9, సెప్టెంబర్ 2021, గురువారం

ఉపయోగించే 21రకాల పత్రుల పేర్లను

 శ్రీ మహాగణాధిపతయే నమః 

        శ్రీ గురుభ్యో నమః


"వినాయక చతుర్థి "

పర్వదినాన గణేశుని పూజించడానికి ఉపయోగించే 21రకాల పత్రుల పేర్లను తెలుసుకొందాము...


*శ్రీ వరసిద్ధివినాయకుని పూజలో - ఉపయోగించే 21 రకాల పత్రి*


1.మాచీపత్రం ౼ మాచి ఆకు

2.బృహతీపత్రం ౼ వాకుడు ఆకు

                                   (వాక్కాయ ఆకు)

3.బిల్వపత్రం ౼ మారేడు ఆకు

4.దూర్వాయుగ్మం ౼ గరిక పోచ

5.ధత్తూరపత్రం ౼ ఉమ్మెత్త ఆకు

6.బదరీపత్రం ౼ రేగు ఆకు

7.అపామార్గపత్రం ౼ ఉత్తరేణి ఆకు

8.శిరీషపత్రం ౼ దిరిసెన ఆకు

9.చూతపత్రం ౼ మామిడి ఆకు

10.విష్ణుక్రాంతపత్రం ౼ విష్ణుక్రాంత ఆకు

11.దాడిమీపత్రం ౼ దానిమ్మ ఆకు

12.దేవదారుపత్రం ౼ దేవదారు ఆకు

13.కరవీరపత్రం ౼ గన్నేరు ఆకు

14.సింధువారపత్రం ౼ వావిలి ఆకు

15.జాజిపత్రం ౼ జాజి ఆకు

16.గణ్డకీపత్రం ౼ ఏనుగుచెవి ఆకు

17.శమీపత్రం ౼ జమ్మి ఆకు

18.అశ్వత్థపత్రం ౼ రావి ఆకు

19.అర్జునపత్రం ౼ మద్ది ఆకు

20.అర్కపత్రం ౼ తెల్లజిల్లేడు ఆకు

21.మరువకపత్రం ౼ మరువపు ఆకు


*సూచన :*


కొన్ని వినాయక చతుర్థి వ్రతకల్పాలలో "తులసీ

పత్రం సమర్పయామి అని ఇస్తున్నారు, శాస్త్రప్రకారం వినాయకుని పూజకు ఏ సందర్భంలోనూ తులసీదళాలు ఉపయోగించరాదు.  

 "శ్రీ శివపురాణంలో"

తులసీదళానికి బదులుగా "శిరీష దళము" అని ఉన్నది...

కామెంట్‌లు లేవు: