శు భో ద యం🙏
"మనమున నూహపోహణలు మర్వకమున్నె, కఫాది రోగముల్
తనువుననంటి మేనిబిగి తప్పకమున్నె, నరుండు మోక్షసా
ధన మొనరింపగావలయు; తత్త్వవిచారము మానియుండుటల్
తనువునకున్ విరోధమది, దాశరథీ! కరుణాపయోనిధీ!"-
(దాశరథి శతకము - రామదాసు)
భావము: మనస్సునకు ఆలోచించే శక్తి నశించక మున్నే, శ్లేష్మ కఫాదులప్రకోుమున వ్యాధులు దేహమున వ్యాపింపక మున్నే , మానవుడు ఆధ్యాత్మికసాధనతో పరమాత్మను గురించి విచారము చేసి, మోక్షసాధనకుయోగ్యమగు నుపాయములను అన్వేషింపవలెను. తర్వాత ఇటువంటి ప్రయత్నం చేయుటకు సాధ్యము కాదు" అనుచున్నాడు రామదాసు.
ఈ పద్యములో కవి, మానవుని శరీరము అల్పమైనదని, క్షణికమైనదని, అది ఎప్పటికైనా రోగగ్రస్తము కావచ్చునని, దేహమున సత్తువ యున్నప్పుడే పరమాత్మను గురించి విచారించి, మోక్షసాధనకు మార్గం కనుగొనవలెనని, సందేశము!
స్వస్తి
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి