29, ఫిబ్రవరి 2024, గురువారం

గాయత్రి జపించండి

 కంచి పరమాచార్య వైభవము…

0104b. 290224-2.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀362.



          *గాయత్రి జపించండి*

                ➖➖➖✍️


```

ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి మద్రాసులోని తేనంపేట్ నుండి నలభై మంది బ్రాహ్మణులు వచ్చారు. స్వామివారికి నమస్కరించి వారందరినీ బాధిస్తున్న ఒక సమస్య గురించి స్వామివారికి విన్నవించారు. వారు ఉంటున్న ప్రాంతంలో బ్రాహ్మణులు ధైర్యంగా తిరగడానికి సిగ్గుపడుతున్నారని, అక్కడ ఉన్న కొంతమంది నాస్తికవాదులు తమని చూసి గేలి చేస్తున్నారని, కనపడిన ప్రతిసారి వారి శిఖలు, యజ్ఞోపవితాలు, వైష్ణవ ప్రతీకలైన ఊర్ధ్వపుడ్రాలు చూసి చాలా హేళనగా మాట్లాడుతున్నారని స్వామివారితో వాపోయారు.


అంతా విన్నవెంటనే స్వామివారు వారిని ఇలా అడిగారు, “మీరందరూ రోజూ గాయత్రి జపం చేస్తున్నారు కదా?” అని.


అందరూ మౌనంగా ఉన్నారు. వారి మౌనంలోని సమాధానాన్ని స్వామివారు గ్రహించి, “ఇక రోజూ గాయత్రి జపం చెయ్యడం కొనసాగించండి. అంతా సర్దుకుంటుంది” అని ఆదేశించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశం అనుసరించి వారు రోజూ గాయత్రి జపం చెయ్యడం మొదలుపెట్టారు. రెండు నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. వారు చాలా సంతోషించారు. మహాస్వామి వారిని దర్శించి విషయం అంతా చెప్పారు.


మహాస్వామి వారందరితో ఇలా అన్నారు, “మీకు కలిగిన కష్టాలకు కారణం అంతా మీరు గాయత్రి జపాన్ని వదిలేయడమే. గాయత్రి మంత్రం యొక్క శక్తిని అంచనా వెయ్యడం, లెక్కగట్టడం సాధ్యమయ్యే పని కాదు!”


“మీ సమస్యలన్నిటికీ మూలం మీరు గాయత్రిని వదిలెయ్యడమే!”


ఇది కేవలం అక్కడున్న బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన విషయం కాదు. శాస్త్రం చెప్పినట్టు మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే ఎవరూ మనల్ని బాధపెట్టరు. అందరూ అందరిని గౌరవిస్తారు.✍️```


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

జ్ఞానాన్ని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 ||శ్లో||.    _

*ఏకమేవాక్షరం యస్తు-*

*గురుః శిష్యం ప్రబోధయేత్-।*

*పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం-*

*యద్ దత్త్వా చాఽనృణీ భవేత్-॥*


||తా|| *జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఒక్క అక్షరమే బోధించినా, అతని ఋణం తీర్చుకోవడానికి ఈ భూమి మీద సరిసమానమైనది ఏదీ ఉండదు*......

కవి చమత్కారానికి

 6000లపై ఓ కవి చమత్కారం

🌹🌹🌹

ఒక కవి అనవేమారెడ్డి కొలువుకు వెళ్లి, ఆయన్ని కీర్తిస్తూ ఈ పద్యం చదివాడట.


*అనవేమ మహీపాల స్వస్త్వస్తు తవ బాహవే*

*అహవే రిపుదోర్దండ చంద్రమండల రాహవే*

(శత్రువులను అంతమొందించడంలో అనవేమ ప్రభువు చంద్రమండలంలోని రాహువు లాంటివాడని అర్థం.)

రాజు సంతోషించి, కవికి మూడువేల వరహాల బహుమానం ప్రకటించాడు. అప్పుడు కవి, ‘ప్రభూ, మీకు నేను నాలుగు ‘వే’లిచ్చాను. మీరు నాకు మూడు వేలివ్వడం ధర్మమా?’ అన్నాడు.

రాజు కవి చమత్కారానికి మళ్లీ సంతోషించి, ‘అయితే నాలుగు వేల వరహాలు పుచ్చుకోండి’ అన్నాడు. ‘నేను మీకిచ్చినంతే మీరు నాకు ఇస్తే మీ గొప్పేమిటి?’ అన్నాడు కవివర్యుడు.

రాజు పెద్దగా నవ్వి, బహుమానాన్ని అయిదు వేల వరహాలకు పెంచాడు. దానికి కూడా ఆ కవిపుంగవుడు, ‘నేను ఆరువేల నియోగిని మహాప్రభూ’ అన్నాడట.

కవి సమయస్ఫూర్తికి మెచ్చి, ఆరువేల వరహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాజు. కానీ కవీంద్రడు ఊరుకున్నాడా! ‘నా దగ్గర వున్నదే నాకు ఇస్తే మీ ఘనత ఏమిటి ప్రభూ’ అన్నాడు.

కవి యుక్తి రాజుకు నచ్చి, ఏడు వేల వరహాలు చేశాడు బహుమానాన్ని. ఊహూ! ‘ఏడు అంకె శుభసూచకం కాదుగా’ అన్నాడు ఆ కవి.

చివరకు అనవేమారెడ్డి అక్షరాలా ఎనిమిది వేల వరహాలతో ఆ కవికేసరిని సత్కరించాడట.

పోతనగారి కవితా మాధుర్యం!

 శు భో ద యం🙏


పోతనగారి కవితా మాధుర్యం!


మందార మకరంద...


మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీవీచికల దూగు

రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు

కోయిల జేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక

మరుగునే సాంద్ర నీహారములకు


అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!

వినుత గుణశీల, మాటలు వేయునేల?


పోతన భాగవతంతో కాస్తంత పరిచయం ఉన్న ఎవరికైనా ఈ పద్యం తప్పకుండా తెలుస్తుంది. భక్తప్రహ్లాద సినిమా చూసినవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుందండోయ్! ప్రహ్లాదుడు మన తెలుగువాళ్ళ హృదయాల్లో నిలిచిపోడానికి ముఖ్య కారణం పోతనంటే అది అతిశయోక్తి కాదు. ఇందులో ఎన్నెన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయో!

కవిత్వంలో, చెప్పే విషయం ఎంత గొప్పదైనా, అది చెప్పే విధానంకూడా అంతగొప్పదీ అయితేనే పాఠకుల మనసులకి హత్తుకుంటుందనడానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.

విష్ణు భక్తిని వదలడం తన సాధ్యం కాదని చెప్పడం ఈ పద్యం సారాంశం. దాన్ని చక్కని నాలుగు ఉదాహరణల్తో సమర్ధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకున్న ఉదాహరణల్లో ఎంతో ఔచిత్యం ఉంది. తేనెటీగ, హంస, కోయిల, చకోరం - ఇవన్నీ పురుగులూ, పక్షులూను. వాటికి ఇష్టమైన ఆ వస్తువులు భౌతికమైనవి, అశాశ్వతమైనవి. అలాటి ప్రాణులకే అలాటి వస్తువులమీద అంత వదల్లేని అనుబంధం ఉంటే, ఇంక మనుషులకి, అందులోనూ అమృత ప్రాయమైన హరి చింతన వదిలిపెట్టడం సాధ్యమౌతుందా? సాధ్యమవదు అన్న జవాబు మళ్ళీ ఆ ఉదాహరణల్లోనే దొరుకుతుంది. మందారాల తేనె, గంగా ప్రవాహము, మావిడి చిగురు, వెన్నెల - వీటితో తుమ్మెద, హంస, కోయిల, చకోరాలకి ఉన్న సంబంధం అతి సహజమైనది. ప్రకృతి సిద్ధమైనది. వాటికి తెలియకుండానే పుట్టుకతో వచ్చింది. ప్రహ్లాదుని భక్తి కూడా అలాంటిదే! అందుకే దాన్ని వదులుకోడం అసాధ్యం!


పద్యం ఎత్తుకోడంతోనే అందమైన పదాలకూర్పుతో చదివేవాళ్ళ, వినేవాళ్ళ మనసులని వశం చేసుకోడం ఒక నేర్పు. ఈ పద్యంలో మరింత లోతైన కూర్పు నేర్పు కూడా చూపించాడు పోతన. ఇష్టమైన వస్తువులను ఎక్కువ పదాలతో వర్ణించి, ఇష్టపడని వస్తువులను ఒకటి రెండు పదాలతో చెప్పి ఊరుకున్నాడు. మదనములు - ఉమ్మెత్త చెట్లు. తరంగిణులు - సెలయేళ్ళు. కుటజములు - (వానాకాలంలో పూసే)కొండ మల్లె చెట్లు. సాంద్ర నీహారము - దట్టని మంచు. అయితే వీటిగురించి చెడు విశేషణాలేవీ వాడకపోవడం ఒక విశేషం. ప్రహ్లాదుడు దేనిగురించీ చెడ్డగా మాట్లాడే వాడు కాదు కదా!వాడిన క్రియలుకూడా చెప్పిన ప్రాణులకీ వస్తువులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పేవే - తేలు, తూగు, సొక్కు, స్ఫురితము (చుంబించబడిన).


అంతా చెప్పి చివరికన్న మాట చూడండీ! "అయినా నువ్వు గొప్ప గుణాలున్న శీలవంతుడివి. నీకు నేనింతగా చెప్పాలా!" ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే!

ప్రహ్లాదుని భక్తి మాట అటుంచి, కనీసం అతని సౌశీల్యాన్నయినా ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు మంచి మనుషులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనందరి చేతుల్లోనే ఉంది!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అహం ఉన్న వ్యక్తికి

 *🎻🌹🙏అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు....!!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

                                       

🌿ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. 


🌸ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి


🌿ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి  'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!") అని చెప్పాడు


🌸శల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను.. 


🌿కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు


🌸అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు


🌿మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. 


 🌸శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది.  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది


🌿ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని  వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది


🌸అంతే !మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు  ఒక్కరుకూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత... అనుకున్నాడు.


🌿 వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' 

ఏది ? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!" అనేసాడు


🌸అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు!ల్"ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది" అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది


🌿మనం పెంచుకొనే అహంభావం 

 అంత ప్రమాదకరమైనది అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. 


🌸నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ''నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు'' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం

మీరు గమనించారా ?


🌿'' అహంభావం '' అనే పదం లోంచి అహం 'తీసేస్తే మిగిలేది ' భావం ' అంటే  ' అర్థం' అర్థమైతే అనర్థం జరగదు....నమస్కారం..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

28, ఫిబ్రవరి 2024, బుధవారం

మారాల్సినది

 ముందు మారాల్సినది రాజకీయాలు నేతలు 


గురుశిష్యులు ప్రజలు మానసికంగా ఎదగాలంటే సంభాషణ సంస్కృతం వేదాలను భగవద్గీతను అనివార్యంగా నేర్చుకోవాలి



మన ప్రభుత్వాలు


మద్యపాన ఆపణాలకు

 నిర్మాణ కర్మాగారాలకు 


ధూమపానమ్ ఆపనాలకు

నిర్మాణ కర్మాగారాలకు


గుట్కా ఆపణాలకు

నిర్మాణకర్మాగారాలకు 


వాటిని ప్రచారం చేయడానికి ప్రచార మాధ్యమాలల్లో నిమిషానికి ఒకసారి

విజ్ఞాపనలకు 


రెస్టారెంటులకు

బార్ ఆపణాలకు

డిస్కో క్లబ్బులకు


అశ్లీలచిత్రాలకు

అశ్లీలసాహిత్యానికి

అశ్లీలనృత్యాలకు

అశ్లీల కథలకు

అశ్లీలఫ్లెక్సీలకు

అశ్లీలసంభాషణలను


ఆనవశ్యక పిల్లల పెద్దల నానావిధ ప్రజల మనస్సులను   విచలితం చేసే వాటికి


అనుమతులు  ఇచ్చిన రాజకీయ నాయకులదే ప్రభుత్వాలదే తప్పు


యథా రాజా తథా ప్రజా


⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡


ఈ దేశంలో మారాల్సింది రాజకీయ నాయకులు


గురుర్ బ్రహ్మ అని గురువుల గొప్పతనం చెబుతారు


గురువులను ఈ ప్రభుత్వాలు 


ప్రైవేటు గురువు అని

ప్రభుత్వ గురువు అని

పార్ట్ టైమ్ గురువు అని

కాంట్రాక్టు గురువు అని

గెస్ట్ ఫ్యాకల్టీ గురువు అని

టైమ్ స్కేల్ గురువు అని


యస్ టి గురుకులాల గురువు అని

యస్ సి గురుకులాల గురువు అని


బి.సి గురుకులాల గురువు అని


ఓ.సి గురుకులాల గురువు అని


మైనారిటీల గురుకులాల గురువు అని


విడదీసినారు


ప్రభుత్వ గురువులకు తప్ప మిగితా గురువులకు చాలీ చాలని వేతనాలు ఇస్తున్నారు


అది కూడా 7 8 నెలలు మాత్రమే


ఈ తెలంగాణాలో 


గురువులందరికి మినిమమ్


50 వేల జీతం ఉండాలి


పోలీసు ఆర్మీ రంగం వలే గురువుల రంగం ప్రభుత్వ ఆధీనమై ఉండాలి


గురువులను సైతం సమాజాన్ని గొప్పగా మార్చే

 క్రమశిక్షణగా ఉంచే ఉండే 


పోలీసు 

ఆర్మీ రంగం వలే ఉంచి 


సరైన వేతనం ఇచ్చి కొన్ని బాధ్యతలను ఇవ్వాలి


ప్రపంచంలో మనిషి మనీషి కావాలంటే నీతిగా మనుగడసాగించాలన్న


అది ఒక్క గురువు వలనే సాధ్యం అని ఈ సమాజం గ్రహించాలి


విద్యను వ్యాపారం చేసి గురువులను బానిసలుగా చేసిననాడే మానవత్వం మాయం అయినది


అర్హులైన వక్తలైన కవులైన పండితులైన ఋషిలైన అంకితభావం గొప్ప మేధావంతులైన గురువులు ఉండాలి

జన్మించాలి


అలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి


యోగ్యలైన గురువులను గుర్తించి ప్రభుత్వం లో భాగస్వామ్యం చేసి


సలహాలు పొందుతూ


గురు శిష్యులను వారి కుటుంబాలను

 అన్ని విధాలుగా ఆదుకోవాలి


గురువులకు


50 వేల వేతనం 12 నెలలు ఇవ్వాలి


అర్హులైన గురువులందరిని కాపాడుకోవాలి ప్రోత్సహించాలి


 గురు శిష్యులందరూ


 గొప్ప వక్తలు కవులు పండితులు ఋషులు పరోపకారపరాయణులు 

నాయకులు కావాలి


సంఘసంస్కర్తలు కావాలి


ఈ సమాజస్వరూపాన్ని కుల్లు రాజకీయాలను మార్చేయాలి


ఏ దేశంలో గురుశిష్యులు మేధోమథనం చేస్తారో


ఆ దేశంలోనే పరోపకారపరాయణులు గొప్ప నాయకులు జన్మిస్తారు


ఈ ప్రపంచచరిత్ర మార్చేస్తారు


సంస్కృతభాషను జాతీయ భాషగా ప్రకటించుకుందాం


వేదాలను భగవద్గీతను జాతీయ గ్రంథాలుగా


ఆవును జాతీయజంతువుగా చేద్దాం


ఈ విశ్వమానవుల చరిత్రను మార్చేద్దాం


వీథి వీథి లో 


సంస్కృతమాధ్యమ గురుకులాలను స్థాపిద్దాం


సంస్కృతసంభాషణను విశ్వసంభాషణం కుర్యామ

పాఠశాలలో

 *🎒మన పాఠశాలలో..!!*

====================


*"ఏంటి సర్..సిలబస్* *అయిపోవచ్చిందా?"*

*అన్న మాటలు విని  వెనక్కి తిరిగి చూసా..*


*ఎదురుగా* *హెడ్డుమాస్టర్..*

*కళ్ళజోడు* *సవరించుకుంటూ..*


*"లేదు సర్,ఇంకా ఒక లెసన్ ఉంది"*

*కొంచెం తటపటాయిస్తూ నా సమాధానం.*


*"మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు"*

*అని మా హెడ్డుమాస్టర్ కొంచెం గంభీరంగానే అడిగారు.*


*"సమాజంలో విలువలు" కోసం చెప్తున్నా సర్..!*

*అని*

*"సర్" కళ్ళలోకి కొంచెం గర్వంగా చూస్తూ..చెప్పా*

*ఆ మాటకు మా హెడ్డు గారు కొంచెం చిరాకుగా మొహం పెట్టి*

*"అవన్నీ నీకు ఎవరు చెప్పామన్నారయ్యా?"*

*అని పిల్లల వైపు ఒకసారి తేరిపారా చూసి బయటకు రమ్మన్నారు.*

*వెళ్లి ఆయన ఎదురుగా నిల్చున్నా..*


*నన్ను ఒకసారి పైకి కిందకి చూసిన ఆయన*

*కొంచెం మెల్లిగా మాట్లాడుతూ..*


*"నీకేమైనా పిచ్చా?"*


*"ఈ రోజుల్లో పేరెంట్స్ వచ్చి మా వాడికి మార్కులు ఎందుకు తగ్గాయి అని అడుగుతారు కానీ..*

*"విలువలు,క్రమశిక్షణ ఎంతవరకు నేర్పించారు?"అని అడగరయ్యా!!*


*"పోనీ ప్రోగ్రెస్ రిపోర్టులో విలువలు, క్రమశిక్షణ కాలమ్  ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా??"*


*"ఈ రోజుల్లో వాటితో పెద్ద పనిలేదయ్యా"*


*అని చెప్పి..నాకు ఆయన మరింత దగ్గరగా వచ్చి*


*"ముందు సిలబస్ కంప్లీట్ చేసి,మన బడుద్దాయిలకి నాలుగు ప్రశ్నలు ఇచ్చి కంటస్థ పెట్టించు.విలువలదేముంది బాబూ..!అవి మనం* *నేర్పించకపోయినా ఎవడూ అడగడు"అన్నారు.*


*ఆ మాటకు నా మొహంలో వస్తున్న మార్పులు* *గమనించినట్టున్నారు.*  *మా హెడ్డుమాస్టర్.*

*వెంటనే..ఇలా అన్నారు.*


*"ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి కత్తి మీద సాము లాంటిదయ్యా!"*


*నాకు అర్ధం అయ్యీ..అవనట్టుగా ఉండి అలానే చూస్తున్నాను.*


*ఆయన నా వైపే చూస్తూ..*


*"అవునయ్యా..!ఈ రోజుల్లో మనం వాళ్ళకి చదువు మాత్రమే చెప్పగలం.*

*"జ్ఞానం"ఇవ్వడానికి మన దగ్గర టైం లేదు.*


*"జ్ఞానం" ఇవ్వాలంటే*


*"క్రమశిక్షణ" కావాలి...అది నేర్పించాలంటే*


*"దండన" కొన్నిసార్లు తప్పకపోవచ్చు.*


*కానీ...ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పనేనా..!?*


*ఎంతమంది విద్యార్థులని రోజూ చూడటంలేదు*


*ఒకడు కన్నాలున్న పాంటుతో వస్తాడు*

*ఇంకొకడు సగం*

*గొరిగి మధ్యలో వదిలేసిన హెయిర్ స్టైల్  తో వస్తాడు.*

*"అదేమిట్రా?" అంటే*

*మా నాన్న చేయించాడు అంటాడు.*

*మరొకడేమో..*

*నిన్ను..నన్నూ..* *గుద్దుకుంటూ పోతాడు.*


*"అది తప్పురా"*

*అని కొంచెం గద్దిస్తే చాలు*

*సాయంకాలానికి వాడి తల్లిదండ్రులు*

*"గేట్"ముందు ధర్నాకు దిగుతారు.*


*పోనీ..వాళ్ళకే ఏదో సర్దిచెపుదాం అంటే..*


*"డబ్బులు కడుతున్నాము..గుద్దితే కొంచెం సర్దుకుపోలేరా??" అని మనల్నే ప్రశ్నిస్తారు.*


*"పిల్లవాడికి మొదటి సమాజం పాఠశాల"*


*సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకునేది ఇక్కడే..!*


*కానీ...*


*"విద్యార్థి చేసిన ఏ చిన్న తప్పుకు కూడా పాఠశాల లో దండన లేదు కాబట్టే వాడు పెద్దయ్యాక సమాజంలో తప్పు చేయడానికి భయపడటం లేదు."*


*విచిత్రం ఏమిటంటే..!!*


*చేసిన తప్పుకు పాఠశాలలో దండన లేదు కానీ*

*సమాజంలో మాత్రం ఉంటుంది.*

*పాపం అది తెలుసుకునే సరికే..వాడు తల్లిదండ్రుల చేయి దాటిపోతాడు.*


*"మా వాడిని ఎందుకు దండిచావయ్యా?"*

*అని "జిల్లా జడ్జి గారి"ని అడగలేరు కదా..*

*తప్పుకు శిక్ష పడాల్సిందే కదా..*


*అదే పాఠశాల లో సరిఅయిన*

 

*"శిక్షణ"*


*జరగడానికి..వీళ్లందరూ సహకరిస్తే..ఆ*

*"శిక్ష"లు పడవు కదా..*


*అని చెప్పి,కొంచెం ఆలోచించి మళ్లీ ఇలా అన్నారు.*


*"నాకు కూడా మంచి సమాజం స్థాపన కోసం*

*క్రమశిక్షణ కలిగిన విద్యార్థులని తయారు చేయాలని ఉందయ్యా..!"*


*"చదువంటే మార్కులు కాదు,క్రమశిక్షణ మరియు విలువలతో కూడిన జ్ఞానం అని ప్రతి పేరెంట్* *తెలుసుకున్నపుడు..తప్పకుండా మనం మంచి సమాజ స్థాపన కోసం పాఠశాలలోనే పునాది వేద్దాం"*


*అని చెప్తూ..ఆయన గది వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు.*


*నేను ఆయన్నే తదేకంగా చూస్తూ..నిల్చుండిపోయాను.*


*"సైనిక పాఠశాలలో ఎంతోమంది* *విద్యార్థులని బెత్తం దెబ్బలతో అయినా* *"క్రమశిక్షణ" నేర్పించి*

*వారిని ఉత్తములుగా తీర్చిదిద్దిన*

*"హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు "*

*ఈ రోజు మార్కుల కోసం ఆలోచించడం ఏంటో..!!"*


*"హ్మ్మ్..ఏదైనా తల్లిదండ్రులకి కావాల్సింది ఈ రోజుల్లో మార్కులే కదా..!!"*


*అని మా ఆఫీస్ బాయ్ లింగరాజు అంటున్న*

*మాటలు నా చెవికి అస్పష్టంగా వినిపిస్తున్నాయి.*


*రాసిన మహానుభావుడికి...*

🙏🙏🙏🙏🙏🙏

Panchaag


 

/ రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*28-02-2024 / బుధవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


సోదరులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున  ఊహించని  మార్పులు ఉంటాయి. 

---------------------------------------

వృషభం


ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా  వ్యవహరిస్తారు.  నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున  పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి  అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం


ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

సింహం


ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా  ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బందిపడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

---------------------------------------

కన్య


నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

---------------------------------------

తుల


ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు  ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప  ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు  వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

ధనస్సు


వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ  బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.

---------------------------------------

మకరం


కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు  నుండి బయట పడతారు. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.

---------------------------------------

కుంభం


నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో  దూర ప్రయాణాలు చేస్తారు.

---------------------------------------

మీనం


ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

ధర్మార్థములు లేని చోట

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 ||శ్లో||.   

*ధర్మార్థౌ యత్ర న స్యాతామ్*

*శుశ్రూషా వాపి తద్విధా|*

*తత్ర విద్యా న వక్తవ్యా* 

*శుభం బీజమివోషరే||*


||తా|| *ధర్మార్థములు లేని చోట, వినవలెనని కోరిక లేని చోట విద్యని బోధించరాదు*.... బోధించినట్లైన చవిటిభూమిలో విత్తనములు జల్లినట్లేయగును...

మాఘ పురాణం

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*🌺మాఘ పురాణం - 18 వ అధ్యాయము🌹*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*ఇంద్రుని శాపవిముక్తి*


శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను." దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు.


మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు, శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో, శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో, రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని  దానములలో, ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము, సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ, ఇలా సర్వనదులయందును, పది సంవత్సరముల పాటు, సూర్యోదయ సమయమున, స్నానము చేసినచో, వచ్చు పుణ్యము, మూడు దినములు, అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి, పూజ  మున్నగువానితో, వివిధ పుష్పములతో, సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన, మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, మాఘవ్రత మహిమను వివరించెనుl.


దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి, యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి, చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను, ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని, శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి, మరునాడు మాఘస్నానాదికమును చేసి, ఆ తీర్థమును తొండపై పోసిరి.


పవిత్రోదకముచే తడిసిన తొండ, దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను." నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున, నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి, తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి, నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.


నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ, చూచువారెవరును లేకపోవుటచే, భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు, బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు, జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమననేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి, పరిహాసము చేసితిని. ధనమును దాచి, సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి, నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములను విడిచి, దురాచారవంతురాలనై, జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.


పులి, కోతి, ఎద్దు, మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాటి  జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును, ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన, మీరు దయయుంచి, నాకు శాపవిముక్తిని కలిగించిరి" అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే, ఆమె దేవతత్వమునంది,' దేవప్రియ' అను పేరును పొందెను. దేవతలలో, ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును, దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో, వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి, బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి, వెంబడించి, వానిని ఊరడించి, ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు, మహావిష్ణువు, నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ, ప్రకారము చేయుదము" రమ్మని, తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెనుl.


ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి, సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము, ఇంకను వినవలెననున్నది. ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు .


ధనసంపాదనము తప్ప, ధనవినియోగము నాతడు  చేయలేదు. పూజ, దానము, మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత, నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి, దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై, పంపాతీరమున, మఱ్ఱిచెట్టు పైనుండి, అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి, ఆ ప్రాంతమునకు, శిష్యులతో వచ్చి, మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు, మాఘస్నానము, పూజ, మున్నగునవి  చేయుచు, శిష్యులకు, మాఘమాస మహత్త్యమును, వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు, నొకనాడు, మాఘస్నానము చేసిన వారి సర్వపాపములును, సూర్యోదయమువలన  చీకట్లు నశించినట్లుగా, నశించును. మాఘస్నానము చేయనివాడు  నరకమునపోవును" అనుచు, మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను,  వివరించుచుండెను. ఆ సమయమున, పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము, వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు, పంపాజలమున, మాఘస్నానమును, వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన, వాని పిశాచరూపముపోయి, దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన, వైకుంఠమును చేరెను.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు; కోరి మనో వా గగోచరుఁడవు*

*నిద్ధ మనోరథ హేతుభూ తోదార; గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల*

*విశ్వోద్భవస్థితి విలయార్థ ధారిత; విపుల మాయాగుణ విగ్రహుఁడవు*

*మహి తాఖి లేంద్రియ మార్గ నిరధిగత; మార్గుఁడ వతిశాంత మానసుఁడవు*


కేశవా! నీవు ఎడతెగకుండా వచ్చిపడే ఘోరమైన కష్టాలనన్నింటినీ రూపు మాపుతావు. నీవు మనస్సులకూ, మాటలకూ అందనివాడవు. నీ గుణాలూ, నీ పేరులూ, భక్తుల హృదయాలలో చెలరేగే మోక్షకాంక్షను చక్కగా ఫలవంతం చేస్తాయి. సత్త్వగుణం నీ సొమ్ము. సంస్త లోకాల పుట్టుక, స్థితి, వినాశమూ అనే పనులను నిర్వహించడానికి నీవు మాయాగుణాలతో కూడిన రూపాలను స్వీకరిస్తావు. ఇంద్రియమార్గాలన్నీ నీ మార్గం దగ్గర నిలిచి పోతాయి. ఆ మార్గాలు నీ మార్గంలో అడుగు కూడా పెట్టలేవు. ప్రశాంతమైన మనస్సుతో విరాజిల్లుతూ ఉంటావు. భక్తుల సంసారమనే ఘోరమైన బంధాన్ని ఎలా నాశనం చేయాలో తెలిసిన జ్ఞానస్వరూపుడవు నీవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. సర్వభూతాల హృదయాలే నీ ఆలయాలు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! వాసుదేవా! నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాము.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 36*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః ।*

*నిందంతస్తవ సామర్థ్యమ్ తతో దుఃఖతరం ను కిమ్ ।।*


*భావము:* 

నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనయిపోతుంది. అయ్యో, దీని కంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?

 

వివరణ: ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీ కృష్ణుడు 'నిందంతః' అంటే 'నిందించుట, దూషించుట' అని. 'అవాచ్య వాదాన్' అంటే, 'నపుంసకుడు' వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు "చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి, కాళ్ళ మధ్యలో తోక ముడుచుకున్న కుక్క లాగ పారిపోతున్నాడు" అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాల బాధాకరంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు గుర్తుచేస్తున్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 41*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 118*


*అదిఇది యని మది దోచెడు*

*సదనము గుర్తించి లోనె సాధించినచో*

*గుదురును బ్రహ్మానందము*

*గదసిన మది జేరనొక్కి కనవలె వేమా !*


*🌹తాత్పర్యము --*

ఆత్మసాక్షాత్కారముతో బ్రహ్మానందము కలుగునని గ్రహించాలి.


*💥వేమన పద్యాలు -- 119*


*అదియొకటి దెలిసి యాదిని నిల్పిన*

*యాది బాయకున్న నభవు డవును*

*యాది బాయువాడు యంధుని రీతిరా*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

ఆదిమధ్యాంతములు తెలిసినవాడే దైవస్వరూపుడగును.

అది తెలియని వాడు గృడ్డివానితో సమానము.


*💥వేమన పద్యాలు -- 120*


*అధముడైన మనుజు డధికుని జబట్టి*

*యతని మాట నడచు నవని లోన*

*గజపతింట నెన్న గవ్వలు చెల్లవా* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అధముడు , అధికుని చేరి అతని మాటే వేదవాక్కుగా భావించి ప్రవర్తిస్తాడు.

గజపతి ఇంటిలో అల్పులెందరు చలామణిగాలేరు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నీచుల ఆశ్రయం

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 నీచాశ్రయో న ఖలు కర్తవ్యః

కర్తవ్యో మహదాశ్రయః|

పయోపి శౌండకీహస్తే

వారుణీత్యభిధీయతే||


తా𝕝𝕝 "నీచుల ఆశ్రయం, సహవాసం ఎప్పుడూ చేయకూడదు. మహదాశ్రయం అంటే మహానుభావుల ఆశ్రయం సాంగత్యం ఎల్లప్పుడూ కర్తవ్యంగా జీవించాలి. మద్యం విక్రయంచే ఆమెవద్ద పాలు వున్నా మద్యం గానే భావిస్తారు. అలాగే నీచుల ఆశ్రయం లో ఎంత నిష్ఠగా వున్నా నీచునిగానే పరిగణిస్తారు."


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

దేహములకు

 *1998*

*కం*

పనిచేసెడి దేహములకు

ఘనమగు ధారుఢ్యమెల్ల కలుగును ధరణిన్.

పనులను తప్పించుకొనెడి

తనువులు రోగముల బడును తరచుగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పనిచేసే శరీరములకు గొప్ప దారుఢ్యము కలుగుతుంది. పనులను తప్పించుకొనే శరీర ములు తరచుగా రోగాలబారిన పడుతూ ఉంటాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

జాతీయ విజ్ఞాన దినోత్సవం

 *నేడు జాతీయ విజ్ఞాన దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)*


1986 లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC- National Council for Science and Technology Communication) ఫిబ్రవరి 28 ను జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day) గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశం 1986 లో ఈ రోజును జాతీయ విజ్ఞాన దినంగా అంగీకరించింది మరియు ప్రకటించింది.


 *ఫిబ్రవరి 28 నే ఎందుకు?* 


చంద్రశేఖర్ వెంకటరామన్ (CV Raman)  *'రామన్‌ ఎఫెక్ట్‌'*  కనుగొన్న (పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన) రోజైన ఫిబ్రవరి 28 (1928) జ్ఞాపకార్థం జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.


 *రామన్ ప్రభావం (Raman Effect):* 


సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సి.వి.రామన్ సిద్ధాంతీకరించాడు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ప్రభావం *(Raman scattering or Raman effect)* అంటారు. కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

వైవాహిక వైఫల్యాలకు

 నేటి వైవాహిక వైఫల్యాలకు కారణం?


1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,

చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)

(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)


3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!


4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...!


5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి

రావటం వధూవరులని ఆశీర్వదించటం..

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి

జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!


6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!


7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!


ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....


అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.


వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి.


అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం

నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..


    🙏 సర్వేజనా సుఖినో భవంతు !🙏

చంద్రశేఖర్ ఆజాద్ ఈ

 తన సొంత దేశస్తుల చేత మోసం చేయబడిన చంద్రశేఖర్ ఆజాద్ ఈ రోజు 1931లో అలహాబాద్‌లో అమరుడయ్యాడు.


చంద్రశేఖర్ ఆజాద్ 23 జూలై 1906న అలీరాజ్‌పూర్ రాచరిక రాష్ట్రంలోని "చంద్ర శేఖర్ తివారీ" గా భాభ్రా గ్రామంలో జన్మించారు . అతని పూర్వీకులు ఉనావో జిల్లాలోని బదర్కా గ్రామానికి చెందినవారు . అతని తల్లి, జాగ్రణీ దేవి, సీతారాం తివారీకి మూడవ భార్య, అతని ముందు భార్యలు చిన్నవయస్సులోనే మరణించారు. బదర్కాలో వారి మొదటి కుమారుడు సుఖ్‌దేవ్ పుట్టిన తరువాత, కుటుంబం అలీరాజ్‌పూర్ రాష్ట్రానికి మారింది . 


అతని తల్లి తన కొడుకు గొప్ప సంస్కృత పండితుడిని కావాలని అతనిని కాశీ విద్యాపీఠం, బనారస్‌కు పంపమని అతని తండ్రిని ఒప్పించింది . 1921లో, సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు 15 ఏళ్ల విద్యార్థి చంద్ర శేఖర్ ఉద్యమంలో చేరాడు. ఫలితంగా డిసెంబర్ 20న అరెస్టయ్యాడు. ఒక వారం తర్వాత పార్సీ జిల్లా మేజిస్ట్రేట్ జస్టిస్ MP ఖరేఘాట్ ముందు హాజరుపరచి వివరాలు అడగ్గా అతను తన పేరును "ఆజాద్" ( ది ఫ్రీ ), తన తండ్రి పేరును"స్వతంత్రత" మరియు అతని నివాస స్థలం "జైలు" అని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన మేజిస్ట్రేట్ అతడిని 23 వారాల పాటు జైలులో ఉంచాలని, రోజుకు 15 కొరడా దెబ్బలు వేయాలని ఆదేశించాడు. 

అప్పటి నుండి చంద్రశేఖర్ తివారీ చంద్ర శేఖర్ ఆజాద్ గా గుర్తింపబడ్డాడు.


1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సస్పెండ్ చేసిన తర్వాత , ఆజాద్ నిరాశ చెందారు. అతను ఒక యువ విప్లవకారుడు మన్మత్ నాథ్ గుప్తాను కలిశాడు, అతను హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) అనే విప్లవ సంస్థను 1923 లో స్థాపించిన రామ్ ప్రసాద్ బిస్మిల్‌కు పరిచయం చేశాడు . అజాద్ HRAలో క్రియాశీల సభ్యుడిగా మారి HRA కోసం నిధులను సేకరించడం ప్రారంభించాడు. నిధుల సేకరణలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడం ద్వారానే జరిగింది. అతను 1925లో కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నాడు. లాలా లజపత్ రాయ్ హత్యకు ప్రతీకారంగా 1928లో లాహోర్‌లో జాన్ పి. సాండర్స్‌ను కాల్చిచంపడం మరియు చివరకు1929లో వైస్రాయ్ ఆఫ్ ఇండియా రైలు పేల్చేసే ప్రయత్నంలో కూడా పాల్గొన్నాడు.


1925లో కాకోరి రైలు దోపిడీ తరువాత , బ్రిటిష్ వారు విప్లవ కార్యకలాపాలను అణిచివేశారు. ప్రసాద్, అష్ఫాఖుల్లా ఖాన్ , ఠాకూర్ రోషన్ సింగ్ మరియు రాజేంద్ర నాథ్ లాహిరి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మరణశిక్ష విధించబడింది. ఆజాద్, కేశబ్ చక్రవర్తి మరియు మురారి లాల్ గుప్తా పట్టుబడకుండా తప్పించుకున్నారు. ఆజాద్ తరువాత శివ వర్మ మరియు మహాబీర్ సింగ్ వంటి తోటి విప్లవకారుల సహాయంతో HRAని పునర్వ్యవస్థీకరించారు.


1928లో, భగత్ సింగ్ మరియు ఇతర విప్లవకారులతో కలిసి అతను రహస్యంగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)ని పునర్వ్యవస్థీకరించాడు, 8-9 సెప్టెంబర్, వారి ప్రాథమిక లక్ష్యాన్ని సాధించడానికి దానిని హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)గా మార్చాడు.


27 ఫిబ్రవరి 1931న, అలహాబాద్‌లోని CID పోలీసు అధిపతి సర్ JRH నాట్-బోవర్‌కి ఆజాద్ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఉన్నాడని అతని సహచరుడు సుఖ్‌దేవ్ రాజ్‌తో మాట్లాడుతున్నాడు అని ఎవరో తెలియజేశారు. ఆ సమాచారంతో అరెస్ట్ చేసేందుకు తనతో పాటు పార్కుకు రమ్మని అలహాబాద్ పోలీసులను బోవర్ పిలిచాడు. పార్కు వద్దకు చేరుకున్న పోలీసులు నాలుగు వైపులా చుట్టుముట్టారు. డీఎస్పీ ఠాకూర్ విశ్వేశ్వర్ సింగ్‌తో పాటు కొందరు కానిస్టేబుళ్లు రైఫిల్స్‌తో పార్క్‌లోకి ప్రవేశించడంతో కాల్పులు జరిగాయి. సుఖ్ రాజ్ క్షేమంగా బయటపడ్డాడు. ఆజాద్ మాత్రం తనను తాను రక్షించుకోవడానికి ఒక చెట్టు వెనుక దాక్కుని కాల్పులు ప్రారంభించాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. సుదీర్ఘ షూటౌట్ తర్వాత, ఎల్లప్పుడూ ఆజాద్‌గానే ఉంటానని, మరియు సజీవంగా బంధించబడను అనే తన ప్రతిజ్ఞకు కట్టుబడి అతను తన తుపాకీ యొక్క చివరి బుల్లెట్‌తో తన తలపై కాల్చుకున్నాడు. షూటౌట్‌లో బోవర్ మరియు DSP సింగ్‌లకు వరుసగా కుడి అరచేతి మరియు దవడలకు గాయాలయ్యాయి. ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత పోలీసులు ఆజాద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


సాధారణ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని దహన సంస్కారాలకు రసూలాబాద్ ఘాట్‌కు తరలించారు. ఇది వెలుగులోకి రావడంతో ఘటన జరిగిన పార్కును ప్రజలు చుట్టుముట్టారు. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆజాద్‌ను కొనియాడారు. 


ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆజాద్ వంటి నిస్వార్థ స్వాతంత్ర యోధులు చనిపోడానికి ప్రధాన కారణం దేశభక్తి లేకుండా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఊడిగం చేసిన భారతీయులే.. నేడు కూడా దేశభక్తి లేకుండా విదేశీ భావజాలాన్ని తలనిండా నింపుకుని విదేశీ నిధులతో ఈ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న వెన్నుపోటు దారులు వున్నారు. అందుకే జాతీయవాదులు అటువంటి దేశ ద్రోహుల అజెండాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ప్రజలను జాగృతం చేయాలి.


25 సం. ల చిరు వయసులోనే అలా ముగిసింది ఒక విప్లవవీరుడి జీవిత గాధ.


🙏🙏🙏


....చాడా శాస్త్రి అన్న గారి వాల్ నుంచి....

దంపత్సమేత దీక్ష..*

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..


*దంపత్సమేత దీక్ష..*


నాలుగైదేళ్ల క్రిందట దత్త దీక్షా కార్యక్రమం జగుతున్న నాటి సంఘటన ఇది..

"అయ్యా..నలభై ఒక్క రోజుల మండలదీక్ష రేపు కూడా తీసుకోవచ్చా..? మా ఇంటాయన చేత దీక్ష చేయిద్దామని అనుకుంటున్నాను.." అని మా దేవస్థానం లో పనిచేసే సిబ్బందిని అడిగిందా ఇల్లాలు..ఆమె పేరు వెంకట సుబ్బమ్మ, ఆమె భర్త పేరు కొండయ్య.."రేపే చివరి రోజు..రేపు వచ్చి దీక్ష తీసుకోండి.."-అని మా వాళ్ళు జవాబు చెప్పారు..తలవూపి వెళ్ళిపోయింది..


వెంకట సుబ్బమ్మ కొండయ్య దంపతులు..ఇద్దరు పిల్లలు..కొన్నాళ్ళు సంసారం బాగానే గడిచింది..కొండయ్య ఏకారణం చేతో తెలీదు కానీ తాగుడికి బానిస అయ్యాడు..ఆనాటి నుంచీ సంసారం లో కలతలు ప్రారంభం అయ్యాయి..అతని సంపాదన మొత్తం తాగుడికి సరిపోతోంది..వెంకట సుబ్బమ్మ కూలి పనులు చేసి, కాపురాన్ని నెట్టుకొస్తోంది..భర్త స్వతహాగా మంచివాడే..కానీ ఈ దురలవాటు అతనిని మార్చివేసింది..త్రాగుడు మానుకోమని ఎన్నోసార్లు భర్తను బ్రతిమలాడి చెప్పుకున్నది..ఆ పూటకు సరే అంటున్నాడు..మళ్లీ ప్రక్కరోజుకు త్రాగుతున్నాడు..సరిగ్గా ఆ సమయం లోనే, మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మండల దీక్ష మొదలవుతున్నదనీ..ఎలాగో ఒకలాగా బ్రతిమలాడి కొండయ్య చేత దీక్ష ఇప్పిస్తే..అతను బాగు పడతాడనీ సుబ్బమ్మకు అనిపించింది...ఆ వివరం కనుక్కోవడానికే ముందుగా మందిరానికి వచ్చింది..


కానీ చుట్టుప్రక్కల వాళ్ళు, "ఈవిడ తాపత్రయ పడుతున్నది గానీ..వాడు తాగుడు మానుతాడా?..అనవసరంగా ఆ స్వామి దీక్ష తీసుకొని కొనసాగించకుండా..మళ్లీ తాగి, పాపం మూటగట్టుకుంటాడు.." అని చాటుమాటుగా కొందరు..ఎదురుగానే మరికొందరు అనేశారు.."అన్నిటికీ ఆ దత్తయ్యే వున్నాడు..ఆయన దీక్ష లో ఉన్నన్నాళ్ళూ నేను కూడా అక్కడే ఉంటాను..మా పిల్లలతో సహా ఆ స్వామి చెంతనే ఉంటాము..స్వామి మీదే భారం వేస్తున్నాను.." అని చెప్పింది వెంకట సుబ్బమ్మ నిశ్చయంగా..


ఆ ప్రక్కరోజు ఉదయాన్నే కొండయ్యను, పిల్లలను వెంటబెట్టుకొని, మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, కొండయ్యకు దీక్ష ఇప్పించింది...స్వామివారి విగ్రహం ముందు నిలబడి మనస్ఫూర్తిగా మొక్కుకుంది..తన భర్త ఆ దురలవాటు ను పూర్తిగా మానుకొని, తన సంసారం చక్క బడాలని కోరుకున్నది సుబ్బమ్మ..దీక్షా మాలలు కొండయ్య మెడలో వేసేముందు.."అయ్యగారూ..మీరు కూడా ఈయనకు..దీక్ష సక్రమంగా చేయమని గట్టిగా చెప్పండి.." అని నన్ను అడిగింది..


ఆ నలభైరోజులూ ఆ దంపతులు పిల్లలతో సహా శ్రీ స్వామివారి మందిరం వద్దే వున్నారు..ప్రతిరోజూ కొండయ్య తో పాటు, వెంకట సుబ్బమ్మ కూడా శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు చేసేది..పది రోజుల కల్లా కొండయ్య మనసులో అంతర్మధనం మొదలైంది..తాను ఇంతకు ముందు గడిపిన జీవన విధానం సరికాదని అతనికే అనిపించసాగింది..అతను మరింత నిష్ఠగా శ్రీ స్వామివారి దీక్ష కొనసాగించ సాగాడు..


వైశాఖ మాసం శుద్ధ సప్తమి నాడు శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం జరుగుతుంది..(ఈ సంవత్సరం మే 11 వతేదీ నాడు శ్రీ స్వామివారి ఆరాధన)..ఆ ముందురోజు, దత్తదీక్ష స్వీకరించిన స్వాములందరూ మొగిలిచెర్ల గ్రామం లో గల రామాలయం వద్దనుంచి నీరు నింపిన కలశాలతో ఊరేగింపుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, ఆరోజు రాత్రి 12 గంటల తరువాత, శ్రీ స్వామివారి సమాధికి ప్రదక్షిణ చేసి, తాము తెచ్చిన కలశం లోని నీటితో శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేస్తారు..స్వాములందరితో పాటు కొండయ్య కూడా శ్రీ స్వామివారికి అభిషేకం చేసాడు..ఆ ప్రక్కరోజు ఉపవాసం వుండి, ఆరాధన నాటి రాత్రికి అగ్నిగుండం లో నడిచాడు..


దీక్ష విరమణ చేసినా కొండయ్య త్రాగుడు జోలికే వెళ్ళలేదు..పూర్తిగా మానేశాడు..ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి దీక్ష తీసుకుంటాడు..ప్రస్తుతం ఆ దంపతులు హైదరాబాద్ లో వుంటున్నారు..కొండయ్య మేస్త్రీ గా పనిచేయటం మొదలుపెట్టి, ఇప్పుడు స్వంతంగా కాంట్రాక్టులు చేస్తున్నాడు..తమను తమ సంసారాన్ని ఆ దత్తయ్య స్వామే కాపాడాడని పదే పదే చెప్పుకుంటారిద్దరూ..దీక్ష కాలంలో ఏదో ఒకరోజు, శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్న ఇతర దీక్షాధారులకు, భక్తులకు అన్నదానం చేయడం ఆ దంపతుల నిర్ణయం..గత నాలుగేళ్లుగా అదే పాటిస్తున్నారు..


దత్త దీక్ష స్వీకరించి, ఆచరించే భక్తుల అనుభవాలు కోకొల్లలు..ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం..అయితే అందరూ చెప్పేది ఒకటే మాట.."ఆ స్వామివారి వద్ద దీక్ష తీసుకుని..నిష్ఠ తో ఆచరిస్తే..మన కష్టాలు తొలిగిపోతాయి..మనలను దత్తాత్రేయుడే కాపాడతాడు.." అని..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx




(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

తెలియగ లేరే నీ లీలలు....

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..


*తెలియగ లేరే నీ లీలలు....*


*ఆవుల మల్లిఖార్జున..*


మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తుడు..శ్రీ స్వామి వారి మందిరంలో మొదట దత్తదీక్ష తీసుకున్న అతి కొద్దిమందిలో మల్లిఖార్జున కూడా ఒకడు..క్రమం తప్పకుండా స్వామి వారిని సేవించుకునే వాడు..


ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దత్త దీక్ష స్వీకరించి..ఆ నలభై రోజులపాటూ శ్రీ స్వామివారి మందిరం వద్ద నిష్ఠతో దీక్ష కొనసాగించడం మల్లిఖార్జున అలవాటు..ప్రతి క్షణం శ్రీ స్వామి వారి సేవలోనే కాలం గడుపుతూ వుండేవాడు.. దీక్షలో ఉన్న ఇతర స్వాములకు కంకణాలు కడుతూనో.. వాళ్ళ కంఠం లో చిక్కుపడిన దీక్ష మాలలు సరిచేస్తూనో..సాయంత్రం భజనకు కావాల్సిన సరంజామా సర్దుతూనో..దీక్ష ముగింపు ముందు కలశాలు స్వాములకు నెత్తిన పెడుతూనో..స్వామీ వారి అభిషేక సమయంలో ఇతర స్వాములకు సహాయం చేస్తూనో.. స్వామీ వారి సమాధి కి అద్దే గంధం కలుపుతూనో...నిరంతరం ఆ స్వామీ సేవలోనే గడుపుతూ ఏ మాత్రం అహంకారం లేని భక్తుడు..


సౌమ్యుడు..మితభాషి..ఎవ్వరి విషయంలోనూ అనవసరపు జోక్యం చేసుకోడు..


కొద్దికాలం క్రిందట ఆ మల్లిఖార్జునకు మోటార్ సైకిల్ పై వెళుతుంటే ప్రమాదం సంభవించింది..ప్రారబ్ధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు..ఆసమయంలో అతనిని చూసిన వాళ్ళు జీవించడం కష్టం అని తేల్చేశారు..హాస్పిటల్ లో చేర్పించారు..ప్రాణాపాయం లేదన్నారు కానీ, మామూలు మనిషి కావడానికి సంశయం వెలిబుచ్చారు..మాట కూడా లేదు..ఆర్ధికంగా కూడా చాలా ఖర్చు అయింది..నిత్యమూ శ్రీ స్వామిని నమ్ముకొని ఉన్న మల్లిఖార్జునను ఇక ఆ దిగంబర అవధూత దత్తాత్రేయుడే కాపాడాలి..అంతకంటే మార్గం లేదని ఇంట్లో వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసారు..


అతని భార్యా, తల్లీ ఇద్దరూ చెరోవైపు పట్టుకుని స్వామి వారి మందిరానికి తీసుకొని వచ్చారు..ఆ దత్తాత్రేయుడి వద్ద నిలబెట్టారు..ఆ కుటుంబానికి స్వామి వారి మీద ఉన్న అచంచల భక్తీ విశ్వాసాలో, భక్తుడి పట్ల ఆ దత్తాత్రేయ స్వామి కి ఉన్న అవ్యాజ కరుణో..ఏదైతేనేం..తల్లి, భార్యా పట్టుకుంటే కానీ అడుగు వేయలేకపోయిన మల్లిఖార్జున.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..క్రమంగా కోలుకున్నాడు..నెమ్మదిగా నడవసాగాడు..కొద్దిరోజుల్లోనే మళ్లీ మామూలు మనిషిలా మారి..తన పనులు తానే చేసుకోసాగాడు..


మళ్ళీ దత్తదీక్ష ల నాటికి మల్లిఖార్జున ఎప్పటిలాగే పూర్తి స్వస్థత తో ఆలయానికి వచ్చి, 41 రోజుల మండల దీక్ష తీసుకున్నాడు..అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ సంవత్సరం దీక్ష పూర్తి చేసాడు..ఈ సంఘటన జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది..ఈ సంవత్సరం కూడా మల్లిఖార్జున దత్తదీక్ష స్వీకరించి, శ్రీ స్వామివారి సన్నిధిలో వున్నాడు..


కష్టాలు ప్రతి మనిషికీ వస్తాయి..ఆ దత్తుడి మీద విశ్వాసం ఉంచి, తన కర్తవ్యం తను చేస్తే, ఆ దత్తాత్రేయుడే సహస్ర బాహువులతో కాపాడతాడు..


సర్వం..

దత్తకృప..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్...శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

Jai ganesh


 

Joke




 

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 36*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః ।*

*నిందంతస్తవ సామర్థ్యమ్ తతో దుఃఖతరం ను కిమ్ ।।*


*భావము:* 

నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనయిపోతుంది. అయ్యో, దీని కంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?

 

వివరణ: ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీ కృష్ణుడు 'నిందంతః' అంటే 'నిందించుట, దూషించుట' అని. 'అవాచ్య వాదాన్' అంటే, 'నపుంసకుడు' వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు "చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి, కాళ్ళ మధ్యలో తోక ముడుచుకున్న కుక్క లాగ పారిపోతున్నాడు" అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాల బాధాకరంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు గుర్తుచేస్తున్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 41*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 118*


*అదిఇది యని మది దోచెడు*

*సదనము గుర్తించి లోనె సాధించినచో*

*గుదురును బ్రహ్మానందము*

*గదసిన మది జేరనొక్కి కనవలె వేమా !*


*🌹తాత్పర్యము --*

ఆత్మసాక్షాత్కారముతో బ్రహ్మానందము కలుగునని గ్రహించాలి.


*💥వేమన పద్యాలు -- 119*


*అదియొకటి దెలిసి యాదిని నిల్పిన*

*యాది బాయకున్న నభవు డవును*

*యాది బాయువాడు యంధుని రీతిరా*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

ఆదిమధ్యాంతములు తెలిసినవాడే దైవస్వరూపుడగును.

అది తెలియని వాడు గృడ్డివానితో సమానము.


*💥వేమన పద్యాలు -- 120*


*అధముడైన మనుజు డధికుని జబట్టి*

*యతని మాట నడచు నవని లోన*

*గజపతింట నెన్న గవ్వలు చెల్లవా* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అధముడు , అధికుని చేరి అతని మాటే వేదవాక్కుగా భావించి ప్రవర్తిస్తాడు.

గజపతి ఇంటిలో అల్పులెందరు చలామణిగాలేరు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వాగ్వాదానికి దిగకూడదు

 నీతిశాస్త్రం॥మతిమత్సు మూర్ఖమిత్రగురువల్లభేషు వివాదో న కర్తవ్యః ॥భావము।బుధ్ధిమంతులతోను,మూర్ఖులతోను ,గురువులతోను, ఇష్టులైనవారితోను వాగ్వాదానికి దిగకూడదు. వేదపురుషానుగ్రహసిధ్ధిరస్తు. నిరంతరం దేవబ్రాహ్మణ ప్రసాదసిధ్ధిరస్తు.॥

నిష్కామ కర్మ*

 *నిష్కామ కర్మ*

                ➖➖➖✍️

*భగవంతుడు భగవద్గీత లో - ‘నిష్కామ కర్మ’ గూర్చి చెబుతారు, భగవద్ అనుగ్రహము కావాలంటే చాలా గ్రంధాలలో కూడా ఈ ‘నిష్కామ కర్మ’ గూర్చి ఉంది, నిష్కామ కర్మ వలన(ఫలితం ఆశించని) ఎటువంటి కర్మ ఫలము అంటదు...!*

*అదేంటో , ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకొందాము!!!*

       *ఒకానొక సమయములో, దూర్వాస మహర్షి యమునా నది దాటివచ్చి, భక్తితో గోపికలు సమర్పించిన ఫలములను, వాళ్ల సమక్షమున ఆరగించి, వారిని ఆశీర్వదించాడు.*

*ఇంతలో యమునా నది పొంగడం వలన, ఆ గోపికలు తిరిగి వెళ్ళే మార్గం లేక దూర్వాస మహర్షి సహాయాన్ని అర్ధించారు.*

*ఆ మహర్షి, వారితో యమునా నదిని ఈవిధంగా ప్రార్ధించమన్నాడు...*

*"ఓ యమునా మాతా! ఈ దూర్వాస మహర్షి ఈనాడు ఉపవాస దీక్ష పాటించి ఉండి నట్లయితే, దయతో మాకు ఆవలి ఒడ్డుకు చేరే దారినియ్యి!" అని.*

*తమ ఎదుటే భుజించిన మహర్షి కి, ఉపవాస దీక్ష ఏమిటి? అనుకుని గోపికలు నిర్ఘాంత పోయారు!!...*

*అయినా మహర్షి మహిమ దృష్టి లో ఉంచుకుని, మారు మాట్లాడకుండా యమునను ఆ విధంగా ప్రార్థించారు.*

*యమునా నది వెంటనే గోపికలకు త్రోవఇచ్చింది, దూర్వాస మహర్షి కేవలం గోపికల భక్తికి మెచ్చి, వారిని ఆనంద పరచడానికి పండ్లు ఆరగించాడే తప్ప, వాటిపై వ్యామోహం తో కాదు. ఆకలితో కాదు, మనస్సును, ఇంద్రియాలను జయించినవారికి, ఆకలి దప్పులు ఉండవు.*

*ఈశ్వరార్పణ భావంతో చేసిన ఆ కర్మకు అతడు కర్త కాదు, కేవలం సాక్షీభూతుడు, అందువల్ల అతనికి ఆ కర్మకు ఫలం అంట లేదు.*

*అలానే ఈనాడు కలియుగంలో ఏది చేసినా, అది భగవంతునికి అర్పితం చేయాలి!*

*ఎవరైనా ఇంతపని ఎలా చేసావు, ఎలా సాధ్యమైనది, అని అడిగినప్పుడు ‘అంతా ఈశ్వర సంకల్పం మాత్రమే, నేను నిమిత్తమాత్రుడిని, ఆయన దయ ఉంటే అన్నీ సాధ్యమే!’ అనే మాట చెప్పి, మన భావం కూడా అలానే ఉండాలి... అప్పుడే ఆ సర్వేశ్వరుడు - మంచి ఫలితం మనకు ఇచ్చి, దానిలో ఉన్న చెడును హలాహలం లాగా తాను స్వీకరిస్తాడు.* 

*అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది..!*

*ఈరోజు మనం, మంచి జరిగితే నేను, చెడు అయితే దేవుడు అని అనుకొని మాయలో పడుతున్నాము ...*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

హనుమంతుడి సంగీతం

 🎻🌹🙏హనుమంతుడి పరిపూర్ణ సంగీతం...!!




దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు.


 తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు.


 ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. 


తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి.  

 

ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు.


 పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. 


నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు.


 ‘గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. 


‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్లాడు.


అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు.


 ‘నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా’ అని బదులిచ్చారు వారు. ‘ఇక్కడికెందుకొచ్చారు?’ అని ప్రశ్నించాడు నారదుడు.


 ‘తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం’ అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు.


 ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు.

ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు.


 ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్నీ విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. 


ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు.


 హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు.  


తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది.  

 

తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు.


 నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి.


 నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది.


 దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు.


హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు. ‘ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు.


 ఇంకో పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి’ అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు.


 హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు. 


‘ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి’ అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు.


‘వీణలో అన్ని మెట్లూ ఉంటేనే కదా వాయించగలం. చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా?’ అని అడిగారు.


 హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు.


 ఎలాంటి మెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరఝరి క్రమంగా ఉధృతి అందుకుంది.


ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా, అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు.


 హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. 


హనుమద్గానంతో తమ కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు.


 ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహాన్ని వీడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు..


అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. . అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్

జై శ్రీమన్నారాయణ...(సేకరణ)..🚩🌞🙏🌹🎻

మనుస్మృతి

! మనుస్మృతి ఈనాటిది కాదురా పాడయిన మొద్దు రాచ్చిప్ప మొహమా! ..మనం కొలిచే శ్రీరాముడు ఎన్నో యుగాల క్రితం ఒక కోటీ డెబ్భై అయిదు లక్షల సంవత్సరాలు క్రితం జన్మించిన వాడు అయితే..అతనికి అత్యంత పూర్వం ఆచరించబడిన వ్యవస్థ మను స్మృతి.ఇది సత్యయుగం లో ఆచరించినది.అంటే 27 మహా యుగాల క్రితం సంగతి ఇది. ఆనాటివి ఈనాటి వరకూ ఎలా వస్తున్నాయన్న తింగరి ప్రశ్నలు వేశావో తిత్తి తీస్తా! ఆ కాలములో వారి ధారణా శక్తి అద్భుతంగా ఉండేది.ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే ఇవన్నీ వచ్చాయి. మధ్యలో ఏవైనా కాలగతిలో అంతరాయాలు ఏర్పడితే ఎవరో ఒకరు తపస్సంపన్నులు తిరిగి వాటిని ఉద్ధరించారు. ప్రస్తుతం ఈ కలియుగములో.. ఆచరించదగ్గది పరాశర స్మృతి. మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నట్టే మనకు పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి.అసలు స్మృతి అంటే ఏమైనా తెలుసుట్రా మిరప తోటలో పిడత మొహాలూ మీరూనూ.

స్మృతులు అంటే ఆయాకాలాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. వాటిలో మను స్మృతి ఒకటి. ఈమానవ ధర్మశాస్త్రమున విశ్వ సృష్టి నుండి అన్ని విషయాలూ చెప్పబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మ,క్షత్రియ,వైశ్య, శూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమఉరేయ్ నికృష్ట అక్కుపక్షీ! మనుస్మృతి ఈనాటిది కాదురా పాడయిన మొద్దు రాచ్చిప్ప మొహమా! ..మనం కొలిచే శ్రీరాముడు ఎన్నో యుగాల క్రితం ఒక కోటీ డెబ్భై అయిదు లక్షల సంవత్సరాలు క్రితం జన్మించిన వాడు అయితే..అతనికి అత్యంత పూర్వం ఆచరించబడిన వ్యవస్థ మను స్మృతి.ఇది సత్యయుగం లో ఆచరించినది.అంటే 27 మహా యుగాల క్రితం సంగతి ఇది. ఆనాటివి ఈనాటి వరకూ ఎలా వస్తున్నాయన్న తింగరి ప్రశ్నలు వేశావో తిత్తి తీస్తా! ఆ కాలములో వారి ధారణా శక్తి అద్భుతంగా ఉండేది.ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే ఇవన్నీ వచ్చాయి. మధ్యలో ఏవైనా కాలగతిలో అంతరాయాలు ఏర్పడితే ఎవరో ఒకరు తపస్సంపన్నులు తిరిగి వాటిని ఉద్ధరించారు. ప్రస్తుతం ఈ కలియుగములో.. ఆచరించదగ్గది పరాశర స్మృతి. మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నట్టే మనకు పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి.అసలు స్మృతి అంటే ఏమైనా తెలుసుట్రా మిరప తోటలో పిడత మొహాలూ మీరూనూ.

స్మృతులు అంటే ఆయాకాలాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. వాటిలో మను స్మృతి ఒకటి. ఈమానవ ధర్మశాస్త్రమున విశ్వ సృష్టి నుండి అన్ని విషయాలూ చెప్పబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మ,క్షత్రియ,వైశ్య, శూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞాతిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీ,పురుషధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలగు హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియూ ఆకాలములో ఆచరించినవి ఉంటాయి.

మనుస్మృతి

బృహస్పతిస్మృతి

దక్షస్మృతి

గౌతమస్మృతి

యమస్మృతి

అంగీరసస్మృతి

యాజ్ఞవల్క్యస్మృతి

ప్రచేతస్స్మృతి

శాతాతపస్మృతి

పరాశరస్మృతి 

సంవర్తస్మృతి

ఔశనసస్మృతి

శంఖస్మృతి

లిఖితస్మృతి

ఆత్రేయస్స్మృతి

విష్ణుస్మృతి

ఆపస్తంబస్మృతి

హరీతస్మృతి 

మళ్లీ వీటిలో ఉపస్మృతులు పదునెనిమిది ఉన్నాయి.

కణ్వస్మృతి

కపిలస్మృతి

లోహితస్మృతి

దేవలస్మృతి

కాత్యాయనస్మృతి

లోకాక్షిస్మృతి

బుధస్మృతి

శాతాతపఉపస్మృతి

అత్రిస్మృతి

ప్రచేతస్మృతి

దక్షఉపస్మృతి

విష్ణుస్మృతి

వృద్ధవిష్ణుస్మృతి

వృద్ధమనుస్మృతి

ధౌమ్యస్మృతి

నారదస్మృతి

పౌలస్త్యస్మృతి

ఉత్తరాంగిరసస్మృతి

అసలు వీటి గూర్చి ఏ మాత్రమూ తెలియని ప్రతీ అక్కుపక్షీ అశుద్ధం తిన్న కాకిలా మను స్మృతి, మనువాదులు అంటూ అరుస్తారేమిట్రా పగిలిపోయిన పింగాణీ జాడీ మొహమా!!

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*సరసిజనాభ! సత్పురుషసంగ సమంచిత భక్తి యోగ వి*

*స్ఫురణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్త మ*

*స్థిర బహిరంగముం గనదు; చెందదు భూరి తమస్స్వరూప సం*

*సరణ గుహన్ జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.*


బ్రహ్మగారి సృష్టికి కారణమైన పద్మం నాభియందు విరాజిల్లే నారాయణా! సత్పురుషుల సాంగత్యం వలన మరింత ఉజ్జ్వలంగా ప్రకాశించే భక్తియోగంతో మానవుని చిత్తం నిర్మలం అవుతుంది. అప్పుడు అది చంచలమైన వెలుపలి ప్రపంచాన్ని చూడదు. లెక్కకు అందని అజ్ఞానస్వరూపమైన సంసారమనే గుహలోనికి చేరుకోదు. అంతేకాదు, నీదైన మహనీయతత్త్వాన్ని నిత్యమూ పొందగలుగుతుంది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 35*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ।*

*యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ।।*



*భావము:* 

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.

 

*వివరణ:* 

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అశాశ్వతమునకై ఆరాటమా?

 శు భో ద యం🙏


"అశాశ్వతమునకై ఆరాటమా?


"తరగల్,పిప్పలపత్రముల్,మెఱుగుటద్దంబుల్,

మరుద్దీపముల్,/

కరికర్ణాంతము లెండమావులతతుల్,ఖద్యోతకీటప్రభల్,/

సురవీధీలిఖితాక్షరంబు లసువుల్,జ్జ్ోస్నామయః పిండముల్/

సిరు,లందేల మదాంధులౌదురుజనుల్?శ్రీకాళహస్తీశ్వరా!


శ్రీకాళహస్తీశ్వర శతకము-ధూర్జటిమహాకవి:


భావము:-ప్రాణములు, సముద్రకెరటములను,రావియాకులయంచులవలెను,తళుకుటద్దములవలెను,మెఱపులవలెను,కరికర్ణాంతములవలెను,(ఏనుగుచెవి తుదలు)ఎండమావులవలెను,మిణుగురుపురుగులకాంతివలెను,ఆకాశపువ్రాతలవలెను,చెచలమైనవి.

       సంపదలా వెన్నెలగుళికలవంటివి.మరి వానినిజూచుకొని నరులేల మదాంధులౌదురో అనూహ్యముగదా!


విశేషములు:కవి యీపద్యమున నరులప్రాణములుగానీ,సిరులుగానీ శాశ్వతమైనవి కావనిచెప్పుచు,చెంచెలమైన విషయములనుపమానములుగా చెప్పుచున్నాడు.

నదీతరంగములు,రావియాకులు,అద్దాలమెఱపులు,ఏనుగుచెవులు,ఎండమావులు,మిణుగురులకాంతి,మెఱుపులు,ఆకాశపువ్రాతలు(శూన్యంలోవ్రాత)ఇవిమిగులయస్థిరమైనవి.

        ఇక సిరులా,(భాగ్యములు) వెన్నెలగుళికలవంటివి.కొంతకాలముమాత్రమే వెన్నెలకాంతులు.అదియు శాశ్వతము గానిదే!

మరి యస్థిరమైన వీనిని నమ్ముకొని గర్వమున సంచరించు నరులు శాశ్వతుడవగు నిన్నేల మరచుచున్నారని తన ఆశ్చర్యమును ప్రకటించుచు.ప్రజలయజ్ఙానమునకు విచారమునువ్యక్త

ము చేయుచున్నాడు.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అరణ్యవాసమునందే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   *||శ్లోకము||*


*అత్యన్తవిముఖే దైవే వ్యర్థే యత్నే చ పౌరుషే*।

*మనస్వినో దరిద్రస్య వనాద్యన్యాత్ కుతస్సుఖమ్*॥


*||తాత్పర్యము||*


"పురుష ప్రయత్నం - {సమస్త ప్రయత్నములూ} వ్యర్థమైపోయి దైవము ప్రతికూలంగా వున్న వానికి అరణ్యవాసమునందే సుఖముగానీ మరొక చోట లేదు".....

మౌనం వహించడమే

 *శ్లోకం*:


తావన్మౌనేన నీయంతే

కోకిలశ్చైవ వాసరాః|

యావత్సర్వజనానంద

దాయినీ వాక్ప్రవర్తతే||


తనకు కూత వచ్చేవరకు కోయిల మౌనంగా ఉండి, రోజులు గడుపుతుంది. కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షించును. అదే విధంగా, సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి అందరినీ మెప్పించాలి.  సమయం సందర్భం‌ రానంతవరకు మౌనం వహించడమే ఉత్తమం.

సంకల్పము

 *శుభోదయం*

16.2291923113

Xxxxxx

 సంధ్యా వందన 

మరియు ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.27.02.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

 *******

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే కృష్ణ పక్షే

తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 *శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే*

*శిశిర ఋతౌ* 

*మాఘ మాసే* 

*కృష్ణ పక్షే  తృతీయాయాం*

*భౌమ వాసరే అని చెప్పుకోవాలి*.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.26

సూ.అ.6.01

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

మాఘ మాసం 

కృష్ణ పక్షం తదియ రా. 11.25.వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం హస్త రా.తె.5.25 వరకు. 

అమృతం రా.10.48 ల  12.34 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.43 ల 9.29 వరకు.

దుర్ముహూర్తం రా.10.58 ల 11.48 వరకు. 

వర్జ్యం ప.12.13 ల 1.59 వరకు. 

యోగం శూల మ.3.19 వరకు.  

కరణం వనజి ప. 10.26 వరకు.  

కరణం భద్ర రా. 11.25 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

*****************

పుణ్యతిధి మాఘ బహుళ తదియ. 

*****************

గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏

.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...

 *👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ*👏

*🤣పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం సృష్టించావు. ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు. కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తావు.🤣* 


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🤪పంచదార, బెల్లం, తియ్యటి పళ్ళు ఇచ్చావు.  కానీ, ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.🤪*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ.👏*

*😃మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మా చెమట వాసనతోనే గుర్తుపట్టి మా నెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.😃*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🥱సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు.🥱*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏* 

*🤣రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు.🤣* 

*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ..👏*

*🫢నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు🫢*. 


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🤪ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు. అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు.🤪* 

*👏నువ్వు తక్కువ వాడివి కావు సామీ...👏* 

*😭నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.😭*


*🫡కానీ సామీ!* 

*నేనూ తక్కువవాణ్ని కాదు. నాకు బాగా తెలుసు, నీ కాళ్ళట్టుకుంటే, నీవే నన్నెత్తుకుంటావని🫡*

పరిజ్ఞానం

 *పరిజ్ఞానం* 


" *తృటి* లో తప్పిన ప్రమాదం "  అని.. అసలీ *తృటి* అంటే ఏమిటి? 


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేషం అంటే రెప్ప పాటుకాలం (నిముషం కాదు..)

3 నిమేషాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్టం

12 కష్టాలు = ఒక నిముషం 

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణు కు ఒక పూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని ఇంత సూక్ష్మంగా, స్థూలంగా విభజన చేసిన మన పూర్వీకుల విజ్ఞానం ఇది

వేదధ్వని

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*యత్ర వేదధ్వని శ్రాంతం* 

*న చ గోభిరలంకృతమ్*

*యన్నబాలైః పరివృతం* 

*శ్మశానమివ తద్గృహమ్*


*- _తాత్పర్యము_-* 


తా𝕝𝕝 *ఏ ఇంట్లో వేదధ్వని వినబడదో, ఏ ఇల్లు అవులతో అలంకరించబడదో, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరో ఆ ఇల్లు శ్మశానము వంటిది అని అత్రిస్మృతి హెచ్చరించింది*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

ప్రకాశం పంతులు

 ప్రకాశం పంతులు గారి గొప్పతనం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వీడియోలో చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...


"సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు..టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు " స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది 


అది రాజమండ్రి స్టేషన్ 

సమయం తెల్లవారి ఐదు గంటలు 


'సరే నేను వస్తా పద 'అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూంకి వెళ్ళాడు 


అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు 


ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు 


ఆ ముసలాయన ఎవరో కాదు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 


ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన 


వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి " అయ్యా మీరా ? నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని మీ శిష్యుడిని " అని నమస్కారం చేశాడట 


ప్రకాశం గారు కళ్ళు తెరిచి " ఏరా.. భోంచేశావా ?" అని అడిగాడట 


పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు 


'తెల్లారి ఐదు గంటలకు ఎవరైనా కాఫీ తాగావా ? అంటారు లేకపోతే టిఫిన్ తిన్నావా ? అని అడుగుతారు..మరి పంతులు గారేంటి భోంచేశావా ? అని అడుగుతున్నారు..బహుశా వయసు మీద పడటంతో ఏం అడగాలో తెలీక ఇలా అడిగారేమో


 అనుకుని పంతులు గారితో ,


"అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి ఐదు గంటలు..మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా ? అని అడిగినట్టున్నారు "అని అన్నాడు


దాంతో పంతులు గారు ,


"ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా ? నేను నిన్నేమ్ అడిగాను..భోంచేశావా ? అనడిగా..దానికి నువ్వేం చెప్పాలి..నేను భోంచేశా.. మీరూ చేసారా ? "అని కదా అడగాల్సింది 


స్టేషన్ మాస్టర్ కి విషయం అర్థమైంది 


పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది 


వెంటనే ఆయనకు కావాల్సిన పదార్దాలను వండటానికి ఇళ్ల దగ్గర మనుషులకు పురమాయించారు 


ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు 


"ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు ?" అని ఒక పెద్దమనిషి పంతులు గారిని అడిగారు 


"విజయవాడ వెళ్తా.."అన్నారు పంతులు గారు 


పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా రెండు రూపాయలు..ఐదు రూపాయలు వేసుకుని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు 


రైలు బయలుదేరుతుందనగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళమీద పడి,

 " పంతులు గారూ.. మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి పది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా..భార్య కాన్సర్ తో బాధ పడుతుందయ్యా ..అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టాడు 


పంతులు గారు వాడ్ని లేపి " ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా ? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు..అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు 


ఇదంతా చూసిన ఓ పెద్దమనిషి " అయ్యా పంతులు గారు..మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు..మీకంటూ కనీసం ఓ పది రూపాయలన్నా ఉంచుకోవాలి కదండీ..సరే..ఎలాగోలా విజయవాడ చేరతారు..మళ్లీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి..ఇంకొందరు పూనుకుని మిమ్మల్ని రైలెక్కించాలి..ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ ఖర్మ ఏంటి పంతులు గారూ " అంటూ భోరున ఏడిస్తే ,


పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి ' ఏరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు.. పాపం వీడికెవరు ఉన్నార్రా ?" అని కళ్లనీళ్ల పర్యంతం అయ్యారట 


ఆ రోజుల్లో తమకోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు 


ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయాడు పంతులు గారు 


మరి ఇప్పుడు అయితే?

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

27-02-2024 మంగళవారం (భౌమ వాసరః) రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

**********

27-02-2024

మంగళవారం (భౌమ వాసరః)

రాశి ఫలితాలు

**********

మేషం

కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి  మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు

---------------------------------------

మిధునం

సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

---------------------------------------

కర్కాటకం

చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత  పెరుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

-------------------------------------

సింహం

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ  కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

---------------------------------------

కన్య

చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి.  సోదరులతో  కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.

---------------------------------------

తుల

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమాకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. చిన్ననాటి  మిత్రుల నుండి ధన  సహయం  అందుతుంది.  స్ధిరాస్తి  క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృశ్చికం

వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన  వ్యవహారాలలో  తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు.

-------------------------------------

ధనస్సు

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.  విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు.

--------------------------------------

మకరం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో  పెద్దలతో  సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.

---------------------------------------

కుంభం

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.  వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

---------------------------------------

మీనం

గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. వాహన ప్రయాణ   విషయంలో జాగ్రత్త వహించాలి.  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.  నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

*గమనిక* :౼

మన సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

⚜ శ్రీ శుక్రలా మాత ఆలయం

 🕉 మన గుడి : నెం 239


⚜ జమ్మూకాశ్మీర్  : బిల్లవార్


⚜ శ్రీ శుక్రలా మాత ఆలయం



💠 శుక్రలా మాత వైష్ణో దేవికి  అక్క అని గట్టి నమ్మకం. 

దేవిమా సుక్రాలను అత్యంత భక్తిపూర్వకంగా జగత్ జననీ, రాజర్జస్వరీ మాత అని సంబోధిస్తారు, ఇక్కడ భక్తులు పవిత్ర దర్శనం కోసం వేల సంఖ్యలో తరలివస్తారు.

 

💠 సుక్రాల మాత మందిరం జమ్మూలోని కతువా జిల్లాలో బిల్లవార్‌లో ఉంది.

ఈ పుణ్యక్షేత్రం 3500 అడుగుల ఎత్తులో కొండపై ఉంది.


💠 ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే మీరు పవిత్రమైన మరియు నిజమైన హృదయంతో కోరుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.


⚜ బిల్లవర్ సుక్రాల మాత కథ  ⚜


💠 500 సంవత్సరాల క్రితం త్రిలోచన అనే మహాకవి సుక్రాల గ్రామంలో నివసించాడు.

తన చిన్న వయస్సులోనే విద్యను అభ్యసించడానికి కాశ్మీర్‌కు వెళ్లాడు.

తన ధార్మిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన తరువాత అతను తన గ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.

అతను బారాముల్లా చేరుకున్నప్పుడు అతను హవాన్ (పూజా సమగ్ర్) కొనుగోలు చేసి అక్కడ హవాన్ ప్రారంభించాడు. అతను పూజలో తన మనస్సును కేంద్రీకరించాడు మరియు మొత్తం హవాన్ (పూజా సామగ్రి) అయిపోయింది మరియు హవాన్ స్థానంలో తన శరీర ముక్కలను అందించడం ప్రారంభించాడు మరియు చివరికి అతను తన తలను సమర్పించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు, అయితే అతను తన తలని కత్తిరించడానికి తన పదునైన ఆయుధాన్ని ఎత్తినప్పుడు మాతా శుక్రలా ( మాతా వైష్ణో యొక్క సోదరి) కనిపించి అతన్ని ఆపింది.

ఈ విధంగా మాతా సుక్రాల (మాత మాల్) భగత్ త్రిలోచనకు దర్శనం ఇచ్చింది.


💠 భగత్ త్రిలోచన్ మాతను బిల్లవర్ (జమ్మూ ప్రావిన్స్)లోని సుక్రాల్స్‌లో స్థిరపడమని బలవంతం చేశాడు. మాత అతని  కోరికను అంగీకరించి, అక్కడ స్థిరపడతానని వాగ్దానం చేసింది, మీ మూడవ (3వ) తరానికి చెందిన పురుషుడు నా పూజారి అవుతాడు.

ఈ మాటలు పలికిన తర్వాత మాత అతని దృష్టిలోంచి మాయమైంది.


💠 భగత్ త్రిలోచన్ యొక్క మూడవ తరంలో అతని మనవడు శివ నందన్ మాత పూజారి (భగత్) అయ్యాడు. అతను కూడా తన తాత త్రిలోచన వలె గొప్ప పండితుడు.

ఒకరోజు కలలో పూజారి శివ నందన్ మాతా శుక్రలను చూసి, త్రిలోచన మూడవ (3వ) తరంలో ఒక పురుషుడు నా పూజారి అవుతాడని తన తాతతో చేసిన వాగ్దానం గురించి చెప్పి శివ నందన్‌ను అడవికి (అడవి) వెళ్ళమని ఆదేశించింది.


💠 మరియు అక్కడ మీకు తెల్లటి పూల లత కనిపిస్తుంది మరియు ఆ లత కింద ఒక అసాధారణ మూర్తి (విగ్రహం) పడుకుని ఉంది. కలలో ఇచ్చిన మాత సూచన మేరకు అతను ఆ ప్రదేశానికి చేరుకున్నాడు మరియు అక్కడ మాతా సుక్రాల యొక్క ఒక అసాధారణ విగ్రహం కనుగొన్నాడు. భగత్ శివ నందన్ ఎటువంటి విరామం లేకుండా పూజలు ప్రారంభించారు.


💠 ఒకరోజు యువరాజు మెహద్ సింగ్ తన బృందంతో కలిసి దట్టమైన అడవికి వెళ్లి 120 (నూట ఇరవై) అడవి మేకలను చంపాడు. అతను తన బృందంతో కలిసి అడవి  నుండి బయటకు వచ్చినప్పుడు తన కడుపులో తీవ్రమైన నొప్పిని అనుభవించాడు. 

అతనిని బిల్లావర్ వద్దకు తీసుకువెళ్లారు మరియు అతని చికిత్స కోసం వైద్యులును సంప్రదించారు, కానీ తీవ్రమైన నొప్పికి పరిష్కారం కనుగొనడంలో విఫలమయ్యారు.

చివరగా మాతా సుక్రాల శివ నందన్ పూజారి యువరాజు  నొప్పి చికిత్స గురించి సలహా ఇవ్వాలని అభ్యర్థించారు. 

మాతా సుక్రాల ఆలయాన్ని నిర్మిస్తే నొప్పి తొలగిపోతుందని పలికారు.

మెహద్ సింగ్ శుక్రాల వద్ద మాత ఆలయాన్ని నిర్మిస్తానని వాగ్దానం చేశాడు. అతను మాత శుక్రల కోరికను అంగీకరించినప్పుడు, యువరాజు యొక్క బాధ మాయమై పోయింది


💠 మెహద్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణీత సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 


💠 ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత పెద్ద పండితులు, పండితులు పాల్గొనే పెద్ద హవనాన్ని ఏర్పాటు చేశారు. హవాన్ పూర్తయినప్పుడు, మాత రాజు మెహద్ సింగ్ మరియు అతని కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు మరియు చంబా రాజ్యాన్ని మరియు దాని ప్రజలను చూడమని కూడా వారిని కోరింది.


💠 ఈ ఆలయ ప్రస్తావన వేదాలు మరియు పురాణాలలో ఉంది. శివుడు, గణేశుడు, హనుమంతుడు, పార్వతి అందాలు, కళలు మరియు మూర్తిలు చూడదగ్గవి. మీరు శుక్రాలను సందర్శిస్తే, శివుడు మరియు మాతా శుక్రాల అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి. 


💠.ఇత్తడి సింహంపై వెండి తలపై కూర్చున్న షిల్లా (రాతి పలక) ఆకారంలో దేవత ఇక్కడ ప్రత్యక్షమైంది. దాని వెనుక మహిషాసుర ముర్దిని (మహా-లక్ష్మి యొక్క పునః అవతారం) మహిషాసురుడు, రాక్షస రాజు శరీరంపై నిలబడి ఉన్న చిత్రం కూడా ఉంది. 

దేవి ఒక చేతిలో కత్తితో నాలుగు ఆయుధాలు ధరించి ఉంది. 


💠 ప్రతి సంవత్సరం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. నవరాత్రుల సమయంలో వారి సంఖ్య 50 వేలకు పైగా ఉంటుంది.

 

💠 ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బిల్లవార్ నుండి 9.60 కి.మీ మరియు కతువా నుండి 75 కిమీ, జమ్మూ నుండి 80 కి.మి.

రష్యాలో వివాహాలు.


ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి



           *రష్యాలో వివాహాలు..*

               ➖➖➖✍️


*సుధా నారాయణమూర్తి ఒక స్వీయ అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశారు:*

```

“ఇటీవల నేను రష్యాలోని మాస్కోలో ఉన్నప్పుడు... ఓ రోజు ఆదివారం అక్కడి పార్కుకి వెళ్లాను.


వేసవి నెల, కానీ వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా చినుకులు పడుతున్నాయి.  నేను గొడుగు కింద నిలబడి     ఆ ప్రాంత అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నా దృష్టి ఒక యువజంట మీద పడింది. వాళ్ళు కొత్తగా పెళ్లి అయిన వారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అమ్మాయికి దాదాపు ఇరవై ఏళ్లు ఉంటాయి. అబ్బాయి కూడా దాదాపు అదే వయసులో, చాలా అందమైన సైనిక యూనిఫాంలో ఉన్నాడు.


ఆ అమ్మాయి ముత్యాలు, అందమైన లేస్‌తో అలంకరించబడి, శోభాయమానంగా ఉన్న అందమైన తెల్లటి శాటిన్ గౌను ధరించి ఉంది.  ఆమె వెనుక, ఇద్దరు తోడుపెళ్లి కూతుర్లు నిలబడి, పెళ్లి గౌను మురికి కాకుండా దాని అంచుని ఎత్తిపట్టుకున్నారు.


ఆ కుర్రాడు తడవకుండా తలపై గొడుగు పట్టుకున్నాడు.  అమ్మాయి ఒక పూల గుత్తిని పట్టుకొని ఉంది. ఇద్దరూ చేతులు ముడుచుకుని నిలబడ్డారు. ఆ దృశ్యం చాలా అందంగా ఉంది. నేను వారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను, ‘పెళ్ళైన వెంటనే ఈ వర్షంలో ఇక్కడ ఈ పార్కుకు ఎందుకు వచ్చారా’ అని ఆశ్చర్యపోయాను. వారు కావాలనుకుంటే దీనికంటే ఇంకా ఆనందకరమైన ప్రదేశానికి వెళ్లి ఉండవచ్చు.  నేను చూస్తూండగా వారిద్దరూ కలిసి పార్క్ లో ఉన్న ఒక స్మారక చిహ్నం దగ్గర ఉన్న ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తూ వెళ్లి, పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి, మౌనంగా తలవంచుకుని, నెమ్మదిగా వెనక్కి వచ్చారు.


నేను ఈ దృశ్యాన్ని చాలాసేపు ఆస్వాదించాను.  కానీ నాకు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.


నవ వధూవరులతో కలిసి నిలబడి ఉన్న ఓవృద్ధుడిపై నాచూపు పడింది. ఆ పెద్దాయన కళ్ళు నా చీర మీద పడగానే, "మీరు భారతీయులా?" అని అడిగాడు.


“అవును నేను భారతీయురాలినే” అని నమ్రతగా బదులిచ్చాను. 


చాలా ఆప్యాయంగా ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఈలోగా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఎదురుచూస్తూ, కుతూహలంగా, అతనికి ఇంగ్లీష్ ఎలా తెలుసు అని అడిగాను.


అతను చాలా మర్యాదపూర్వకంగా ఇలా బదులిచ్చాడు: 

"నేను విదేశాలలో పనిచేశాను."


దానితో, నేను, “ఈ యువ జంట తమ పెళ్లి రోజున యుద్ధ స్మారక చిహ్నం వద్దకు ఎందుకు వచ్చారో దయచేసి నాకు చెప్పగలరా?" అని అడిగాను.


“ఇది రష్యా ఆచారం, ఇక్కడ వివాహాలు తరచుగా శనివారం లేదా ఆదివారాలు జరుగుతాయి!” అని అతను చెప్తూ, "ఇక్కడ వివాహ కార్యాలయంలో రిజిస్టర్‌పై సంతకం చేసిన తర్వాత, ప్రతి వివాహిత జంట      వాతావరణంతో సంబంధం లేకుండా సమీపంలోని ప్రముఖమైన జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించాలి.   ఈ దేశంలోని ప్రతి అబ్బాయి కనీసం రెండేళ్లపాటు సైన్యంలో పనిచేయాలి.  అతని హోదా ప్రకారం, వివాహానికి తన సర్వీస్ యూనిఫాం మాత్రమే ధరించాలి", అని వివరించాడు.


నేను చాలా ఆశ్చర్యపోయాను, "ఇక్కడ అలాంటి ఆచారం ఎందుకు ఉంది?" అని అడిగాను.


అది విని, "ఇది కృతజ్ఞతాభావం. మా పూర్వీకులు రష్యా చేసిన వివిధ యుద్ధాలలో తమ ప్రాణాలను అర్పించారు. వాటిలో కొన్ని మేం గెలిచాం, కొన్ని ఓడిపోయాం, కానీ వారు ఎల్లప్పుడూ దేశం కోసమే త్యాగం చేశారు. కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్క జంట తమ పూర్వీకుల త్యాగం వల్లే తాము శాంతియుతమైన, స్వేచ్ఛాయుత రష్యాలో జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి."


“పెళ్లి వేడుకలకంటే దేశం పట్ల ప్రేమే ముఖ్యమని ఇక్కడి మాపెద్దల నమ్మకం. అందుకే మాస్కో అయినా, సెయింట్ పీటర్స్‌బర్గ్ లేదా రష్యాలోని మరే ఇతర ప్రాంతంలో అయినా, పెళ్లి రోజున సమీపంలోని యుద్ధ స్మారక చిహ్నం వద్దకు వెళ్లే, ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని మేం పట్టుబడుతున్నాం.”


ఆ పెద్దాయనతో మాట్లాడిన తర్వాత నా మనసులో ఒక్కటే మెదిలింది, ఇక్కడ మన దేశంలో మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున మన అమరవీరులను స్మరించుకునే రివాజు మనకు ఉందా? మన దేశంలో వివాహాల సమయంలో, చీరల కోసం షాపింగ్ చేయడం, ఆభరణాలను కొనుగోలు చేయడం,  విస్తృతమైన వంటకాలను సిద్ధం చేయడం, డిస్కోలలో పార్టీలు చేసుకోవడం మొదలైన వాటితో తీరిక లేకుండా గడుపుతాం.

బహుశా మనం దాని గురించి ఎప్పుడూ ఆలోచించమేమో.

ఈ సంఘటన నా కళ్ళను నీళ్లతో నింపింది. ఈ గొప్ప ఆలోచన, ఆచారం గురించి మనం కూడా రష్యన్‌ల వద్ద నుండి నేర్చుకోవాలని నేను కోరుకున్నాను.

మన దేశం కోసం,  మన ఈ రోజు కోసం, మన రేపటి కోసం - ప్రాణత్యాగం చేసిన అమరవీరులను మనం కూడా గౌరవించవచ్చు,...!```

                       ➖🌷➖

                 

ఒక ఉదాత్తమైన కార్యం జరిగినప్పుడు దాని వలన కలిగే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అప్పుడు చైతన్యం నిరంతరంగా పెరుగుతుంది.✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

హెయిర్ ఫాల్

 

       హెయిర్ ఫాల్ గురించి బాధపడుతూ నన్ను అడుగుతూ ఉన్నారు . వారికి అప్పటికప్పుడు కొన్ని తాత్కాలిక పరిష్కారాలు చెప్తూ ఉన్నాను. కాని అవి శాశ్వతంగా పరిష్కారం చూపలేకపోయేవి . మార్కెట్లో దొరికే వివిధ రకాల ఆయిల్స్ వాడి విసిగిపోయిన వారికోసం ఒక కేశతైలం తయారుచేసాను. దానితో పాటు పూర్తి ఒక షాంపూ కూడా తయారుచేశాను. 


        ఈ రెండు పూర్తి ప్రకృతిసిధ్ధ వనమూలికలతో 

తయారుచేయబడినవి. ఇది అత్యంత ప్రాచీన గ్రంధాలననుసరించి 12 రకాల మూలికలు కలిపి  ప్రాచీనపద్ధతులను అనుసరించి తయారుచేశాను. 


  కేశవృద్ధితైలం ఉపయోగాలు - 


 *  వెంట్రుకలు రాలిపోవడం ఆపుతుంది.


 *  బరకగా ఉన్న వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. 


 *  వెంట్రుకల మందాన్ని పెంచుతుంది. 


 *  వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని చేకూర్చడమే కాకుండగా వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.


 *  తలలోని వేడిని తీసివేస్తుంది. తలలోని వేడివల్ల వచ్చే తలనొప్పిని నివారిస్తుంది.


 *  తలకు చల్లదనాన్ని ఇస్తుంది.


  హెర్బల్ షాంపు ఉపయోగాలు  - 


  *  చుండ్రుని శాశ్వతంగా పోగొడుతుంది.


  *  వెంట్రుకలకు అమితమైన బలాన్ని ఇస్తుంది. 


  *  వెంట్రుకలు చిట్లడం  ఆపుతుంది. 


     ఈ రెండిటి కాంబినేషన్ గతకొంతకాలంగా కొంతమంది మీద ప్రయోగించి చూసాను. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మీ అందరికి అందుబాటులో తీసుకుని వస్తున్నాను. 


       నా అనుభవంతో చెప్తున్నాను ఇది తప్పకుండా వెంట్రుకల సమస్యలపైనా బ్రహ్మస్త్రంలా పనిచేస్తుంది. అతి తక్కువకాలంలోనే మీ వెంట్రుకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది.

 

  

  ఈ తైలం ఒక ప్రాచీన ఫార్ములాతో తయారుచేయబడినది. దీనిని వాడటం వలన సైడ్ అఫక్ట్స్ వంటివి ఉండవు. నిర్భయంగా వాడవచ్చు . ఇది పూర్తిగా 100% శుద్ధ ఆయుర్వేద మూలికలతో తయారుచేయబడినది. షాంపు కూడా పూర్తి ఆయుర్వేద మూలికలతో రూపొందించబడినది. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ షాంపు వాడటం వలన చుండ్రుసమస్య నుంచి బయటపడగలరు.


   ఈ షాంపు మరియు తైలం కావలిసిన వారు 9885030034  నెంబర్ నందు సంప్రదించగలరు .


గమనిక  - 


      రెండు నుంచి మూడు నెలలపాటు ఆపకుండా వాడటం వలన ఇంకా గొప్ప ఫలితాలు చూడగలరు . వేడి నీటితో తలస్నానం నిషిద్ధం . 


        కేశవృద్ధి తైలం మరియు షాంపు కావలసిన వారు 9885030034 ఫోన్ నంబర్ నందు డైరక్టుగా సంప్రదించగలరు . 


   కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


        9885030034

అష్టసిద్ధులు

 అష్టసిద్ధులు - కుండలినీ శక్తి జాగరణ .


        హిమాలయ పర్వతాలలో రహస్య గుహలు చాలా ఉన్నాయి. వాటి గురించి సామాన్య మానవులైన మనం ఎంతమాత్రమూ తెలుసుకోలేము. ఆ గుహలలో అత్యంత కఠిన సాధన చేస్తూ ధ్యానంలో ఉండు మహాయోగులు ఎంతో మంది ఉన్నారు . వీరు సామాన్యంగా జనబాహుళ్యంలోకి రారు. రావలసి వస్తే అదృశ్యరూపములో వచ్చి తమ కార్యం నిర్వర్తించుకొని పోగల గొప్ప శక్తి కలిగి ఉంటారు . వీరిలో వందల సంవత్సరాల వయస్సు కలిగినవారు కూడా ఉన్నారు . మరి వీరు ఇన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతికి ఉన్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం . ఈ విషయం పైన అనేకమంది పాశ్చత్య పరిశోధకులు పరిశోధనలు కూడా చేశారు . దీని గురించి నేను కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించినపుడు కొంత వివరణ నాకు దొరికింది. దానిలో ఈ విధముగా ఉన్నది. ప్రతి మనిషి యొక్క ఆయష్షు అనేది బ్రహ్మ సంవత్సరాల పరంగా రాయడు. పుట్టిన ప్రతి జీవి ఇన్ని లక్షల ఉచ్చ్వాస , నిశ్చ్వాసాలు తీసుకుంటాడు అని మాత్రమే రాస్తాడు. మనిషి తన ఆయష్షు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది తన శ్వాస మీద అధారపడి ఉంటుంది . ఆ ఉచ్చ్వాస , నిశ్చ్వాసాలు సమాప్తి అయ్యాక జీవి తన శరీరాన్ని వదిలి పరమాత్మని చేరుతుంది.


               ఈ సిద్ధాంతం ఖచ్చితంగా యోగుల విషయంలో పనిచేస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఎలా అంటే ఒక యోగి ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క శ్వాస అనేది క్రమక్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా ఆగిపోతుంది. అతని శరీరంలోని అవయవాల పనితీరు ఏ మాత్రం చెడిపోదు. శ్వాస ఆగుతుంది చుట్టూ ఉన్న కాలం ఆగదు.అతని ఉస్చ్వాస , నిశ్చ్వాసాలు యొక్క సంఖ్య తరగదు. ఈ విధముగా ఎంతకాలం గడిచినను అతను జీవించే ఉంటాడు. యోగం చేయువారు ప్రధానముగా తన శ్వాసని అదుపులో పెట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి .


                        పైన చెప్పిన విధానంలో యోగుల ఆయష్షు పెరుగును . వీరిలో చాలా మంది కుండలీ శక్తిని మేల్కొలిపినవారై ఉంటారు . ఈ దశలో వీరికి అష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి . ముందు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. ఆ తరువాత కుండలిని శక్తి గురించి చెప్తాను .


        సిద్ధులను పొందినవాడు సిద్దుడు అవుతాడు. కొంతమంది కొన్నిరకాల సిద్ధులతో సంతృప్తి పడి ఆగిపోతారు. కాని కొందరు మాత్రమే అన్నిరకాల సిద్ధులను సాధించే వరకు విశ్రమించరు . ఈ సిద్ధులలో బేధాలు కలవు. ఇవి మొత్తం 8 రకాలు .అందుకే వీటిని "అష్టసిద్దులు " అని పిలుస్తారు . ఇవి వరుసగా  


 * అణిమ .


 * మహిమా .


 * చైవ .


 * గరిమ .


 * లఘిమ .


 * తథా .


 * ప్రాప్తిహి . 


 * ప్రాకామ్య .


 * మీశిత్వం .


 * వశిత్వం .


 * చాష్ట భూతయః .


 అష్టసిద్దులు యొక్క వివరణ -


   శరీరమును చాలా చిన్నదిగా చేసుకొను ప్రక్రియయే "అణిమ " .


 తన స్వరూపమును చాలా పెద్దగా చేసుకొను ప్రక్రియను " మహిమ" అని పిలుస్తారు .


  తన శరీరంను చాలా బరువుగా చేసుకొను ప్రక్రియను " గరిమ" అని పిలుస్తారు .


  తన యొక్క శరీరంను అత్యంత తేలికగా చేసుకొను ప్రకియనే " లఘిమ" అని పిలుస్తారు .


  తన యొక్క జ్ఞానేంద్రియాలు , కర్మేంద్రియాలు సహయముతో ఎంత దూరం ఉన్న విషయములనైను గ్రహించుటయే "ప్రాప్తి" .


  తను కోరిన కోరికలు అన్నింటిని పొందుటనే "ప్రాకామ్యము" .


  తనశక్తిని ఇంకొకరి యందు ప్రసరింపచేయు సిద్ధిని "ఈశిత్వము " అందురు.


  సర్వ భూతములు అన్నియు తనకు వశం అగుటను "వశిత్వము" అందురు.


          ఈ 8 రకాల సిద్ధులను "అష్టసిద్దులు" అందురు. ఈ అష్టసిద్ధులు ను సాధించినవాడు మహాయోగి అగును. ఇవియే గాక సూక్ష్మ శరీరముతో లోకలోకాంతరములు అన్నింటిని దర్శించుట, దూరశ్రవణము , దూరదర్శనము , ఆకలిదప్పికలు లేకపోవుట , ధ్యానావస్థలో కొత్తకొత్త విఙ్ఞాన విషయాలు తెలుసుకొనుట, మరొక లోకములలో నివశించుతున్న మహాపురుషులను సందర్శించి వారితో సంభాషించటం , తన సంశయములకు సమాధానములు వారి నుంచి పొందుట , ఎక్కువ సమయములో అనుభవించదగిన ప్రారబ్ద కర్మను తక్కువ సమయములోనే అనుభవించి ముగింపచేయుట , అనేక మంది దుఃఖితుల యొక్క దుఃఖాన్ని దూరం చేయుట , పూర్వజన్మ , రాబోవు జన్మ గురించి తెలుసుకొనుట , త్రికాల జ్ఞానము మొదలగునవి ఉపసిద్దుల కిందికి వచ్చును. అష్టసిద్దులు సాధించు సమయంలో తన యొక్క ప్రయత్న స్థితిని బట్టి ఈ ఉపసిద్దులు కూడా యోగికి వచ్చును.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034