15, ఫిబ్రవరి 2025, శనివారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ముందు శ్లోకంలో హరి, బ్రహ్మవంటి దేవతలు ఈశ్వరుని సేవిస్తున్నారని చెప్పబడింది. అలా తనను సేవిస్తున్న బ్రహ్మకు, ఈశ్వరుడు చేసిన ఉపకారాన్ని చూసి, ఈశ్వరుని భజన చేయడం వల్ల, తామునూ కృతార్థులమైనామని  శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు.*


*శ్లోకం:19*


*దురాశా భూయిష్టే దురధిప గృహద్వార ఘటకే*

                  

*దురంతే సంసారే దురిత నిలయే  దుఃఖ జనకే*

                   

*మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే*

                   

*వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయమ్.*


*పదవిభాగం : ~*


*దురాశా  భూయిష్టే _ దురధిప గృహద్వార ఘటకే _ దురంతే _ సంసారే _ దురిత నిలయే _ దుఃఖజనకే _ మదాయాసం   _ కిమ్ _ న _ వ్యపనయసి _ కస్య _ ఉపకృతయే _ వద _  ఇయమ్ _ ప్రీతిః  _ చేత్ _ తవ _  శివ _ కృతార్థాః  _ ఖలు  _  వయమ్..*


*తాత్పర్యం :~*


*ఓ శివా ! దురాశతో నిండినదీ, దుష్టులైన ప్రభువుల ద్వారములందు నిలబడేటట్లు చేసేదీ, అసౌఖ్యకరమైనదీ, అంతములేనిదీ, పాపములకు నిలయమైనదీ , దుఃఖాన్ని కలిగించేది అయిన సంసారమునందు పడియున్న  నాకష్టాన్ని నీవు ఎందుకు తొలగింపవు ? బ్రహ్మ దేవునికి ఉపకారం చేయడానికా ? ఇది నీకు ప్రీతికరమైనట్లైతే మేము కూడా కృతార్థులమౌతాము. (నీ ప్రీతియే , మాకు ధన్యత చేకూరుస్తుందని భావం)*


*వివరణ :~*


*దురాశతో నిండియుంటుందట సంసారం. సంసార పోషణకు దుష్ట ప్రభువుల ఇళ్ళకు వెళ్ళి వారిని యాచించవలసి వస్తుందట. అంతు లేకుండా జనన,మరణ యాత్ర సాగుతుందట, పాపాలకు నిలయమట, దుఃఖాలను పుట్టిస్తుందట, అటువంటి సంసారంలో పడే శ్రమను  ఎందుకు పోగొట్టవని శంకరులు ఈశ్వరుని ప్రశ్నిస్తున్నారు.*


*ప్రపంచములోని ధనం,ధాన్యం, బంగారం, పశువులు, స్త్రీలు  అన్నీ ఒకే వ్యక్తికి వచ్చి పడినా, చాలుననే, భావం వుండదట.  ఆశ ఉన్న చోట పాపం, పాపమున్న చోట దుఃఖము ఉంటుంది  . సంసార పరిస్థితి ఇదీ.  అందుకే శంకరులు , తన సంసారదుఃఖాన్ని తొలగించమని, ఈశ్వరుని కోరారు..*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: