శా.
అంతా మిథ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించు గాని, పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా!
4 వపద్యం
శా.
నీ నా సం దొడబాటుమాట వినుమా! నీచేత జీతంబు నే
గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు, నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నా పాటియే చాలు దే
జీ నొల్లన్ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి