ఓ హిందూ మేలుకో-2
ఈ రోజుల్లో మన సమాజంలో రోజు రోజుకు మన సాంప్రదాయాలమీద, మన ఆచారాల మీద ఆదరణ తక్కువ అవుతున్నది.
దానికి కారణం ఏదయినా కావచ్చు. ముఖ్యంగా ప్రతి హిందువు తన ధర్మం ఏమిటి తన కర్తవ్యం ఏమిటి తన్ను తాను ఎలా ఉద్దరించుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి తన దైనందిక జీవితాన్ని కొనసాగిస్తే ప్రతిహిందువు ఒక చక్కని వ్యక్తిత్వం వున్న ఆదర్శమూర్తిగా నిలుస్తాడు మన హిందూ ధర్మాన్ని కలకాలం నిలపటానికి తోడ్పడుతాడు.
ప్రతి హిందువు తాను తన ధర్మాన్ని ఆచరించి
తన పిల్లలకు ధర్మం పట్ల అవగాహన కలిగే విధంగా పిల్లలను పెంచవలసిన అవసరం
ఉన్నది. పిల్లలకు మాటలు వచ్చే వయసునుండి దైవభక్తిని ప్రేరేపించాలి. చిన్న వయసు పిల్లలను కూడా దేవాలయాలకు తీసుకొనిపోయి దైవదర్శనం చేయించాలి. గుడిలో తీర్థప్రసాదాలను తీసుకోవడం, శఠగోపురం పెట్టించుకోవటం, మొదలైనవి అలవాటు చేయాలి.దేవుడిని అనగా గుడిలో విగ్రహం చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించడం అలాగే గుడిలో గంటను మ్రోగించటం పిల్లలతో చేయిస్తూ ఉంటే వారికి అది ఒక వేడుక లాగా అనిపించి తర్వాత కాలక్రమేణ ఒక చక్కటి అలవాటుగా మారుతుంది.
పెద్దలు కనిపించగానే తల్లిదండ్రులు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ పిల్లలు కూడా అలానే నమస్కరించటం నేర్పించాలి. నమస్కరించేటప్పుడు జై శ్రీరామ్ అనో లేక ఓం నమస్సివాయ అని సంబోధించడం ఒక మంచి సాంప్రదాయంగా చేసుకుంటే మంచిది.
ఎల్లప్పుడు మన హిందూ దేవీ దేవతల ఔన్నత్యాన్ని తెలిపే పురాణాలూ, రామాయణ, భారతాది ఇతిహాసాలు, భాగవతాది పురాణాలు వాటికి సంబందించిన గాధలు చదువుతూ పిల్లలకు చెబుతూ ఉండాలి. దానివలన పిల్లలకు బాల్యం నుండి మన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు తెలుస్తాయి. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని సదా పిల్లలకు తెలియజేయాలి
వేమన, సుమతి, కుమార, కాళహస్తీశ్వర, దాశరథి శతకం వంటివి సదా పిల్లలకు కంఠతా వచ్చే విధంగా నేర్పాలి. నీతి శతకాలు నేర్చిన బాలలు ఏది నీతి ఏది అవినీతి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. తత్ ద్వారా చక్కటి క్రమశిక్షణ పరులుగా అవుతారు. అవినీతిని ఎదుర్కొనే ధైర్యాన్ని చిన్నప్పటినుండి అలవరచాలి.
తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శవంతులు గా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు తల్లిదండ్రులు లోను కాకూడదు. పిల్లలకు తల్లి మరియు తండ్రి ప్రేమలో లోపం లేకుండా పెంచాలి. పిల్లలు మా తల్లిదండ్రులు నాకు దొరకటం నా అదృష్టం అనే విధంగా మెలగాలి. చిన్నప్పటి నుండి వారి వారి వయస్సుకు తగినట్లుగా కుటుంబ బాధ్యతలు వారికి వప్ప చెప్పాలి. అది ప్రేమతో చేయాలి. చిన్ననాటి నుండి కుటుంబ బాధ్యతలు తీసుకున్న పిల్లలు రేపు పెద్ద అయిన తరువాత చక్కటి పౌరులుగా ఎదుగుతారు. దేశ అభివృద్ధికి దోహద పాడుతారు.
మన ఆచారాలను పాటిద్దాము, మన ధర్మాన్ని కాపాడుదాము.
జై హిందూ జై జై హిందూ
ఆచంద్ర తారార్కం మన ధర్మం వెలసిల్లేలా మనమంతా కృషి చేద్దాం.
మార్పు నానుండే మొదలు అని ప్రతివారం ఉద్యమిద్దాం.
జై శ్రీరామ్,జై శ్రీ కృష్ణ
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి