవినీతస్వామిలాభత్ అస్వామిలాభాఃశ్రేయాన్ (అవినీతిపరుడైన ప్రభువు దొరకడం కంటే ప్రభువు లేకపోవడమే మంచిది.) 

(ఇంకా ఉంది)..🙏.


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️

కామెంట్‌లు లేవు: