7, ఏప్రిల్ 2025, సోమవారం

శ్రీరాముని చరితం

 శీర్షిక :  శ్రీరాముని చరితం


సుతుల కోసం చేసేను

దశరధుడు పుత్రకామేష్టి యాగం

ఆ యాగ ఫలంగా

రామ లక్ష్మణ భరత శతృఘనుల జననం!


నలుగురు మాతల ప్రియపుత్రులై

అల్లారు ముద్దుగా పెరిగిరి

అన్ని విద్యల్లో అరితేరిరి

గురువుల ఆజ్ఞలను నెరవేర్చిరి!


విశ్వామిత్రుని యాగ సంరక్షణకై

దశరధుని ఆనాతి మేరకు

రామ లక్ష్మణులు కానల కేగిరి

రాక్షసి తాటకిని సంహరించిరి!


జనకుని సీతా స్వయంవరం

రామ లక్ష్మణుల ఆగమనం

విశ్వామిత్రుని ఆశీస్సుల ఫలం

రాముడు విరిసెను శివధనుస్సును వేగిరం!


జరిగెను సీతారాముల కళ్యాణం

విరిసెను జగతిన సంతసం

తండ్రి ఆజ్ఞ పాలనకై

సీతా సామేతంగా అడవుల కేగిరి రామ లక్ష్మణులు సత్వరం!


రావణునిచే సీతాపహరణం

రామునిచే రావణ సంహారం

అయోధ్య కు శ్రీరామ పట్టాభిషేకం

ఇదియే మారుతి గానామృత శ్రీరాముని చరితం!


*************************-**********-**

రచన :

ఆళ్ల నాగేశ్వరరావు

కవి... రచయిత... ఆర్టీసీ కండక్టర్

నాజరుపేట

తెనాలి....522201

గుంటూరు.... జిల్లా

ఆంధ్రప్రదేశ్.... రాష్ట్రము

చరవాణి '7416638823


************************************


హామీ పత్రం :


ప్రజాశక్తి సంపాదకులకు నమస్సులు!


ఆర్యా!


చిన్నారి శీర్షికలో ప్రచురణ కొరకు పంపుచున్న

పై బాలగేయం నా స్వీయరచనేనని, ఇది ద

కామెంట్‌లు లేవు: