7, ఏప్రిల్ 2025, సోమవారం

సీతారాముల కళ్యాణము*

 *****************************

*సీతారాముల కళ్యాణము*

*చూచెదము రారండి జనులార*

*****************************

సీస పద్యము.

శ్రీరాముడు వరుడు శ్రేయస్కరము

గను

    సీతమ్మ వధువు సౌశీల్యవతిగ

చైత్ర మాసము,అభిజిత్ సుము హూర్తము

     శుక్లపక్ష నవమి శుభ ఘడియలు

కళ్యాణము జరిగె కమనీయముగ

దేవ

   తలు,ఋషుల్ దీవించె తనివితీర

ముల్లోకములు మెచ్చెముచ్చటగా

ను,హ

     ర్షించె భూసురులు,వర్షించె 

     మేఘ

తే.గీ.

మాల చక్కగాసకల ప్రామాణికంబు

గాను,శోభాయమానంబుగాను పెండ్లి

జరిగె భూలోకమంతటా యరుగు లాక

స సమమూ పందిరీ తోడ సందడిగను.

2.తే.గీ.

నిండు సత్య వాక్పరిపాలకుండు 

నిజము,

హితము ఏకపత్నీవ్రతుం తోడు

నిజము,

కూర్మి పితృవాక్పరీపాలకుండు

నిజము,

మంచి జనుల పాలిట దైవ మతడు

నిజము.

3.ఆ.వె.

రాము డంత మంచి రాజు భూ

మండల

మందు లేడు, మరియు మంచి పాల

కుండు,ప్రజలహితము కూర్మి 

వాంఛించెడీ

చక్రవర్తి ఇతడె జగతి నందు.

4.తే.గీ.

రామ శ్రీరామ జయరామ రక్ష!రక్ష!

రామ దశరధ తనయుడారక్ష!రక్ష!

రామ కౌసల్య కొమరుడా రక్ష!రక్ష!

రామ జానకీ నాధుడా రక్ష!రక్ష!

5.కందము.

శ్రీరామ జయ జయ మనో

హరా సకల సద్గుణాభి హాసా రామా

శ్రీరామ మమ్ము బ్రోవుము

ఓ రామా చక్కగాను ఓరిమి

తోడన్!

*****************************

రచన.దామర్ల నాగేశ్వరరావు.

           9908568099.

విల్లా నెం.24.

     గోల్డెన్ పామ్స్ ,మోడి కాంప్లెక్స్.

లింగమయ్య విగ్రహం వద్ద

రామాలయం వద్ద

అమీన్ పూర్ 

హైదరాబాద్-502032.

*****************************

కామెంట్‌లు లేవు: