ఉ.పాపులు కొంద రుందురు వివర్జిత శీలురు తమ్ము తాము నే
దోపగిదిన్ కుచేష్టల నయుక్తముగా పొగడొందు కొంచు నిం
కేపని పాటలేక తమ కెన్నక మేలును గూర్చు వారికే
పాపమెరుంగ నట్టి పరివారము కెన్నుచు కీడొనర్చుచున్౹౹ 67
మ.ఉపకారమ్మె సమస్త జీవులకు సర్వోత్కృష్టమై వెల్గగా
నపకారమ్మున హాని గల్గు, నఘమే యాతవ్యుడై కాల్చెడున్
కపటమ్మెన్న నరిష్ట హేతువగు, సంఘమ్మందు విద్రోహిగా
నపకీర్తి న్మహి మూటగట్టుకొన లక్ష్యార్థమ్ము సిధ్ధించునే?!౹౹ 68
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి