9, సెప్టెంబర్ 2021, గురువారం

స్వభాషాధ్యాసకాళన్నశ్వాస

 *స్వభాషాధ్యాసకాళన్నశ్వాస.* *dr. వేదుల'శిరీష'.* kkd.

*ధీశాలి,అన్యాయంనెదిరించేవాడిని ఆరాధించినప్రజాకవి కాళోజి.

తెలుగుఅక్షర శ్వాస కాలంయోధుడు,

జాతికి అంకిత జీవన సాహితీశిఖరం.

*ప్రజాగోడుగొడవేనాగొడవన్న గరంస్వరం,

స్వరాజ్యకాంక్షస్వతంత్ర్యయోథకాళోజి,

స్వరాష్ట్రఆకాంక్ష భావనా వెలుగులై,

స్వభాషాయాస మనిషి మనసైనగళం,

మనిషితత్వం ప్రజాకవిత్వ కళాతత్వమై,

మానవతావాద ఓరుగల్లు భావన ఖిల్లాయై,

ప్రజాపక్ష అక్షర తెలుగు మాండలీకమైన,

సాంఘిక చైతన్య పద్మవి భూషణం.

అన్యభాషలునేర్చి ఆంధ్రమ్ము రాదనే వేలని,

నిలదీసినిగ్గుతేల్చిన నిబ్బర గరంస్వరం,

ప్రశ్నించే ప్రజాగళంపెన్ను- పోరాటంగన్నయ్,

భాషశ్వాసలోనే బతుకు వెలుగుందన్న స్ఫూర్తి,

మనసంతకం ఆస్థిత్వమంటూ, బాషాభివృద్ధితెగింపుకి అక్షర కదలిక కాళన్న.

జీవనదిగా,భాషోదయం ఆశల దిక్సూచి,

జాగృతిగ సాగిపోవుటేబతుకు,ఆగితే చావని,

మనసు వేదికగా-బాషా నమ్మకం మనిషై,

మనుగడ మార్గదర్శనం -సమాజఆశయ కళయినోడు ధిక్కారమైన ఆమ్ఆద్మీకాళోజి. తెలంగాణ బాషాదినోత్సవ ఉత్సాహం,

భాషామమకారం గౌరవాక్షర కేతనమైన,

కవిత్వకధనయశస్వి -అక్షర సాధన తపస్వి కాళోజి నారాయణే.

*dr. వేదుల శ్రీరామశర్మ 'sirisha',kkd.9866050220

కామెంట్‌లు లేవు: