15, ఫిబ్రవరి 2025, శనివారం

15.02.2025,శనివారం

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

15.02.2025,శనివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:తదియ రా10.28 వరకు

వారం:స్థిరవాసరే (శనివారం)

నక్షత్రం:ఉత్తర రా12.38 వరకు

యోగం:సుకర్మ ఉ7.02 వరకు

కరణం:వణిజ ఉ9.41 వరకు

తదుపరి విష్ఠి రా10.28 వరకు

వర్జ్యం:ఉ.శే.వ.8.07 వరకు

దుర్ముహూర్తము:ఉ6.31 - 8.02

అమృతకాలం:సా4.48 - 6.32

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం:5.56




దేహ, బుద్ధి బలాలతో సాధిస్తే కలిగేది జయం. దీనికి కుయుక్తులు, కుతంత్రాలు, నీచపు పనులు చేయవలసి రావచ్చు. కానీ నిజమైన విజయం భగవంతుడు అండగా ఉంటే దానంతట అదే లభిస్తుంది. భగవంతుడు అండగా నిలవాలంటే చేసే పనుల్లో పవిత్రత ఉండాలి. అలా లభించే విజయమే లక్ష్మీస్వరూపం. దానికి కావలసిందల్లా ధర్మవర్తన, నైతిక జీవన గమనం, ఆధ్యాత్మిక మార్గాన పయ నించడం. విద్య సైతం లక్ష్మీ స్వరూపమే. ఆ విద్యను సన్మార్గంలో వినియోగించగలగాలి. విద్య కలిగినవారు వివేకం, జ్ఞానం, సంస్కారం, సదాచారం లాంటివి కలిగి ప్రవర్తిస్తే అదే విద్యాలక్ష్మీ కటాక్షం. శ్రీ అంటే సంపద. దీనితో దేని నైనా కొనగల పొందగల వీలుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సంయమనంతో మెలగాలి. తన దగ్గర ఉన్న ధనం సక్రమ వినియోగం అయ్యేలా చూడమనే ఆకాంక్ష రూపమే శ్రీలక్ష్మి.


ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుణ్ని... అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. ఫలితంగా ధర్మవర్తన లేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం. భక్తుల ప్రవర్తన మెచ్చి, భగవంతుడు ఇచ్చే కానుకను వరం అంటారు. భూతదయ, సేవ, త్యాగం లాంటి గుణాలు కలిగి ఉన్ననాడు భగవంతుడు కరుణించి భక్తుడికి వరాలను ఇస్తాడు. ఆ వరాలు లక్ష్మీ స్వరూపమే. అలా పొందే వరాలను వరలక్ష్మీ స్వరూపంగా పేర్కొంటారు. 'అలాంటి వరాలను నాకు 'ప్రసాదించు' అనే ఆకాంక్ష సైతం ఇందులో ఇమిడి ఉంది.

కామెంట్‌లు లేవు: