*విశ్వావసు నామ సంవత్సర శ్రీ రామ పద్యార్చనమ్*
*4*
*చం*
అవనిన రావణాసురుని యాగడముల్చెలరేగి వేగగన్
భువిజని రామభద్రునిగ భూజనిసీతను పెండ్లి యాడి తా
నవనిన రామరాజ్యమను నాకము జూపిన దేవదేవుడౌ
దివిపతి విష్ణుమూర్తి కి వె ధీజన పూజలునిత్య(దివ్య) హారతుల్.
*భావం*:-- భూలోకంలో రావణాసురుని ఆగడాలు చెలరేగి బాధలు పడుతున్న తరుణంలో భూలోకంలో రామభద్రునిగా పుట్టి భూజనియైన సీతామహాలక్ష్మి అమ్మవారి ని పెండ్లాడి భూలోకులకు రామరాజ్యం అనబడే స్వర్గమును జూపిన దేవదైన శ్రీ మహావిష్ణువు కు ఇవియే గొప్ప పూజలు నిత్య ( గొప్ప) హారతులు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి