2, ఆగస్టు 2020, ఆదివారం

అష్ట నిధులు



పురాణముల ప్రకారం మనవద్ద ఉన్న ధనమును 8 నిధులు గా చెప్పబడినవి. వీని గురించిన్ మార్కండేయ పురాణంలో చెప్పారు. అవి

పద్మ: ఈ నిధికి సత్వగుణం ప్రధానం. ఈ నిధి వంశ పారంపర్యంగా క్రింది తరములకు చెందుతుంది.  అంతే కాక అది నిరంతరం వృధి చెందుతూనే ఉంటుంది. ఈ నిధి దాన ధర్మములకు, యజ్ఞ యాగాదులకు ఇతర పుణ్యకార్యములకు ఉపయోగపడుతుంది. 

మహాపద్మ: ఇది కూడా సత్వగుణం కలిగిన నిధి. ఈ నిధి 7 తరములవరకు ఉంటుంది. ఇది దాన ధర్మములకు, గృహదానములకు ఇతర సత్కార్యములకు ఉపయోగపడుతుంది. 

మకరనిది: ఈ నిధి మనస్సును ప్రభావితం చేసి, గొప్పలు చెప్పుకునే వారికి, ఇంకొకరితో గొడవపెట్టుకునే వారికి చేరుతుంది. ఒక జీవితకాలం మాత్రమే ఉంటుంది. 

కచ్ఛపనిధి: ఈ నిధి, తాను  స్వధర్మమును వదిలి, తను తినకుండా, ఇంకొకరికి పెట్టకుండా దాచి ఉంచేది. ఇది అతి తక్కువ కాలం చాలా తక్కువకాలం ఉంటుంది. 

ముకుంద: ఈ నిధి రజోగుణం కలది. తమ భోగములను, సుఖములను చూసుకుంటూ, ఇతరులను అవమానించుటకు కూడా వెనుకాడరు. ఈ నిధి కూడా అత్యంత తక్కువ కాలం ఉంటుంది. 

కుంద: ఈ నిధి రజోగుణ ప్రధానమైనది. 7 తరములవరకు నిలిచి ఉంటుంది. ధాన్యమును అమ్ముటవలన ప్రాప్తిస్తుంది. అతిధులను, బంధువులను పోషించుటకు, తమ భోగమునకు ఉపయోగపడుతుంది. 

నీల నిధి: ఇది సర్వ తమోగుణములు కలిగి ఉంటుంది. ఈ ధనం 3 తరములవరకు ఉంటుంది. జ్ఞానం లేని మూర్ఖులుగా ఉంటారు.

శంఖము: ఇది మరింత రజోగుణం కలిగి ఉంటుంది. తను ఒక్కడే తింటూ, తన స్వంత అనుకూలములను చూసుకుంటూ, భార్యా బిడ్డలకు కూడా పెట్టే ఆలోచన కూడా చేయరు. ఇది అత్యంత తక్కువ కాలం ఉంటుంది.
🌹🙏🌹🙏🙏

కామెంట్‌లు లేవు: