22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 46*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 46*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్రీరామకృష్ణులు పరీక్ష:


నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చాడంటే చాలు, శ్రీరామకృష్ణులు  భావపారవశ్య స్థితిలో మగ్నులయ్యేవారు. కాని ఒకసారి ఈ పరిస్థితి తలక్రిందులైంది. నరేంద్రుడు వచ్చినప్పుడల్లా అతణ్ణి పట్టించుకోకుండా, ఎడముఖం పెడ ముఖంగా ఉండిపోయారు శ్రీరామకృష్ణులు;   శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో నెలకొని ఉన్నారని నరేంద్రుడు భావించాడు.  నరేంద్రుడు బయటకు వెళ్లగానే శ్రీరామకృష్ణులు తక్కిన వారితో మాట్లాడసాగారు. ఆయన మాటల శబ్దం చెవిన పడగానే నరేంద్రుడు లోపలకు వచ్చి కూర్చున్నాడు. అప్పటికీ ఆయన నరేంద్రునితో మాట్లాడకుండా, ముఖం త్రిప్పుకొని పడుకొన్నారు. ఆ పగలంతా ఇలాగే గడిచింది. సాయంత్రమయినప్పటికీ శ్రీరామకృష్ణుల వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడం చూసి నరేంద్రుడు ఆయనకు ప్రణమిల్లి కలకత్తా తిరుగు ముఖం పట్టాడు.


నరేంద్రుడు దక్షిణేశ్వరానికి రాకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు అతడి క్షేమ సమాచారాలు వాకబు చేయడానికి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఎవరినైనా కలకత్తాకు పంపడం కద్దు. కాని అతడు ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మాత్రం అదే ఎడముఖం పెడముఖం. ఈ విధంగా ఒక నెలకు పైగా గడిచింది. నరేంద్రుడు కించిత్తు కూడా కలత చెందకుండా దక్షిణేశ్వరానికి వస్తూవుండడం గమనించిన శ్రీరామకృష్ణులు చివరకు ఒక రోజు అతణ్ణి పిలిచి, "ఏం నాయనా! నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదే! అయినప్పటికీ నువ్వెందుకు వస్తూనే ఉన్నావు?” అని అడిగారు. 


అందుకు నరేంద్రుడు, “మీ మాటలు వినడానికా వస్తున్నాను? నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను. మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. అందుకే వస్తున్నాను" అని జవాబిచ్చాడు. ఆ మాటలు విన్న శ్రీరామకృష్ణులు పరమానంద భరితులై, “నా ప్రేమానురాగాలు లభించకపోతే, నువ్వు ఇక్కడకు రావడం మానుకొంటావేమోనని నిన్ను పరీక్షించి చూశాను. నీ లాంటి దృఢచిత్తులే ఇంత అవమానాన్నీ, చిన్నబుచ్చడాన్నీ దిగమింగుకోగలరు. మరొకరైతే ఎప్పుడో పలాయనం చిత్తగించేవాడు, ఈ వైపు కన్నెత్తి కూడా చూసి ఉండడు" అన్నారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: