🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శంకరులు ఈ శ్లోకంలో తనను రక్షింపుమని ఈశ్వరుణ్ణి కోరారు.*
*శ్లోకం : 66*
*క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః*
*యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।*
*శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం*
*తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ।।*
*తాత్పర్యము :-*
*ಓ పరమేశ్వరా ! ಓ పశుపతీ ! నీవు నీ వినోదము కొరకే, ఈ సర్వ ప్రపంచాన్నీ సృష్టిస్తున్నావు. ఈ జనమంతా నీ వినోదం కోసం ఏర్పడ్డ జంతువులు. వారి వారి పెంపుడు జంతువుల నడవడులు, వారికి ప్రేమాస్పదములు కావడం జగత్ప్రసిద్దమే. కాబట్టి నేను చేసే సత్కర్మలు గానీ, దుష్కర్మలు గానీ, ఏ చేష్టలయినా, నీకు అవి తృప్తికరములే అవుతాయి. కాబట్టి నీవు నన్ను రక్షింపవలసిన వాడవు అవుతున్నావు. (పిల్లలు తమ ఆట బొమ్మలను తాము రక్షించుకొనే విధంగా నీవే నా రక్షణమును చేయవలసి యుంది ) అది నీ కర్తవ్యం.*
*వివరణ :-*
*శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుడికి ఇలా నివేదించారు*
*" ಓ శంభూ ! పశుపతీ ! ఈ ప్రపంచాన్ని సర్వమునూ నీవే నీ ఆట కోసం పుట్టిస్తూ వున్నావు. నీవు సర్వ వాంఛలూ తీరినవాడవు. అలాటప్పుడు ఈ పంచభూతాలు అనే ముడి పదార్థాలతో నీవు నిర్మించే ఈ ప్రపంచం, నీవు సరదాగా ఆడుకోవడం కోసమే. ఈ ప్రపంచములోని జనులంతా నీ చేతిలోని కీలుబొమ్మలు*. *వీరంతా నీ విలాసం కోసం సృష్టించబడ్డ మృగాలు. వీరు నీవు ఆడించినట్లల్లా ఆడుతారు.* *నీవు తిప్పేవాడవు, వారు తిరిగేవారు. నీవు జగన్నాటక సూత్రధారివి. ఈ ప్రపంచానికీ దీనిలోని ప్రజలకు ఏమాత్రం స్వతంత్రత లేదు*
*కాబట్టి నాతప్పేమీ లేదు . నేను చేసిన తప్పేదైనా వుంటే నేను ఒకడిని ఉన్నానని అనుకోవడం మాత్రమే. ప్రపంచములో ఉన్నదంతా నీవే. అందువల్ల నేను మంచి చేసినా ,చెడు చేసినా అది నీకు ప్రీతికరంగా ఉండాలి . నేను చేసిన చేష్టలన్నీ నీ వేడుకకు సాధనములు. కాబట్టి నన్ను రక్షించడం నీ కర్తవ్యం.*
*తోలుబొమ్మలాటలో బొమ్మలన్నీ సూత్రధారుని ఇష్టానుసారంగా తిరిగి వినోదాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా జగన్నాటక సూత్రధారుడైన పరమాత్మ ఇచ్ఛాను సారంగా నడిపే మన జీవితరూపమైన ఈ జగన్నాటకం, పరమేశ్వరుని కి వినోదాన్నే కల్పిస్తుంది.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి