*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ*👏
*🤣పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం సృష్టించావు. ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు. కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తావు.🤣*
*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*
*🤪పంచదార, బెల్లం, తియ్యటి పళ్ళు ఇచ్చావు. కానీ, ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.🤪*
*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ.👏*
*😃మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మా చెమట వాసనతోనే గుర్తుపట్టి మా నెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.😃*
*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*
*🥱సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు.🥱*
*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*
*🤣రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు.🤣*
*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ..👏*
*🫢నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు🫢*.
*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*
*🤪ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు. అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు.🤪*
*👏నువ్వు తక్కువ వాడివి కావు సామీ...👏*
*😭నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.😭*
*🫡కానీ సామీ!*
*నేనూ తక్కువవాణ్ని కాదు. నాకు బాగా తెలుసు, నీ కాళ్ళట్టుకుంటే, నీవే నన్నెత్తుకుంటావని🫡*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి