*
*కం*
విలువలనొందుట కన్నను
విలువలు కాపాడుకొనుట విలువగు నెపుడున్.
విలువలకాచుకొనేందుకు
విలువెరుగని వారి నుండి వెలివడు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! విలువలు పొందటం కన్నా విలువలు కాపాడుకోవడం చాలా విలువైన పని. విలువలు కాపాడుకోవడం కోసం నీ విలువ తెలియని వారి నుండి దూరంలో ఉండుము.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*
*కం*
విలువీయని వారల కడ
విలువల నొందెడి వశమున వెంబడకుము నీ
విలువెరిగెడి దినము కొరకు
నలుపెరుగని శ్రమలకోర్చి నెగడుము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! నీకు విలువ ఇవ్వని వారి వద్ద విలువలు పొందాలనే ఆశతో వెంపర్లాడవద్దు. నీ విలువ లు గుర్తించగలిగే విధంగా అలుపెరగని కృషి చేయుము.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి