7, ఏప్రిల్ 2025, సోమవారం

కసాయి తల్లి....*

 *కవిత శీర్షిక:*

     *కసాయి తల్లి....*


మాజీ ప్రియుడి మోజులో పడి తన కామ కేళికి అడ్డుగా ఉన్నారని ప్రియుడి ఆజ్ఞను అమలు చేసింది.....

దైవం లాంటి ముగ్గురి పసి బిడ్డలను కడతేర్చిన ఓ కసాయి తల్లి....

కనీసం కన్నీరైనా పెట్టని పాషాణపు హృదయురాలు....

కంటేనే అమ్మ అని అంటే ఎలా? అని, 

మన సి.నా.రే అన్నట్టు. కన్న పేగు చచ్చి, కామ వాంచ పెరిగి, బిడ్డలకు విషమిచ్చి చంపింది. 

ఇది మాతృ ప్రేమకే మహా కళంకం....

ఆ ముగ్గురి పిల్లల మృతదేహాలను చూసి కన్నతండ్రి మనసు తల్లడిల్లింది, మాతృమూర్తులు, మానవతావాదులు, కవులు, గాయకులు మౌనంగా ఉంటున్నారే తప్ప తలలు ఎత్తి ఖండించ లేకపోతున్నారు....

వద్దమ్మా వద్దు, ఏ బిడ్డలకు ఇలాంటి తల్లి వద్దు, ఇలాంటి గతి ఏ బిడ్డలకు రావద్దు...

మోజు తీరాక నీ మాజీ ప్రియుడు నీ ఆస్తి అంతా హస్తగతం చేసుకొని, నిన్ను ఒంటరి చేయడమో, ఈ లోకం నుండి పంపించమో ఖాయం...

మాతృమూర్తులారా, మాతృ ప్రేమలను కాపాడండి, మానవజాతి మనుగడకు ప్రాణం పోయండి....


 *గరిడేపల్లి శోభనాద్రి, కవి, ఖమ్మం, T G. చరవాణి: 8897785495*

కామెంట్‌లు లేవు: