28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

కృష్ణ మందిర్

 Hyderabad మిత్రులు అందరూ దయచేసి..ఈ గుడినీ ఓ మారు దర్శించాలని మనవి🙏🙏


ఈ గుడి హైదరాబాద్ లోని కిషన్ బాగ్ లో ఉన్న భైరవ స్వామి గుడి., ఇక్కడి పంతులు గారి పరిస్థితి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి బాగా లేక ఆ పంతులుగారు ఆటో నడిపిస్తున్నారు 


కాబట్టి చుట్టూ పక్కల ఉన్నవాళ్లు ఆ గుడికి తరచుగా వెళ్ళండి ఆ ప్లేట్ లో ఓ 20 సమర్పించండి.,


ఈ గుడితో పాటు పక్కనే కాశిబుగ్గ ఆలయం, కృష్ణుని గుడికూడా ఉంది..,


పాపం కృష్ణ మందిర్ ముందే ఓ పెద్ద చెత్త కుప్ప., చుట్టూ ముస్లిం ఏరియా..,


కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి., పైగా ఇది 200 సంవత్సర క్రితం కట్టింది..


కాబట్టి ఈ మూడు గుడులకు చుట్టూ పక్కన ఉన్నవారు వెళ్ళండి వెళ్తూ ఉంటే పూజలు జరుగుతూ ఉంటే శక్తి ఉత్తేజం చెందుతుంది..


ఈ గుడులకు వెళ్లిన వాళ్ళు హుండీలో కాకుండా ఆ పళ్ళెంలో మాత్రమే దక్షిణ వేసి అక్కడి పూజారిని ఆదుకోండి... వాళ్ళ పరిస్థితి కష్టంగా ఉంది... 🙏


Sudha Krish  పెట్టిన పై పోస్ట్ చదివి నిన్న సాయంత్రం ఆ ప్రదేశానికి వెళ్ళాను. అది అత్తాపూర్ దాటాక కిషన్ బాగ్ లో ఉంది.

మేముంటున్న మియపూర్ ఏరియా కి సుమారు 25 కి.మీ దూరం.


ముందుగా భైరవస్వామి దేవాలయం చూద్దామని వెళ్లాం. కానీ దానికి ముందే చాలా పెద్ద తలుపులతో పూర్వం రాజులు నిర్మించిన దేవాలయం లాగా ఒకటి కనిపించింది. ఏమిటో ఆ దేవాలయం అని చూస్తే దాని పేరు

 "శ్రీ మురళీమనోహర స్వామి" వారి దేవాలయం. బహుశా దీనినే కృష్ణ దేవాలయం అంటున్నారేమో.


ఈ దేవాలయం కనీసం 250 సం. ల క్రిందట కట్టబడి నట్లు ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. దేవాలయం చిన్నదే కానీ ప్రహరీ గోడ ని అనుకుని లోపల అంతా రాతి మంటపం నిర్మించి ఉంది. కొంత శిథిలావస్థకు చేరిన స్థితిలో ఉంది.


అహోబిలం మఠం స్వామి వారు 1750 సం. లో ఈ దేవాలయానికి విచ్చేసినట్లు శిలాఫలకం ఉంది.


ఈ స్వామి వారి మూర్తి చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలవు. పేరుకు తగ్గట్టే  స్వామి వారి మూర్తి మురళీ మనోహరం.


ఈ దేవాలయానికి రెండు కధలు వ్యాప్తిలో ఉన్నాయి. మొదటి దాని ప్రకారం ఢిల్లీలో వుండే రాజా రఘు రాం బహదూర్ కి పిల్లలు లేరు. అయితే ఒకరోజు  రాజా వారికి కలలో హైదరాబాద్ లో ఒక తోట, దానిలో భూమిలో 5 అడుగుల క్రింద ఉన్న కృష విగ్రహం కనిపించాయట. వెంటనే రాజా వారు అనుచరులతో కలిసి గుర్రాలు పై హైదరాబాద్ వచ్చి అన్ని తోటల్లో వెతకగా ఈ తోటలో కృష్ణుని విగ్రహం కనిపించడం, ఈ ఆలయం   నిర్మించి విగ్రహం ప్రతిషించారట.  ఈ దేవాలయం నిర్మించిన వెంటనే వారికి సంతానం కలిగింది అని ఒక కథనం. 


రెండో కథ ఏమిటంటే..  నిజాం దగ్గర వకీల్ లేదా నిజాం కు ఎజెంట్ గా పైన చెప్పిన రాజవారు వుండేవారు అని వారే ఈ దేవాలయం నిర్మించారు అని.


ఈ దేవాలయం పక్కనే సయ్యద్ షా నిజముల్లా హుసైన్ దర్గా ఉంది. 


ఈ దేవాలయం ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. చుట్టూ ఎక్కువ శాతం ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.. చూడబోతే ఈ విలువైన 

స్థలం కబ్జాకు గురి అయ్యే అవకాశాలు ఉండటంతో దేవాదాయశాఖ పెద్ద నోటీసులు అంటించింది.


అక్కడకు పోయిన తరువాత నాకు అర్ధం అయింది ఏమిటంటే  ఈ దేవాలయాలకు భక్తులు ఉత్సవాలు సమయంలో తప్ప సాధారణ రోజుల్లో రావడం సంఖ్య తగ్గిపోవడానికి ఈ ప్రాంతం ఒక కారణం కావచ్చు. 


ఈ దేవాలయానికి దగ్గరలోనే భైరవస్వామి వారి దేవాలయం ఉంది. చాలా చిన్న దేవాలయం ఈ దేవాలయం కూడా సుమారు 200 సం. ల క్రిందట కట్టినట్లు చెపుతున్నారు. ఈ దేవాలయానికి కూడా లోపల వైపు అంతా శిథిలావస్థకు చేరిన రాతి మంటపం ఉంది.


చూడబోతే పైన చెప్పిన మురళీమనోహర దేవాలయంలో మంటపం, దీనిలో మంటపం  నిర్మాణ శైలి ఒకే లాగా అనిపించాయి.


ఇక్కడ పూజారి గారి పేరు నట్వర్ నాధ్ శర్మ. ఉత్తరాది బ్రాహ్మణులు.

ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో పూజారి గారు ఖాళీ సమయాల్లో పొట్ట కూటి కోసం ఆటో నడుపుకుంటున్నారు.

వారి గూగుల్ పే నెంబర్: 8886511504.


పై కారణాలు దృష్ట్యా మనకు దగ్గరలో గల ఇటువంటి దేవాలయాలు గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కనీసం శని ఆదివారాలు లేదా శలవు రోజుల్లో అయినా ఈ దేవాలయాలు దర్శించే భక్తుల సంఖ్య పెంచవచ్చు. మన భక్తులు ఎంత ఎక్కువగా దర్శిస్తే దేవాలయాలు అంత ఎక్కువగా ప్రాచుర్యం పొంది ప్రాచీన వైభవం సంతరించుకుంటాయి, కబ్జాకు గురి కాకుండా నిలబడతాయి.


ఈ దేవాలయాలకు దగ్గరగా మరొక ముఖ్య దేవాలయం ఉంది. అదే కాశిబుగ్గ ఆలయం.

కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి.  ఇది కూడా 200 సంవత్సర క్రితం కట్టింది..


నిన్న నాకు టైం సరిపోక ఆ దేవాలయం దర్శించలేకపోయాను. మరొక్క సారి వెళ్ళాలి.


అందువల్ల అందరూ ఈ దేవాలయాలు తప్పక దర్శించి ఆలయాల పునర్వైభవానికి తమ సహకారం అందించండి..🙏🙏🙏


....చాడా శాస్త్రి....

పాప భారం*

 *పాప భారం*

🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭


మహా కుంభ మేళాలో త్రివేణీ సంగమ స్నానమాచరిస్తన్న కోట్లాది మందిని చూసిన ఒక ఋషిపుంగవునికి  ఒకసందేహంవచ్చి వెంటనే  గంగాదేవిని 

ప్రార్థించి ఇలా అడిగాడుట!

అమ్మా  గంగాభవాని! ఎందరో ఎన్నెన్నో పాపాలు చేసి నదిలో మునక వేసి వారి వారి పాపాలన్నీ నీలో కలి పేస్తూన్నారు.  మరిఇందరి  ఇంత ఎక్కువ పాప భారాన్ని ఎలా మోస్తూన్నావు తల్లీ? అని. 

అందుకాతల్లి. " నాయనా  నేనెట్లా ఆ పాప భారం మోస్తున్నాను? అవన్నీ  ఎప్పటికప్పుడు తీసుకెళ్లి సముద్రం లో

కల్పేస్తున్నాను" అని బదులిచ్చిందట. 

ఆ మాట విన్న ఋషి అయ్యో! అన్ని పుణ్య నదులు ఇంతే కదా? పాపాలన్నీ  అన్ని నదులూ సముద్రం లోనే కలిపేస్తున్నాయి కదా? పాపం! సముద్రుడు ఈ పాప భారాన్ని ఎలా భరిస్తునాడో అనుకుని  సముద్రుడ్నే అడిగాడట ఎలా మోస్తున్నావు ఈ పాప భారాన్ని? అని 

దానికి ఆ సముద్రుడు!

నేనెక్కడ మోస్తున్నాను ఆ పాపాలనూ!

వెనువెంటనే ఆవిరిగామార్చి పైకి మేఘాలలోకి పంపిస్తాను కదా

అని బదులు ఇచ్చాడట!

అరే!  ఎంతో తేలిక గా కదలిపో యే మేఘమాలికలారా!  మీరు ఎలా భరిస్తున్నారు ఆ పాప భారాన్ని? అని.అడగగా!!!!

అవి పక పకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం?  ఆ పాపాలన్నీ ఎప్పటికప్పుడే వర్ష రూపేణా మీ మీదే కురిపించేస్తున్నాం అని బదులిచ్చాయట!

ఓహో!!! ఆ పాపాలన్నీ  మనమీద పడి తరిగి మనమే అనుభవిస్తున్నాము అన్న మాట!

ఎట్టి పరిస్థితుల్లోనూ! ఎవరూ కూడా! కర్మ ఫలితాలను వదిలించుకోలేమని ఆ ఋషి గ్రహించాడు!!!

అప్పుడు ఆ ఋషికి  పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకం గూర్తుకొచ్చింది!

*" ఇదం తీర్థ మిదం తీర్థం భ్రమన్తి తామసాః జనాః,* 

*ఆత్మ తీర్థం  నజానన్తి కథం మోక్షః శృణు  ప్రియే. "*

            అంటే

ఈ తీర్థం లో స్నానమాచరించిన పాపాలు నశించును, ఆ తీర్థం లో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఇంకో నదిలో స్నానమాచరించిన మోక్షం సిద్ధించును! అని తీర్థస్నానములకై పరుగులెత్తెడు మానవులు " భ్రమకు లోబడినవారు".


*" ఆత్మజ్ఞాన మనే తీర్థం లో స్నానమాచరించని వారికి మోక్షమెట్లు కలుగును?"*

*" కర్మ కర్మణా నశ్యతి కర్మ "*

కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది. 


*పురోహితులు కళాధర శర్మ తెలకపల్లి 🪷💐*

మనుషులతో సఖ్యంబుల

 *2025*

*కం*

మనుషులతో సఖ్యంబుల

ననవరతము కాచుకొనెడి యావశ్యకముల్

కనుగొను వారలె ధన్యులు

మనుషులు సఖ్యంబుతోనె మనునిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనుషుల తో స్నేహాన్ని ఎల్లప్పుడూ కాపాడుకొనవలసిన అవసరాన్ని కనిపెట్టగలిగే వారే ధన్యులు(కృతకృత్యులు/ఉత్తీర్ణులు/గెలుపొందువారు). ఎందుకంటే మనుషులు స్నేహం ఉన్నంతవరకే ఈ భూలోకంలో మనగలుగుతారు.(ఉండగలరు/నిలువగలరు/మసలగలరు).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున 

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ (45)


యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే 

తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః (46)


అర్జునా.. వేదాలు మూడుగుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలనూ విడిచిపెట్టి, ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. నదినుంచి నీరుతెచ్చుకునేవాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యమివ్వరో అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం ఇవ్వరు.

శర్కరాదేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 1034


⚜ కేరళ  :  చిరాయింకీజు -  త్రివేండ్రం 


⚜ శర్కరాదేవి ఆలయం



💠 శర్కరాదేవి దేవాలయం దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి.  

ఇది చిరయిన్‌కీజు తాలూకా (తిరువనంతపురం జిల్లా వాయువ్యంలో) దక్షిణాన ఉంది.  


💠 ఇది వర్కాలలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి మరియు త్రివేండ్రం సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి . చిరయిన్‌కీజులోని సర్కారా దేవి ఆలయం భద్రకాళి దేవికి అంకితం చేయబడింది.


💠  1748లో ట్రావెన్‌కోర్ సార్వభౌముడు అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ ప్రసిద్ధ కలియూట్ ఉత్సవాన్ని ప్రవేశపెట్టడంతో శర్కరాదేవి ఆలయం అనేక కారణాల వల్ల ముఖ్యమైన హోదాను సంతరించుకుంది మరియు ప్రధానంగా చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. 


💠 శర్కరా దేవి ఆలయానికి సంబంధించి ఒక పురాణం ఉంది: 

చాలా కాలం క్రితం, ఈ ఆలయం ఉన్న ప్రదేశం తక్కువ జనాభాతో ఉండేది. బెల్లం ఊట వ్యాపారం చేసే వ్యాపారుల బృందం ఈ ప్రదేశం గుండా వెళుతోంది. రోడ్డు పక్కన కొంత సేపు ఆగిపోవాలని నిర్ణయించుకున్నారు. 

వారు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించినప్పుడు, వారి కుండలలో ఒకదానిని కదల్చలేమని వారు కనుగొన్నారు. 

వారు దానిని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు, కుండ విరిగిపోయింది మరియు బెల్లం ఊట  ప్రవహిస్తుంది మరియు అక్కడ ఒక విగ్రహం కనిపించింది. 


💠 తరువాత, ఒక వృద్ధురాలు విగ్రహాన్ని చూసి గ్రామస్తులకు అద్భుతం గురించి తెలియజేసింది. 

గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. 

దేవత శర్కారా (మలయాళ పదం బెల్లం/చెరుకు ఊట) నుండి వచ్చింది కాబట్టి, దేవత శర్కరా దేవిగా ప్రసిద్ధి చెందింది.


💠 గర్భగుడి రెండు అంతస్తుల దీర్ఘచతురస్రాకార నిర్మాణం. 

పైకప్పు కంచుతో చేయబడింది. అమ్మవారి విగ్రహం ఉత్తరం వైపు ఉంటుంది. 

కృష్ణుడు, రాముడు, దుర్గ, గణపతి, విష్ణువు, నరసింహమూర్తి మరియు అనేక ఇతర ముఖ్యమైన దేవతల లెక్కలేనన్ని శిల్పాలు రెండవ అంతస్తును అలంకరించాయి.


💠 అట్టింగల్‌లోని అవనావంచెరిలో ఉన్న నక్రంకోడ్ దేవి ఆలయంతో శర్కరాదేవి ఆలయానికి కొంత ప్రాథమిక అనుబంధం ఉంది. 

ఆలయంలో ఒక చిన్న చెరువు ఉంది, ఇక్కడ భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు చేతులు కడుక్కోవచ్చు. 


💠 మలయాళ నెల కుంభం (మార్చి)లో వచ్చే కలియూట్ పండుగ ఈ ఆలయంలో ప్రధాన పండుగ.  కాళీదేవత రైతుల ఆరాధ్యదైవం.


💠 కలియూట్ కళారూపం యొక్క ఆచారాలలో వ్యవసాయ కళ సంప్రదాయాల యొక్క కల్పిత వివరణలను చేర్చడం ద్వారా ఇది స్పష్టమవుతుంది. 


💠 కలియూట్ అనేది వరుసగా మంచి మరియు చెడుల ప్రతినిధులైన భద్రకాళి మరియు దారికా యొక్క పుట్టుకను నాటకీయంగా ప్రదర్శించడం, వారి ఘర్షణ మరియు తరువాత దారికను భక్తి పరంగా మరియు లయబద్ధమైన అడుగుజాడలతో సంహరించడం.  


💠 కలియూట్ పండుగ యొక్క లక్ష్యం భూమి యొక్క రక్షకులైన కాళికా దేవికి ప్రాథమిక పంటను అందించడం.


💠 కలియూట్ పండుగ సాధారణంగా ఫిబ్రవరి/మార్చి నెలలో జరుపుకుంటారు. 

ఇది ఆలయ ప్రాంగణంలో ఆచారాలు మరియు సాంప్రదాయ వేడుకలతో 9 రోజుల పాటు జరిగే పండుగ.


💠 మొదటి 7 రోజుల వేడుకలు భద్రకాళి మరియు దారికా మధ్య యుద్ధానికి దారితీసే కథల నాటకీయ దృశ్యమానం.  

ఈ వేడుకలు వరుసగా 8వ మరియు 9వ రోజు వేడుకలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.


💠 వేడుకల 8వ రోజున, భద్రకాళి స్వయంగా దారికను వెతుకుతూ బయటకు వెళుతుంది, కానీ ఆ రోజు చివరిలో రాక్షస రాజును కనుగొనకుండా తిరిగి వస్తుంది. 

ఆ రోజు దేవత అందించే పండుగకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఈ ఫంక్షన్ ఒకటి.  


💠 ప్రసిద్ధ "నిలతిల్ పోరు" (గ్రౌండ్ ఫైట్) వేడుకల 9వ మరియు చివరి రోజులో జరుగుతుంది, ఇది రాక్షస రాజును భద్రకాళి చంపడాన్ని దృశ్యమానం చేస్తుంది మరియు తద్వారా చెడుపై సత్యం వ్యాప్తి చెందుతుంది.


💠 కాళీ నాటకోత్సవంలో 8వ మరియు 9వ రోజు కార్యక్రమాలు మరియు రంగుల వేడుకలు పూర్తి కావడానికి గంటల సమయం పడుతుంది.

 

💠 మీనా భరణి ఉత్సవం శర్కరా దేవి ఆలయంలో రెండవ గొప్ప వార్షిక పండుగ.  

ఈ పండుగ తరచుగా వార్షిక ప్రత్యేక పూజా అట్టవిశేషం సందర్భంగా వస్తుంది. 



💠 "మీనాభరణి పండుగ సాధారణంగా శర్కరాదేవి జన్మ నక్షత్రంగా పరిగణించబడే భరణి నక్షత్రానికి తొమ్మిది రోజుల ముందు కొడియెట్టు (జెండా ఎగురవేయడం)తో ప్రారంభమవుతుంది.  

ఇది పదవ రోజున ఆలయ ట్యాంక్‌లో దేవత యొక్క ఆరాత్ (పవిత్ర నిమజ్జనం)తో ముగుస్తుంది. 


💠 ఈ పండుగకు సంబంధించి చాలా ఆసక్తికరమైన వేడుకలు ఉన్నాయి.  పల్లివెట్ట అని పిలువబడే ఈ ఆలయంలో తొమ్మిదవ రోజున ఒక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తారు.  ఈ కార్యక్రమంలో శర్కరా దేవి ఆలయం నుండి అదృశ్యమైందని మరియు ఆమె వేటకు వెళ్లిందని నమ్ముతారు.  

5 ఏనుగులు మరియు అగ్నిజ్వాలల తోడుగా వేట కోసం దేవిని ఊరేగింపుగా భగవతీ ప్యాలెస్‌కు తీసుకువెళతారు.  


💠 పూర్వ కాలంలో ఈ ప్రదర్శనతో పాటుగా జంతుబలులు నిర్వహించేవారు.  

అయినప్పటికీ, తరువాతి కాలంలో జంతు బలులు నివారించబడ్డాయి.  



💠 వర్కాల రైల్వే స్టేషన్ నుండి 7 కి.మీ దూరం 


రచన

©️ Santosh

తర్వాత ఆలోచిస్తుంది

 


అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది  మరణించేవాడిని కూడా బతికించేలా ఉండాలి కానీ , బతికి ఉన్నవాడిని మానసింగా చంపేలా ఉండకూడదు.

మాఘ పురాణం - 30

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷శుక్రవారం 28 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 30 వ*_ 

        _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మార్కండేయుని వృత్తాంతము*


☘☘☘☘☘☘☘☘☘


వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము , మృకండుని జననము , కాశివిశ్వనాధుని దర్శనము , విశ్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి *"మహారాజా ! ఇక మార్కండేయుని గురించి వివరింతును , శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాస్త్రములు , వేదాంత పురాణేతిహాసములు , స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు "కుమారా ! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ , పెద్దలయెడ , బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన , నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధగును"* అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన , భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి , మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు , మునీశ్వరులు , గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరుకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా , ఆయన మార్కండేయుని వారించినారు , అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా ! మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా ! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా ? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.


అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. *'చిరంజీవివై వర్ధిల్లు'* మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా ? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి , వశిష్టులు కొంతసేపాలోచించి *"మునిసత్తములారా ! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు"* అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ *'చిరంజీవిగా జీవించు నాయనా'* అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు  వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొంత తడవడి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి *"పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక"* యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి *"ఓ మునులారా ! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు"* అని పలికి వత్సా మర్కండేయా ! నీవు కాశీ క్షేత్రమునకు పోయి , విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.


మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి , *'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ'* నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక , కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి. విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే యుండసాగెను.


క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధిలో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి , ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా , నాతడు భయపడి , శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి , మార్కండేయుని రక్షించెను.


యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి , కోపముచల్లార్చుకో మహేశా ! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా ! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని , ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన , మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదగ్గరికి రావలదు సుమా ! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి , తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.


*మాఘపురాణం ముప్పయివ* 

      *🙏మరియు చివరి🙏* 

   *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

ఫాల్గుణ మాసం విశిష్టత*

 *ఫాల్గుణ మాసం  విశిష్టత*


♻️♻️♻️♻️♻️♻️♻️♻️


ఫాల్గుణం... విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు *"పయోవ్రతం"* ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం , ధనదానం , వస్త్రదానం , గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు , వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా , సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.


*వసంత పంచమి* నుంచి *ఫాల్గుణ పూర్ణిమ* వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు , లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.


*హరిహరసుతుడు అయ్యప్పస్వామి ,  పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు.* ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు , రామకృష్ణ పరమహంస , స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి *‘ఫల్గుణ’* అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు , ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు , దుర్యోధనుడు , దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.


*ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన*


*శ్లో || నరాడోలా గతం దృష్ట్యా గోవిందం         పురుషోత్తమం !* 


*ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్ !!*


శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే , ఆ మాసాన్ని *‘ఫాల్గుణి’* గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు *‘పయోవ్రతం’* విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.


సమీపంలోని నదుల్లో స్నానమాచరించి , సూర్యుడికి అర్ఘ్యమిచ్చి , విష్ణువును షోడశోపచారాలతో పూజించి , పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు , పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. 


ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ , ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి , చతుర్థినాడు అవిఘ్న , పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు.


ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు. దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి , ఆ చెట్టు వద్దనే *‘అమలక ఏకాదశి’* వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని *‘అమృత ఏకాదశి’* గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ , హోలికా పూర్ణిమ , కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి - కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు , మన్మథుడు , కృష్ణుడు , లక్ష్మీదేవి పూజలందుకుంటారు.


ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు *‘సంకట గణేశ’* వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి , సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి , అన్నదానం చేస్తారు.


*ఫాల్గుణ మాస ప్రాశస్త్యం*


పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు , పండుగలూ , ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్తరూపం ఈ మాసం.

ఈ మాసాధిపతి గోవిందుడు కావున , ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోః – వేదాలు , గోవులు విందః – రక్షించేవాడు గోవిందుడు , అంటే ఈ సమస్త జీవకోటికీ పూజనీయమైన వేదాలను , గోవులను రక్షించేవాడు అంతేకాకుండా మనలని రక్షించి ఆత్మతత్త్వాన్ని తెలియచేసేవాడు. ఈ మాసంలో అచ్యుత , అనంత , గోవింద అనే నామస్మరణ ఎంతో శుభఫలితాన్ని ఇస్తుంది. వసంతఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతీ దినమూ ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు , పర్వ దినాలూ , విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


*ఫాల్గుణ శుద్ధ పాడ్యమి* మొదలు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ *పయోవ్రతం* ఆచరిస్తారు. భాగవతం అష్టమ స్కందం ప్రకారం , బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అదితి , కశ్యపుణ్ణి బలి గర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా , కశ్యపుడు ఈ *పయో వ్రతాన్ని* ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందింది. ఈ వ్రతంలో ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకూ లక్ష్మీ నారాయణులని షోడశోపచారాలతో పూజించి , కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి , బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో , వస్త్ర , ధన , దానాలు శక్తి కొలదీ చేస్తారు.


*ఫాల్గుణ మాసం శుద్ధ విదియ* నుండీ *యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.*


*ఫాల్గుణ శుద్ధ చవితి* రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి , సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి , ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.


ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి రెండు రోజులూ స్వామివారికి శ్రీరాముడు , శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత మూడురోజులూ శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తారు.


*ఫాల్గుణ శుద్ధ నవమి* నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.


*అమలక ఏకాదశి* ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక లేదా ధాత్రీ ఫలం గా పిలుచుకునే ఉసిరిని విష్ణుస్వరూపంగా భావించి ఈనాడు ఉసిరివృక్షం క్రింద శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం. ఈరోజు ఏకాదశీ వ్రతం ఆచరించి , విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభపలితాన్నిస్తుంది.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి , నృసింహ ద్వాదశి అంటారు. ఈ నాడు గంగాస్నానం పవిత్రం. కుదరని వారు సమీపం లోని ఏదైనా నది వద్దకు వెళ్లి , గంగను స్మరిస్తూ నదీస్నానం చేయాలి. నృసింహకరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి.


*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మహా పూర్ణిమ , హోళికా పూర్ణిమ , డోలా పూర్ణిమ , కామదహనోత్సవంగా* వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు.


దక్షిణ భారత దేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు. శివకళ్యాణం అనే మహత్తరకార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి , తన మూడో నేత్రంతో భస్మం చేసిందీ ఈనాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెకొక్కదానికే అతడు కనిపించేలాగా వరము ఇచ్చాడు శివుడు. మనలో ఉన్న కామక్రోధాదులనే అరిషడ్వర్గాలని దహనం చేసి , ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ , శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేగాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకుని కూడా ఉత్సవం చేస్తారు.


ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో , అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి , తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది.


ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను , దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.


ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక , విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా , చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోలికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత (చూత కుసుమ భక్షణం) ను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.


ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా *డోలా పూర్ణిమ* చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు.


*ఫాల్గుణ బహుళ విదియనాడు* లక్ష్మీదేవి పాలకడలి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆరోజు కనకధారా స్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది.


*ఫాల్గుణ బహుళ అష్టమి*

రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేకమంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు.


*ఫాల్గుణ బహుళ అమావాస్య* రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృ దేవతలకి తర్పణాలు ఇస్తారు.

ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరచుకున్న ఫాల్గుణ మాసంలో , భక్తితత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమవుదాము.

తరువున వెల్గుచుండె నవి తారలు మాలిక లౌచు వింతగన్*

 *తరువున వెల్గుచుండె నవి తారలు మాలిక లౌచు వింతగన్*

ఈ సమస్యకు నా పూరణ. 


"సురవన పారిజాతమును శూరత కృష్ణుడు దొంగిలించునే


తరుణమిదే లభించె పద ద్వారకకున్ భువి నందు స్వర్గమే


కురియు వరాల జల్లు"లని కోరిక చేరెను పుష్పజాతులున్


తరువున వెల్గుచుండె నవి తారలు మాలిక లౌచు వింతగన్.

జటాయువు

సీత నెందుకు దొంగిలింతువు చేటు వచ్చు తొలంగురా


పాతకుండవు రావణా! నిను పట్టి ద్రుంతు నఖంబుతో


రావణుడు

చేతికందిన యందమే యిది చేరవేతును లంకకున్


నీతి నాకదె యడ్డగింతువె? నిన్ను చంపుదు నిప్పుడే. 


అల్వాల లక్ష్మణ మూర్తి.



27, ఫిబ్రవరి 2025, గురువారం

కాలు జారితే

 108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….

🙏🙏🙏

.

రావికొండలరావు

 ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు రావికొండలరావు గారు వందలాది చిత్రాల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. చాలా చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. కొన్ని సినిమాలను నిర్మించడంతో పాటు.. దర్శకత్వం కూడా వహించారు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినిమా నటి. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు.  


రావి కొండలరావు గారు 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. వీరి కుటుంబానిది శ్రీకాకుళం జిల్లా. 1958లో శోభ చిత్రంతో రావికొండలరావు గారి సినీ ప్రస్థానం మొదలైంది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్​ఎడిటర్​గా పనిచేస్తూ.. సినిమాల్లో నటించేవారు. బాపు-రమణలకు మంచి ఆప్తులు. కెరీర్ తొలినాళ్లలో ముళ్లపూడి రమణగారింట్లోనే ఉన్నారు. తొలి రోజుల్లో మలయాళం, తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. అక్కడ డబ్బింగ్ కళాకారిణిగా ఉన్న రాధాకుమారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరివురూ చాలా సినిమాల్లో దంపతులుగానూ నటించారు.


"శోభ" సినిమాతో తెరంగేట్రం చేసిన తర్వాత వరకట్నం, పెళ్లికానుక, దసరాబుల్లోడు, అందాలరాముడు, రాధాకల్యాణం, చంటబ్బాయి, ఎదిరింటిమొగుడు పక్కింటి పెళ్లాం, పెళ్లిపుస్తకం, బృందావనం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. భైరవద్వీపం, బృందావనం, పెళ్లిపుస్తకం సినిమాలకు మాటల రచయతగా పనిచేశారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుకు సన్నిహితుడైన రావి కొండలరావు.. ఆయన దర్శకత్వం వహించిన భైరవద్వీపం, బృందావనం సినిమాల నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించారు.రావికొండలరావు మంచి కథకులు కూడా..! రావికొండలరావు కథలు, నాటికలు పేరుతో వాటిని వెలువరించారు. అలనాటి సినిమా విశేషాలను తెలుపుతూ బ్లాక్ అండ్ వైట్ అనే సినీ సంకలనం తీసుకొచ్చారు. ఆయన రచించిన హ్యూమరథం అనే పుస్తకం మంచి ప్రాచుర్యం పొందింది. రావికొండలరావును ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో గౌరవించింది.

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*చల్లటి స్పర్శ..*


"గత సంవత్సరం నుండీ  నాకు కష్టకాలం దాపురించినట్లుగా అనిపిస్తున్నది..ఏ పని చేద్దామని అనుకున్నా..ఏదో ఒక సమస్య తో ఆ పని ఆగిపోవడమో..లేదా..నాకు దక్కకుండా పోవడమో జరుగుతున్నది..జాతకం లో ఏదైనా దోషం ఉన్నదేమో నని..ఇద్దరు ముగ్గురు జ్యోతిష్కుల వద్ద జాతకం చూపించుకున్నాను..వాళ్ళు చెప్పిన పరిహారాలూ చేయించాను..ఈ పరిహారాలకే దాదాపు యాభైవేల రూపాయలు పైగా ఖర్చు చేసాను..అదొక అదనపు భారం పడింది నా మీద..దిక్కుతోచని పరిస్థితి నాది.." అన్నాడు నారాయణ  తన మిత్రుడి తో..


నిజమే..నారాయణ రావు సంవత్సరం క్రిందటి దాకా..బెంగుళూరు లో ఇళ్లు కట్టి అమ్మే వ్యాపారం లో బాగా సంపాదించాడు..కానీ ఉన్నట్టుండి అతని వ్యాపారం దెబ్బతిన్నది..కట్టిన ఇళ్లు అమ్ముడు పోలేదు..వాటి మీద పెట్టిన పెట్టుబడి ఇరుక్కుని పోయింది..తన స్వంత డబ్బులు కాకుండా..బైట నుంచి అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టాడు..ఆ అప్పుకు వడ్డీ పెరిగి పోతున్నది..అప్పు ఇచ్చిన వాళ్లలో ఒకరిద్దరు తాము ఇచ్చిన డబ్బు వెనక్కు ఇచ్చేయమని వత్తిడి చేయ సాగారు..ఈ సమస్య లతో నారాయణ రావు మనోశాంతి కోల్పోయి బాధపడసాగాడు..


నారాయణ రావు చెప్పిందంతా విన్న మిత్రుడు..ధైర్యం వహించమని ఓదార్చాడు కానీ..అతని ఆర్ధిక బాధలు తీరడానికి ఎటువంటి మార్గము చూపలేకపోయాడు..నారాయణ రావు నిరాశలో కూరుకుపోసాగాడు..


సరిగ్గా ఆ సమయం లో నెల్లూరు లో ఉంటున్న తన బంధువు ఒకరు బెంగుళూరుకు వచ్చారు..అతనితో తన కష్టాన్ని చెప్పుకొని బాధపడ్డాడు..అతను నారాయణరావును నెల్లూరు రమ్మని చెప్పాడు..మూడురోజుల తరువాత నారాయణ రావు నెల్లూరు లోని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు..ఆ సమయం లో ఆ బంధువు పూజ చేసుకుంటున్నాడు..నారాయణ రావు ఓపికగా ఎదురు చూసాడు..

పూజ ముగించుకొని..ఆ బంధువు..నారాయణ రావు ను పలకరించి.."నారాయణా..నీ కొచ్చిన ఇబ్బందుల నుంచి బయట పడాలంటే..ఒక్కసారి మొగలిచెర్ల వెళ్లి, అక్కడ సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించు..ఆ స్వామి దయ వుంటే..ఈ కష్టాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి..నేను స్వయంగా అనుభవించాను..చాలా మహిమగల అవధూత మందిరం అది..ఈ మాట చెప్పి, నిన్ను అక్కడికి తీసుకెళ్లాడానికే నెల్లూరు రమ్మని చెప్పాను..ఇప్పుడే ఇద్దరమూ బయలుదేరి వెళదాము..నా మాట విశ్వసించు.." అన్నాడు..నారాయణ రావు తాను జ్యోతిష్కుల ను నమ్మి..ఎలా ఇబ్బంది పడిందీ వివరించి..ఇప్పుడు తనకు ఏ దేవీ దేవతలను..సిద్ధులను..గురువునూ.. కొలిచే ఓపిక లేదని..తనను బలవంత పెట్టొద్దనీ..చెప్పాడు..కానీ ఆ వ్యక్తి వినలేదు సరికదా..నారాయణ రావు చెవిలో పోరు పెట్టి..ఎట్టకేలకు ఒప్పించాడు..


ఇద్దరూ కలిసి..కారులో మొగలిచెర్ల కు చేరుకొని..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం చేరారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నారు..నారాయణ రావు..శ్రీ స్వామివారి సమాధి ముందు సాగిలపడి..తన కష్టాలు చెప్పుకున్నాడు..ముందున్న మంటపం లో కొద్దిసేపు  ఇద్దరూ కూర్చున్నారు..ఒక ఐదు నిమిషాలు గడిచే సరికి..నారాయణ రావు కు తనకు తెలీకుండానే..నిద్ర ముంచుకొచ్చింది..అలానే వాలిపోయి..నిద్ర పోయాడు..నిద్రలో ఎవరో తన వీపుమీద అనునయంగా తడుముతున్నట్టు..చల్లని చేయి తన వళ్ళంతా నిమురుతున్నట్టు తోచింది..నారాయణ రావు లేచి సమయం చూసుకుంటే...తాను సుమారు మూడు గంటల పాటు నిద్రలో ఉన్నట్టు తెలిసింది..తన బంధువు కూడా నిద్ర పోతున్నాడు..అతని మనసంతా తేలికగా ఉంది..తన బంధువు కూడా నిద్ర లేచిన తరువాత..ఇద్దరూ కలిసి..మరొక్కసారి శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని నెల్లూరు వచ్చేసారు.. 


ఆరోజు రాత్రికే నారాయణ రావు బెంగుళూరుకు తిరిగి వచ్చేశాడు..మరో రెండు మూడు రోజుల్లోనే..నారాయణ రావు కట్టిన ఇళ్లకు బేరం వచ్చింది..అదికూడా అతను అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకు..ఈ పరిణామం అతను ఊహించలేదు..ప్రక్కరోజే కొంత నగదు ఇచ్చి అగ్రిమెంట్ వ్రాసుకున్నారు..నారాయణ రావు తన బంధువుకు ఫోన్ చేసి..విషయం చెప్పి..మొగలిచెర్ల స్వామివారి వద్ద తాను పొందిన చల్లటి స్పర్శ ఆ స్వామి వారిదే అనీ..తనను గట్టెక్కించిన ఆ మహానుభావుడి మందిరాన్ని మళ్లీ మళ్లీ దర్శించుకోవాలనీ.. ఉద్వేగంతో చెప్పాడు..


రెండు నెలలు తిరిగే సరికి నారాయణ రావు మామూలు స్థితికి వచ్చేశాడు..అప్పటి నుంచీ అతని మనసంతా శ్రీ స్వామివారే నిండిపోయారు..తన జీవితాన్ని కాపాడిన స్వామివారి మందిరాన్ని  పదే పదే దర్శించుకుంటూ ఉంటాడు..


స్వప్నంలో శ్రీ స్వామివారి చేతి స్పర్శ పొందిన అదృష్టవంతుడు నారాయణరావు..


సర్వం..

శ్రీ దత్త కృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).


 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*ఆరుబయట దీక్ష..*


కొన్నాళ్ల క్రితం నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం  శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చింది..చిత్రమైన సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళు..భార్యా భర్తా ఇద్దరు కుమారులు..ఆ ఇద్దరు కుమారులు కూడా పదిహేను సంవత్సరాల వయసు పై బడిన వారే..కుటుంబం లో ఉన్న ఇద్దరు పిల్లలకూ మానసిక స్థితి సరిగాలేదు..ఒక గంట ప్రవర్తించినట్లు..మరో గంటలో ప్రవర్తించరు.. ఒక రోజులోనే వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది..ఉన్నట్టుండి బాధ పడుతున్నట్లు మెలికలు తిరిగి పోతారు..మరి కొద్దిసేపటికే మామూలుగా వుంటారు..వీళ్ల ఇద్దరినీ తీసుకొని ఆ తల్లి తండ్రి శ్రీ స్వామివారి మందిరానికి చేరారు..


శ్రీ స్వామివారి మందిరానికి ఉత్తరంగా ఉన్న రావిచెట్టు క్రింద ఉన్న అరుగు మీదే ఉండేవాళ్ళు..రోజూ ఉదయం సాయంత్రం శ్రీ స్వామివారి మందిరం లో ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు..వీళ్ళను నేను గమనిస్తూనే వున్నాను..ఎండగా వున్నా..వర్షం కురుస్తున్నా కూడా ఆ కుటుంబం ఆ అరుగు మీదే వుంటున్నారు తప్ప..తలదాచుకోవడానికి రూము ల్లోకి రావడం లేదు..కొద్దిగా ఆశ్చర్యం గా ఉండేది నాకు..ఆరుబయట..ఏ ఆచ్ఛాదనా లేకుండా..కేవలం రావి చెట్టు నీడలో.. వీళ్ళు ఎలా వుండగలుగుతున్నారా? అని..


ఒకరోజు కుతూహలం ఆపుకోలేక..వీళ్ళ వివరాల కోసం మా సిబ్బందిని అడిగాను..ఈ కుటుంబం..పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామం..ఇళ్లు కట్టే మెస్త్రీ పని చేస్తుంటాడు అతను.తనకొచ్చిన ఆదాయం లోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు..ఇద్దరు మొగపిల్లలు..పెద్ద పిల్లవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు..రెండవవాడు పదవతరగతి చదువుతున్నారు.. ఉన్నంతలో బాగానే జరిగిపోతున్న సంసారం లో  చిన్న కుమారుడి మానసిక స్థితి లో మార్పు వచ్చింది..పిచ్చి పిచ్చిగా ప్రవర్తించసాగాడు..మరో వారం కల్లా పెద్దకుమారుడూ  అలానే మారిపోయాడు..ఇవన్నీ గ్రహ బాధలనీ..ఇవి తొలగిపోవాలంటే మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వెళ్లి కొన్నాళ్ల పాటు శ్రీ స్వామివారి ని కొలుస్తూ వుండమని కొందరు చెప్పారు..ఆ మాట ఈ దంపతుల మనసులో నాటుకుపోయింది..ఒక క్షణం కూడా ఆలస్యం లేకుండా..పిల్లలను తీసుకొని మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి చేరారు..


ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం..శ్రీ స్వామివారి సమాధి మందిరానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయసాగారు..పది రోజులు గడిచిపోయాయి..పిల్లల ప్రవర్తన లో మార్పు వస్తున్నది.. ముందుగా చిన్న పిల్లవాడు మామూలుగా మారాడు..మరో పదిరోజుల కల్లా పెద్దవాడిి ప్రవర్తన కూడా మారిపోయింది..ఆ తల్లీ తండ్రీ సంతోషానికి అవధులు లేవు..వాళ్ళు శ్రీ స్వామివారి వద్ద నలభై రోజులు ఉంటామని మ్రొక్కుకున్నారు..కానీ ఇరవై రోజుల్లోనే పిల్లలకు స్వస్థత ఏర్పడింది..అంతమాత్రం చేత వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్లిపోలేదు..శ్రీ స్వామివారి మందిరం వద్దే..ఆ చెట్టుకిందే వున్నారు..మందిరం లో చిన్న చిన్న పనులు చేయసాగారు..ఆ భార్యా భర్తా ఇద్దరూ మందిరం వద్ద పనులకు రాసాగారు..క్రమంగా మందిరం వద్దే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడపసాగారు..నలభై రోజుల పాటు శ్రీ స్వామివారిని కొలుద్దామనుకున్న ఆ కుటుంబం మూడు నెలల పాటు ఉండిపోయింది..పిల్లలిద్దరూ వాళ్ళ ఊరు వెళ్లి తమ తమ పరీక్షలు వ్రాసి వచ్చారు..మంచి మార్కులతోనే పాసయ్యారు..నలభై రోజుల తర్వాత కూడా ఆ కుటుంబం ఆ చెట్టు క్రింద ఉన్న అరుగు వద్ద నుంచి రూము లోకి రాలేదు..అక్కడే వున్నారు..


పిల్లలిద్దరూ పనికిరాకుండా పోతారేమోనని దిగులుపడ్డ ఆ దంపతులకు వాళ్ళు మళ్లీ మామూలు మనుషులవడానికి శ్రీ స్వామివారి ఆశీస్సులే కారణమని ప్రగాఢంగా నమ్మారు..మూడు నెలల తరువాత..వాళ్ళ ఊరికి వెళ్లేముందు..వాళ్ళను అడిగాను.."ఇన్నాళ్లూ ఆ చెట్టు క్రింద ఎలా వుండగలిగారూ?.." అని..


"అయ్యా..మేము అనుకున్నది కాదు..మొదటిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు..ఆరోజు రాత్రి నాకు స్వప్నం లో ఒక యోగి కనబడి..మమ్మల్ని ఇక్కడే వుండమని ఆదేశించాడు..అది శ్రీ స్వామివారి ఆదేశం అనుకొని..మేము అక్కడే ఉండిపోయాము..ఎండయినా.. వాన అయినా..అక్కడే వున్నాము..మేము అనుకున్న నలభై రోజుల దీక్ష లో ఇది కూడా ఒక భాగం అనుకున్నాము..చిత్రంగా మాకు ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు..ఆ స్వామి మమ్మల్ని కాపాడాడు.." అని చెప్పాడు..


శ్రీ స్వామివారి వద్ద నిరంతరమూ ఉన్నామనీ..అన్ని పనులూ సక్రమంగా చేస్తున్నామనీ..ఒక్కొక్కసారి కొద్దిగా గర్వంగా అనుకుంటాము..ఇటువంటి వారికున్న భక్తిలో ఎంత శాతం మనలో ఉందీ అని మాత్రం అనుకోము.. అందుకే అటువంటి వారిని అన్నివేళలా దైవం అడుగడుగునా కాపాడతాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

ఆచరించ వలసిన విధులు*

 🌹🌷🪷🪔🛕🪔🪷🌷🌹

*భక్త జనులందరు తెలుసుకొని* 

*ఆచరించ వలసిన విధులు*


*సనాతన హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం పాటిద్దాం.*

మంచి విషయాన్ని పది మందికి పంచుదాం. 

*మన సంస్కృతీ సాంప్రదాయాలను మన పిల్లలకు, భావితరాల వారికి చేరవేద్దాం.*

 

             *ఆలయాల్లో*

               *తీర్థం* 🤔

       *ఎలా తీసుకోవాలి..?* 

                 

*ఆలయంలో తీర్థం ఎలా తీసుకోవాలి. తీర్థం తీసుకున్నాక తలపై చేతితో ఎందుకు రాయొద్దు..?*


తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి!


గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం, దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు.


*శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువుని సాలగ్రామ శిలలకు... రుద్ర నమక చమకాలతో, పురుష సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పూజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నానము చేసిన జలము కుడా కలిపి (తులసీదళ సహితమై, పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము, తీర్థము అనబడును)ఇస్తారు.*


శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు.


ఈ తీర్థమును అర్చన పూర్తి అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికి, సన్యసించిన వారికినీ, అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.


తీర్థమును ఎలా తీసుకోవాలి 

అనే ప్రశ్నకు సమాధానం, మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని, పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి *తీర్థం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి.*```


తీర్థం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు


తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం.


తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానీయకుండా తాగాలి.


తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి‌.


అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.


1).మొదటిసారి తీర్థం 

   శారీరక, మానసిక                         

   శుద్థి జరుగుతుంది.


2).రెండోసారి తీర్థం 

   న్యాయ ధర్మ ప్రవర్తనలు 

   చక్కదిద్దుకుంటాయి.


3).మూడోది పవిత్రమైన 

   పరమేశ్వరుని పరమ 

   పదం అనుకుంటూ 

   తీసుకోవాలి.

    

    **తీర్థాల రకాలు:-*


1). జలతీర్ధం

2). కషాయ తీర్ధం

3). పంచామృత తీర్ధం

4). పానకా తీర్ధం```


*1. జల తీర్ధం:-*``` 

ఈ తీర్ధం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వ రోగాలు నివారించ బడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.```


*2). కషాయ తీర్ధం:-*```

ఈ తీర్ధం కొల్హాపురంలోని 

శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు  ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాలా మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయములో ఇస్తారు.

రాత్రి పూజ తరువాత తీర్థమును కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనికనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.```


*3).    *పంచామృత* 

         *అభిషేక తీర్థం:* 


పంచామృత సేవనం ద్వారా...                    చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.```


*4) *పానకా తీర్ధం*


శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.


పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. ఎముకలకు సంబందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.```


     *ఇతరమైన రకాలు:-* 


ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు.


వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.


             *శఠగోపం*

                    

గుడిలో తలమీద - ‘శఠగోపం’ ఎందుకు - పెడతారో తెలుసా?


శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు.


గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు.


అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు...


ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తాయని చెబుతారు.


అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలంటారు పండితులు.

 

శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు.


శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం.


భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.```



    *శఠగోపం విశేషాలు:*```


శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు... 


శఠగోపం వలయాకారంలో ఉంటుంది, వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి, శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి.  అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు.


అంటే మనము మన కోరికలను….       శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.


శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది.


భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన.


నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.```



*శఠగోపం వలన కలిగే ఫలితం:*```


శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి.


శఠగోప్యమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది.


తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.


శఠగోప్యమును శఠగోపం శటారి అని కూడా అంటారు.

         


  *సాష్టాంగ నమస్కారం*               


*🙏సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత🙏*

```

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.


సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము.```


సాష్టాంగ నమస్కారం చేసేటపుడు చదివే శ్లోకం:


*ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామోష్టాంగ ఈరితః౹౹*


అష్టాంగాలు అంటే...```


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా  

 హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా 

 పాదములు,

"కరాభ్యాం" అనగా 

 చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా ‘8’ అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.



మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. 


అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి.


ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.


1). ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతి నేలకు తగలాలి.


2). శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.


3). దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


4). మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనఃస్పూర్తిగా చేయాలి.


5). వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం. అంటే నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే "ఓం నమో నారాయణాయ" అని అంటూ నమస్కారం చేయాలి.


6). పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8) కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చెవులు కూడా నేలకు తగులుతూ

(అటూఇటూతిప్పి) ఉండాలి.```


*స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు!* 


*ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి.*


అంటే కాళ్లు, చేతులు, నుదురు, మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని (కళ్ళు, మనసుతో ఐదు)శాస్త్రం చెబుతుంది.


సాష్టాంగ ప్రణామము చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమౌతాయి. అవి ఛాతి (రొమ్ము),నుదురు, శబ్దం,మనస్సు,కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు, కళ్ళు,మోకాళ్ళు మరియు పాదాలు. 


సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు రెండు పాదాల ముందుభాగం మోకాళ్ళు, ఛాతి మరియు నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి. అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి. 

అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ, దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుడిని ధ్యానించాలి.


ఈ పద్దతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు... స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటపుడు, ఉదరం, పాలిండ్లు, కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది. అందువలన గర్భస్థ మహిళలకు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు.ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాటి ప్రణామాలు చేయడం ద్వారా వారి గర్భాశయం స్థాన భ్రంశం అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరగింది. 

అందుకని మన పెద్దలు ‘స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించడమో, ధ్యానించడమో లేక మోకాళ్ళపై ఉండి మోకరిల్లడమో(పంచాంగ నమస్కారం) చేస్తే చాలు అని చెప్పారు. అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్య వంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులు బాటు కలిగించారు.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని   భగవానుడికి   భక్తితో సమర్పించుకునే  సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. 


దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

.          

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*


*🛕ఆధ్యాత్మిక బృందం నుండి* *ఒక మిత్రుడు పంపిన విషయాలు* *భాగస్వామ్యం  చేయడమైనది* 


                      *మీ*  

*🙏న్యాయపతి నరసింహారావు🙏*

కరచరణ కృతం వాక్

 "కరచరణ కృతం వాక్ కాయజం కర్మజం వా


శ్రవణ నయనజం వా మానసం వా పరాధమ్


విహితం అవిహితం వా సర్వ మేతత్ క్షమస్వ


జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో" :


ఆ పరమ శివుని దివ్య ఆశీస్సులు మీ జీవితానికి సమృద్ధిని మరియు శ్రేయస్సును కలిగించాలని కోరుతూ :


మహాశివరాత్రి శుభాకాంక్షలు.


🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏 

           🌞శుభోదయం🌞

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*పెళ్లి సంబంధాలు..*


"రాబోయే శ్రావణ మాసం లో మా అబ్బాయి వివాహం నిశ్చయం అయిందండీ..ఇక్కడే శ్రీ స్వామివారి సన్నిధిలో నే పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నాము..అమ్మాయి తరఫు వాళ్లకు కూడా చెప్పాము..ఆరోజు మీ దంపతులిద్దరూ ఇక్కడ వుండి.. వధూవరులను ఆశీర్వదించాలి.." అన్నారు ఆ భార్యా భర్తలు ..వాళ్లిద్దరూ ఎప్పుడూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చేవారే.. శ్రీ స్వామివారి మీద అపారమైన భక్తి కలిగి వున్నవారు..మాకూ బాగా తెలుసు..అందువల్ల..ఒక్కక్షణం కూడా సంకోచించకుండా "సరే!" అనేశాము.. పెళ్లికి సుమారు నెలన్నర పైనే సమయం ఉంది..


శ్రావణమాసం వచ్చింది..సహజంగానే శ్రావణమాసం లో వచ్చే శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది..మేమూ ఆందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటాము..ఆ నెలలో మందిరం వద్ద వివాహాలూ  జరుగుతుంటాయి..మొదటివారం గడిచిపోయింది..అప్పుడు గుర్తుకొచ్చింది నాకు..ఆ దంపతులు వచ్చి వాళ్ళబ్బాయి వివాహం అని చెప్పి వెళ్లారు కదా..నేను మర్చిపోయానేమో..అనే సందేహం వచ్చి మా సిబ్బందిని అడిగాను..ఫలానా వాళ్ళబ్బాయి వివాహం ఎప్పుడు?..లేక జరిగిపోయిందా?..అని..మా సిబ్బంది కూడా "ఆరోజు వచ్చి శ్రావణమాసం లో వివాహం అని చెప్పారే కానీ..ఫలానా తేదీ అని చెప్పలేదు..మళ్లీ మందిరానికి రాలేదు..మనలను సంప్రదించలేదు.." అన్నారు..హమ్మయ్య!..నేను మర్చిపోలేదు అని సంతోషించాను..వివరం కనుక్కోవడానికి ఫోన్ చేసాను.."అయ్యా..అబ్బాయి పెళ్లి విషయం నేను వచ్చి మీతో మాట్లాడతాను..వచ్చే ఆదివారం నాడు నేనూ నా భార్యా ఇద్దరమూ గుడికి వస్తాము.." అని ముక్తసరిగా  బదులిచ్చి, ఫోన్ పెట్టేసాడు..ఏదో జరిగింది అని అనిపించింది..ఆ తరువాత నేను నా పనుల్లో మునిగిపోయాను..


ప్రక్క ఆదివారం నాడు ఆ దంపతులిద్దరూ మందిరానికి వచ్చారు..ఈసారి తమ కుమారుడిని కూడా తీసుకొని వచ్చారు..వాళ్ళను చూస్తే..పుట్టెడు దిగులుతో ఉన్నారనిపించింది..శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లి, సమాధి మందిరం గడప వద్ద  చాలా సేపు నిలబడి ప్రార్ధించుకున్నారు..యధావిధిగా అర్చన చేయించుకున్నారు..నన్ను అనుమతి అడిగి, సమాధి వద్దకు వెళ్లి, సమాధికి తల ఆనించి నమస్కారం చేసుకున్నారు..ఇవతలికి వచ్చేసారు..


"మీతో ఆరోజు శ్రావణమాసం లో వివాహం అని చెప్పాను కదండీ..అన్నీ మాట్లాడుకున్నాము..నిశ్చయ తాంబూలాలు కూడా తీసుకున్నాము..మరి ఏ కారణమో తెలీదండీ..అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి.."మేము మీ సంబంధం వద్దు అనుకుంటున్నాము..మేము బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.." అన్నారండీ..మాకేమి అర్ధం కాలేదు..మా ఇంట్లో  శుభకార్యం అని బంధువులందరితో చెప్పేశాము..ఫలానా తేదీ నాడు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద వివాహం అని కూడా తెలిపాము..ఉన్నట్టుండి వాళ్ళు "పెళ్లి రద్దు" అని చెప్పేసరికి..బాగా బాధపడ్డాము..మేమేమీ కట్న కానుకల దగ్గర పేచీ పెట్టలేదు..మా వైపు నుంచి ఎటువంటి కోరికలూ కోరలేదు..మరి ఎందుకని వద్దన్నారో అర్ధం కాలేదు..మనసుకు తీవ్ర కష్టం వేసింది..శ్రీ స్వామివారినే నమ్ముకొని వున్నాము..ఆయన ఎందుకని మాపై చిన్న చూపు చూశాడో తెలీదు..ఇప్పుడు కూడా ఆయనకే మొర పెట్టుకున్నాము.." అన్నారు.. 


"నమ్మిన వాళ్ళను దైవం ఎప్పుడూ చిన్న చూపు చూడడు..మీకు ఇంతకంటే మంచి సంబంధం కుదురుతుందేమో..కొన్నాళ్లపాటు మీకు వేదన ఉండొచ్చు..కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది..శ్రీ స్వామివారిని నమ్మి వున్నారు..నిశ్చింతగా వుండండి.." అని ఓదార్పుగా చెప్పాను..అన్యమన్యస్కంగానే తలూపారు..తల్లీ దండ్రి తో పాటు వచ్చిన ఆ అబ్బాయి కూడా ముభావంగా వున్నాడు..తిరిగి వాళ్ళ ఊరికి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి ఆ కుటుంబం మొత్తం శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..మాకూ కొద్దిగా బాధ అనిపించింది..


ఆ ప్రక్క బుధవారం నాడు ఉదయం పది గంటలప్పుడు..నేనూ మా సిబ్బంది మందిరం లో కూర్చుని వున్నాము..ఇంతలో ఆ దంపతులు వచ్చారు..వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి..ఇద్దరూ నేరుగా శ్రీ స్వామివారి సమాధి మందిరం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..అర్చన కూడా చేయించుకున్నారు..అక్కడనుంచి నేరుగా మా వద్దకు వచ్చి.."వచ్చే గురువారం అబ్బాయి పెళ్లి..ఇక్కడే చేయాలి..మొన్న సోమవారం నాడు మాట్లాడుకున్నాము..ఇంతకూ అమ్మాయి తరఫు వాళ్ళు మా బంధువులే!..వాళ్ళు మా సంబంధం చేసుకోవాలని అనుకున్నారట.. కానీ ఈలోపల మేము వేరే కుదిరింది అని చెప్పడంతో ఊరుకున్నారట..తీరా ఆ సంబంధం తప్పిపోయిందని తెలిసి..మా ఇంటికొచ్చి మాతో మాట్లాడి అన్నీ కుదుర్చుకుని వెళ్లారు..పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు..ఆలస్యం ఎందుకని వచ్చే గురువారానికి ముహూర్తం పెట్టుకున్నాము..ఈ స్వామివారు చల్లంగా చూసాడు..మంచి సంబంధమే కుదిరింది.." అని చెప్పారు..


అనుకున్నవిధంగానే శ్రీ స్వామివారి సన్నిధిలో ఏ ఆటంకం లేకుండా లక్షణంగా వివాహం జరిగిపోయింది..మొదటి సంబంధం తప్పిపోవడానికి ఏ కారణమో తెలీదు..మళ్లీ ఈ సంబంధం కుదిరి వివాహం కావడానికి కూడా కారణం తెలీదు..కారణం తెలిసింది ఒక్క స్వామివారికే..వారు చెప్పరు..మౌనంగా సమాధి నుంచి గమనిస్తూ వుంటారు..అందుకే మేము నిత్యమూ ఒకటి అనుకుంటూ వుంటాము.."స్వామి వారి లీలలు మన ఆలోచనలకు అందవూ.." అని..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114.. సెల్..94402 66380 & 99089 73699).

శ్రీపాద_సుబ్రహ్మణ్యశాస్త్రి

 జాతి కోసం తపించిన కథకుడు #శ్రీపాద_సుబ్రహ్మణ్యశాస్త్రి గారు

(23 ఏప్రిల్ 1891 -  25 ఫిబ్రవరి 1961)

రచన - పున్నమరాజు నాగేశ్వరరావు గారు 

‘ముందు గ్రంథాలు పట్టు, తపస్సు చెయ్యి, ఆ తరువాత కలం పట్టు’ అరవై డెబ్బై ఏళ్ళ క్రితం కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సాహితీ రంగంలో కృషి చేసే యువకులకు చేసిన హెచ్చరిక ఇది. గ్రంథాలు చదివితే పదసంపద పెరుగుతుంది. గ్రంథాలు బుద్ధికి మారాకు పట్టిస్తాయి. జ్ఞానాన్ని గురించి ఆవేదన కలిగిస్తాయి అన్నది శ్రీపాద వారి విశ్వాసం. లోకుల సంభాషణలు వింటూ ఉండడమూ, గ్రంథాలు చదువుతూ వుండడమూ, ఎడతెగకుండా రచనలు సాగిస్తూ వుండడమూ - ఈ విధంగా భాషాజ్ఞానం సంపాదించాలి కవి అంటారాయన. శ్రీపాద దృష్టిలో రచన అనేది ఒక తపస్సు. కవి సమాధిలో కూచున్నాడా సరియైన తాదాత్మ్యం సిద్ధించిందా ఇక అతనికి భోగాల మీదికి దృష్టి పోదు. కష్టాలు కనబడవు. రచనలో మునిగిన కవి మానసిక స్థితి అలా ఉంటుంది అంటారాయన. కవి హృదయం అతి సున్నితమట. సాధారణ ప్రజలు చూడలేని ఆనందం అతడు చూడగలడట. ఆ ఆనందం పరులు కూడా పొందాలని అతడు కావ్యం రచిస్తాడని శాస్త్రిగారు కావ్య సృష్టిలోని పరమార్థాన్ని చెప్పారు.

కథా రచయితగా ప్రఖ్యాతి పొందిన సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు సాహిత్యంలో నవల, నాటక, కథ, కవిత,  చరిత్రలు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు- ఇలా అన్ని ప్రక్రియలూ చేపట్టి ఓహో అనిపించుకున్నారు. వ్యాఖ్యానాలు రాశారు. అవధానాలు చేశారు. ప్రబుద్ధాంధ్ర అనే పత్రిక స్థాపించి సంపాదకత్వం వహించారు. గంధర్వ ఫార్మసీ స్థాపించి ఆయుర్వేదం మందులు తయారు చేశారు. కళాభివృద్ధినీ పరిషత్ ఏర్పాటు చేసి సాహితీ సభలూ, సన్మానాలూ నిర్వహించారు. నాటకాలు ఆడారు. సంగీతంపై అభిమానంతో వయోలిన్ నేర్చుకున్నారు. నిజాయితీ, నియమబద్ధతా, నిష్కర్ష ఆయనకు సహజ గుణాలు. దేనిలోనూ రాజీ ఉండదు. #అనుభవాలూ_జ్ఞాపకాలూను పేరుతో రాసిన వారి ఆత్మకథ ఎన్నో  ప్రశంసలు అందుకుంది. అన్నింటినీ మించి ఆయనకు తెలుగుజాతి అన్నా అభిమానం ఎక్కువ. ఏమాత్రం కల్తీలేని అసలు సిసలైన తెలుగు రచయిత ఆయన.

సుబ్రహ్మణ్యశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని పొలమూరులో 1891 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. స్వగ్రామం మహేంద్రవాడ. వారిది వైదిక నిష్టాగరిష్టమైన కుటుంబం. ఎన్నో నియమాలు. సంస్కృతమే తప్ప తెలుగు గ్రంథాలు ముట్టడానికే వీలులేదు ఆ కుటుంబంలో. క్రాపింగుతో ఉండాలని సరదా ఆయనకి. పనికిరాదంటారు కుటుంబసభ్యులు. చొక్కా తొడుక్కోవాలని ఉబలాటం. పనికిరాదంటారు పెద్దలు. దీంతో కుటుంబ సంప్రదాయాలపై తిరుగుబాటు చేశారు శాస్త్రిగారు. ఈ లక్షణమే వారి రచనల్లో దర్శనమిస్తుంది. వరకట్నం, అస్పృస్యత వంటి దురాచారాలపై దాడి కనిపిస్తుంది. మహిళలపై సానుభూతి చోటుచేసుకుంటుంది.

నా తెలుగుపై నాకు నిషేధం ఏమిటీ? అనుకుని ఓం ప్రథమంగా నన్నయ భారతాన్ని తెరిచారు. తెలుగు గడ్డపైనే తెలుక్కి అన్యాయం జరుగుతోందని చిన్నప్పుడే ఆయన తెలుసుకోగలిగారు. ఇదే తెలుగు సాహిత్యానికి ఆయన్ని అంకితం చేసింది. తెలుగుభాషకూ, తెలుగు జాతికీ జరుగుతున్న అపకారాన్ని శాస్త్రిగారు ఎదిరించారు. తమ ప్రబుద్ధాంధ్ర పత్రికద్వారా పోరాటాలే జరిపారు. గ్రాంథికం నుంచి వ్యావహారికభాషకు మళ్ళి దానికి అండగా నిలిచారు. వ్యావహారికభాష తియ్యదనాన్ని రుచి చూశారు. రచనల ద్వారా రుచి చూపించారు.

తెలుగు భాష గొప్పదనాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి: ‘‘ నా తెనుగు భాష శాస్త్రీయం, తాటాబూటం కాదు. నా తెనుగుభాష యుగయుగాలుగా ప్రవాహినిగా వుండినదిగాని, యివాళ ఆ భాషలోంచి వొక మాటా యీ భాషలోంచి ఒక మాటా యెరువు తెచ్చుకుని భారతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు. నా తెనుగు సరస్వతికే తేనె చినుకులందించిందిగాని నిరుచప్పనిది కాదు. నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలిగిందిగాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందికాదు. అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీకాదు’’.

తెలుగు మాగాణి నాలుగు చెరగులా తిరిగి అక్కడక్కడి పలుకుబళ్లు ఒంట బట్టించుకున్నాక తనకు ఐదు ప్రాణాలూ సంక్రమించినట్టు అయిందంటారు శ్రీపాదవారు. తన ప్రాంతపు పలుకుబడిలో యెంత శక్తి వుందో అక్కడక్కడి పలుకుబళ్ళలోనూ అంతంత జీవశక్తీ వుంది అంటారు ఆయన. ఒక్కొ సీమలో ఒక్కొక్క జీవకణం ఉందట. అన్నీ ఒకచోటికి చేర్చగల, అన్నీ ఒక్క తెనుగు రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకురావాలి అని అసలు విషయం వెల్లడించారు. అవునుకదా, నిజానికి ఇప్పుడదే జరగాలి.

మాతృభాషపట్ల చిన్నచూపు పనికిరాదంటూ తల్లిభాష విడిచి ఇతర భాష నేర్చుకునేవాడూ తల్లిభాషలో కాక ఇతర భాషల్లో మాట్లాడేవాడూ తల్లిభాషలోకాక ఇతరభాషలో ఆనందించేవాడూ- తల్లి లేని బిడ్డ అంటారు. శ్రీపాదవారి దృష్టిలో తెలుగుదేశమే దేశం. తెలుగుభాషే భాష. తెలుగు మనుషులే మనుషులు. తెలుగు వేషమే వేషం. ఇది కొంచెం తీవ్రంగా తోచినా కచ్చితంగా వాస్తవం. విదేశీయులు సైతం అంగీకరించిన పరమ సత్యం. ఇప్పటి మన దయనీయమైన పరిస్థితికి నేను ఆంధ్రుణ్ణి అనే భావన బొత్తిగా లేకపోవడమే కారణం. కాబట్టి అలా భావించడం చాలా అవసరం.

 ‘భారతదేశం అంతా వీరవిహారంగా చేసుకుని, మహాసామ్రాజ్యాలు నిర్మించి, అనేక ప్రాంతాలవారిని పరిపాలించి, - అయ్యో! నేడు భృత్యునిగా, అనుచరునిగా, మట్టి తలకాయవానిగా యాసడింపబడుతున్నానే’ అనే అవేశం కలిగించాలి.

అంతేకాదు ‘నే నాంధ్రుణ్ణి. నా పూర్వుల రక్తమే నన్ను నడిపిస్తోంది. భరతవర్షానికి నేను ప్రవర్తకుణ్ణి. ప్రపంచానికి నేను ఆదర్శ పురుషుణ్ణి అని చెప్పుకోగలగడమే పరమావధి’ అని కూడా శ్రీ పాదవారు ఉద్భోదించారు.

ఈ పరిస్ధితుల్లో చేయవలసిందాన్ని శాస్త్రిగారు సూచించారు. ‘తెలుగులో విజ్ఞానం కలిగించే వాఞ్మయం నిర్మించాలి . నోరు విప్పితే ఉద్రేకం పుట్టించే ఉపన్యాసం చెయ్యాలి. నడుంకట్టితే ఫలితం యిచ్చే కార్యక్రమం నెరవేర్చాలి. ఇది ప్రయోజనకరమైన సందేశం?

ఏ జాతి ఎదటా ఏ సందార్భంలోనూ ఎందుకున్నూ నా తెలుగుజాతి తీసిపోదు. అంచేత ప్రపంచానికిది ఉద్ఘాటించడానికి నా సేవలు జాతికే మీదు కట్టుకోవాలి నేను అని శ్రీపాదవారు ప్రతిజ్ఞలాంటిదే చేశారు. దానికి కట్టుబడి కృషి చేశారు కూడాను.

 అయితే, చేయవలసింది ఇంకా ఉండగానే తెలుగుజాతి దురదృష్టంవల్ల శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1961 ఫిబ్రవరి 25  మరణించారు. ఆంధ్రజాతి అభ్యుదయం కోసం తపించే ఒక పెద్ద అండ కరువైంది. వారికి నిజమైన నివాళులు అర్పించుకోగలగడం మన విధి.

********************************************

ఈ శతాబ్దంలో వచనరచనకు పెట్టినది పేరు, ఒక్క యిద్దరికే..శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారూ! వేంకటశాస్త్రిగారు కబుర్లలో ఎన్నో కథలు చెప్పారు. సుబ్రహ్మణ్యశాస్త్రి గారు కథలుగా ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. ఇద్దరూ విన నేర్పున్నవారు: చెప్పేతీరు వారికే చేతనౌ! వారి వచనము తెలుగువారికి, తెలుగుతనానికి నారాయణ కవచము! వేంకటశాస్త్రి గారి వచనము చదవకపోతే, తెలుగువారికీ తెలుగు రాదు! శ్రీపాదవారి కథలు వినివుండకపోతే – తెలుగుల ఉనికి అయోమయం!

"యీ వచనం నీకెలా అబ్బిందయ్యా అంటావా! ఉగ్గుపాలనాడే అబ్బింది. పదుగురాడు మాటలు విని, మనం పలుక నేర్చాము. నలుగురిలో కలిసిమెలిసి మెలగనేర్చాము. మనము బడిపుస్తకాలమూ, పాఠ్యగ్రంథాలమూ కాదు. మన ప్రయోగానికి అర్థమూ, స్వారస్వమూ మనము విప్పి చెపితేనే కాని ఎదుటివాడికి అర్థంకాదనే అనర్థం సృష్టిలో లేదు. ఎదుటివాడు మనవంటి పండితుడు కాదు. మనకన్న పామరుడూ కాడు. వాడూ మనలాటివాడే! వాడి భాషే మన భాష!

నేను విన్నవి-కన్నవి కాగితంమీద పెట్టాను. అది, నా భాషా? అందరి భాషా కాదా? గిడుగు వాగనుశాసనుడు. యీతరంలోనూ, ఎల్లకాలమూ, కలంబట్ట నేర్చేవారందరికీ ఉపాస్యదైవం. నాకు, మరీ ముఖ్యంగాను. నీవు అనుకున్నది ఏమై ఉండునో నీ రచనలో స్పష్టంగా తెలియకపోతే, నీవు తెలుగువాడవేనా? నీది తెలుగుభాషేనా? అయితే, లాకాయ్-లూకాయ్ వాళ్ళందరికోసం కాదు నా రచన! -అనుకుంటూ భుజాలు చరచుకునేవాళ్ళూ లేరంటావా? ఉన్నారు! అది వాళ్ళవాళ్ళ లలాట లిఖితం!….” యీ తీరు శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి గారిది! 

సుబ్రహ్మణ్యశాస్త్రిగారు జగము ఎరిగినవాడు: జగము తన్నెరిగినవాడు. మరిన్నీ, విశేషించి బ్రాహ్మణుడు. అనగా బ్రాహ్మణీకమే ఆయన రచన: గోదావరీ మండలంలో వెలనాటి వైదిక కుటుంబాలు ఆయన సాహితీ సమరాంగణము. వారి పోకడలూ, మెలకువలూ ఆయన వాక్యములు. వారి కష్టసుఖాలు ఆయన చెప్పిన కథలు.

సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథలు కొన్నైనా చదివితే తెలుగుకుటుంబాల ఆపేక్ష, అంతఃఅకరణాలు ఎలాటివో, ఆ మరియాదలు, మన్ననలు ఎట్టివో అర్థమౌతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచ్చటౌతుంది!

‘వడ్లగింజలూ మించే కథ ఉందా!

‘యిల్లుపట్టిన వెధవాడపడుచూ అలా మరొకరు వ్రాయగలిగేరా?

‘అనుభవాలూ-జ్ఞాపకాలూ’ నూరేండ్ల తెలుగుతనపు కూలంకష క్రోడీకరణ కాదా! అది వేయేళ్ళపాటు, పదింబదిగ చదువుకోవలసిన గ్రంథం కాదా! తెలుగు మాగాణముతోబాటు, మీగడ తరకలైన శ్రీ శాస్త్రిగారి రచనలు శాశ్వతముగా వర్థిల్లవా!

ఆయన వ్రాసిన కథలు యించుమించు లెక్కలేనన్ని. అవన్నీ మేలురతనాలు! చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. విద్యాబుద్ధులున్న అహంకారులకు కనువిప్పు చేసినది ఆయన వచనము! తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరోభాషకు లొంగవు. జాను తెలుగు నేర్చినవారికే, తెలుగువారైనవారికే శ్రీ శాస్త్రిగారి కథలు చదివి ఆనందించే అదృష్టము!

– మల్లాది రామకృష్ణశాస్త్రి

పుస్తకప్రపంచం; మార్చి, 1961

భార్యా శ్రేష్ఠతమా సఖా*

 *భార్యా శ్రేష్ఠతమా సఖా*


*భార్య గొప్పదైన స్నేహితురాలు (మహాభారతం)*


*అపూర్వ నాగరికతతో ప్రపంచంలో ప్రప్రథమ సంస్కృతిని సాధించిన భారతీయధర్మం ఇప్పటికీ ఆ విలువలను పూర్తిగా కోల్పోలేదు. స్త్రీ-పురుష సంబంధాలపై సనాతనధర్మం తపశ్శక్తితో గొప్పవ్యవస్థను ఏర్పరచింది.*


*ఆ ధర్మానికి మూలస్తంభం కుటుంబం. కుటుంబానికి మూలాధారం దాంపత్యధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురౌతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది.*


*భార్యాభర్తల బంధాన్ని స్నేహబంధంగా నిర్వచించారు.*


*("ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ,* *వ్యయాలపై*

*ఆమెయే అధికారిణి. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ,*

*ధర్మంలోనూ, ఆహారంలోనూ ఆమెకే పూర్ణ అధికారం" -*

*అని మనుస్మృతి ఉపదేశం.)*


*“పురుషునకు దైవమిచ్చిన స్నేహితులెవరు?" - అని యక్షుడు ప్రశ్నిస్తే “భార్య”(భార్యా దైవకృతా సఖా) అని సమాధానమిచ్చాడు* *ధర్మరాజు. ఈ స్నేహాన్ని* *చాటడానికే*

*వివాహంలో 'సప్తపది' (ఏడడుగులు) మంత్రాలున్నాయి.*


*వివాహమంత్రాలన్నీ దాంపత్యం అనేది ఒక 'సఖ్యం' అని స్పష్టీకరించాయి."ఏడడుగులు వేసి నాతో స్నేహితురాలవై* *ఉండు. మనం ఎప్పుడూ* *స్నేహితులుగానే*

*ఉందాం. నీ స్నేహమే నాకు* *లభించింది. నీ స్నేహం విడవలేను. నా స్నేహం వీడకు" -* *అని వివాహమంత్రాల* *భావం.*


*“ధర్మార్థ కామాలలో నిన్ను అతిక్రమించను"(నాతి చరామి) అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు*

*వరుడు.*


*అసలు “పరస్పర విరోధంగా కనిపించే ధర్మార్థకామాలను సమన్వయపరచే శక్తి భార్యకే* *ఉంది"... అని మహాభారతం చెబుతోంది. అర్థకామాలు భార్య ద్వారా*

*నెరవేరడం వల్ల అధర్మ దోషం* *ఉండదు. ఇలా ధర్మంతో ఆ రెండూ కలిసి పురుషుని* *ఉన్నతుని చేస్తున్నాయి. ఈ లోతు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ* *వ్యవస్థ*

*పటిష్టపడి సవ్యమైన సమాజం సుప్రతిష్ఠితమవుతుంది.*


*యజుర్వేద మంత్రాలలో స్నేహధర్మం గురించి చెబుతూ - "స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు. మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు.పుణ్యమార్గం అతనికి గోచరించదు” - అంటే ఇహపరాల్లో క్షేమం ఉండదని భావం.*


*( కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా* *నిర్వహించడంలో*

*భార్యాభర్తలు కలిసి* *ఉద్యమించాలని వేదబోధ.* *అసలు దాంపత్య ధర్మం అనాది. సనాతనం. ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే*

*ప్రకృతీ-పురుషులనీ, ఆ అర్ధనారీశ్వరతత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది.)*


*స్నేహబంధమైన దాంపత్యంలో దీనిని గుర్తుంచుకోవాలి.*


*మనిషి తనని తాను ఎలా క్షమించుకుంటాడో, తనతో తాను ఎలా రాజీపడతాడో, తన భార్య (భర్త) తోనూ అలాగే సహనశీలియై సఖ్యాన్ని* *కాపాడుకోవాలి. కొన్ని భేదాలు*

*వచ్చినా శాశ్వత ప్రయోజనమైన ధర్మం కోసం, స్నేహనిబద్ధత కోసం సహనం వహించడం ప్రేమధర్మం.*


*“సామ్రాజ్ఞి శ్వశురేభవ” మూర్థానాం పత్యురారోహ”*


*“నా గృహానికి నువ్వు సామ్రాజ్ఞివి,” “పతినైన నా శిరస్సుపై అధిష్ఠించు" - అని ఉత్తమస్థానంలో గౌరవించదగినది ఇల్లాలేనని వైదిక వివాహ మంత్రాల బోధన.*


*అర్థస్య సంగ్రహే పక్త్యాంచ పారిణాహ్యస్యచేక్షణే ||*


*స్త్రీకి ధనాన్ని ఆర్జించే వేదన ఉండరాదు - అని నిబంధించిన సంస్కృతంలోని ఉదారతని గ్రహిస్తే, “స్త్రీధనం కోసం ఆశపడే పురుషుడు అధముడు" - అని హెచ్చరించిన మన మహర్షుల వాక్కుల్ని గుర్తుపెట్టుకుంటే, పవిత్రమైన వివాహ వ్యవస్థలో వరకట్నపు అపశ్రుతులు వినబడనే వినబడవు.*


*కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ.*


*అసలు దాంపత్య ధర్మం అనాది. సనాతనం.*


*ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే ప్రకృతీ-పురుషులనీ,*

*ఆ అర్ధనారీశ్వర తత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది.*

*ఈ విషయాన్నే మనువు -


*'ద్విధాకృత్వాత్మనో దేహమర్ధన పురుషో భవత్'*

*అర్ధేన తస్యాం సా నారీ విరోజ మసృజతే ప్రభుః॥ అని* *తెలియజేశాడు.*


*విశ్వనిర్మాణానికే మూలం దాంపత్యభావం. ఒకే పరతత్త్వం రెండయ్యింది. అలాగే స్త్రీ-పురుషభావం ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తుంది. ప్రకృతి నియయం పాలించబడుతుంది. అంటే - దాంపత్యధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం. భార్యాభర్తల అన్యోన్యత గురించి రాముడు చెప్పిన ఒక్క మాట చాలు*:


*"అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభా యథా”"* *“సూర్యునికి వెలుగులా సీత నాకు అనన్య (వేరుకానిది)”.* *దాంపత్యంలో ఔన్నత్యాన్ని తెలిపేది ఇంతకన్నా గొప్ప వాక్యం ఉంటుందా !*

మాఘ పురాణం - 29

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷గురువారం 27 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 29 వ*_ 

        _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


        *మృగశృంగుని కథ*


☘☘☘☘☘☘☘☘☘


వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయవలెనని తల్లిదండ్రుల అనుమతి నొంది  ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరి తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలేనను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. *"నాయనా ! నీవు అనేక పర్యాయములు మాఘమాసస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును , నా ప్రేమను సాధించితివి. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను".* మృగశృంగుడును *"స్వామీ ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను , ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను".* శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.


కౌత్సుడు ఇంటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి , ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.


భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల , ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు , గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన ఇద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల , ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను , చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.


కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను , యముని దయవలన , సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి. జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన ఇనుపస్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో , పాపముచేసిన వానిని పడవేయుదురు. తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.


వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి. అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాసస్నానము చేసి , ఇష్టదైవమును పూజించి , యధాశక్తి దానము , జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా ! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత ? చనిపొయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా యని ప్రశ్నించెను. అప్పుడు వశిష్టమహర్షి నాయనా ! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును , సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము , కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా ఇట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.


యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది ఇతనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి ఇతడు భయపడెను. భయముపోవుటకై హరినామ భజనమును చేసెను. ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా ! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.


*☘️మృగశృంగుని వివాహములు☘️*


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను , మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో నంగీకరించిరి. శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము , ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా ? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా ? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ , గంగ ఇద్దరు లేరా ? వారికి లేని అభ్యంతరము నీకెందులకు ? అని వాదించిరి. ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.


కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు *బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయు వివాహము బ్రహ్మవివాహము , యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు. ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు , ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగా చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను.* గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని గూడ వివరించెను.


దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి ఇష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను , మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.


మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవయధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను , సర్వలాభములను పొందెను , మనుమలను గూడ పొందెను. ఈ విధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక , అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు యీ విధముగా తలపోసెను. *"కాశీ మహా పుణ్యక్షేత్రము , సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక , మనస్సునందలి కోరికలు నెరవేరెను , అనేకమంది కాశీ విశ్వనాధుని దర్శనము చేసికొని , వారి అభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని , కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.


కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాలబాహువులను చాచి , ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని , విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను. ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు , తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి , ఒక లింగమును ప్రతిష్టించి , దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా ! అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా ! సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి , ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. *"మహామునీ ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్టమెరిగినపుడు"* డని పలికెను. అంత మృకండుడు నమస్కరించి *"తండ్రి ! మహాదేవా ! తల్లి అనంపూర్ణా ! ఇవే మా నమస్కృతులు , లోకరక్షకా ! మీదయవలన నాకు సులక్షణవతి , సౌందర్యవతి , సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము. కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా ! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను"* అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు *"మునిసత్తమా ! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒకా నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా ? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా ?"*

అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను. కొంత తడబడి *"హే శశిధరా ! నన్ను పరీక్షింప నెంచితివా ? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని"* అడిగెను. *"అటులనే అగునుగాక !"* అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రునిగనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా ! పరమపూజ్యుడును , ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి , వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.


*మాఘపురాణం  ఇరవై తొమ్మిదవ* 

   *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

అశాశ్వతమునకై ఆరాటమా?

 శు భో ద యం🙏


అశాశ్వతమునకై ఆరాటమా?


"తరగల్,పిప్పలపత్రముల్,మెఱుగుటద్దంబుల్,

మరుద్దీపముల్,/

కరికర్ణాంతము లెండమావులతతుల్,ఖద్యోతకీటప్రభల్,/

సురవీధీలిఖితాక్షరంబు లసువుల్,జ్జ్ోస్నామయః పిండముల్/

సిరు,లందేల మదాంధులౌదురుజనుల్?శ్రీకాళహస్తీశ్వరా!


శ్రీకాళహస్తీశ్వర శతకము-ధూర్జటిమహాకవి:


భావము:-ప్రాణములు, సముద్రకెరటములను,రావియాకులయంచులవలెను,తళుకుటద్దములవలెను,మెఱపులవలెను,కరికర్ణాంతములవలెను,(ఏనుగుచెవి తుదలు)ఎండమావులవలెను,మిణుగురుపురుగులకాంతివలెను,ఆకాశపువ్రాతలవలెను,చెచలమైనవి.

       సంపదలా వెన్నెలగుళికలవంటివి.మరి వానినిజూచుకొని నరులేల మదాంధులౌదురో అనూహ్యముగదా!


విశేషములు:కవి యీపద్యమున నరులప్రాణములుగానీ,సిరులుగానీ శాశ్వతమైనవి కావనిచెప్పుచు,చెంచెలమైన విషయములనుపమానములుగా చెప్పుచున్నాడు.

నదీతరంగములు,రావియాకులు,అద్దాలమెఱపులు,ఏనుగుచెవులు,ఎండమావులు,మిణుగురులకాంతి,మెఱుపులు,ఆకాశపువ్రాతలు(శూన్యంలోవ్రాత)ఇవిమిగులయస్థిరమైనవి.

        ఇక సిరులా,(భాగ్యములు) వెన్నెలగుళికలవంటివి.కొంతకాలముమాత్రమే వెన్నెలకాంతులు.అదియు శాశ్వతము గానిదే!

మరి యస్థిరమైన వీనిని నమ్ముకొని గర్వమున సంచరించు నరులు శాశ్వతుడవగు నిన్నేల మరచుచున్నారని తన ఆశ్చర్యమును ప్రకటించుచు.ప్రజలయజ్ఙానమునకు విచారమునువ్యక్త

ము చేయుచున్నాడు.

                     స్వస్తి!

🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(61వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *భగీరథుడు-గంగావతరణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *శంకరుని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు భగీరథుడు. అతని తపస్సును మెచ్చుకున్నాడు శంకరుడు. ప్రత్యక్షమయ్యాడు. భగీరథుని అభీష్టాన్ని నెరవేర్చేందుకు సిద్ధమయ్యాడు.*


*స్వర్గం నుంచి మహావేగంతో దూకుతూ వచ్చింది గంగ. శంకరుని శిరస్సున పడింది. భరించాడు శంకరుడు, తన జటాఝూటాన ధరించాడామెను. నాటి నుంచే శంకరుణ్ణి ‘గంగాధరుడు’ అని వ్యవహరించసాగారంతా.*


*శంకరుని శిరస్సు నుంచి జారి ప్రవహించసాగింది గంగ. రథాన్ని అధిరోహించి భగీరథుడు ముందు పరుగుదీస్తోంటే అతన్ని అనుసరించింది గంగ.* 


*హిమవత్పర్వతం నుంచి మహావాహినిగా భూలోకానికి వచ్చింది. భూలోకానికి వస్తూ వస్తూ జహ్నుముని యజ్ఞవాటికను ముంచి వేసింది గంగ. కోపం వచ్చింది మునికి.*


*గంగను పుక్కిటపట్టాడు. వదలనని పట్టుబట్టాడు. అతన్ని ఎన్నో విధాల ప్రార్థించాడు భగీరథుడు. కరుణించమని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు తన చెవిలోనుంచి గంగను వదలిపెట్టాడు జహ్నువు. జహ్నువు చెవి నుండి వెలువడిన కారణంగా గంగకు ‘జాహ్నవి’ అని పేరు వచ్చింది.*


*గంగను రసాతలానికి తీసుకుని వెళ్ళాడు భగీరథుడు. అక్కడ భస్మరాశులుగా పడి ఉన్న పితరులయిన సగరపుత్రుల దగ్గర ఆగాడు. గ్రహించింది గంగ. సగరపుత్రులను స్పృశించింది. అంతే! అరవై వేలమంది సగరపుత్రుల పాపాలన్నీ పటాపంచలయి, వారంతా సద్గతి పొందారు.*


*భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకుని వచ్చిన కారణంగా ఆమెను ‘భాగరథి’ అన్నారు. గొప్ప ప్రయత్నం చేసి భగీరథుడు ఇంతటి మహత్కార్యాన్ని సాధించిన కారణంగా ఎవరయినా గొప్ప ప్రయత్నానికి పూనుకుంటే దానిని ‘భగీరథీ ప్రయత్నం’ అంటున్నారు.*


*ఈ వంశంలోనే ఋతుపర్ణుడు జన్మించాడు. అయోధ్య పట్టణాన్ని ఏలిన ప్రముఖుల్లో అతను కూడా ఒకడు. అక్ష హృదయం విద్యలో ఋతుపర్ణుణ్ణి మించిన వారు లేరు. బాహుకుడు అనే పేరుతో నలమహారాజు ఇతని వద్దనే వంటలవాడుగా చేరాడు. నలుని నుంచి అశ్వహృదయం విద్య నేర్చుకుని, తనకు తెలిసిన అక్షహృదయం విద్యను నలునికి నేర్పిన ఘనత కూడా ఋతుపర్ణునిదే!*


*ఇదే సూర్యవంశంలో ఖట్వాంగుడు జన్మించాడు. విష్ణుభక్తునిగా ఉత్తమపదం అందుకున్నాడు. ఖట్వాంగునికి దీర్ఘబాహువు, దీర్ఘబాహువుకి రఘువు జన్మించారు. రఘువుతోనే రఘువంశం ఏర్పడింది. ఈ వంశంలోనే శ్రీరామచంద్రుడు అవతరించాడు. రఘువు కుమారుడు అజమహారాజు. అజమహారాజు పుత్రుడే దశరథుడు. దశరథునికే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముని కుమారుడే కుశుడు. కుశసంతతి సుమిత్రునితో కలియుగంలో ఇక్ష్వాకువంశం అంతరించిందని వ్యాసుడు పేర్కొన్నాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురువులైన శంకరులు, ఈ శ్లోకంలో తమపై కరుణా కటాక్షాన్ని ప్రసరింప జేయుమనీ, తమకు గురువుగా నిల్చి, బ్రహ్మోపదేశాన్ని చేయుమనీ ఈశ్వరుని ప్రార్థించారు.*


*శ్లోకం: 29*


*త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం*

           

*త్వా మీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే ప్రభో ! (విభో)*

           

*వీక్షాం(దీక్షాం) మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం*

           

*శంభో ! లోకగురో ! మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. !!*


*పదవిభాగం:~*


*త్వత్పాదాంబుజమ్ _ అర్చయామి _ పరమం _ త్వాం _ చింతయామి - అన్వహం _ త్వామ్ _ ఈశం _ శరణం _ వ్రజామి _ వచసా _ త్వామ్ _ ఏవ _యచే _ ప్రభో _ (విభో) _ వీక్షాం _ (దీక్షాం) _ మే _ దిశ _ చాక్షుషీం _ సకరుణాం _ దివ్యైః _ చిరం _ ప్రార్థితాం _ శంభో _ లోకగురో _ మదీయ మనసః _ సౌఖ్యోపదేశం _ కురు.*


*తాత్పర్యం :~*


*శంకరా ! జగద్గురూ ! ప్రభూ నేను నీ పాదపద్మములను ఆరాధిస్తున్నాను. ప్రతిదినమూ పరమ పురుషుడవైన నిన్ను ధ్యానిస్తున్నాను. ఈశ్వరుడవైన నిన్ను శరణు పొందు తున్నాను. వాక్కుచే నిన్నే యాచిస్తున్నాను. దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన, కరుణతో కూడిన నీ దృగ్దీక్షను (కరుణా కటాక్ష ప్రసారాన్ని) నా పై ప్రసరింప జేయుము. తరువాత సౌఖ్యంగానూ, ప్రశాంతంగానూ ఉండేటట్లు , నా మనస్సునకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి.*


*వివరణ:~*


*మనోవాక్కాయముల ద్వారా భగవంతుని సేవచేయాలనే విషయం ఈ శ్లోకంలో ప్రకటింపబడింది.*


*ఇందులో పూజ అన్నది కాయికం. ధ్యానం అనేది మానసికం.*


*"త్వమేవ శరణం మమ" అని శరణు కోరడం వేడుకోవడం _ అన్నది వాచికం. ఈ విధంగా త్రికరణాలతో చేసే దైవ సేవ వల్ల మన ఏ పని ఫలవంతం కావాలన్నా, ఆ పనికి చేసే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా వుండాలి.*


*మనస్సు, వాక్కు, శరీరం (కాయం) అనే మూడింటినీ, "త్రికరణాలు " అని అంటారు. మనోవాక్కాయములతో పరిశుద్ధిగా చేసేదానినే త్రికరణ శుద్ధి అంటారు. అంటే చేసేది, చెప్పేది, ఆలోచించేది ఒకటే అయి ఉండాలి. భగవంతుని సేవ త్రికరణ శుద్ధిగా చేయాలి.*


*శంకరులు ఈ శ్లోకంలో భగవద్దర్శనానికై పరితపించారు. శంకరా ! నిన్ను శరణు కోరు తున్నాను. దయాదృష్టితో చూడు అని ప్రార్థించారు. తన మనస్సుకు సుఖంగా ఉండేటట్లు ఉపదేశం చెయ్యి ప్రభూ ! అని కోరారు.*


*ఉత్తమ భక్తుని పరిస్థితి ఇలాగే వుంటుంది. చెరువులోనుండి గట్టుపై పడిన చేపలా, భగవద్దర్శనానికీ, భగవంతునితో మాట్లాడడానికీ, ఆ భక్తుడు పరితపిస్తాడు.*


*అప్పుడు భగవంతునికి ఆ భక్తునిపై జాలి కల్గుతుంది. ఆకలితో ఉన్న పిల్ల వాడికి తల్లి అన్నం పెట్టకుండా ఉండలేదు కదా ! దేవుడికికూడా ,అప్పుడు భక్తుణ్ణి చూసి , భక్తుణ్ణి చేతితో స్పృశించి మాట్లాడాలనే ఇచ్ఛ కలుగుతుంది. అప్పుడు భగవంతుడు గురువు రూపంలో భక్తుని వద్దకు వచ్చి ఉపదేశం చేస్తాడు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(59వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️ *సగరులు - సాగరం; భగీరథుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘ఈ ముని పెద్ద దొంగ! మన యాగాశ్వాన్ని దొంగిలించాడు. ఇతన్ని క్షమించకూడదు. కొట్టండి, చంపండి.’’ అంటూ సగరపుత్రులంతా ఒక్కసారిగా కపిలమునిని చుట్టుముట్టారు. మారణాయుధాల్ని ఎక్కుపెట్టారు.*


*ఆ కలకలానికి తపోభంగం కలిగింది. కళ్ళు విప్పి చూశాడు కపిలముని. ఆ చూపుల్లో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లాయి. అరవైవేలమంది సగర పుత్రులూ ఆ జ్వాలలకు ఆహూతయిపోయారు. భస్మమయిపోయారు. బూడిదగుట్టలయ్యారు.* 


*కపిలముని నేత్రాగ్నికి తన అరవై వేలమంది పుత్రులూ బూడిదయిపోయారని నారదుడు చెప్పగా తెలుసుకున్నాడు సగరుడు. బాధపడ్డాడు.*


*అప్పుడు మనవడు అంశుమంతుణ్ణి పిలిచాడు. యాగాశ్వాన్ని తీసుకుని రమ్మని అతన్ని పంపాడు. తన పినతండ్రులు తవ్విన సముద్రమార్గం గుండా అంశుమంతుడు రసాతలానికి చేరాడు. అక్కడ బూడిదగుట్టల్నీ, వాటి సమీపంలో తపస్సు చేసుకుంటున్న కపిలమునినీ చూశాడతను. కట్టి వేసి ఉన్న యాగాశ్వాన్ని కూడా గమనించాడు. కపిలమునిని సమీపించాడు. చేతులు జోడించి నమస్కరించాడతనికి. అనేక విధాల స్తుతించాడు.*


*అనుగ్రహించాడు కపిలముని. చల్లగా కళ్ళు తెరచి, మెల మెల్లగా ఇలా చెప్పాడు. ‘‘యాగాశ్వాన్ని నిరభ్యంతరంగా తీసుకుని వెళ్ళు. నీ పినతండ్రులు పవిత్రులు కావాలంటే దానికి గంగాజలమే పరిష్కారం.’’*


*కపిలునికి ప్రదక్షిణ నమస్కారం చేశాడు అంశుమంతుడు. యాగాశ్వాన్ని తీసుకుని బయల్దేరాడు. అశ్వాన్ని తాత సగరునికి అప్పగించాడు. యాగం పూర్తయిందప్పటికి. కొన్నాళ్ళకు రాజ్యభారాన్ని అంశుమంతుడికి అప్పగించి, తపోనిష్ఠలో తనువు చాలించాడు సగరుడు.*


*సగరపుత్రులు తవ్విన కారణంగా సముద్రానికి ‘సాగరం’ అని పేరు వచ్చింది.*


*తన పినతండ్రులకు ఉత్తమ గతులు కల్పించేందుకు అంశుమంతుడు అనేక సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. అయితే అది సాధించకుండానే కాలధర్మం చెందాడు. అంశమంతుడు కొడుకు దిలీపుడు కూడా గంగను రప్పించి, తన పితామహాదులకు ఉత్తమగతులు కల్పించాలని ఎంతగానో ప్రయత్నించాడు. అతని ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరకి ఆ కార్యాన్ని దిలీపుని పుత్రుడు భగీరథుడు సాధించాడు.*


*భగీరథుడు:~*


*ఎవరూ సాధించలేని గొప్ప కార్యాన్ని సాధించి ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందాడు భగీరథుడు. దివి నుండి భువికి గంగను తీసుకుని వచ్చింది అతనే!*


*తన పితృదేవతలకు సద్గతి కల్పించాలని భగీరథుడు కఠోరమయిన తపస్సు చేశాడు. అతని తపస్సుకు దేవతలూ మునులూ ఆశ్చర్యపోయారు. ఆఖరికి గంగాదేవి ప్రత్యక్షమయింది. విషయం అడిగి తెలుసుకుంది. అప్పుడు ఇలా అంది. ‘సరే, నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీ పితృదేవతలకు సద్గతి కల్పిస్తాను. అయితే నేను స్వర్గలోకం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు నా ప్రవాహవేగాన్ని తట్టుకునే మహనీయుడు కావాలి. లేకపోతే భూతలాన్ని చీల్చుకుని, నేను పాతాళంలోకి జారిపోతాను. నన్ను తట్టుకునే మహనీయుణ్ణి ముందు చూడు.’’*


*‘‘తప్పకుండా తల్లీ’’ అన్నాడు భగీరథుడు.‘*


*‘మరో విషయం. నేను భూమి మీద ఉంటే భూలోకంలోని పాపాత్ములంతా నాలో స్నానం చేసి, తమ పాపాలు నాకు అంటగడతారు. ఆ పాపాల్ని నేనెలా భరించేది?’’ అడిగింది గంగ.*


*ఆలోచించాడు భగీరథుడు. ఇలా అన్నాడు. ‘‘నీ ప్రవాహవేగాన్ని తట్టుకునే మహనీయుడు శంకరుడు ఉన్నాడు. అతడు నిన్ను భరిస్తాడు. విష్ణుపాదోద్భూతమయిన నిన్ను పాపాలు అంటవు. నిప్పును చెదలు అంటుతాయా తల్లీ? దయచేసి నా ప్రార్థన ఆలకించి, భూలోకంలోకి దిగి రా.’’ వేడుకున్నాడు భగీరథుడు.*


*అంగీకరించింది గంగ. తనని తట్టుకుని నిలబడే శంకరుని కోసం ముందు ప్రార్థించమంది. శంకరుని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు భగీరథుడు. అతని తపస్సును మెచ్చుకున్నాడు శంకరుడు. ప్రత్యక్షమయ్యి భగీరథుని అభీష్టాన్ని నెరవేర్చేందుకు సిద్ధమయ్యాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

సమస్యలకి మూల కారణాలు

 9440893593N🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏             🔥 *జీవితంలో చాలా సమస్యలకి మూల కారణాలు రెండు... అని 1)చర్యలు తీసుకోకుండా ఆలోచిస్తూనే ఉండడం..2)ఆలోచించకుండా చర్యలు తీసుకోవడం*🔥అహం ఎల్లప్పుడూ మనకి మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది..కొన్ని సార్లు ఆది తాత్కాలిక తృప్తిని ఇవ్వవచ్చు.. కానీ చివరికి ఆది మనలని విలువ  తక్కువ చేసి చూపిస్తుంది..మన అందరికీ జీవితంలో అతి పెద్ద ఆశ ఏమిటంటే మన కలలను నిజలుగా మార్చడం.. ఎప్పుడైతే మనం నిజాన్ని అంగీకరించి ఆగిపోతామో అదే జీవితంలో మొదటి ఓటమి🔥సరైన సమయానికి, సరైన ఆలోచన, సరైన నిర్ణయం లేకుంటే ప్రగతి శూన్యం..కోల్పోయిన తరువాత కోరుకుంటే లాభం ఉండదు.. తెలిసిన తరువాత కూడా కోల్పోతే అర్ధముండదు.. ఆది వస్తువైనా , బంధమైనా...నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా పయత్నం సాగిస్తే విజయం తథ్యం..నేటి తెలివైన నిర్ణయమే రేపటి భవిష్యత్తుకు పునాది🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3  గొకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510* 🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -  చతుర్దశి & అమావాస్య - ధనిష్ట -‌‌ గురు వాసరే* (27.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కేతీశ్వరం ఆలయం

 4 కేతీశ్వరం ఆలయం 


మన్నార్‌లో ఉంది. శ్రీలంకలోని పంచ ఈశ్వరాలు మరియు ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి, ఇది బహుశా చోళ రాజవంశం పాలనలో స్థాపించబడి ఉండవచ్చు మరియు కేతీశ్వరుడిగా శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది, పొడవైన గోపురాలు, క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో. ఈ క్షేత్రం యొక్క ప్రధాన దైవం శివుడు, కేతీశ్వరుడిగా ప్రతిష్టించబడ్డాడు. ఇతర దేవతల పుణ్యక్షేత్రాలతో పాటు, ఈ ఆలయ సముదాయం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం కూడా మెరుగుపడుతుంది.

3నాగులేశ్వరం ఆలయం

 3నాగులేశ్వరం ఆలయం


 జాఫ్నాలో ఉంది మరియు ఇది పురాతన ఈశ్వరాలలో ఒకటిగా మరియు శ్రీలంకలోని పవిత్ర శివాలయంగా పరిగణించబడుతుంది. ఇది 2,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు మరియు నాగులేశ్వరన్ అనే పేరుతో శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ప్రవేశద్వారం వద్ద గంభీరమైన గోపురంతో కూడిన క్లాసిక్ ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంది. శివుడిని సూచించే లోపలి గర్భగుడిలో ఒక లింగం అలంకరించబడి ఉంటుంది. ఆలయ సముదాయం లోపల వివిధ దేవతలకు అంకితం చేయబడిన వివిధ మందిరాలు ఉన్నాయి, ఇవి ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతాయి.

మున్నేశ్వరం ఆలయం.

 2 మున్నేశ్వరం ఆలయం.


శ్రీలంకలోని పురాతన ప్రధాన హిందూ దేవాలయాలలో ఒకటి చిలావ్‌లో ఉన్న మున్నేశ్వరం ఆలయం. పురాణాల ప్రకారం, ఇది క్రీస్తుపూర్వం 1,000లో శివుడికి మున్నేశ్వరం అనే పేరు పెట్టబడింది. ఆలయ చరిత్ర స్థానిక ఇతిహాసాలు మరియు పురాణాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది, ఇది ఈ ప్రదేశాన్ని చారిత్రాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదిగా చేస్తుంది. లోపలి గర్భగుడిలో శివుడిని సూచించే ఒక లింగం ప్రతిష్టించబడింది. ఇందులో వివిధ దేవతల ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి, ఇది దాని ఆధ్యాత్మిక విలువను పెంచుతుంది. ప్రకాశవంతమైన రంగులలో క్లిష్టమైన చెక్కడాలు మరియు కుడ్యచిత్రాలు హిందూ పురాణాల నుండి కథలను వివరిస్తాయి మరియు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటాయి.

కోనేశ్వరం ఆలయం .

 కోనేశ్వరం ఆలయం .


 1 శ్రీలంకలో శివుని పూజకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి ట్రింకోమలీలోని కోనేశ్వరం ఆలయం . పురాతన కాలంలో ఈ ఆలయం "వెయ్యి స్తంభాల ఆలయం"గా పిలువబడింది. కోనేశ్వరంలో లభించిన ఆధారాలు దీని చరిత్రను 2,000 సంవత్సరాలకు పైగా నాటివిగా సూచిస్తున్నాయి. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ మరియు పల్లవ శైలులను మిళితం చేసి వివిధ దేవుళ్ళు మరియు దేవతలను మరియు పురాణాల దృశ్యాలను చూపించే క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో కూడి ఉంటుంది. శివుడిని ఇక్కడ కోనేసర్‌గా పూజిస్తారు.

ప్రముఖ శివాలయాల

 శివరాత్రి వేడుకల సందర్భంగా విదేశాల్లో ఉన్న కొన్ని ప్రముఖ శివాలయాల గురించి తెలుసుకుందాం..


1. పశుపతినాథ్ ఆలయం (నేపాల్):


ఖాట్మండులో ఉన్న ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. హిందువులతో పాటు బౌద్ధమతస్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.


2. కైలాస మానసరోవరం (చైనా):


టిబెట్, చైనాలో ఉన్న ఈ పవిత్ర సరస్సు శివుని నివాసం అని భావిస్తారు.


3. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా):


జావా ప్రావిన్స్లో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచింది.


ఎనిమిది దేవాలయాల సమూహం ఈ ఆలయంలో ఉంది.


4 కోణమాలిలో ఉన్న ఈ ఆలయం శ్రీలంకలోని అత్యంత పురాతన వాలయం. రాముడు రావణుని వధించిన తర్వాత ఈ ఆలయంలో వుణ్ణి పూజించాడని చెబుతారు.



5 గౌరీశంకర్ ఆలయం (నేపాల్):


ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో శి వపార్వతులు కొలువైయ్యారు.


6. కటాస్రాజ్ ఆలయం (పాకిస్థాన్):


''సెవెన్ పూల్స్ టెంపుల్' అని కూడా పిలువబడే ఈ ఆలయం పాకిస్థాన్లో ఉంది.


7. అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం (మలేషియా):


మలేషియాలోని జోహోర్ బారులో ఉన్న ఈ ఆలయం దేశంలోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి.


8. శ్రీ శివ మందిర్ (ఇంగ్లండ్):


లండన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం యూకెలోని ప్రముఖ శివాలయాలలో ఒకటి.


9. శివాలయం (నెదర్లాండ్స్):


ఆమ్స్టర్దామ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నెదర్లాండ్స్లో ఒక ప్రసిద్ధ శివాలయం.


10. శివాలయం (జర్మనీ):


బెర్లిన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం జర్మనీలో ఒక ముఖ్యమైన శివాలయం.