*1779*
*కం*
చెప్పెడి గతి చెప్పినపుడు
నొప్పుదురెల్లరు హితములు నుపచయమొందున్.
నొప్పెడి చందము జెప్పగ
చప్పున నుపకారమైన సడలును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! చెప్పే విధంగా చెబితే అందరూ సమ్మతించి మంచి వర్ధిల్లుతుంది. నొప్పి కలిగించే లా చెబితే ఉపకార మే అయినా చెడిపోతుంది.
*సందేశం*:-- చెప్పే నేర్పు మన మాటకి బలం చేకూర్చుతుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి