🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*సప్త చిరంజీవులు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*అశ్వత్థామా బలిర్వ్యాసో*.
*హనుమాంశ్చ విభీషణః ।*
*కృపః పరశురామశ్చ*
*సప్త ఏతైః చిరంజీవినః ॥*
*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం*
*మార్కండేయమథాష్టమం ।*
*జీవేత్ వర్షశ్శతమ్ సొపి*
*సర్వవ్యాధి వివర్జిత ॥*
*శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు, వామనుడి అనుగ్రహమువలన బలిచక్రవర్తి, లోకహితముకై వ్యాసుడు, శ్రీరామభక్తితో హనుమంతుడు, శ్రీ రాముడి అనుగ్రహమువలన విభీషణుడు, విచిత్రజన్మము వలన కృపుడు, ఉత్క్రుష్ట తపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైరి।*
*వీరి తర్వాత శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శత వర్ష ఆయుష్మంతులౌతారని పై శ్లోక తాత్పర్యము.*
*చిరజీవులు లేదా చిరంజీవులంటే చావులేనివారని అర్థం.*
*అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెపుతున్నాయి.*
*పుట్టిన రోజున పాలు, బెల్లం, నువ్వులు కలిపిన మిశ్రమాన్ని దేవునికి నైవేద్యం నివేదించి, పై శ్లోకమును చదివి, ఆ మిశ్రమాన్ని మూడు సార్లు తీర్థంలా తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణ వచనం.*
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి