15, ఫిబ్రవరి 2025, శనివారం

క్యాన్సర్ కారకమయ్యే ఆహారపదార్థాలలో

 .క్యాన్సర్ కారకమయ్యే ఆహారపదార్థాలలో మైదా ప్రధానమైంది. గోధుమల ద్వారా గోధుమ పిండి, జొన్నల ద్వారా జొన్న పిండి, రాగుల నుంచి రాగి పిండి వస్తుంది. మరి మైదా పిండి వేటి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?

మిల్లులో బాగా పాలిష్ చేసిన గోధుమల నుంచి పిండికి Azodicarbonmide, chlorine gas benzoyl peroxide అనే రసాయనాలు ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడకాన్ని చైనా, ఐరోపాలో నిషేదించారు. మైదాలో అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదాపిండి ముట్టుకోవడానికి మెత్తగానూ, చూడ్డానికి తెల్లగానూ ఉంటుంది.

దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల తయారీలో వాడతారు కొన్ని కార్యాలయాల్లో కూడా కవర్లు అంటించేందుకు, గోడలపై సినిమా పోస్టర్లు అంటించేందుకు వాడతారు. మైదా పిండి తో రవ్వ దోస, పరోటా, రుమాలి రోటి, కేకులు, పిజ్జాలు హల్వా,జిలేబి వంటి మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైనవి తయారుచేస్తారు.

మైదాపిండి నిత్యం లేదా అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.

సాధారణంగా గోధుమలు ని ఆడిస్తే వచ్చే పిండి లేత  గోధుమ రంగు లో ఉంటుంది.ఈ గోధుమపిండికి రకరకాల రసాయనాలు కలిపి మైదా పిండి తయారు చేస్తారు. రక రకాల రసాయనాలను కలపడం వల్ల చూసేందుకు తెల్లగా, పట్టుకునేందుకు మెత్తగా కనిపిస్తుంది. హోటళ్లలో తయారుచేసే వంటకాలలో మినప గుండ్లకు బదులు మైదాపిండిని విరివిగా వాడుతున్నారు. దీనివల్ల అనేక రకాల అనారోగ్యాలు పొంచి ఉన్నాయి. మైదా పిండితో తయారు చేసే వంటకాల వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మైదా పిండితో తయారు చేసే వంటకాలు క్యాన్సర్ రోగులకు మరింత ప్రమాదకరం. వీటివల్ల క్యాన్సర్ కణుతులు వేగంగా వృద్ధి చెందుతాయి. అదేవిధంగా మధుమేహం ఉన్న వారు మైదా పిండి తో తయారు చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరంలో మరింతగా చక్కెర నిల్వలు పెరుగుతాయి.థైరాయిడ్, హార్మోన్ల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు  అధిక బరువు ఉన్నవాళ్లు కూడా మైదా పిండి తో తయారు చేసిన వంటకాలు మానేస్తే మంచిది.

 (మరొక మాట మనం పోగొట్టుకున్న వస్తువు దొరుకుతుందేమో కానీ ఎప్పటికీ దొరకనిది జీవితం.... ఉన్నన్ని నాళ్ళు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి కనీసం చుట్టూ ఉన్న బుజ్జాయిలతోఅయినా సమయాన్ని కేటాయిస్తూ వీళ్ళతో ఉంటే పువ్వు నవ్వు లవ్వు మనదే ).

 

*సుధ కొనకళ్ళ అనువంశిక ఆయుర్వేద వైద్యురాలు సుధ కొనకళ్ళ హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సత్తుపల్లి ఖమ్మం జిల్లా*

కామెంట్‌లు లేవు: