11, డిసెంబర్ 2024, బుధవారం

గీతాజయంతి

 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి "గీతాజయంతి" గా (11-12-2024) ఆచరిస్తున్నాము. లౌకిక భాషలో చెప్పాలంటే ఆరోజు భగవద్గీత పుట్టినరోజు అని అర్థము. కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో 


”ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ: మామాకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ” ప్రశ్నించాడు.


యుద్ధమునకు తలపడిన నావాళ్ళు అయిన కౌరవులు పాండవులు యేమి చేసిరి అని ప్రశ్న. ఆ సందర్భమున వ్యాసభగవానుడు సంజయునకిచ్చిన, ‘యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట’ అను వరము వలన జరిగినదంతా చూచి ధృతరాష్ట్రునకు వివరించినాడు. ఆ సంరద్భముననే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించినాడు. ఇట్లు ఆరోజు గీతలోకమునకు వెలువడినది. అందువలన గీతాజయన్తిగా మనం ఆనాడు జరుపుకుంటున్నాము. భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది. 


మిత్రులకు, శ్రేయోభిలాషులకు


 *"గీతా జయంతి శుభాకాంక్షలు"*


 💐💐🕉️💐💐


 🙏 నమో నారాయణాయ 🙏

 

🙏 *వందే గీతామాతరం* 🙏

కామెంట్‌లు లేవు: