22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -53🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -53🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


.             *🌷కులశేఖర పడి🌷*


తిరుమల ఆలయంలోని వేంకటేశ్వర స్వామి మూలవిగ్రహం ఎదురుగా ఉండే గడప. ఆళ్వారులలో ఒకడు, తిరువాన్కూరు మహారాజు కులశేఖరుని పేరు మీదుగా ఈ గడప పేరు ఏర్పడింది.

కేరళ ప్రాంతానికి చెందిన విష్ణుభక్తుడు, తిరువాన్కూరు రాజ్యానికి మహారాజు కులశేఖరుడు. 12మంది వైష్ణవ మహాభక్తులు ఆళ్వారులలో ఆయన కూడా ఒకరు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు. ఆ గ్రంథంలో తిరుమల దేవునితో నీ సన్నిధికి దేవతలు, అప్సరసలు, మహాభక్తులు ఎందరో వస్తారు. అటువంటి నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లేనని తన కోరిక విన్నవించుకున్నారు. కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో ఈ గడపను కులశేఖర పడి అని పిలుస్తారు.


*🌷ఆనంద నిలయ విమానం:*

గర్భాలయం మీద మనకు బంగారు పూత పూసిన గోపురం కనిపిస్తుంది. దీనిని ఆగమ భాషలో విమానం అంటారు. శ్రీవారి దేవాలయం మీద ఉన్న విమానానికి ఆనంద నిలయ విమానమని పేరు. ఇది త్రిదళ విమానం. ఈది మూడు అంతస్తులుగా ఏర్పాటు చేయబడింది.


*🌷బేడి ఆంజనేయస్వామి దేవాలయము:*


బేడి ఆంజనేయస్వామి వారి దేవాలయం శ్రీవారి సన్నిధికి తూర్పు మాడా వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది. బేడి ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజలీ దేవి (ఆంజనేయుని తల్లి) చేతులకు బేడీలు తగిలించిందట అందుకనే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి వుంటుంది.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

కామెంట్‌లు లేవు: