🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*శ్రీరామ నవమి -మకుట ధారణ సర్గ*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*శ్రీ రామనవమి నాడు మకుట ధారణ సర్గ లేదా కనీసం మకుటధారణకు సంబంధించిన ఈ శ్లోకములనైనా పారాయణ చేయడం విధి*
*శ్రీ వాల్మీకి రామాయణం - యుద్ధకాండ లోని పట్టాభిషేక సర్గ నుండి మకుట ధారణ ఘట్టానికి సంబంధించిన శ్లోకాలు(64 - 67)*
*బ్రహ్మణా నిర్మితం పూర్వం*
*కిరీటం రత్నశోభితమ్౹*
*అభిషిక్తః పురా యేన*
*మనుస్తం దీప్తతేజసమ్!*
*తస్యాన్వవాయే రాజానః*
*క్రమాద్యేనాభిషేచితాః౹*
*సభాయాం హేమక్లుప్తాయాం*
*శోభితాయాం మహాధనైః!*
*రత్నైర్నానావిధైశ్చైవ*
*చిత్రితాయాం సుశోభనైః౹*
*నానారత్నమయే పీఠే*
*కల్పయిత్వా యథావిధి!*
*కిరీటేన తతః పశ్చాత్*
*వసిష్ఠేన మహాత్మనా*
*ఋత్విగ్భిర్భూషణైశ్చైవ*
*సమయోక్ష్యత రాఘవః!*
*పూర్వము బ్రహ్మ నిర్మించిన రత్నమయమైన, తేజస్సుతో ప్రకాశించుచున్న కిరీటమును సభామధ్యములో ఉన్న వివిధరత్నములు పొదిగిన పీఠముపై యథావిధిగా ఉంచెను. పట్టాభిషేక సమయమునందు పూర్వము మనుచక్రవర్తి, తరవాత క్రమముగా ఆయన వంశమునకు చెందిన రాజులందరు ఆ కిరీటమును ధరించెడివారు. ఆ మహాసభా భవనము బంగారము చేత అలంకరింపబడెను, చాల విలువైన వస్తువులతో శోభించుచుండెను. అనేక విధములైన చాలా అందమైన రత్నములతో అది చిత్రవర్ణమై ఉండెను. పిదప రత్నపీఠముపై ఉంచిన ఆ కిరీటముని తీసి వసిష్ఠుడు రాముని శిరస్సుపై అలంకరించెను. అనంతరము ఋత్విక్కులు రామునకు ఇతరాలంకారములు అలంకరించిరి.*
*జై శ్రీరామ్౹*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి