*1780*
*కం*
ధనమును ఘనకీర్తులెపుడు
గొనములు చెరచంగనెంచు కుటిలంబులిడున్.
ధనములు తస్కరణంబున
ఘనతలనపనిందలనిడి కడచురు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ధనములు,గొప్ప కీర్తులు మనుషుల గుణములను చెడగొట్టే తప్పుడు ఆలోచనలనిస్తాయి. ఇతరుల ధనములను దోపిడీ తోనూ,ఇతరులు సాధించిన గొప్ప కీర్తులను అపవాదులను ప్రచారం చేయుట ద్వారా నూ దూరం చేస్తారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి