కృష్ణుడు లీలలు చేసాడు.. మాయలు చూపించాడు.. అంతేనా నిస్వార్థమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు.
కృష్ణుడు-కుచేలుడు వీరి స్నేహం గురించి అందరికీ తెలసిందే. యుగాలు మారినా వారి స్నేహం గురించి మనం చెప్పుకుంటూనే వస్తున్నామంటే వారి మైత్రి అంత గొప్పది.
కృష్ణ-కుచేలులు చిన్ననాటి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. కృష్ణుడు పెరిగి పెద్దై ద్వారకాధీసుడైతే.. కుచేలుడు పేదవాడిగా మిగిలిపోయాడు.
గంపెడు సంసారంతో వారిని పోషించలేని స్థితిలో జీవితాన్ని భారంగా గడుపుతాడు. అలాగని తన స్నేహితుడైన కృష్ణుని సాయమడిగేందుకు అతని మనసు అంగీకరించదు.
కానీ కష్టాలు మితిమీరడంతో దిక్కుతోచని స్థితిలో ద్వారకకు వెళ్తాడు. స్నేహితుడిని ఎంతగానో ఆదరించిన కృష్ణుడు తన భార్యలతో కలిసి సత్కరిస్తాడు. కుచేలుడు తన వెంట కృష్ణుడికి ఇష్టమైన అటుకులు తీసుకువస్తాడు. కానీ అది కృష్ణుడికి ఇచ్చేందుకు సంశయిస్తాడు.
కానీ కృష్ణుడు ఆ అటుకులు తీసుకుని ఎంతో ఇష్టంగా ఆరగిస్తాడు. అలా కృష్ణుడు రెండు పిడికెళ్లు అటుకులు తింటాడో లేదో కుచేలుడి పాపకర్మలు తొలిగిపోతాయి. అతని కష్టాలు పరి సమాప్తమవుతాయి. మూడో పిడికిలితో అటుకులు తినడానికి సిద్ధమైన కృష్ణుని రుక్మిణి వద్దని వారిస్తుంది. ఆయన కష్టాలు తీరాయని నమ్మిన కృష్ణ పరమాత్మ ఆ అటుకులు తినకుండానే వదిలేస్తాడు.
స్నేహితుడు నోరు తెరిచి అడగకపోయినా అతని అవసరాన్ని గుర్తించి సాయం చేసి కృష్ణుడు స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు.
నిజమైన స్నేహితుడు అంటే ఎలా ఉంటాడో వీరి అనుబంధం మనకు చెబుతుంది.
కాని యిక్కడ అర్థం కానిది ఏంటంటే మూడో పిడికిలి అటుకుల్ని తినడానికి ఉపక్రమించిన కృష్ణుణ్ణి రుక్మిణి ఎందుకు వారించినట్టు
***************

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి