15, ఫిబ్రవరి 2025, శనివారం

వాణిని జీవకోటి పరిపాలిని

 ఉ.ఉ.వాణిని జీవకోటి పరిపాలిని వాఙ్మయి, విశ్వ కర్తకున్

రాణిని సన్నుతించెదను రమ్యములౌ విపులార్థ శబ్దముల్

శ్రేణిగ గూర్చ, సన్మతి తరింపగ దీన జనాళి బ్రోవ గీ

ర్వాణిని కోరి మ్రొక్కెద నపార దయానిధి వేడి భారతీ౹౹ 47

మ.వెలుగుల్ జిందు కవిత్వ శక్తులవి సంవేద్యమ్ములౌ హృద్యమౌ

నిలలో సర్వ శుభ ప్రదమ్ములగు నా యీశాను గొల్వన్ మహో

జ్వల రూపమ్ము గనన్  విశిష్ట గతులన్ సంసేవ్య జిజ్ఞాస భ

క్తులకున్ మాఘము విందుసేయు నెద సంతుష్టిన్ గనన్ భారతీ!౹౹48విశ్వ కర్తకున్

రాణిని సన్నుతించెదను రమ్యములౌ విపులార్థ శబ్దముల్

శ్రేణిగ గూర్చ, సన్మతి తరింపగ దీన జనాళి బ్రోవ గీ

ర్వాణిని కోరి మ్రొక్కెద నపార దయానిధి వేడి భారతీ౹౹ 47

మ.వెలుగుల్ జిందు కవిత్వ శక్తులవి సంవేద్యమ్ములౌ హృద్యమౌ

నిలలో సర్వ శుభ ప్రదమ్ములగు నా యీశాను గొల్వన్ మహో

జ్వల రూపమ్ము గనన్  విశిష్ట గతులన్ సంసేవ్య జిజ్ఞాస భ

క్తులకున్ మాఘము విందుసేయు నెద సంతుష్టిన్ గనన్ భారతీ!౹౹48

కామెంట్‌లు లేవు: