22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సౌందర్యలహరి🪷🙏🏻* *శ్లోకం - 29*

 *🙏🏻🪷సౌందర్యలహరి🪷🙏🏻*


*శ్లోకం - 29*


  *కిరీటం వైరించం పరిహర పురః కైటభ భిదః*

          *కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ |*

          *ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం*

          *భవస్యభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే ||*


ప్రసభముపయాతస్య భవనం =  అమ్మవారు తన నివాసమైన చింతామణి గృహంలో సభ తీర్చి యుండగా పరమేశ్వరుడు అక్కడికి విచ్చేస్తున్నారన్న సమాచారం అందుకొని ఆవిడ ఒక్కసారిగా *అభ్యుత్థానే* లేచారట.ఆయనకు ఆహ్వానము పలకటానికి


పరిజనోక్తి ర్విజయతే =  పరిజనులు జయజయ ధ్వానాలు చేస్తూండగా. దేవతలందరూ ఆమెకు సాగిలపడి ప్రణమిల్లుతున్నారట.


ఆ పరిజనులు చెపుతున్నారట అమ్మ ఇది బ్రహ్మదేవుని కిరీటము, ఇది దేవేంద్రుని కిరీటము, ఇది విష్ణువు కిరీటము అని చెప్తూ వారి శిరసులు కనబడటం లేదు, కిరీటాలతో సహా నేలవాల్చి వున్నాయి.


కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ = కఠినమైన ఆ కిరీటములు అమ్మవారి పాదములకు తగిలి నొప్పివస్తాయేమోనని హెచ్చరికగా చెపుతున్నారట ఆ పరిజనులు.


ఇక్కడ అమ్మవారి పాతివ్రత్యము మాత్రమే కాక ఆమె దేవాధిదేవత అనే విషయం కూడా ప్రస్తుతిస్తున్నారు.


ఇందులో ముఖ్యమైన అంతరార్థం మరొకటి వుంది.

అమ్మవారు చిచ్ఛక్తిగా మూలాధారం నుండి సహస్రారము వరకు తిరిగి వెనుకకు మేరుదండము నందు ప్రయాణిస్తున్నది. అట్టి పరదేవత సహస్రారములోని పరమశివుని చూచుటకు మూలాధారము నుండి బయలుదేరి క్రమముగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి మొదలుగా కల షట్చక్రములను దాటి సహస్రారమును చేరుతుంది. ఈ చక్రములను గ్రంథులనూ నియంత్రించే బ్రహ్మ, విష్ణు, రుద్రాదులే కాక వీరి అనుచరగణమైన 33 కోట్ల దేవతలు శరీరములో వివిధ స్థానాల్లో నిక్షిప్తమై ఉంటారు.


ఒక్కొక్క గ్రంథి విభేదనం జరిగినప్పుడు సాధకుడికి ఆ గ్రంథికి,ఆ చక్రాధిదేవతకు సంబంధించిన శక్తులు లభిస్తాయి. మోక్షగామి అయిన నిజమైన సాధకుడు ఈ సిద్ధుల వైపు చూడకుండా అమ్మవారు దేవతల కిరీటముల వంక చూడనట్లు తన ప్రయాణాన్ని ఊర్ధ్వగతిగా సాగిస్తాడు. పొరపాటున సిద్ధులకు ఆకర్షింపబడి వాటిని ఉపయోగించటం మొదలుపెడితే, అతడి సాధన భంగపడినట్లే.


ఈ కుండలినీ ప్రయాణంలో శరీరం పతనమైతే ఏ దేవత సిద్ధి అప్పటికి పొందివుంటాడో  ఆ దేవత లోకానికి చేరుతాడు. (ఇంద్ర, బ్రహ్మ, విష్ణు లోకములు మున్నగునవి).


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: