11, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య పూరణ.

 *కలికాలమ్మునc బాప పుణ్యముల లెక్కల్ తాఱు మాఱౌc గదా*

ఈ సమస్యకు నాపూరణ. 


*శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో*


తలపన్నేరరు ధర్మకార్యములు సద్భావంబు పూజ్యం బగున్


కలుషమ్మౌ జనజీవనంబులును పోగాలంబు దాపుండునే


నిలువన్నేరవు రాజశాసనములున్ నిద్రించునే పాలనల్


కలికాలమ్మునc బాప పుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌc గదా! 


అల్వాల లక్ష్మణ మూర్తి.

కామెంట్‌లు లేవు: